Nallabelli BC Leaders Demand Immediate Approval of 42% Reservation
బీసీ బంద్ లో పాల్గొన్న ఎంసిపిఐ (యు)
నర్సంపేట,నేటిధాత్రి:
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సామాజిక రాజకీయ పార్టీలు చేపట్టిన తెలంగాణ బంద్ కు ఎంసిపిఐ (యు) సంపూర్ణ మద్దతు తెలిపింది.నర్సంపేట లో నిరసన ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి మాట్లాడుతూ రాజ్యాంగంలోని షెడ్యూల్ 9 లో బీసీ రిజర్వేషన్ అంశాన్నిచేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సమాజమంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్య పోరాటాలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు అనుమాల రమేష్ ,బంగారు ముత్తయ్య,అచల,మేడిద ప్రమీల,ఈర్ల అనుష ,మాదాసి రాజు,జి అంజి, సుశీల,శ్రీను,రాములు, ఐలమ్మ, జన్ను నీల,ప్రమీల పాల్గొన్నారు.
దుగ్గొండి మండలంలో…
బీసీ రిజర్వేషన్ కోసం చేపట్టిన రాష్ట్రవ్యాప్త బిసి బంద్ కార్యక్రమంలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో చేపట్టిన నిరసనలో ఎం సిపిఐ పార్టీ నాయకులు పాల్గొని ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ కార్యదర్శి మొహమ్మద్ రాజా సాహెబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు,డివిజన్,మండల సభ్యులు కుమారస్వామి, కొమురయ్య, సురేందర్,చందర్ రావు,భాస్కర్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
