BC Reservation Bandh at Nyal Kal
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యాల్ కల్ బంద్
జహీరాబాద్ నేటి ధాత్రి:
స్థానిక న్యాల్ కల్ మండల కేంద్రం లోని బస్టాండ్ ముందు బీసీ సంక్షేమ సంఘం న్యాల్ కల్ మండల అధ్యక్షులు భోజగొండ శివరాజ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్య సంస్థలు దుకాణాలు ఇతర వ్యాపారాలు స్వచ్చందంగా బంద్ పాటించారు ఈ సందర్బంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 42 % శాతం బీసీ రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోవాలని, ఇచ్చిన హామీని అమలు చేసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయక పోవడం కారణంగానే బీసీల “బంద్” కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. బంద్ లో భాగంగా శాంతియుతంగా చేపట్టమని తెలిపారు ఈ రాష్ట్ర ప్రభుత్వనికి చిత్త శుద్ధి ఉంటే మీరు ఇచ్చిన బీసీ లకు కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తాను అన్న మాయమాటలు చెప్పి ప్రభుత్వన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు బీసీలకు ముంచే ప్రయత్నం చేస్తున్నారు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో మాజీ మల్గి సర్పంచ్ బీసీ సంఘం విద్యార్థి విభాగం ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతీ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్ మిర్జాపూర్ మాజీ సర్పంచ్ బీరప్ప చల్కి అశోక్ బీజేపీ మాజీ మండలం అధ్యక్షులు ఓంకార్ యాదవ్ బీజేపీ మండలం అధ్యక్షులు మల్లేష్ బీజేవైఎం మండలం అధ్యక్షులు విష్ణు పాటిల్ మండలం ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి సతీష్ కులకర్ణి మైనారిటీ సభ్యులు అసిఫ్ నర్సప్ప లావేష్ పాటిల్ రాజు యాదవ్ పాండు తదితరులు ఉన్నారు,
