83,12,250-00 విలువ గల గంజాయి,అల్ఫాజోలం దహనం:

జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 83,12,250-00 విలువ గంజాయి,అల్ఫాజోలం దహనం చేశామని జిల్లా ఎస్పీ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన 5 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత గంజాయి 183 కిలోల 490 గ్రాముల గంజాయి మరియు 3 కేజీల 725 గ్రాముల అల్ఫాజోలం లను, ఎన్ డి పి ఎస్ చట్ట ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ షాపూర్ గ్రా. ఖిలాఘనపూర్ మం. వనపర్తి జిల్లా నందు గల కామన్ బయో మెడికల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ (సీబీఎంత్ఫ్ ) రన్ బై ఎం /ఎస్ స్వేతనష్ & కంపెనీ నందు ఈ రోజు దహనం చేయడం జరిగిందని, దహనం చేసిన గంజాయి విలువ రూపాయలు 83,12,250-00 ఉంటుందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ గా జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపిఎస్ మరియు కమిటీ సభ్యులు గా అదనపు ఎస్పీ రాములు, మహబూబ్ నగర్ డిఎస్పి వెంకటేశ్వర్లు ఉండడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
ఎన్ డి పి ఎస్ యాక్ట్ లోని నియమనిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదు చేయనడిన 5 కేసులలో నిల్వ ఉన్న గంజాయి మరియు అల్ఫాజోలం ని దహనం చేయడం జరిగిందని తెలియజేసారు. కొందరు అక్రమార్జనలో భాగంగా, గంజాయి సాగు మరియు అల్ఫాజోల్ విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారన్నారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసుల ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను సాగు చేసిన, రవాణా చేసిన, అమ్మిన, సేవించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

షాపూర్ గ్రా. ఖిలాఘనపూర్ మం. వనపర్తి జిల్లాలో గంజాయి దహన కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు, డిసిఆర్బి డీఎస్పీ రమణా రెడ్డి, మహబూబ్ నగర్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, మహబూబ్ నగర్ రూరల్ ఎస్ ఐ మరియు భూత్ పూర్ ఎస్ ఐ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!