Youths Abused Police in Nyalkal, Case Registered
పరుషపదాలతో..”పోలీసులను దూషించిన యువకులు”..!
◆ – కేసు నమోదు చేసిన హద్మూర్ ఎస్సై సుజిత్..!!
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్ కల్: విధినిర్వహణలోనున్న పోలీసులపై పరుషపదాలతో దూషించిన యువకులపై హద్దునూర్ ఎస్సై గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..న్యాల్ కల్ కు చెందిన యువకులు మున్నూరు రాజు, చుట్టాకుల శ్రీకాంత్, గాండ్ల వినయ్ కుమార్ లు బుధవారం అర్ధరాత్రి నారాయణఖేడ్, న్యాల్ కల్ – బీదర్ రోడ్డుపై బైఠాయించి మద్యం సేవిస్తున్నారు. విధినిర్వహణలో భాగంగా స్థానిక పోలీసులు సాయికుమార్, మహేష్ లు గస్తీ నిర్వహిస్తుండగా.. ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నారంటూ పోలీసులు ప్రశ్నించారు. ప్రశ్నించడానికి మీరెవరు అంటూ.. మద్యం మత్తులో యువకులు పోలీసుల పైనే పరిష పదాలతో దూషిస్తూ.. పోలీసులు వీడియో రికార్డు చేస్తుండగా.. విధులను ఆటంకం కలిగిస్తూ.. వారివద్ద నుండి సెల్ ఫోన్లు, లాఠీలను లాక్కోవడం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ హెచ్చరించారు.
