పాలకుర్తి నేటిధాత్రి
వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 2023-2024 సంవత్సరం కొబ్బరికాయలు పూజా ద్రవ్యములు,లడ్డు పులిహోర ప్రసాదం అమ్ముకొను హక్క బహిరంగ వేలం పాట ద్వారా రూ.6,40,000 దేవాలయానికి ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ బి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. గురువారం వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బహిరంగ వేలం పాట నిర్వహించారు. కొబ్బరికాయలు పూజా ద్రవ్యములు అమ్ముకునే వేలం పాట ద్వారా రూ.3,11,000 లక్షలు, లడ్డు పులిహోర ప్రసాదం అమ్ముకొను హక్క బహిరంగ వేలం పాట ద్వారా రూ. 3,29,000 హెచ్చు పాట పాడి వల్మిడి గ్రామానికి చెందిన తాళ్ల సోమనారాయణ హక్కు దక్కించుకున్నారు. కొబ్బరి ముక్కలు పోగు చేసుకునే హక్కు కాంటీన్ నడుపుకొని హక్కుకు ఎవరు షెడ్యూలు కొనుగోలు చేయకపోవడంతో వాయిద వేసినట్లు ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ భువనగిరి డివిజన్ ఇన్స్పెక్టర్ బి.సుమతి , కొడవటూరు దేవాలయ ఈవో వంశీ, గ్రామ సర్పంచ్ కత్తి సైదులు, అర్చకులు , పాటదారులు, ఆలయ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.