88.11% Voter Turnout in Warangal District
వరంగల్ జిల్లాలో 88.11శాతం ఓటింగ్ నమోదు
నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా వరంగల్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికలు దుగ్గొండి, నల్లబెల్లి, సంగెం,గీసుకొండ మండలాల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 88.11శాతం ఓటింగ్ నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి,వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
దుగ్గొండి మండలం 89.88 శాతం అత్యధికంగా పోలింగ్ నమోదు కాగా గీసుకొండ మండలం 85.83 శాతం ఓట్లతో జిల్లాలో తక్కువ శాతం పోలింగ్ అయ్యింది.సంగెం మండలంలో 89.44 శాతం ఓట్లు పోలింగ్ కాగా నల్లబెల్లి మండలంలో 86.36 శాతం ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా పరిధిలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలలో జిల్లాలోని రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దుగ్గొండి, నల్లబెల్లి,సంగెం,గీసుకొండ మండలాల పరిదిలో 66467 పురుషులు,69722 మహిళలు ఇతరులు ఇద్దరు కాగా మొత్తం 136191ఓటర్లు ఉండగా అందులో
58688 మంది పురుషులు 61311 మహిళలు ఇతరులు ఇద్దరు మొత్తం 120001మంది ఓటర్లు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
