చిట్యాల, నేటిదాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అధికారులు ప్రజాప్రతినిధులు యువజన సంఘాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రామయ్య, మండల తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ సుమన్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ రమేష్ ,సర్కిల్ ఆఫీసులో సిఐ వేణు చందర్, ఐకెపి కార్యాలయంలో ఏపీఏం, మంజుల, మరియు ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో ఆయా ఉపాధ్యాయులు అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆయా అధ్యక్షులు స్టార్ యూత్ ఆధ్వర్యంలో మహేష్ స్థానిక గ్రామపంచాయతీ లో కార్యదర్శి, మండలంలోని గ్రామాలలో గ్రామ అధికారులు జాతీయ జెండా ఎగరవేసి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు, విద్యార్థులు ,ఉపాధ్యాయులు, మహిళలు యువజన సంఘాల నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.