వనపర్తి నెటిధాత్రి:
వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం వారు ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డు వేలంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆకుతోట దేవరాజ్ రికార్డు స్థాయిలో 315116 లక్షలు పాట పాడి లడ్డును దక్కించుకున్నార ని ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మారం గోవిందు గుప్తా గుంత శంకర్ కల్వ భూపేష్ కుమార్ శెట్టి ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు అదేవిధంగా వినాయకుని కరెన్సీ దండను 61116 నరహరి నరేష్ లావణ్య ఎన్నం రవికుమార్ డ్రై ఫ్రూట్స్ 52116 వినాయకుని శేష వస్త్రం సోమిశెట్టి సాయిరాం 35116 వేలము లో పాట పాడి దక్కించుకున్నారని వారు తెలిపారు ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు వినాయకుని అనుగ్రహం ఉండాలని వారు కోరారు వినాయకుని నవరాత్రుల ఉత్సవాలకు సహకరించిన ఆర్యవైశ్య సంఘానికి అనుబంధ సంఘాలకు ఒక ప్రకటనలో వారు కృతజ్ఞతలు తెలిపారు