బీదలను ఆదుకునేందుకు ముందుకు రావాలి

రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ సుధారాణి

వరంగల్ అర్బన్,నేటిధాత్రి: ప్రస్తుత లాక్ డౌన్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్ 24 వ డివిజన్లోని 70 పేద కుటుంబాలకు ది వరంగల్ ఐరన్ మరియు హార్డ్ వేర్ మర్చంట్స్ అసోసియేషన్ ఆద్వర్యములో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణా రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్, మాజీ పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కోడం రాజేందర్, ప్రధానకార్యదర్శి గుల్లపెల్లి రాజ్ కుమార్, ముఖ్యసలహాదారులు వెయ్యిగండ్ల రమేశ్ మరియు అసోసియేషన్ ప్రతినిధులు, TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!