Paddy Purchase Centers Open in Tangallapalli
వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
https://youtu.be/noKiE2XIQfg?si=L7oOaMMyR-BikAwq
తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల పాక్స్. ఆధ్వర్యంలో. నేరెళ్ల. చిన్న లింగాపూర్ గ్రామాలలో.వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నేరెళ్ల పాక్స్. చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని. అలాగే రైతులు తమ పండించిన ధాన్యాన్ని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని. రైతులకు ఏమైనా ఇబ్బందులు గురైతే తమ దృష్టికి తీసుకురావాలని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తూకం సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని . తగు విషయాలపై సంబంధిత అధికారులతో చర్చించి సంబంధిత రైతులకు అన్ని రకాలుగా. ఏ ఇబ్బందులు. రైతుల సంక్షేమమే ధ్యేయంగాచర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే.రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం . నిర్ణయించిన ధర చెల్లిస్తుందని దయచేసి రైతులు. దళారులను నమ్మి మోసపోవద్దని వారు పండించిన ధాన్యాన్ని వరి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. పాక్స్. డైరెక్టర్స్ అనిల్ రెడ్డి. రాజిరెడ్డి. గణేష్ గౌడ్. రవీందర్. రావు. నారాయణ గౌడ్. పొన్నాల కిషన్. ఏం సి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. నాయకులు లింగారెడ్డి. రవి. శ్రీనివాస్ గౌడ్. శోభ. పాక్స్. సిబ్బంది. రైతులు గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు
