
46 Grievances Submitted at Tirupati Public Grievance Forum
ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు..
తిరుపతి(నేటిధాత్రి)అక్టోబర్ 13:
నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారుఈ కార్యక్రమంలో 36 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా,10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి. మునికృష్ణ, కార్పొరేటర్ దూది కుమారితమ వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. లక్ష్మీపురం కూడలి పనులు,పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ ఎస్.కె.బాబు ఫోన్ ద్వారా కోరారు. యాదవ వీధిలో త్రాగునీటిలో మురుగు నీరు కలుస్తున్నాయి పరిష్కరించాలని,పింఛన్ ఇప్పించాలని, కోర్లగుంట రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలని, యాదవ వీధిలో రోడ్డు నిర్మించాలని, కూరపాటి లే అవుట్ వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టాలని, కోర్లగుంట మారుతీ నగర్ లో వర్షపు నీరు నిలిచి పోతున్నది పరిష్కరించాలని,ఏ ఆర్ హాస్పిటల్ రోడ్డులో అనధికారిక నిర్మాణాలు అడ్డుకోవాలని, కుక్కల సమస్య పరిష్కరించాలని,ఎల. ఎస్. నగర్ నందు కాలువలు మరమ్మత్తు చేయాలని, నగరంలోని ఓపెన్ డ్రైన్స్ లో చెత్త వేయకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి,హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, రవి,ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు, ఏసీపీ లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.