CITU Demands Repeal of 4 Labour Codes
4 లేబర్ కోడ్స్, విబి రామ్ జి చట్టం రద్దు చేయాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బందు సాయిలు.
భూపాలపల్లి నేటిధాత్రి
4 లేబర్ కోడ్స్, విబి రామ్ జి చట్టం రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో జాతను ప్రారంభించిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బందు సాయిలు.
సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మూడు వర్గ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ కారల్ మార్క్స్ కాలనీలో జిల్లా జాతను సిఐటియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బందు సాయిలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా బంధు సాయిలు మాట్లాడుతూ ఈ నెల 11 వరకు జిల్లాలోని 10 మండలాలు 343 గ్రామాలు 302 కిలోమీటర్ల వరకు ఈ జాత తిరుగుతుంది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం ఇటీవల కాలంలో పార్లమెంటులో తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, సకల జనులను చైతన్యం చేయడం కోసం ఈ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రను ఆదరించి జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోడీ సర్కారు 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా చేసి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా యజమానులకు అనుకూలంగా ఈ చట్టం తెచ్చి అమలుపరచటం అన్యాయం. దీని ఫలితంగా హైలాండ్ ఫైర్ సిస్టం, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, కార్మికుల కనీస వేతనాలు పడిపోవడం, 12 గంటల పని విధానం అమలు చేయటం, లేబర్ అధికారులకు అధికారాలు లేకుండా చేయటం, యజమానులకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వటం, కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి.
2005లో వామపక్షాల ఆధ్వర్యంలో ఏర్పడ్డ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ మార్చి బీబీ రాంజీ చట్టం తెచ్చారు. దీనితో వ్యవసాయ కూలీలకు నష్టం. గతంలో 90% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు ఇస్తే, రాష్ట్రాలు పది శాతం నిధులు చెల్లించేది, కానీ మారిన చట్టం ప్రకారం 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాలని చట్టంలో ఉంది. ఇప్పటికే జీఎస్టీ, శేషు ల పేరుతో కేంద్ర ప్రభుత్వం నిధులను వసూలు చేసుకుని పనులన్నీ దగ్గర పెట్టుకొని రాష్ట్రాలకు ఇవ్వకుండా బలహీన పరుస్తుంది. 40 శాతం నిధులు ఉపాధి హామీకి పెట్టాలంటే రాష్ట్రాలు పెట్టలేని పరిస్థితి దీనితో ఉపాధి హామీ పథకం నిర్విర్యమై నీరు గారి పోతుంది. యధావిధిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈనెల 19 తారీఖున జిల్లా కేంద్రంలో మూడు వర్గ సంఘాల ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం.
ఈ జీబు జాతకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం దేవేందర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆత్మకూరు శ్రీకాంత్, నాయకత్వం వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో బి క్రాంతి, ఎం రాజేందర్, సిహెచ్ రవికుమార్, మహేందర్, కే రవికుమార్, జాడి కిష్టయ్య, పగిడి, గట్టు శంకర్, గడ్డం ప్రభాకరు తదితరులు పాల్గొన్నారు.
