పిచ్చికూతలు కూసే ప్రతిపక్షాలను తరిమికొట్టాలి-కేటీఆర్
ధర్మారెడ్డి కి బ్రాహ్మరథం పడుతున్న నియోజకవర్గ ప్రజలు
పరకాల నేటిధాత్రి(టౌన్)
పరకాల పట్టణ కేంద్రంలోని పశువుల సంతలో పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి బి ఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం మొత్తం వెన్ని తిరిగి చూసేలా తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అభివృద్ధిని చూసి ఓర్వలేని పిచ్చికుక్కల మాటలు ఎవరు వినకూడదని అన్నారు. రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించుకుని రాబోయే రోజుల్లో కెసిఆర్ నేతృత్యంలో అనేక సంక్షేమ పథకాలు బడుగు బలహీన పేదవారికి అందేలా గెలిపించుకోవాలని అన్నారు. పరకాల నియోజకవర్గం లో ఎన్నడూ లేని విధంగా తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో 50 ఏళ్ల అభివృద్ధి జరిగిందని అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే ధర్మారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం కడుతున్నారని వచ్చే ఎన్నికలలో 70 వేలకు పైచిలుకతో ఎమ్మెల్యే ధర్మారెడ్డి ని గెలిపించుకోవాలని పిచ్చికూతలు కూసే ప్రతిపక్షలను తరిమికొట్టాలని అన్నారు.పరకాల నియోజకవర్గం లో 5500 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దేనిని కొనియాడారు మూడోసారి ముచ్చటగా పరకాల నియోజకవర్గంలో చల్లా ధర్మారెడ్డికి ఎదురేలేదని ప్రజలే వారిని కోరుకుంటున్నారని అధిక మెజార్టీతో గెలిపించుకుంటారని అన్నారు. మూడు గంటలు కరెంటు ఇస్తానన్న కాంగ్రెస్ కావాలా 24 గంటలు ఇచ్చే కారు గుర్తు పార్టీ ప్రజలే ఆలోచించుకోవాలని అన్నారు దేశంలోనే ఎక్కడ్ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం లో టెక్స్టైల్ పార్కు తీసుకువచ్చి 100 కోట్లతో ఎంతో అభివృద్ధి చేస్తూ అందరికీ అండగా ఉంటున్న ధర్మాలను మళ్లీ గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్,ఎమ్మెల్సీ బండ ప్రకాష్,ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్,జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, నియోజకవర్గంలోని మండలాల ఎంపీపీలు,జడ్పిటిసిలు,సొసైటీ చైర్మన్లు,మార్కెట్ చైర్మన్,లు మున్సిపాలిటీ చైర్మన్, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.