
79th Independence Day celebrations
ఓదెల మండలం లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో పెద్దవల్లి సివిల్ జడ్జి ఎన్ మంజుల జాతీయ జెండాన ఎగురవేశారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ ధీరజ్ కుమార్ జాతీయ పతాకాన్ని
ఎగరవేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జి తిరుపతి ఎస్సారెస్పీ కార్యాలయం లో డిఈ బి భాస్కర్, పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై దీకొండ రమేష్, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ఈవో బి సదయ్య, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సహబజ్ ఖాన్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏవో బి భాస్కర్, మండల విద్యా అధికారి కార్యాలయంలో ఎంఈఓ వై రమేష్ ఐకెపి కార్యాలయంలో ఏపీఎం సంపత్
ప్రెస్ క్లబ్ ఆవరణంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పని
సుదర్శన్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదెల పశువుల ఆసుపత్రి
ఆవరణలో పశు వైద్యాధికారి మల్లేశం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో కాలేజీ ప్రిన్సిపాల్, మోడల్స్కూల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బీసీ హాస్టల్ ఆవరణలో హాస్టల్ వార్డెన్ ప్రవీణ్, కస్తూర్భా గాంధీ పాఠశాల ఆవరణలో ఎస్ఓ జ్యోతి తో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలో
పాఠశాల
ప్రధానోపాధ్యాయులు ప్రైవేట పాఠశాలలో అలాగే వివిధ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శులు, వివిధ పార్టీల, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఎగరవేసారు. ఈ సందర్భంగా విద్యార్థు లకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పంద్రా గస్టు నాడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటున్నా మంటే పూర్వం 1947కు పూర్వం ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామన్నారు. రాను న్న రోజులలో ప్రపంచ దేశంలో మన భారత దేశాన్ని మరింత ముందుకు తీసుకో వెళ్ళవలసిన బాధ్యత బావి భారత పౌరులమైన మన అందరి పైన ఉందని అలాగే ఉద్యోగంలో పనిచేసేవారు మరింత చురుకుగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించా లని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ షబ్బీర్ పాష, అడ్వకేట్స్, ఏఎస్ఐ లు, సిఓ అంజి రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, సింగి ల్విండో డైరెక్టర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ ప్రభుత్వ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.