25 లీ. నాటుసారా,2 ద్విచక్ర వాహనాలు సీజ్

నర్సంపేట, నేటిధాత్రి :

నర్సంపేట మండలంలోని సీతారాం తండా శివారు ప్రాంతంలో రూట్ వాచ్ నిర్వహించగా 25 లీటర్ల నాటుసారా రవాణా చేస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు హీరో హోండా స్ప్లెండర్, టీవీఎస్ ఎక్సెల్ ల ను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సీతారాంతండాకు చెందిన వాకుండోత్ వీరన్నతో పాటు మరో వ్యక్తి వాటి వారి ద్విచక్ర వాహనాలపై 25 లీటర్ల నాటుసారాను ఇతర గ్రామాలకు తరలిస్తున్నారు.ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో ఎస్సై రాజేశ్వరి అధ్వర్యంలో రూట్ వాచ్ నిర్వహిస్తుండగా అనుమానంతో రెండు వాహనాలు తనిఖీలు చేయగా 25 లీటర్ల నాటు సారా లభ్యమైంది.దీంతో నాటు సారాతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి వాకుండోత్ వీరన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.నాటు సారా రవాణా చేసిన, తయారు చేసిన,విక్రయించిన, నాటు సారా తయారీకి ఉపయోగించి ముడి పదార్థాలైన బెల్లం,పటిక లను రవాణా చేసిన, నిల్వచేసిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ఈ దాడులలో ఎస్సై రాజేశ్వరి, హెడ్ కానిస్టబుల్ సదానందం, లింగేశ్వర, కానిస్టేబుల్స్ రామ్మూర్తి , సురేందర్ రావు, లింగస్వామి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!