
Congress
న్యాల్యల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలి
◆:- ఎం.పి,కాంగ్రెస్ నేతలను మహమ్మద్ యూనుస్ వినతి
జహీరాబాద్ నేటి ధాత్రి:

స్థానిక ఎన్నికల్లో న్యాల్కల్ మండలం నుండి కాంగ్రెస్ పార్టీ జెడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముహమ్మద్ యూనుస్ జహీరాబాద్ తమ బృందంతో చేరుకుని, మాజీ రాష్ట్ర మంత్రి మరియు జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ ఎ. చంద్రశేఖర్ ఎంపీ జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కర్ లను జహీరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో ఇన్చార్జి క్యాంప్ ఆఫీస్ శుక్లా వర్ధన్ రెడ్డితో కలిసి న్యాల్కల్ మండల నుండి జెడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దరఖాస్తును అందజేశారు. జడ్పిటిసి అభ్యర్థి ప్రకటిస్తే మండల ప్రజలను సేవలందిస్తానని ఈ అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా సంగారెడ్డి ఉపాధ్యక్షుడు ముహమ్మద్ ముల్తానీ, జహీరాబాద్ మున్సిపల్ మాజీ సభ్యుడు ముహమ్మద్ ముయిజుద్దీన్, జహీరాబాద్ మున్సిపల్ మాజీ సభ్యుడు హఫీజ్ మహ్మద్ అక్బర్ హోగేలి, కాంగ్రెస్ జహీరాబాద్ మండల అడహాక్ కమిటీ అధ్యక్షుడు రాంలు యాదవ్, మహ్మద్ ఇనాయత్ అలీ మహమ్మద్ ఇస్మాయిల్ మహమ్మద్ అయూబ్, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.