మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ
ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి
– కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
రాజన్న సిరిసిల్ల 🙁 నేటి ధాత్రి )
ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి చివరి లోపు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఎల్ఆర్ఎస్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్ఆర్ఎస్ 2020 క్రింద 42 వేల 942 దరఖాస్తులు రాగా, 23 వేల 515 దరఖాస్తులు ఆమోదించామని,1230 దరఖాస్తులు తిరస్కరించామని అన్నారు. ప్రస్తుతం ఎల్ 1 వద్ద 6776 దరఖాస్తులు, ఎల్ 2 వద్ద 385 , ఎల్ 3 వద్ద 76 పెండింగ్ ఉన్నాయని, వీటిని మార్చి చివరి నాటికి పరిష్కరించాలని అన్నారు.
ఎల్ఆర్ఎస్ స్క్రూటినీ పూర్తి చేసుకుని ఆమోదించిన దరఖాస్తుదారుల ను ఫాలో అప్ చేయాలని అన్నారు.జిల్లాలో 23 వేల 515 దరఖాస్తులు రుసుం చెల్లింపు కోసం ఆమోదిస్తే ఇప్పటి వరకు 184 మాత్రమే ఫీజు చెల్లించారని, మిగిలిన దరఖాస్తుదారులు మార్చి 31 లోపు రు