
CPI Demands 50% Reservation for BCs in Elections
* బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి
చేవెళ్ల,నేటిధాత్రి:
https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x
బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు,స్థానిక ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు ఆర్థికంగా ఆడుకోవాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చేవెళ్ల నియోజకవర్గం కె.రామస్వామి, నియోజకవర్గ బీసీ కన్వీనర్ పాడాటి వెంకటయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల న్యాయమైన హక్కులు కల్పించి వారి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ,జెడ్పిటిసి సర్పంచు, ఎన్నికల్లో ప్రతి గ్రామంలో 42 శాతం రిజర్వేషన్ కోటా ప్రకారం స్థానాలు కల్పించాలని అన్నారు. రాష్టంలో అత్యధికంగా బీసీలు ఉన్నారని వారి అభివృద్ధికి బీసీ బందును ప్రవేశపెట్టి బడ్జెట్లో అధికనిధులు కేటాయించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కేంద్రం బీసీలకు ఇతర వర్గాలకు ఇండ్లు మంజూరులో ఇంటికి 10 లక్షలు రూపాయలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వాలు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని అన్నారు. నామినేటెడ్ పదవులలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.రైతులు యూరియా కోసం గత 20 రోజులగా అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి సకాలంలో ఎరువులను అందించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి బీసీ సంఘాల నాయకులు ఎం. సుధాకర్ గౌడ్,
మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల, నియోజకవర్గం బీసీ కన్వీనర్ పాడాటి వెంకటయ్య, కో కన్వీనర్ జీ నరసింహులు, మొయినాబాద్ మండల సిపిఐ కార్యదర్శి కే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.