Praja Sena Party Merges with TRP Party
టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలనం.
◆:- కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలీన కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ హైదరాబాద్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రజా సేన పార్టీ అధ్యక్షులు ఆవుల హన్మన్లు టీఆర్పీ పార్టీ లో విలీనం చేయడం జరిగింది.ఈ సందర్భంగా, ప్రజా సేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్పీ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజా సేన పార్టీ నాయకులు, మహిళలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
