Band Prakash Mudiraj 71st Birthday Celebrations
ఘనంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి బండ ప్రకాష్ ముదిరాజ్ కు విషెస్
దుగ్గొండి,నేటిధాత్రి:
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ 71వ జన్మదిన వేడుకలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిన్నిబావి గ్రామంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి ముదిరాజ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బండ ప్రకాష్ ముదిరాజ్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో
తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్,దుగ్గొండి మండలం అధ్యక్షులు పల్లె రమేష్ ముదిరాజ్, సార రాములు ముదిరాజ్, బీసీ జాక్ కన్వీనర్ బండారి ప్రకాష్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ నేదురి రాజేందర్ ముదిరాజ్, వరంగంటి తిరుపతి, నీరటి మురళి, ఒరంగంటి కుమారస్వామి, గొర్రె శీను, దండు రాజు, మేక అనిల్, జెట్టబోయిన రాజు, తెప్ప శంకర్, పొన్నం వంశీ తదితరులు పాల్గొన్నారు.
