విజయవాడలో మావోల కదలికలు.. పోలీసుల అలర్ట్
విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. ఆరుగురు మావోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా ఎన్‌కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కానూరు కొత్త ఆటోనగర్‌లో 12 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. 12 మంది మావోయిస్టుల్లో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన 6 గురు మావోయిస్టుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే దీనిపై అధికారికంగా వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఆపరేషన్ పూర్తి అయ్యాక వివరాలు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
