
Youth Congress Burns RSS Leader Effigy Over Sexual Harassment
ఆర్ఎస్ఎస్ నాయకుల దిష్టిబొమ్మ దగ్ధం
బట్టు కర్ణాకర్
ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడు
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ ఆధ్వర్యంలో ఆనందాజీ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆర్ఎస్ఎస్ నాయకుల దిష్టిబొమ్మను దహనం చేయడం
జరిగింది. అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేరళకు చెందిన యువ సాఫ్ట్వేర్ ఆనందా ఆజీ పై చిన్న వయసు నుంచే కొంతమంది ఆర్ఎస్ఎస్ వాదులు లైంగిక వేధింపులకు గురిచేస్తూ మానసిక వేదనకు, శారీరకంగా వేదనకు గురిచేసి ఆయనను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి.. అతని చావుకు కారణమైన ఆర్ఎస్ఎస్ వాదుల దిష్టిబొమ్మను దహనం చేసినామన్నారు
ఆనందా ఆజీ తన ఇంస్టాగ్రామ్ లో స్వయంగా నాకు ప్రేమ వ్యవహరాలలో జోక్యం లేదు ఆర్థిక ఇబ్బందులు లేవు కేవలం ఆర్ఎస్ఎస్ నాయకులు చేసిన లైంగిక వేధింపులకే మానసిక ఇబ్బందుల వల్లనే నేను చనిపోతున్నాను అని వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది
యువ సాఫ్ట్వేర్ ఆనంద్ ఆజిపై లైంగిక వేధింపులు చేసిన ఆర్ఎస్ఎస్ నాయకులపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి వారి కుటుంబానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా నాయకులు ప్రసాద్ అఖిల్ తిలక్ ప్రేమ్ కుమార్ అఖిల్ భాస్కర్ రిజ్వాన్ వినోద్ శేఖర్ శ్రీకాంత్ సాగర్ రేవంత్ రవీందర్ మల్లేష్ సంపత్ నదీమ్ సురేష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు