Paddy Procurement Centers Launched in Tangallapalli
తంగళ్ళపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో ఐకెపి సెంటర్ల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా.. చేపట్టిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని. నిన్ననే ప్రారంభోత్సవం చేసి ఈరోజు కొనుగోలు కేంద్రాలను.మహిళా సంఘాల ఆధ్వర్యంలో. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని. అలాగే ప్రభుత్వం గుర్తించి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ల ద్వారా వడ్ల కొనుగోలు చేయాలని మహిళల అభివృద్ధి ధ్యేయంగా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఐకెపి సెంటర్లద్వారా వడ్ల కొనుగోలు చేయడంతో పాటు మహిళలకు ఐకెపి సెంటర్ల ద్వారా. ఉపాధి కల్పిస్తున్నట్టు తెలియజేస్తూ మహిళా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారని అలాంటిది రైతులు పండించిన ధాన్యాన్ని. రైస్ మిల్లులో గాని. దళారుల గాని అమ్మి మోసపోవద్దని. ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధరకు రైతులు ఐకెపి సెంటర్ ద్వారా కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని. గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని. ప్రజలను. ఆర్థికంగా. నిండా ముంచి వెళ్ళాయని ఎన్ని కష్టనష్టాలు వచ్చినా. రాష్ట్రాన్ని. అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్. వెలుపుల. స్వరూప తిరుపతి రెడ్డి. వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. ఏపీఎం.. డైరెక్టర్లు తిరుపతి రెడ్డి. నక్క నరసయ్య. సత్తు శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మునిగిల రాజు. శ్రీనివాస్ రైతులు మహిళా సంఘ సభ్యులు ఐకెపి సెంటర్ నిర్వాహకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
