
ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీస్.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఆదిలాబాద్, నిర్మల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన కొత్తగా ఎంపికైన 213 పోలీస్ కానిస్టేబుల్స్ (సివిల్) (పురుషులు) 9 నెలల బేసిక్ ఇండక్షన్ శిక్షణకు హాజరు కావడానికి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రం లోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రానికి రావడం జరిగింది. శిక్షణను ప్రారంభించి, శిక్షణా సూచనలు వున్న పుస్తకాలను అందించరు. ఈ కార్యక్రమం లో ఎస్పీ మాట్లాడుతూ, నేటి సమాజంలో రకరకాల మోసాలను, నేరాలను అరికట్టాలంటే శిక్షణ పొందే సమయంలో సిబ్బంది క్రమశిక్షణతో, శిక్షణ పూర్తి చేయాలని అప్పుడే ఇలాంటి నేరాలను అరికట్టడం జరుగుతుందని,అన్నారు.వివిధ ఉన్నత చదువులు చదివిన యువకులు ఎమ్.ఎస్., బి.టెక్, డిగ్రీ పొంది ప్రజలకు సేవలు అందించే అవకాశం కల్గిన పోలీసు వృత్తిని ఎంచుకోవడం పట్ల వారిని ప్రత్యేకంగా అభినందించారు. మీరు ప్రధానంగా సమాజానికి ఏమీ చేయాలి అనేది ఆలొచించి విధులు ప్రారంభించాలని, సమాజంలో శాంతి భద్రతలు బాగుండాలన్న, అభివృద్ధి చెందాలన్న ముఖ్యంగా అక్కడ పోలీస్ విధులు ప్రధానం అని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటే సిబ్బంది చక్కని విధులు నిర్వహించాలని, మనకు శిక్షణ అటే ఇంటినిర్మాణానికి పుణాదిలాంటిది అని పుణాది బాగుంటే ఇంటి నిర్మాణం అంత బాగుటుందని, అందుకే పోలీస్ పై ఎన్నో భాద్యతలు గలవని అన్ని శాఖలకన్న ఎక్కువ మంది సిబ్బంది పోలీస్ శాఖలో ఉంటారని, అందుకే అందరూ యునిఫాం సర్వీసు ఒకే మాదిరిగా ఆలోచించాలని సేవలు అందించాలని, అమలు చేసే చట్టం ఒకే మాదిరిగా ఉండాలని, అందుకే క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం అని, మీరు పర్సానాలిటి అంటేనే క్రమశిక్షణ అని గుర్తుకురావాలని మీరు ముందు ముందు ఎన్నో చాలెంజ్‌లను ఎదుర్కోవాల్సి వస్తుందని, అన్నింటిని దృఢనిచ్చయముతో ఎదుర్కోవాలని, వీటి కోసం తప్పకుండా ఈ శిక్షణ కాలంలో నేర్పిస్తారని, ప్రతీ ఒక్కరు క్రమశిక్షణతో అలవర్చుకోవాలని మరియు ప్రతీ ఒక్కరు మంచి విశ్వాసం తో ఉండాలని, అన్నింటికి కట్టుబడి నియమ నిబద్దతతో ఉండడం కూడా ప్రతీ ఒక్కరికి చాలా అవసరం అని, ఎవ్వరు కూడా ఎలాంటి అపోహాలు లేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని, ప్రతీ ఒక్కరు ఎల్లప్పుడు 24 x 7 మాదిరిగా సేవలు అందించాలని, ప్రస్తుతం ప్రజలలో చైతన్యం పెరిగి తమ హక్కుల పై, చట్టాలపై అవగాహాన పెరిగిందని కనుక ప్రతిఒక్కరు ఉద్యోగ భద్రతగా విధులు నిర్వహిస్తు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ గురించి ప్రతీ ఒక్కరం మంచి ఉద్దేశ్యంతో ముందుకెల్లాలి, అందుకోసం ప్రజలతో సత్సంబందాలు ఏర్పాటుచేసుకోవాలని, శిక్షణ కాలంలో ప్రతి ఒక్కరు మానసికంగా, శారీరకంగా శిక్షణ పొంది ప్రతిభ అవార్డులు పొందాలని ప్రతి పోలీసు మానిసిక, శారీరక అన్నిరకాల శిక్షణలకు సిద్దంగా ఉండాలని, శిక్షణ నియమనిబందనలను ప్రతిఒక్కరు పాటించాలని, శిక్షణకాలంలో నేర్చుకున్న నియమ నిబందనలుశిక్షణ అనంతరం కూడా ప్రతి ఒక్కరు తూ.చ తప్పకుండా తమసర్వీసు మొత్తం ఇదే విధంగా పాటించాలాని కోరారు.
ఈకార్యక్రమంలో డీటీసీ డీఎస్ పి రామారావు, డీటీసీ ఇన్స్పెక్టర్ బాలస్వామి, ఇండోర్ మరియు ఔట్ డోర్ శిక్షణా సిబ్బంది మరియు ఇతర సపోర్టింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.