వనపర్తి నేటిధాత్రి
వనపర్తి జిల్లా కేంద్రంలో తిరుమలయ్య గుట్ట ఎక్స్ రోడ్డు దగ్గర 58.అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం నుండి స్థలం ఇప్పించాలని పట్టణ బిజెపి ఆధ్వర్యంలో ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డికి వినపత్రం అందజేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాము జిల్లా బిజెపి మహిళ ఉపాధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ ఏర్పుల సుమిత్రమ్మ కల్పన కవిత లక్ష్మి నాయకులు రాయన్న సాగర్ పీఎం రాము విజయ్ సాగర్ అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలనాథ స్వామి దేవాలయం పురాతనమని దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉన్నదని దేవాలయం అభివృద్ధి ఆధ్యాత్మిక కేంద్రం పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డిని కోరారు