Stop Cotton Trade Irregularities, Demand Farmers
సీసీఐ పత్తి కొనుగోళ్ళలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలి
పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
కేంద్ర ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కొనుగోళ్లలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి ఆరోపించారు.పత్తి రైతుల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని పండించి పత్తికి కనీసం మద్దతు ధర పలకపోవడంపోవడంతో రైతు నష్టపోతున్నారని వెంటనే సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.క్వింటాల్ 10. వేల రూచొప్పున ధర అమలు చేయాలని కోరారు.పత్తి వ్యాపారస్తులు ధరలు తగ్గించి రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పత్తి దిగుబడులు చాలా తగ్గాయని వరంగల్ మార్కెట్లో 7000 ధర నిర్ణయించి తేమ పేరుతో పేరుతో 6000 కూడా కొనడంలేదని అవేదన వ్యక్తం చేశారు.రైతులు పత్తి విత్తనాలు ఎరువులు,పురుగు మందులు వ్యవసాయ కూలీ ధరలు అన్ని పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని తట్టుకొని మార్కెట్కు పత్తి తీసుకుంటే తీసుకుని వస్తే రైతులకు సరైన ధర లభించడం లేదని రైతులకు అండగా ఉండవలసిన కేంద్ర ప్రభుత్వం 7700 ధర ప్రకటించినప్పటికీ వ్యాపారస్తులు అమలు చేయడంలేదని ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడంలేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొరబోయిన కుమారస్వామి, జిల్లా నాయకులు కటుకూరి శ్రీనివాసరెడ్డి,కోడం రమేష్, కొంగర నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.
