న్యాల్కల్ లో 359వ ఉర్సు షరీఫ్: సర్కారి గంధం ఊరేగింపు ఘనం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలంలో హజ్రత్ పీర్ గైబ్ సాహెబ్ ఖిబ్లా దర్గా వద్ద జరుగుతున్న 359వ ఉర్సు షరీఫ్ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 8 గంటలకు సర్కారి గంధం ఊరేగింపు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మాలి పటేల్ స్వర్గీయ ఉస్మాన్ పటేల్ ఇంటి నుండి ప్రారంభమైన ఈ ఊరేగింపు న్యాల్కల్ ప్రధాన వీధుల గుండా దర్గా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు, మత పెద్దలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల భద్రత కోసం పోలీసులు, వాలంటీర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
