
-ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి…
మేడిపల్లి(నేటీదాత్రీ):
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని పీర్జాదిగూడ కార్పొరేషన్ 16వ డివిజన్ గణేష్ నగర్ పరిదిలోని చైల్డ్ గైడెన్స్ సెంటర్ సిజిసి యాజమాన్యం ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. చైల్డ్ గైడెన్స్ సెంటర్ మా ప్రాంతంలో ఉండడం మాకు చాలా సంతోషకరమని, మీకు ఏ సమయంలో ఏమి సహాయ సహకారాలు కావాలన్నా, విద్యార్థిని విద్యార్థులకు, యాజమాన్యం వారికి అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ మానసిక అంగవైకల్యం కలిగిన విద్యార్థిని విద్యార్థులకు విద్య బోధన చేయడం అంత సులభం కాదని, వీళ్లకు సేవ చేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సిజీసీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాంరెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, మహేశ్వరప్ప, సిజిసి సెంటర్ ప్రధాన కార్యదర్శి జైనీ రోజ్ కుమారి, డైరెక్టర్ కం ప్రిన్సిపాల్ రజిని, స్టాఫ్ సిహెచ్ లక్ష్మి, పీ లక్ష్మి, అనిత, విద్యార్థిని, విద్యార్థులు, స్టాప్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.