90 పక్కా!

https://epaper.netidhatri.com/

` జోరుమీదున్న కారు!

` ఈసారి కూడా బిఆర్‌ఎస్‌ దే గెలుపు.

` 40శాతానికి పైగా బిఆర్‌ఎస్‌ కే ఓటు.

` ఎన్నికల సమయానికి 45 శాతానికి పెరిగే అవకాశం.

` ప్రతిపక్షాల నుంచి బిఆర్‌ఎస్‌ వైపు మళ్లనున్న వలసలు.

` తాజా అంచనాలతో డి-ప్యాక్‌, నేటిధాత్రి సంయుక్తంగా అందిస్తున్న సంచలన సర్వే వివరాలు.

` కర్ణాటక ఎన్నికల ఫలితాలపై నెల రోజుల ముందే చెప్పిన డి-ప్యాక్‌.

` తెలంగాణ లో మూడు నెలల ముందే చెబుతున్న లెక్కలు.

` కర్నాటక లో కచ్చితంగా డి- ప్యాక్‌ చెప్పిన లెక్కే నిజమైంది.

` తెలంగాణ లో మరోసారి బిఆర్‌ఎస్‌ గెలుపు దిశగా దూసుకుపోతోంది.

https://epaper.netidhatri.com/

`హట్రిక్‌ విజయంతో ప్రభంజనం సృష్టించబోతోంది.

` కేసిఆర్‌ ప్రజల్లోకి వచ్చాక మరింత పెరగొచ్చు!

` దరిదాపుల్లో కూడా లేని కాంగ్రెస్‌.

` బిజేపి అడ్రస్‌ గల్లంతే.

` జనంలో బలమైన నేతగా కేసిఆర్‌.

` తెలంగాణ లో ఎదురులేని నేతగా కేసిఆర్‌.

` దేశంలోనే తిరుగులేని పాలనగా కేసిఆర్‌ ప్రభుత్వం.

` సంక్షేమ సారధిగా గుర్తింపు.

` రైతులంతా కేసిఆర్‌ వైపే.

` దివ్యాంగుల ఓట్లు బిఆర్‌ఎస్‌ కే.

` మహిళాలోకమంతా కేసిఆర్‌ కు నీరాజనాలే.

` సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లు కారుకే.

` దళితులు, గిరిజనులు గంపగుత్తగా గులాబీ వైపే.

` మైనారిటీలు మొత్తం బిఆర్‌ఎస్‌ తోనే.

` అన్ని వర్గాలు బిఆర్‌ఎస్‌ కు అనుకూలమే.

`ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్‌ఎస్‌ గెలుపు లాంఛనమే.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

బిఆర్‌ఎస్‌ ప్రభంజనం మరో కనిపించనున్నది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఈసారి ఎన్నికలలో గత ఫలితాలను మించి సీట్లు సంపాదించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు తెలంగాణ లో ఎన్నికలు జరిగితే కచ్చితంగా 90 సీట్లు బిఆర్‌ఎస్‌ గెల్చుకునే అవకాశం కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ సంఖ్య కూడా పెరిగేలా కనిపిస్తున్నది. తెలంగాణలో ప్రజలు మరో పార్టీని ఊహించుకోలేకపోతున్నారు. మరే నాయకుడిని గుర్తించడానికి సిద్దంగా లేరు. ప్రతిపక్షాలలో ప్రజల కోసం ఆలోచించే నాయకుడు లేడు. ప్రజల కోసం పెద్దగా కొట్లాడిన నాయకుడు కూడా ప్రతిపక్షాలలో లేడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు అసలే ఆయా పార్టీలలో లేరు. వారికి తెలంగాణ సమస్యలు తెలియవు. తెలంగాణ ప్రజల అవసరాలు అర్థం కావు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారన్న దానిపై దృష్టి పెట్టే స్థితిలో లేరు. గాలిలో లీడర్లైన ప్రతిపక్ష పార్టీల నాయకులను నమ్మడానికి తెలంగాణ ప్రజలు ఇషంగా లేరు. మరో సారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. అరవై ఏళ్లు పడిన గోస చాలు. ఆనాడే ప్రజల బాధలు కాంగ్రెస్‌ నాయకులు తీర్చలేదు. తెలంగాణ ప్రజలను ఆదుకోలేదు. ఎన్నికలలో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే తెలంగాణ అవసరాల గురించి కాంగ్రెస్‌ నేతలు కొట్లాడలేదు. పదవుల పట్టుకొని వేళాడుడు తప్ప, పదిపైసల పని చేసింది లేదు. ఇప్పుడు మళ్ళీ అదే నాయకులు వచ్చి మేం ఉద్దరిస్తామని చెబితే ప్రజలు వినడానికి సిద్ధంగా లేదు. వాళ్లను ఆదరించాలన్న ఆలోచన జనం కలలో కూడా చేయడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ లో ప్రతిపక్షాల రాజకీయం వృధా! ఇదీ సగటు తెలంగాణ ప్రజలు వెలుబుచ్చుతున్న అభిప్రాయాలు. డి.ప్యాక్‌, నేటిధాత్రి దినపత్రిక చేపట్టిన సర్వేలో ప్రజలు వెలుబుచ్చిన నిజాలు ఇవే…

 తెలంగాణ లో ప్రజల అభిప్రాయాలు వింటుంటే ఈసారి జరిగే ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ కు 90 పక్కా! అనిపిస్తోంది. 

గతం కన్నా ఈసారి కారులో మరింత జోరు కనిపిస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ గత రెండేళ్లుగా చెబుతూనే వున్నారు. అంతేకాదు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్న సర్వే సంస్థలకు కూడా క్షేత్ర స్థాయిలో ఇదేకనిపిస్తోంది. అందులో భాగంగా డి-ప్యాక్‌ నిర్వహిస్తున్న సర్వేలో ప్రజలు ఎక్కడికెళ్లినా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. సూటిగా వారి మనసులో మాట చెప్పేస్తున్నారు. కారు పార్టీని తప్ప మరో పార్టీకి తెలంగాణ లో చోటు లేదంటున్నారు. ఒక దశలో డి. ప్యాక్‌ ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా నేరుగా ప్రజలను ప్రశ్నించడం జరిగింది. అప్పుడు కూడా కేసిఆర్‌ చెప్పిన అభిప్రాయాలనే ప్రజలు పంచుకోవడం, చెప్పడం విశేషం. ఇటీవల రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఏం చెప్పారో..అదే ప్రజలు చెబుతుంటే ఆశ్చర్యకరంగా వుంది. అంటే ప్రజలు పూర్తిగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం కావాలని మరింత బలంగా కోరుకుంటున్నారన్న సంగతి అర్థమౌతోంది. అందుకే ఈసారి కూడా బిఆర్‌ఎస్‌ దే గెలుపు ఖాయమన్నది ఇక్కడితోనే స్పష్టమౌతోంది. 40శాతానికి పైగా బిఆర్‌ఎస్‌ కే ఓటు. ఎన్నికల సమయానికి 45 శాతానికి పెరిగే అవకాశం వుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేరుగా రంగంలోకి దిగితే బిఆర్‌ఎస్‌ కు మరింత జోష్‌ నిండుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనేక పథకాలు ప్రకటించి, ప్రతిపక్షాలకు ఊపిరాడకుండా చేస్తున్నారు. తాజాగా రైతు రుణ మాఫీ పూర్తి చేశారు. ఇది ప్రతిపక్షాలు ఊహించలేదు. ఇక ఇటీవలే గిరిజనుల సమస్యల మీద దృష్టి పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో చేయని పోడు భూముల పరిష్కారం చేసి చూపించారు. రైతులకు పట్టాలు అందజేశారు. అపరిష్కృతంగా వున్న ఈ సమస్య తీరడం అంటే గిరిజనులకు ఎంతో ఊరట కల్గించే అంశం. అంతేకాకుండా గిరిజన బంధు కూడా దశలవారీగా అమలు చేస్తున్నారు. దాంతో తెలంగాణ లో వున్న గిరిజనులంతా బిఆర్‌ఎస్‌ వైపే నిలుస్తారని చెప్పడంలో సందేహం లేదు. డి.ప్యాక్‌ సర్వేలో కూడా ఇదే వెల్లడైంది. తెలంగాణ లో మరోసారి బిఆర్‌ఎస్‌ గెలుపు దిశగా దూసుకుపోతోంది. హట్రిక్‌ విజయంతో ప్రభంజనం సృష్టించబోతోంది. 

ప్రతిపక్షాలలో ఇటీవల దూకుడు మీదున్నట్లు గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్‌ పార్టీ తరఫునలో బిఆర్‌ఎస్‌ దరిదాపుల్లో కూడా లేదు.

 అసలు పోటీ చేయడానికి నాయకులు ఆసక్తిగా కూడా లేరు. తెలంగాణలో ప్రజల్లో ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత లేదు. వుంటే ఆ పరిస్థితి వేరే రకంగా వుంటుంది. ప్రజలకు అసంతృప్తి వుంటే వాళ్లను ఎవరూ ఆపలేరు. ప్రజల్లో లేని వ్యతిరేకతను ప్రతిపక్షాల ఎంతగా రుద్దాలని చూసినా పట్టించుకోరు. అంతదాక ఎందుకు మునుగోడు ఉప ఎన్నికలో ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. పైగా రేవంత్‌ రెడ్డి ప్రచారంలో భాగంగా ఓ గ్రామానికి వెళ్తే మహిళలలే ఎందుకొచ్చావని మొహం మీదే అడిగిన సందర్భం చూశాం. ఇదీ కాంగ్రెస్‌ పరిస్థితి. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ మీద అభిప్రాయం చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు. ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్‌ గురించి చెప్పడానికి ఏమీ లేదంటున్నారు. అంటే అంత విరక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక బిజేపి గురించి అడిగితే నవ్వుతున్నారు. ధరల గురించి ఉటంకిస్తున్నారు. సిలిండర్‌ మొద్దులు ఆడ పడివున్నాయంటున్నారు. ఈ విషయాలు వింటుంటే తెలంగాణలో బిజేపి అడ్రస్‌ గల్లంతే అనేది స్పష్టంగా కనిపిస్తోంది. పైగా బిజేపి రాష్ట్ర నాయకత్వం మార్పుపై బైట జరుగుతున్న చర్చను ప్రజలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. బండి సంజయ్‌ మార్పు జరగకుంటే అనే మాటలు వినిపిస్తున్న బిజేపి నేతలు కూడా పార్టీ పరిస్థితి బాగా లేదనే అంటున్నారు. 

జనంలో బలమైన నేతగా కేసిఆర్‌ కీర్తి మరింత పెరిగింది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ అన్నపూర్ణగా అవతరించింది.

 అందుకు కేసిఆర్‌ కృషి మాటల్లో చెప్పలేనంత గొప్పది. ఆయన దీక్ష, పట్టుదల, కార్య నిర్వహణ గతంలో ఏ నాయకుడిలో చూడలేదు. ఇదే మాట తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఎవరిని కదిలించినా ఇదే విషయాన్ని సంతోషంగా చెబుతున్నారు. తమ బతుకులు బాగుపడ్డాయని కేసిఆర్‌ కు రుణపడి వున్నామంటున్నారు. దేవుడు కేసిఆర్‌ అంటూ రెండు చేతులెత్తి దందం పెడుతున్నారు. అంతలా ప్రజల హృదయాలలో కేసిఆర్‌ చెరిగిపోలేని, సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. దాంతో ప్రజలకు ఏ ఇతర పార్టీ నాయకుడు కనిపించడం లేదు. అసలు ప్రతిపక్షాల నాయకులను ప్రజలు పట్టించుకోవడం లేదు. దాంతో తెలంగాణ లో ఎదురులేని నేతగా కేసిఆర్‌ నాయకత్వం కళ్ల ముందు కనిపిస్తోంది. దేశంలోనే తిరుగులేని పాలనగా కేసిఆర్‌ ప్రభుత్వం గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగల శక్తి వున్న నాయకుడు కేసిఆర్‌ అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. తెలంగాణనే సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు కేసిఆర్‌ ను సంక్షేమ సారధిగా కొలుస్తున్నారు. రైతులంతా కేసిఆర్‌ వైపే. దివ్యాంగుల ఓట్లు బిఆర్‌ఎస్‌ కే. మహిళాలోకమంతా కేసిఆర్‌ కు నీరాజనాలే. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లు కారుకే.

 దళితులు, గిరిజనులు గంపగుత్తగా గులాబీ వైపే. మైనారిటీలు మొత్తం బిఆర్‌ఎస్‌ తోనే. అన్ని వర్గాలు బిఆర్‌ఎస్‌ కు అనుకూలమే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్‌ఎస్‌ గెలుపు లాంఛనమే.

 డి-ప్యాక్‌ అంటే విశ్వసనీయతకు మారుపేరు. 

గత కర్నాటక ఎన్నికలకు నెల ముందే తన సర్వే వివరాలను వెల్లడిరచింది. అప్పటికి దాదాపు అన్ని సర్వే సంస్థలు బిజేపికి అనుకూల ఫలితాలను సూచించాయి. కొన్ని హంగ్‌ అంటూ నివేధికలు ఇచ్చాయి. కానీ డి.ప్యాక్‌ సంస్థ మాత్రమే కాంగ్రెస్‌ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని చెప్పింది. అంతే కాదు బిజేపికి అందనంత ఎత్తులో వుందని కూడా చెప్పింది. వీటికి తోడు కర్ణాటక లో ఏఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది కూడా కచ్చితమైన లెక్క చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డి.ప్యాక్‌ నెల ముందుగానే లెక్కలు చెబితే అసాధ్యమని వాదించిన వారు కూడా వున్నారు. కర్ణాటక ఎన్నికలలో ప్రధాన మంత్రి మోడీ ప్రచారం తర్వాత మార్పు వచ్చిందని చాలా మంది అన్నారు. అయితే డి.ప్యాక్‌ మాత్రం ప్రధాని ప్రచారం ఏ మాత్రం బిజేపికి ఉపయోగపడదని కూడా చెప్పింది. అదే అది నిజమైంది. డి.ప్యాక్‌ లెక్కలపై అందరికీ ఆసక్తి నెలకొన్నది. దాంతో తెలంగాణ లో ఏం జరగబోతోందనే దానిపై అనేక మంది డి.ప్యాక్‌ సంప్రదిస్తున్నారు. సర్వే వివరాలు అడుగుతున్నారు. మిగతా సర్వే సంస్థలు కూడా సమాచారం తెలుసుకోవాలని కుతూహలంతో వున్నారు. అందుకే నేటిధాత్రి డి.ప్యాక్‌ సర్వే వివరాలు మూడు నెలల ముందే వెల్లడిస్తోంది. అయినా సర్వే కొనసాగుతూనే వుంటుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎలా వుంటుందన్న దానిపై అందిస్తున్న ప్రత్యేక వివరాలు పాఠకుల కోసం అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు సర్వే వివరాలు ఎన్నికల దాకా ప్రకటిస్తూనే వుంటాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!