
Congress Stands for 42% BC Reservation
బీసీలకు 42% రిజర్వేషన్లు: కాంగ్రెస్ కట్టుబడి ఉంది, బీజేపీ-బీఆర్ఎస్ అడ్డుకుంటున్న
◆:- ఎంపీ సురేష్ కుమార్ ఆరోపణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కట్టుబడి ఉందని, అయితే ప్రతిపక్షాలు హైకోర్టుకు వెళ్లడం ద్వారా రిజర్వేషన్ల అమలును అడ్డుకున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నియామకం కోసం అభిప్రాయ సేకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అబ్జర్వర్లు, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, సంజీవరెడ్డి, జిల్లా
కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.