రైతు ధర్నాలో బిఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్
హసన్ పర్తి / నేటి ధాత్రి
సమయానికి సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేలు, ధాన్యానికి అదనపు బోనస్ 500 వేను వెంటనే చెల్లించాలని వర్ధన్నపేట రైతుల ధర్నా లో ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. శనివారం వర్ధన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా పాల్గొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ రైతులకు ఉచిత కరెంటు, రైతు బంధు అందించామని, రైతు ఏడ్చిన రాజ్యం…ఎద్దు ఏడ్చిన ఎవుసం
బాగుపడదని పెద్దలు చెప్పిన మాటలు అక్షరాల నిజం. కారణం కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక రైతు మొఖంలో ఆనందం ఆవిరైపోయిందని, సాగునీళ్లు, నాణ్యమైన కరెంట్, పంట పెట్టుబడి లేక రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. కాంగ్రెస్ రైతుల పాలిట శాపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై కుట్రలు చేస్తూ… కాంగ్రెస్ కృత్రిమ కరువు సృష్టిస్తుందని, కానీ కాంగ్రెస్ నాయకులకు
పరిపాలన చేత గాక 4 నెలల్లోనే రాష్ట్రమంతట కరువు విలయతాండవం చేస్తుందన్నారు.
రైతులు అడగకుండానే రైతుబంధు, నాణ్యమైన కరెంట్, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు, ఎరువుల బాధ మాయం, రుణమాఫీ ఇది కేసీఆర్ ట్రాక్ రికార్డ్ రైతులు రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు చేసినా నో రైతుభరోసా, శంకరగిరి మాన్యాలు పట్టిన బోనస్. కరెంట్ కోతలు, ఎరువుల బాధలు, బ్యాంకర్ల దబాయింపులు ఇది కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ 420 హామీలు వచ్చిందని విమర్శించారు.వాటిని అమలు చేసేవరకు కొట్లాడుతాం ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 25 లక్షలివ్వాల్సిందే
రాజకీయాలు పక్కన పెట్టి రైతుల మేలు కోరుతున్నా కేసీఆర్.. ఇప్పుడు ఆరోగ్యం సక్రమంగా లేకున్నా రైతుల పక్షాన పోరాడుతున్నాడని, ఆహోరాత్రులు కష్టపడి సాగునీటి ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్లిచ్చిన కేసీఆర్.
ఉన్న ప్రాజెక్ట్ లు నిర్వహించలేక రైతుల కంట నీరు తెప్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పండిన పంటకేమో బోనస్ అంటూ బోగస్ వాగ్దానాలు
ఎండిన పంటకు పరిహారమంటే పత్తా లేని పాలకులు అన్ని అనుభవించి పార్టీని విడిపోయిన పర్వాలేదు… పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని మోసం చేసి వెళ్లిపోయిన వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల నాయకులు, వరంగల్ పశ్చిమ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.