‘‘7 నెలలు’’..’’70 మార్కులు’’..!

https://epaper.netidhatri.com/view/308/netidhathri-e-paper-3rd-july-2024%09

‘‘రేవంత్‌’’ పాలన సూపర్‌

-పరుగులు పెడుతున్న పాలన!

-అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సిఎం. రేవంత్‌ రెడ్డి.

-అటు పిసిసి… ఇటు సిఎం గా ద్విపాత్రాభినయం.

-శాసనసభ ఎన్నికలలో పార్టీని విజయ తీరాలకు చేర్చి…

-పార్లమెంటు ఎన్నికలలో సముచితమైన స్థానాలు గెలిపించి

-అందరి మన్ననలు పొందుతూ…

-అందరినీ కలుపుకుపోతూ..

-పార్టీని పటిష్ఠపరుస్తూ…

-పాలనను సరికొత్త పంధాలో సాగిస్తూ..

-భవిష్యత్తు తెలంగాణను ఆదర్శవంతమైన బాటలు వేస్తూ..

-తెలంగాణను అభివృద్ధి నమూనాగా మలిచే ప్రణాళికలు రచిస్తూ.

-గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ…

-కాళేశ్వరం ప్రాజెక్టులు చకచకా మరమ్మత్తులు సాగిస్తూ…

-యువతకు భరోసా కల్పిస్తూ…

-తెలంగాణను ఆరోగ్య హబ్‌గా తీర్చి దిద్దే రచన చేస్తూ

-రుణమాఫీ చేసే దిశగా అడుగులు వేస్తూ…

-అవినీతిని ఊడ్చేస్తూ…

-ఆరు గ్యారెంటీల అమలు కోసం కృషి చేస్తూ..

-అభివృద్ధి, సంక్షేమాలను ఏక కాలంలో అమలు చేస్తూ

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలన మొదలై ఏడు నెలులు పూర్తయ్యింది. ఏడు నెలల కాలంలో ఎక్కడా ప్రజలు ఎలాంటి అసంతృప్తితో లేరు. బిఆర్‌ఎస్‌ చేసే కృత్రిమ హడావుడి తప్ప, ఎక్కడా ప్రజా వ్యతిరేకత అన్నది కనిపించకుండా పాలనసాగించడం అంటే రేవంత్‌ రెడ్డి సంక్షేమపాలనకు నిదర్శనమనే చెప్పాలి. ఈ ఏడు నెలల పాలనలో రేవంత్‌ రెడ్డి అన్ని వర్గాలను నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అంతే కాకుండా అటు పిసిసి.అ ధ్యక్షుడుగా, ఇటు ముఖ్యమంత్రిగా ఆయన ద్విపాత్రిభినయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అటు పార్టీలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా చూసుకుంటున్నారు. అరమరికలు అన్నవి తెరమీదకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. నిజానికి కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అంతర్గ ప్రజాస్వామ్యం ఎక్కువ. అయినా ఎక్కడా ఇప్పటి వరకు ఎవరి నుంచి అలకలు లేవు. అంతగా పార్టీని జాగ్రత్తగా నడుపుకుంటూ వస్తున్నారు. మరో వైపు పాలన పరుగులు పెట్టిస్తున్నారు. శాసన సభ ఎన్నికలను ఒక రకంగా చెప్పాలంటే ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లారు. ఆ ఎన్నికల భాధ్యత పూర్తిగా తన భుజాల మీద వేసుకొని ముందుకు సాగారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలతో ప్రజలను ఆకట్టుకున్నారు. రేవంత్‌ రెడ్డిలాంటి ప్రశ్నించే నాయకుడు కావాలని తెలంగాణ సమాజం కోరుకున్నది. అనుకున్నట్లుగానే తెలంగాణ మొత్తం ఆయనకు మద్దతుగా నిలిచింది. తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనూ అనూహ్యమైన విజయమే సాదించే వాతావరణం కనిపించింది. కాని తీరా ఎన్నికల ముందు బిఆర్‌ఎస్‌, బిజేపిల చీకటి ఒప్పందం మూలంగా కొన్ని సీట్లు కోల్పోయినా, తెలంగాణ ప్రజలు రేవంత్‌ రెడ్డి నాయకత్వానికి సముచితమైన స్ధానమే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యమంత్రిగా అందరి మన్ననలు పొందుతూ ముందుకు సాగుతున్నారు. అందర్నీ కలుపుకుపోతూ, వ్యవస్ధలో పాతుకుపోయిన కలుపు మొక్కలను ఏరేసుకుంటూ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. ముందు అవినీతి మీద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమరం సాగించడం మొదలు పెట్టారు. దాంతో అనేక మంది తిమింగలాలు బైటకు వచ్చాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చుకుంటూ, రాష్ట్ర రుణభారం తీర్చుతూ, ఎక్కడా సంక్షేమ పథకాలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ ఉద్యోగుల జీతాలు కనీసం 15 తేదీ వరకు కూడా వచ్చేవి కాదు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఒకటో తారీకునే జీతాలు అందేలా చర్యలు తీసుకున్నది. గత పదేళ్లలో పేరుకుపోయిన ఫైళ్లన్నీ క్లియర్‌ చేస్తున్నారు. పెండిరగ్‌ పనులన్నీ చకచకా పూర్తి చేయిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజల ముందు వుంచుతున్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశారు.

గత పాలకులు చేసిన పాపం ప్రజలకు తెలిసేలా చేశారు. విద్యుత్‌ పేరుతో జరిగిన దోపిడీని కళ్లముందు వుంచారు. కాళేశ్వరాన్ని గత పాలకులు ఏటిఎం చేసుకొని ఎలా దోచుకున్నారన్నది ప్రజలకు తెలిసేలా చేశారు. వారు తప్పిదాలను సరిదిద్దుతూ, మరో వైపు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హమీల అమలుతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం రిపేర్‌ పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేశారు. రేవంత్‌రెడ్డి అదికారంలోకి వచ్చిన మూడు నెలలకే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ఎన్నికల వాతావరణం ఎదురైంది. అటు పాలన, ఇటు ఎన్నికల నిర్వహణ రెండూ చూసుకుంటూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని సైతం తన భుజాల మీద వేసుకొని ఎనమిది సీట్లు గెలిపించారు. తెలంగాణను ఆదర్శవంతమైన రాష్ట్ర్ట్రంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్దిలో దూసుకుపోయేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన మూడు నెలల కాలంలోనే రాష్ట్రానికి 40వేల కోట్ల పెట్టుబడులు సాదించిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కతుంది. తెలంగాణ యువతకు ఉద్యోగ కల్పనలోనూ జోరు చూపిస్తున్నారు. మూడు నెలల కాలంలోనే సుమారు 30 వేల మందికి ఉద్యోగాలు అందించారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తున్నారు. గత పాలకులు మూడు సార్లు గ్రూప్‌ వన్‌ నిర్వహించి నవ్వుల పాలయ్యారు. కాని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రూప్‌ వన్‌ పూర్తి చేశారు. గతంలో పరీక్షలంటేనే పదో తరగతి నుంచి ఏ పరీక్షలైనా లీకులే జరిగేవి. పశ్నాపత్రాల మూల్యాంకన కూడా సరిగ్గా జరక్క , ఎంతో మంది విద్యార్ధులు నష్టపోయారు. ఒక దశలో ఒకే ఏడాది సుమారు 20 మంది ఇంటర్‌ విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాని రేవంత్‌రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత పదో తరగతి పరిక్షలో ఎలాంటి ఆరోపణలు లేవు. ఇంటర్‌ పరీక్షలు కూడా ఎక్కడా వివాదాలు లేవు. ఎంతో తొందరగా ఫలితాలు ప్రకటించి కూడా రికార్డు తిరగరాశారు. ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. త్వరలో గ్రూప్‌ టూ కూడా నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విజయాలు ఆయన ఖాతాలో వేసుకున్నారు. ఎన్నికలను ఎంత టాస్క్‌గా తీసుకున్నారో, పాలన కూడా అంతే అంకితభావంతో తీసుకొని తెలంగాణను ప్రగతి పధంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హమీ మేరకు అటు రైతు భరోసా అమలు చేస్తూనే, రైతు రుణమాఫీ త్వరలో పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రుణమాఫీ మీద మంత్రుల ఉప సంఘం ఏర్పాటు చేశారు. ఉప సంఘం నివేదిక రాగానే దాని విధివిధానాలను అనుసరించి, ఆగష్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని హమీ ఇచ్చారు. రైతుల కళ్లలో ఆనందం నింపారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ప్రముఖంగా విసృతంగా రేవంత్‌రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లారు. తన నాయకత్వం మీద ప్రజలకు ఎనలేని విశ్వాసం కలిగించేలా చేశారు.

ఆరు గ్యారెంటీలలో కూడా పదమూడు అంశాలు నిక్షిప్తం చేసి, ప్రజల విశ్వాసం పొందారు. గెలిచారు.

ఇక ఇప్పుడు వాటి అమలు జరుగుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం ఏడు నెలలుగా అమలు చేస్తున్నారు. మహిళలకు తెలంగాణ వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించారు. దాన్ని ప్రతి పక్షాలు వివాదం చేయాలని సకల ప్రయత్నాలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులకు అన్యాయం జరుగుతుందని లేని పోని రాద్దాందం చేసే ప్రయత్నం చేశారు. కాని పార్లమెంటు ఎన్నికల్లో అలా ప్రచారం చేసిన బిఆర్‌ఎస్‌ను తుక్కు తుక్కుగా ఓడిరచారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆగష్టు లోగా రుణమాఫీ చేసేలా ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసిఆర్‌ పదేళ్ల కాలయాపన చేశారు. రుణమాఫీ మాత్రం మర్చిపోయారు. అందుకే రైతులు కేసిఆర్‌ను తిరస్కరించారు. రేవంత్‌రెడ్డిమీద నమ్మకం పెట్టుకున్నారు. ఎలాగైనా ఆగష్టులోగా రుణమాపీ చేయాలన్న పట్టుదలతో సిఎం వున్నారు. మరోసారి వాయిదా పడకుండా రైతుల రుణమాఫీ చేపడితే రేవంత్‌ నాయకత్వం మరోపదేళ్లపాటు ఎదురులేకుండా వుంటుంది. ప్రజలు రేవంత్‌ను జీవితంలో మర్చిపోలేరు. ఎందుకంటే రుణం అనేది రైతులు గుండెల మీద కుంపటి లాంటిది. అది దిగితే రైతులకు ఎంతో ఊరటగా వుంటుంది. పైగా కొత్త రుణాలు అందేందుకు అవకాశం వుంటుంది. గత పదేళ్లు ఎదురుచూసిన రైతులకు మాఫీ జరిగితే అంతకంటే గొప్ప సంతోషం మరొకటి వుండదు. ఇక గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అంతా బైటకు తీస్తున్నారు. పదేళ్లుగా కొన్ని శాఖలలో పాతుకుపోయి, బిఆర్‌ఎస్‌కు సహకరిస్తూ, అవినీతికి పాల్పడిన అధికారులను ఏరి వేస్తున్నారు. పైగా పదేళ్లుగా పాతుకుపోయిన వారిని స్ధాన చలనం చేస్తే తప్ప వ్యవస్ధలు బాగు పడవని గుర్తించారు. ఆయా శాఖలపై దృష్టిపెట్టారు. ఇలా పాలన గాడిలో పెడుతున్నారు. పాలనను పరుగులు పెట్టిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *