Lawyers Support BC Bandh
బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర బంద్ కు న్యాయవాదుల సంఘీభావం:-
42% రిజర్వేషన్ బిల్లు వెంటనే ఆమోదించాలి వరంగల్ ఉమ్మడి జిల్లా న్యాయవాదుల డిమాండ్:-
వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి, అక్టోబర్ 18:-
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన “బీసీ హక్కుల సాధన బంద్” కు వరంగల్–హనుమకొండ జిల్లా న్యాయవాదుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.బంద్ సందర్భంగా, వరంగల్ హనుమకొండ జిల్లా న్యాయవాదులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున కోర్టు ఎదుట ధర్నా నిర్వహించి మరియు ర్యాలీ చేపట్టి కాళోజీ సెంటరు నుండి అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నినాదాలిచ్చి తమ మద్దతును తెలియజేశారు.
ఈ సందర్భంగా జరిగిన బంద్ సభలో, జిల్లా న్యాయవాద సంఘాల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ మాట్లాడుతూ —
“బీసీలు రాష్ట్ర జనాభాలో అతి పెద్ద వర్గం అయినప్పటికీ, సమాన అవకాశాలు ఇంకా లభించడం లేదు అన్నారు.అందుకే బీసీ రిజర్వేషన్ శాతం 42% కు పెంచి, ఆ బిల్లును పార్లమెంట్లో వెంటనే ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చడం అత్యవసరం” అని అన్నారు.అలాగే “బీసీలకు న్యాయం చేయడం అంటే సామాజిక న్యాయం సాధించడం.విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సరైన వాటా దక్కే వరకు ఈ ఉద్యమం ఆగదు అన్నారు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం కోసం ప్రతీ ఒక్కరూ ఐక్యంగా నిలవాలి” అని పిలుపు నిస్తూ బీసీ రిజర్వేషన్ల సాధనలో న్యాయవాద సంఘాలు ముందు వరుసలో నిలిచి పోరాడుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ బార్ ఉపాధ్యక్షులు మైదం జయపాల్, కార్యవర్గ సభ్యులు మర్రి రాజు, హనుమకొండ ప్రధాన కార్యదర్శి కొత్త రవి, కోశాధికారి సాంబశివరావు, సీనియర్ న్యాయవాదులు మాజీ అధ్యక్షులు ఎలుకుర్తి ఆనంద్ మోహన్, గుడిమల్ల రవి కుమార్ , చిల్లా రాజేంద్ర ప్రసాద్ , జి. విద్యాసాగర్ రెడ్డి మరియు గంధం శివ, నారగోని నర్సింగరావు,సాయిని నరేందర్,నల్ల మహాత్మ, గుర్రాల వినోద్ , వి వి రత్నం, జగన్ మోహన్ రెడ్డి , యాకస్వామి , రాచకొండ ప్రవీణ్ , రామచందర్ , శ్రీనివాస్ గౌడ్,తదితర పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు,బీసీ సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
