
National flag
ఉమ్మడి హన్మకొండ జిల్లా కోర్ట్ ఆవరణలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు:-
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఇరు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు:-
హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
హన్మకొండ/వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్ట్ ఆవరణలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోర్టు ఆవరణలో పోలీసులు గౌరవ వందనం చేయగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ మరియు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. కె. పట్టాభి రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుదీర్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇట్టి సందర్భంగా వారు మాటాడుతూ న్యాయవాదులకు మరియు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో ఇరు బార్ అసోసియేషన్ల ప్రధాన కార్యదర్శిలు డి.రమాకాంత్, కె. రవి మరియు ఇరు కమిటీ సభ్యులు, మరియు జిపిలు, ఏజిపిలు మరియు పిపి లు, ఏపిపిఓలు, మరియు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.