7 జులైన ఎమ్మార్పీఎస్ అవుర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

జిల్లెల్ల మురళి మాదిగ రాష్ట్ర కార్యదర్శి

పరకాల నేటిధాత్రి
పట్టణంలోని మాదారం కాలనీలో నేడు ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి నాగెల్లి సంతోష్ మాదిగ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పరకాల మండల ఇంచార్జ్ జిల్లెల్ల మురళి మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ దినోత్సవాలను పురస్కరించుకొని గ్రామ గ్రామాన మాదిగ జాతి ఆత్మగౌరవ పతాకలను ఎగరేయాలని ఆయన అన్నారు.ఉద్యమం ఈ సమాజంలోని బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం ప్రభుత్వాలపై ఉద్యమాలు చేసి అనేక సంక్షేమ ఫలాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ, వృద్ధులు వితంతువుల,వికలాంగుల పెన్షన్ పెంపు కోసం చేసిన ఉద్యమం,తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తికి సుమారు 6 కేజీల బియ్యం అందించడం కోసం, ప్రమోషన్లు రిజర్వేషన్లు ఉద్యమం,ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంలో చేసిన ఉద్యమం మరియు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అండగా అమరవీరుల కుటుంబానికి ఉద్యోగం,10 లక్షల ఎక్స్గ్రేషియా మరియు వారికి ఇంటిస్థలం కోసం అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర మందకృష్ణ మాదిగకి దక్కుతుందని ఆయన గుర్తు చేశారు.ప్రకాశం జిల్లా ఈదుమూడి అనేకు గ్రామంలో ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం అంచలంచలుగా ఎదుగుతూ జాతి లక్ష్యంతో పాటు ఈ సమాజంలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ పేద వర్గాల పక్షాన నిలబడి ఉద్యమం చేస్తున్న కుల సంఘం కేవలం ఎమ్మార్పీఎస్ దక్కుతుందని ఆయన గుర్తు చేశారు.మూడు దశాబ్దాల ఎంఆర్పిఎస్ ఆవిర్భవ వేడుకలు పురస్కరించుకొని గ్రామ గ్రామాన ఎమ్మార్పీ ఎస్ జెండాలు ఎత్తాలి.అదేవిధంగా మహనీయులు మరియు మాదిగ అమరవీరులను స్మరించుకుంటూ ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో
నగేల్లి సంతోష్ మాదిగ,జిల్లెల్ల సంపత్ మాదిగ,దుప్పటి మహేందర్ మాదిగ,మంద సదానందం మాదిగ, కోయిల రవి డబ్బాలు,పెండెల శ్రవణ్ మాదిగ,జన్ను స్వామి మాదిగ,
కొయ్యడ సన్నీ మాదిగ,జిల్లల సాయి మాదిగ
తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!