
50 Crore Road Sanction for Choppadandi–Malyal
చొప్పదండి నుండి మల్యాల వరకు రోడ్డు మంజూరు పట్ల కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు:బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రము నుండి రాగంపేట్, గోపాలరావుపేట, బురుగుపల్లి, తక్కలపల్లి గ్రామాలను కలుపుతూ జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్డు వరకు డబుల్ రోడ్డు కోసం యాభై కోట్ల సిఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయడం పట్ల కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించి, స్వీట్లు పంపిణీ చేసి, బాణసంచా కాల్చడం జరిగింది. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ చొప్పదండి నుండి మల్యాల వరకు రోడ్డు సరిగా లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్న విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించి వెంటనే వారు స్పందించి మంజూరు చెపిచినందుకు కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకి నూట ఎనభై ఎనిమిది కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, చొప్పదండి నియోజవర్గంలో రోడ్ల అభివృద్ధికి యాభై కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షణీయం అని అన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అను నిత్యం పాటు పడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంతోనే రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయని వారు అన్నారు. రోడ్డు మంజూరు పట్ల గ్రామస్థులు, వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు జాతరగొండ ఐలయ్య, కళ్లెం శివ, మండల కార్యదర్శి గుంట అశోక్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, యువ మోర్చా మండల అధ్యక్షులు దురుశెట్టి రమేష్, యువ మోర్చా మండల అధికార ప్రతినిధి మాడిశెట్టి అనిల్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, బద్ధం లక్ష్మారెడ్డి, మునిగంటి శ్రీనివాస్ చారి, మాజీ సర్పంచ్ ఉమ్మెంతల అభిషేక్ రెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షులు పల్లపు చిరంజీవి, రేండ్ల తిరుపతి, మందపెళ్లి అరుణ్, వేముల దామోదర్, బండి శేఖర్, ఉత్తేం కనుకరాజు, మంద రాజశేఖర్, పొన్నం అభిషేక్, బుర్ర శ్రీధర్, దైవాల తిరుపతి గౌడ్, ఎగుర్ల ఎల్లయ్య, లింగంపెళ్లి శ్రీనివాస్, మేకల నాగరాజు, సత్తు రాకేష్, గ్రామస్తులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.