
CPI Celebrates 79th Independence Day in Bellampalli..
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
బెల్లంపల్లి నేటిధాత్రి :
ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి 79వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగినది వారు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు దేశ స్వాతంత్రానికై సమరయోధులై పోరాటం కొనసాగించారని స్వాతంత్రోద్యమంతో సంబంధంలేని మతోన్మాద బిజెపి ఆర్ఎస్ఎస్ లు స్వాతంత్రోద్యం కోసం దేశభక్తి కోసం మాట్లాడడం హాస్యాస్పదమని నిజమైన దేశభక్తి అంటే పేదల నిర్మూలన ఆదివాసీలు గిరిజనుల హక్కుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అని గిరిజన హక్కుల కోసం పోరాడే నక్సలైట్లను హతమార్చడం కాదని సమస్యల పరిష్కరించినప్పుడే ఉద్యమాలకు తావుండదని సమస్యలు ఉన్నంతకాలం ఎర్ర జెండా పోరాటాలు ఉంటాయని వారన్నారు, రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ మాట్లాడుతూ 79వ గణతంత్ర స్వాతంత్ర వేడుకలను పట్టణ కార్యాలయంలో నిర్వహించడం సంతోషదాయకమని ఓటు హక్కులను దుర్వినియోగపరుస్తూ కేంద్ర ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుందని ఇలాంటి చర్యలు మానుకోవాలని వారన్నారు, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య మాట్లాడుతూ కార్మిక హక్కులను కాల రాయడంలో బిజెపి ని ఎవరు బీట్ చేయలేరని కార్మికులంతా ఒక్కటై కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని వారన్నారు, ఈ కార్యక్రమంలో
బి కే ఎం యు జాతీయ సమితి సభ్యులు అక్క పెళ్లి బాబు, మండల కార్యదర్శి బొంతుల లక్ష్మీనారాయణ, పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, ఎస్ సి డబ్ల్యూ యు బ్రాంచ్ సహాయ కార్యదర్శి డి తిరుపతి గౌడ్, పట్టణ కోశాధికారి మంతెన రమేష్, కో ఆప్షన్ సభ్యులు మూల శంకర్ గౌడ్, పట్టణ కార్యవర్గ సభ్యులు, రత్నం రాజo, బియ్యాల ఉపేందర్, బొంకూర్ రామచందర్, బండారి శంకర్, నాయకులు గుండ ప్రశాంత్, బియ్యాల భవాని, బూర్ల సమ్మయ్య, ఉప్పుల శంకర్, కట్ల పోచం పాల్గొన్నారు.