చర్ల మండలంలో ఇంటింటికి సర్వే చేసిన దరఖాస్తులను డేటా ఎంట్రీ చేసిన యువతి యువకులకు దరఖాస్తుకి 35 రూపాయలు ఇవ్వాలీ

భద్రాచలం నేటి ధాత్రి

పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ డిమాండ్ చేశారు* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల ఉపాధ్యాయులతో ఇంటిటికి సర్వే చేపించిన దరఖాస్తులను డేటా ఎంట్రీ చేయడానికి చర్ల మండలంలో కాలిగా ఉన్న కొందరు నిరుద్యోగులకు చర్ల మండల అధికారులు ఒక్క దరఖాస్తు డేటా ఎంట్రీ చేస్తే 35 రూపాయలు ఇస్తామని 20 రోజులు వారితో డేటా ఎంట్రీ చేపించుకున్నారు ఎంట్రీ చేపించుకొని 15 రోజులు అవుతున్న ఎటువంటి ఆదాయం ఇవ్వలేదు ఈ విషయంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ని కలుద్దామని వెళ్తే వారు లేరు ఈ సందర్భంగా పి వై ఎల్ ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ ని కలిసి అడిగితే వారు డేటా ఎంట్రీ చేసిన యువతి యువకులకు మేము ఏడు రూపాయల కంటే ఎక్కువ ఇవ్వము ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే మానేయండి అని పక్క జిల్లాలో ఇచ్చినట్టు మేం ఎ మాత్రం ఇవ్వం అని ఏడు రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఎగస్ట్రా ఇవ్వం అని అన్నారు అవసరం ఉన్నంతసేపు ఇస్తామని మాట్లాడినవారు ఇప్పుడు ఎందుకు ఇవ్వమని మాట్లాడుతున్నారు వాడలో ఉన్నంతసేపు వాడ మల్లయ్య వాడ దాటినంక బోడి మల్లయ్య అనే విధంగా జిల్లా అధికారుల తీరు ఉందని వారన్నారు కొత్తగూడెం జాయింట్ కలెక్టర్ పైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మిగతా డబ్బులు ఆయన జేబు నింపుకున్నారేమో అని అర్థమవుతుంది ములుగు జిల్లా ఖమ్మం జిల్లాలో 35 రూపాయలు ఇచ్చారు దీనిపైన తక్షణమే జిల్లా అధికారి కలెక్టర్ గారు స్పందించి 35 రూపాయలు ఇవ్వాలని వారన్నారు ఉదయం ఆరు గంటలకు వచ్చి ఎనిమిది గంటల సమయం రాత్రి దాకా వారు శ్రమించారని దరఖాస్తులో ఆధార్ రేషన్ నెంబరు ఇంటి పన్ను నెంబరు మొబైల్ నెంబరు ఏ ఒక్క నెంబర్ తప్పు రాసిన అది ఎంటర్ చేస్తే దరఖాస్తు రిజెక్ట్ అవుతా ఉంది అయినా ఓపికతో పంచాయతీ అధికారులకు ఫోన్లు చేసి డీటెయిల్స్ తీసుకొని 20 రోజుల్లో ఆన్లైన్ సర్వే ని డేటా ఎంట్రీ చేస్తే ఏడు రూపాయలు ఇస్తామంటే యువతి యువకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి కష్టాన్ని అర్థం చేసుకొని కలెక్టర్ గారు 35 రూపాయలు ఇవ్వాలని పి వై ఎల్ ప్రగతిశీల యువజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాము లేనియెడల యువతి యువకులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!