
మేడిపల్లి(నేటీదాత్రీ):
75వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఉప్పల్ డిపో ఏఐఎస్ఎఫ్(AISF) కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీర్జాధిగూడ మున్సిపల్ కార్పోరేషన్ కార్మికులు పెంటయ్య, ఇంద్ర, శ్యామల, హాజరై భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని “పెంటయ్య”ఎగురవేసి అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శి చిన్న, ఎండీ అన్వర్, ఉపాధ్యక్షులు హరీష్, నాయకులు , గోపి, కృష్ణ, శ్రీను, అభి, వినీల్ రెడ్డి, జెక్క సాయి, మహేష్, సైదులు, దుర్గ ప్రసాద్, నవరతన్, తదితరులు పాల్గొన్నారు.