
Bhoopalapalli Former MLA
కాంగ్రెస్ బాకీ కార్డుతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి
మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
ఆనాడు ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు,420 హామీలు ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేటికి రోజులు లెక్కపెట్టి చూస్తే దాదాపుగా 660 రోజులు అయ్యింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయింది ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన హామీలను గుర్తు చేద్దామని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు భూపాలపల్లి నియోజకవర్గం లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి కాంగ్రెస్ బాకీ కార్డు ఇస్తూ వివరిస్తూ వారిని చైతన్య పరిచే దిశలో మేము పని చేస్తుంటే వాళ్ళ పునాదులు కదులుతాయనే భయంతో ఈ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఇస్తూ ఏదో డోఖా కార్డుల పేరుతో కొత్త రాజకీయం మొదలు పెట్టారు.
మేము ఏమైనా లేనివి ఇవ్వమని చెప్పుతున్నామా మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయాలని గుర్తు చేస్తున్నామని అన్నారు.
బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజలకు మంచి చేసిందా,చేడు చేసిందా అనేది వాస్తవం తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సెక్యూరిటీ లేకుండా ప్రజలలోకి రావాలి.
రాబోయే 38 నెలలు వీళ్ళు అధికారంలో ఉంటారు కావచ్చు.ఈ 38 నెలలు వీళ్ళ నీడలాగ వెంటాడుతూనే ఉంటాం.
పడేండ్లలో డోఖా చేస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం ఈ విదంగా ఉండదు.
భూపాలపల్లి చిన్న కుగ్రామం నేడు జిల్లా స్థాయికి వచ్చింది.
మారుమూల జిల్లా అయిన ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంటింటికి నీళ్లు వచ్చిన్నాయి, పెన్షన్స్ వచ్చినాయి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినయి.
కేసీఆర్ మాట చెప్పి ఎన్ని రోజులు నడుపుతారు ఈ ప్రభుత్వాన్ని.
కనీసం యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, చేతకాని ముఖ్యమంత్రి అని ప్రజలు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు పెట్టాలంటే బయపడుతున్నారు.
ప్రధాన ప్రతిపక్ష హోదాలో మాకు ప్రశ్నించే హక్కు ఉంది డానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిఏసి ఎస్ చైర్మన్ మేకల సంపత్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట రాణి సిద్దు గండ్ర హరీష్ రెడ్డి నూనె రాజు తదితరులు పాల్గొన్నారు