
Congress Slams BRS for Ignoring BCs for 10 Years
పదిఏళ్లలో బీసీలకోసం బిఆర్ఎస్ ఏం చేసింది.?
మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రం లో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ మాట్లాడుతు బి ఆర్ఎస్ పార్టీ పదిఏండ్లు అధికారంలో ఉండి.. బీసీ రిజర్వేషన్ల మీద కనీసం బిల్లు కూడా పాస్ చేయించుకోలేదు టిఆర్ఎస్ పార్టీ..?
బి ఆర్ఎస్ నాయకులంతా గొప్ప గొప్ప మేధావులు..
బిల్లు ఎలా పెట్టాలో తెలుసు..
ఆర్డినెన్సులు ఎలా తీసుకు రావాలో తెలుసు..
కేంద్రంతో ఎలా కోట్లాడలో తెలుసు.. అంటున్నారు..
మరి ఇన్ని తెలిసి పదేండ్లు అధికారం లో ఉండి.. బిసిల పట్ల మీరు చూపించిన నీతి ఏంటి?
నీతులు ప్రతి ఒక్కడూ చెప్తాడు.. ఆట ఆడే వాడికి తెలుసు ఎలా ఉంది పరిస్థితి అని.
దేశం లో, స్వాతంత్రం నుంచీ.. పేదల పట్ల చట్టాలు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ నే..
బిసి రిజర్వేషన్ల బిల్లు కూడా సాధించి తీరుతుంది.*
తెలంగాణ కోసం ఎన్నాళ్లు కోట్లాడితే తెలంగాణ వచ్చింది? అడగగానే తెలంగాణ ఇచ్చారా? ఎన్నో ఏండ్లు కోట్లాడితే వచ్చింది తెలంగాణ.. అది ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే..!!
బీసీ బిల్లు కూడా అంత సులువైన వ్యవహారం కాదు..!
కాంగ్రెస్ పోరాడుతుంది.. సాధిస్తుంది..!
బి ఆర్ఎస్ కి బీసీ ల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే పందేడ్లలో ఏనాడైనా బీసీ ల కోసం ఏమైనా చేసిందా? చెప్పండి..
కనీసం బి ఆర్ఎస్ నుంచి ఒక్కటంటే ఒక్క నాయకుడు కూడా ఇంప్లీడ్ పిటిషన్ వెయ్యలేదు బీసీ రిజర్వేషన్ల కేసులో..
నీతులు ప్రతి ఒక్కడూ చెప్తాడు..
బి సి రిజర్వేషన్లు మాత్రం కాంగ్రెస్ ద్వారానే సాధ్యం..అవుతుంది.!! స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న జీవో నెంబర్ స్టే హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బిజెపి టీఆర్ఎస్ పై ప్రజలు మండి పడుతున్నారని బిల్లు ఆపడంలో వారి కుట్ర స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాత రాజు రమేష్ విలేకరులకు కాంగ్రెస్ పార్టీవివరించారు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపింది బిజెపి ప్రభుత్వం కాదా? రిజర్వేషన్ 50% మించకుండా చట్టం చేసింది బిఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు ఇక్కడ రెండు పార్టీలు కుట్ర స్పష్టంగా కనబడుతుందని అదంతా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు