
# అసభ్య పదజాలంతో మాట్లాడితే ఊరుకునేది లేదు.
# ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరి ప్రచారం వారిది..
# బిఆర్ఎస్ పార్టీపై పదేపదే కంప్లైంట్ చేయడం కాంగ్రెస్ పార్టీ పద్దతి సరైంది కాదు..
# ఆశీర్వాద సభను సక్సెస్ చేసిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు.
నర్సంపేట బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలో సీఎం కేసీఆర్ సమక్షంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గం నుండి 50 శాతం మంది ఓటర్లు హాజరయ్యారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.మంగళవారం తన పార్టీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న తనపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అసభ్య పదజాలంతో మాట్లాడడం సరైంది కాదని అన్నారు.ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో చేసిన పనులను కేసిఆర్ విశ్లేషించి ప్రజలకు వివరించారని అదే విధంగా నిండు మనస్సుతో దీవించారని పెద్ది పేర్కొన్నారు.పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ కు వస్తే పనులు పూర్తి చేసుకున్న వెంటనే నర్సంపేట ప్రజలకు అందుబాటులో ఉంటాడని సీఎం కితాబు ఇవ్వడం ఆనందంగా ఉన్నారు.నియోజకవర్గ పరిధిలో చేసిన విద్యా వైద్య రంగంలో అభివృద్ధి కేసిఆర్ వివరించారని ఎమ్మెల్యే పెద్ది తెలిపారు.గ్రామాల్లోని ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్న బిడ్డను నేను గతంలో వచ్చిన మేజారిటి అదిగమిస్తానని ధీమా వ్యక్తం చేశారు.నియోజకవర్గంలో అన్ని రంగాల్లో పట్టు ఉన్న నేతను, దానికి అనుగుణంగా పలు అభివృద్ధి పనులు చేశానని చెప్పారు.పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి కావలంటే మళ్ళి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ప్రజలను వేడుకున్నారు.
నియోజకవర్గ పరిధిలో సమస్యలు ఇప్పుడు పోటిలో ఉన్న అభ్యర్థులకు సమస్యల పట్ల అవగాహన లేదని ఎద్దేవా చేశారు.కరోనా కష్టకాలంలో మీకు అందుబాటులో ఉన్న, నాతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు సేవలందించారని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తుకు చేశారు.నియోజకవర్గంలో గత గ్రామాల్లో ఉన్న పెండింగ్ పనుల పురోగతిని చూస్తే అర్థమవుతుందని,చెన్నారావుపేటలోని అమీనాబాద్ తో పాటు అన్ని గ్రామాల్లో పార్టీలకతీతంగా డెవలప్ చేసిన బిడ్డను నేను అని పేర్కొన్నారు.
ఘర్షణలతో నియోజకవర్గంలో వెనుక బడి ఉండగా నేడు నర్సంపేటకు వైద్య రంగంలో రూ.350కోట్ల నిధులు తెచ్చానని,అభివృద్ధి, సంక్షేమం, స్వయం పాలనపైనే ఓట్లు అడుగుతానని ఆశాభావం వ్యక్తంచేశారు.నియోజకవర్గంలో ఇప్పటికే 50శాతం ప్రచారం పూర్తి చేశాం, గత 60 ఏళ్ళుగా పెద్దొల్లు చేయని పనులు ఒకే టర్ములో పూర్తి చేసిన చిన్నోన్నని ఎమ్మెల్యే పెద్ది అన్నారు.పాకాల, రంగాయ చెరువు పాజెక్టు కోసం ఎమ్మెల్సీ పదవులను సైతం వదులుకొన్న నేతను అని పేర్కొన్నారు.గతంలో ఇప్పుడు నాపై పోటీ చేసిన ఇద్దరు నేతలు అనుభవం ఉన్న నేతలే అని 2014లో నన్ను ఓడించి ఏం సాధించారని వారు చేసిన అభివృద్ధి ఎక్కడ అని,మళ్లీ ఇప్పుడు అదే విధానంతో నన్ను ఓడించేందుకు పన్నాగం పన్నారని పెద్ది ఆరోపించారు.నర్సంపేట నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు
వారి కుట్రలు గమనించాలని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీపై రెచ్చకొట్టే విధంగా పదేపదే కంప్లైంట్ చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిపై అసభ్య పదజాలం వాడుతున్నారని వయస్సులో పెద్ద అట్లా మాట్లాదడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిని ప్రశ్నిస్తూ ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు.ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరి ప్రచారం వారిది కాని అసభ్య పదజాలంతో రెచ్చకొట్టే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.ప్రజా ఆశీర్వాదసభ విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు,కార్యకర్తలు,నాయకులు,ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యే పెద్ది కృతజ్ఞతలు తెలిపారు.ఈసమావేశంలో జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి,పట్టణ పార్టీ అధ్యక్షులు నాగెల్లీ వెంకటనారాయణ గౌడ్,పార్టీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు దార్ల రమాదేవి,క్లస్టర్ భాద్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.