తెచ్చిన వాళ్లా…ఇచ్చిన వాళ్లా!?

ఈసారి ఎన్నికల్లో బలమైన ప్రత్యర్ధులెవరు?

ఇరు పార్టీల మధ్య పోటీనా?

మూడు ముక్కలాటనా?

బలంగా వున్న టిఆర్‌ఎస్‌

బలం పెంచుకుంటున్న కాంగ్రెస్‌

ఆటలో అరటిపండై బేజారయ్యేది బిజేపేనా?

క్షేత్రస్ధాయిలో యంత్రాంగమే లేని బిజేపి…

పాల పొంగు గెలుపులు ఎప్పటికీ తోడు రావు…

ఉప ఎన్నికలు వేరు…సార్వత్రిక ఎన్నికలు వేరు!

హస్తం డిక్లరేషన్‌లో వాస్తవమెంత?

జనం నమ్మేదెంత?

అధికారంలో వున్న రాష్ట్రాల్లో అమతౌతున్నదెంత?

కారుకు ప్రత్నామ్నాయం ఎవరు?

పంతం …నీదా…నాదా..సై! అన్నట్లే వుంది రాష్ట్ర రాజకీయాల పరిస్ధితి. ఇచ్చిన వాళ్లా…తెచ్చిన వాళ్లా అన్నట్లే సాగుతోంది. తెలంగాణలో బలమైన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రాంతీయ పార్టీ అయినా ఉద్యమ నేపథ్యం బలంగా వున్న పార్టీ. బలమైన క్షేత్రస్ధాయి యంత్రాంగం వున్న పార్టీ. అడుగడుగునా పార్టీకి అండగా వుండే నాయకులు మెండుగా వున్న పార్టీ. పద్నాళుగేళ్ల పోరాట చరిత్రలో రాటుదేలిన నాయకులున్న పార్టీ. ఎనమిది సంవత్సరాలుగా అధికారంలో వున్న పార్టీ. బలమైన నాయకుడు, ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో సాగుతున్న పార్టీ. ఉద్యమ నాయకుడుగా కార్యరంగంలో అడుగు పెట్టి, తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన కేటిఆర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటుగా వున్న పార్టీ. పార్టీ కోసం అహర్నిషలు పాటుపడే కార్యకర్తలున్న పార్టీ. దేశంలోనే 60లక్షల మంది కార్యకర్తలున్న ప్రాంతీయ పార్టీ. ఇరవై రెండేళ్ల పార్టీ ప్రస్ధానంలో ఏనమిదేళ్ల తిరుగులేని ఎన్నికల విజయాలతో దూసుకెళ్తున్న పార్టీ. అలాంటి టిఆర్‌ఎస్‌కు, వరంగల్‌ లో జరిగిన కాంగ్రెస్‌ రైతు సంఘర్షణ సభ ఒక సవాలు లాంటిదే అని చెప్పక తప్పదు. అంత చిన్నగా తీసివేయాల్సిన సభకాదు. 

                    మండుటెండలో అంత మందిని సభకు తీసుకురావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ ప్రజలంతా మొత్తం తెలంగాణ నుంచి వచ్చిన వాళ్లు కాదు. కేవలం ఉమ్మడి వరంగల్‌ జిల్లా తోపాటు, పొరుగు రెండు, మూడు జిల్లాల సరిహద్దు కార్యకర్తలు మాతమ్రే…! ఇది తెరాస తెలుసుకోవాల్సిన విషయం. అంటే కాంగ్రెస్‌ బాగానే బలడుతోందన్న సంకేతాలు ఇచ్చినట్లే లెక్క. ఎంత బలమున్నా మన బలాన్ని మనం కూడా అప్పుడప్పుడూ చూసుకుంటుండాలి. చూపిస్తూ వుండాలి. అలా కూడా మనమెంత బలవంతులమో చూడా ప్రతిపక్షాలకు కనిపించాలి. అంత మంది ప్రజలు ఎలా కాంగ్రెస్‌ సభకు వెళ్లారన్నదానిపై టిఆర్‌ఎస్‌ లో లోతైన విశ్లేషణ జరగాల్సిన అవసరం వుంది. బేషజాలకు పోవాల్సిన పనిలేదు. పార్టీకి కార్యకర్తలకు వున్న ఆలోచనలు తెలుసుకోవాలి. మండల, జిల్లా స్ధాయి నేతల సమావేశాలు జరగాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నదానిపై విసృతమైన చర్చ జరగాలి.

                           ఇంతగా కాంగ్రెస్‌ కార్యకర్తలను కూడేయడానికి దారి తీసిన పరస్ధితులు అంచనా వేయాలి. ఇదంతా తెరాసలో వేగంగా జరగాలి. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో అమలు లేనన్ని అనేక సంక్షేమ పధకాలు తెలంగాణలో అమలౌతున్నాయి. కళ్లముందు నీళ్లు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నాయి. చెరువులు కళకళలాడుతున్నాయి. ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు రైతుకు అందుతోంది. పంటలు పుష్కలంగా పండుతున్నాయి. కళ్యాణ లక్ష్మి వంటి వినూత్నమైన పధకాలు దేశంలో ఎక్కడా లేవు. ఆసరా పధకం అమలు అన్నది గొప్పగా అమలౌతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే సాగు రంగమే, కాదు పారిశ్రామిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించిన రాష్ట్రం తెలంగాణ. అయినా ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత ఎదురౌతోందన్నదానిపై అంతర్మధనం అవసరం. అదీ కాక పార్టీ శ్రేణులను కాపాడుకోవాల్సిన అవసరం పార్టీకి ఎంతో వుంది. పార్టీకి పెట్టని గోడాలా వున్న కార్యకర్తలకు కూడా సంక్షేమ పధకాలు అందాలి. వారికి చేతి నిండా పని లేకపోతే పార్టీకి పనిచేయడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు సామాన్యులకు వచ్చినట్లే, పార్టీ కార్యకర్తలు కూడా ఇండ్లు తీసుకున్నారు. అలా పార్టీ పరమైన సేవలు కూడా పొందారు. మరి తెలంగాణలో పార్టీ కార్యకర్తలకు ఏం అందిందన్నది కూడా చూస్తారు? సహజంగా ఏ పార్టీలోనైనా కార్యకర్తల్లో కనిపించే నిస్తేజమే జనం గ్రహిస్తారు. కార్యకర్తలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూసి కూడా ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధపడతారు. నిజానికి తెలంగాణ వచ్చేదాకా తెరాసకు పూర్తి స్ధాయిలో పార్టీ యంత్రాంగం లేదు. అప్పుడు ఉద్యమ కాలం. పార్టీ నుంచి కార్యకర్తలు ఆశించేదేమీ లేదు. తెలంగాణ వస్తే చాలనకున్నారు. కాని ఇప్పుడు పార్టీ అధికారంలో వుంది.. పార్టీనుంచి ఎంతో కొంత కార్యకర్తలు ఆశిస్తారు. అవి పదవులే కావొచ్చు…పనులే కావొచ్చు. ఎలాగో స్ధాయిని బట్టి నాయకులు, కార్యకర్తలు సంతోషంగా వుండడం అన్నది పార్టీకి ఎంతో శ్రేయస్కరం. 

                             నిన్నటిదాక రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఊపులేదు. ఆ జోరు లేదు. కమలంలో దరహాసం లేదు. చేతిలో ఐక్యత లేదు. కాని కొత్తగా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కార్యకర్తలో జోష్‌ నిండుతోంది. రాష్ట్రంలో గత ఎనమిదేళ్ల రాజకీయం వేరు, వరంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ సభ తర్వాత వేరు అనే చర్చ రాష్ట్రంలో మొదలైంది. నిజంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇంత శక్తి వుందా? అన్నది మరోసారి రుజువు చేసుకున్నట్లైంది. మొన్నటికి మొన్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్‌ కూడా రాకుండాపోయిన కాంగ్రెస్‌ పార్టీ ఇంత పటిష్టంగా వుందా? అన్న సందేహాం కలగకమానదు. రేవంత్‌ రెడ్డి పీసిసి అధ్యక్షుడయ్యాక కొత్తలో కొంత ఉత్సాహం కనిపించింది. కాని హుజూరాబాద్‌ ఎన్నికలతో ఇక రేవంత్‌ పని అయిపోయందన్న చర్చ జోరుగా సాగింది. సీనియర్లకు మంచి పని దొరికింది. అడుగడుగునా రేవంత్‌ను ఉతికి ఆరేయడం మొదలుపెట్టారు. సందుదొరికితే చెడుగుడు ఆడుకున్నారు. ఉక్కిరి బిక్కిరి చేశారు. అడుగు తీసి అడుగేయాలంటే రేవంత్‌ ఆలోచనలో పడేలా చేశారు. ఒక దశలో ఇక రేవంత్‌ కాంగ్రెస్‌లో నెగలడం కష్టమే అన్న స్ధాయి దాకా తీసుకొచ్చారు. పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం సన్నాహక సమావేశాలు సికింద్రాబాద్‌లో జరిగినప్పుడు జిల్లాల సీనియర్‌నేతలు, రాష్ట్ర స్ధాయి నేతలు కలసి, ఆగమాగం చేశారు. అయినా రేవంత్‌ అన్ని దిగమింగుకుంటూ వచ్చాడు.

                          తన లక్ష్య సాధనలో ఇలాంటివి ఎదురౌతాయని ముందుగానే తెలిసి ధైర్యం కూడగట్టుకుంటున్నాడు. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ, క్షేత్రస్ధాయి నుంచి మళ్లీ కాంగ్రెస్‌కు జీవం పోస్తూ వస్తున్నాడు. అయినా ఎక్కడిక్కడ అవాంతరాలు ఎదరౌతూనే వున్నాయి. సృష్టింబడుతూనే వున్నాయి. కాంగ్రెస్‌లో అవి ఆగేవికాదు. నాయకుల మధ్య ఐక్యత లేదు. సఖ్యత అంత కన్నా లేదు. మేము పిసిసి కాలేకపోయామన్న అసంతృప్తి ఒక వైపు, కొత్తగా వచ్చిన రేవంత్‌ రెడ్డి ఎలా అయ్యారన్న కోపం మరో వైపు. ఈ సంఘర్షణల మధ్యే సీనియర్లు సాగుతున్నారే తప్ప పార్టీ కోసం ఆలోచించడం లేదు. ఆ యావ కూడా వారిలో లేదు. ఇదే పార్టీకి ఇప్పటికే రెండు సార్లు తీరని నష్టం తెచ్చిపెట్టింది. తెలంగాణ వచ్చాక ఇచ్చింది మేమే.. మేమే అన్నది చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు చెప్పుకుంటున్నారు. కాని మాలో ఐక్యత లేదని పదే పదే నిరూపించుకుంటున్నారు. ప్రజల్లో నమ్మకం కల్పోతున్నారు. అందుకే ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కన్నా తెచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి, ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్లనే తెలంగాణ బాగు పడుతుందని ప్రజలు ఆశించారు. కేసిఆర్‌ తోనే తెలంగాణ పునర్మిర్మాణం జరుగుతుందని బలంగా నమ్మారు. ఒకటికి రెండుసార్లు తెలంగాణలో తెరాసను మరింత మెజార్టీ కట్టబెట్టి మరీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటారు. కాకపోతే కాంగ్రెస్‌ను కూడా ఎంతో కొంత గుండెల్లో పెట్టుకునే ప్రయత్నమే ప్రజలు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను మరీ పక్కన పెట్టలేదు. కాని పార్టీ ఎంపిక చేసిన నాయకులను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే వాళ్లు కారెక్కడాన్నే జనం చీదరించుకున్నారు. ఆ పార్టీని చీకొట్టేదాకా తెచ్చారు. 

                           ఇప్పటికీ నమ్మితే ఏం చేస్తారో ఆందోళనలో ప్రజల్లో సజీవంగానే వుంచుతున్నారు. కోవర్టులెవరో…అసలు కాంగ్రెస్‌ వాదులెవరో అందరికీ తెలుసు. కాని కాంగ్రెస్‌లోనే వుంటూ నిత్యం చిటపటలతో కాలం గడుపుతూ, పార్టీకి సెగపెడుతూ, పొగ పెడుతూనే వున్నారు. వాళ్లే పార్టీకి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతున్నారు. ఆ కష్టం నుంచి కాంగ్రెస్‌ను బైట పడుకుండా చేస్తున్నారు. కాంగ్రెస్‌ను ఎదగకుండా చేస్తున్నారు. తమ వైఫల్యాలను, బలహీనతలను కప్పిపుచ్చుకుంటూ, తెరాస వల్లనే వీకవుతున్నామని అశక్తతను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలన్న తర్వాత రాజకీయాలే చేయాలి. అధికార తెరాస చేస్తున్న రాజకీయానికి దీటుగా రాజకీయం చేయలేనప్పుడు చేతిని ఒత్తేందుకే ఎవరైనా చూస్తారు… కాని చేయిచ్చి పైకి తెచ్చేందుకు ఎవరు సాయపడతారు? ఈ మాత్రం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు తెలియక కాదు…కాకపోతే మాకన్నా ఎవరూ ముందుకు వెళ్లొద్దు…మాపై పెత్తనం చేసేవాళ్లు వుండొద్దు. ఇంతకు మించి ఏదీ లేదు. అసంతృప్తులతోపార్టీకి ఒరిగేదేమీ లేదు. పార్టీకి ఎప్పుడూ వాళ్లుతో నష్టమే…! ఇది పూర్తిగా తెలిసిన రాహుల్‌ గాంధీ వరంగల్‌ సభలో సూటిగానే కోవర్టులను హెచ్చరించారు. వుంటే వుండండి…లేకుంటే వెళ్లిపోండన్నారు? ఇది కాంగ్రెస్‌కు ఎంతో శుభయోగం…శుభకరం. వాళ్లు వెల్లిపోతే కొట్లాడేవారికి ఎదురుండదు. తలనొప్పి వుండదు. టిక్కెట్లు ఇచ్చి, గెలిపించునే బాధ్యత మరింత తీసుకుంటారు. లేకుంటే సీనియర్ల రాజకీయాలతోనే పుణ్యకాలం పోగొట్టుకుంటారు. 

                                  వరంగల్‌ జోష్‌తోనైనా కలిసి కట్టుగా వుంటారో లేదో అన్నది కాలమే సమాధానం చెప్పాలి. కాని రేవంత్‌కు కాంగ్రెస్‌ పార్టీలో ఎదరు లేదు, తిరుగు లేదన్నది మాత్రం వరంగల్‌ సభతో రుజువు చేసుకున్నాడు. తనకు ధీటైన నాయకుడు కాంగ్రెస్‌లో మరొకరు లేదన్నది నిరూపించుకున్నాడు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎటు వైపు నడుస్తారన్న దానికి కౌంట్‌ డౌన్‌ మొదలైందనే అనుకోవాలి. ఇక వ్యూహాలు ఎలా వుంటాయి? వాటిని ఎలా చేధించుకుంటారు? ఇద్దరా, ముగ్గురా? అన్నది తేలితే గాని ద్వంద్వ యుద్ధమా? త్రిముఖ పోరా అన్నది తెలుతుంది. ఏది ఏమైనా అన్ని పార్టీలకు పరీక్షా కాలం మొదలైనట్లే…పరీక్షలకు సిద్ధం కావాల్సిందే!!

బాబాయ్‌…అబ్బాయ్‌!

జగన్‌ను జననేతగా నిలబెట్టడం కోసం…

జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం…

వైఎస్‌. కుటుంబానికి తోడుగా….

జగన్‌ రాజకీయ జీవితానికి అండగా….

 

వై.వి. చేసిన త్యాగం….

చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం….

అదృష్టం అంటే ఏమిటి? ధనమా! దైవమా!! ఈ రెండూ కాదు…దైవ సేవలో తరించడం. ఆ సేవ ఒక్కసారి రావడమే ఎంతో అదృష్టం. అలాంటిది రెండుసార్లు టిటిడి. చైర్మన్‌ కావడం అన్నది పూర్వజన్మ సుకృతం. ఆ వ్యక్తే టిటిడి

చైర్మన్‌.వైవి.సుబ్బారెడ్డి. టిటిడి చైర్మన్‌ కోసం ఎంతో మంది నేతలు ఎదరుచూస్తుంటారు. కనీసం పాలకమండలిలో సభ్యుడైతే చాలు అనుకుంటారు. కలియుగ దైవాన్ని మనసు నిండేలా కళ్లారా చూసుకునే అవకాశం చాలు అనుకుంటారు. అలాంటి టిటిడి చైర్మన్‌ పదవి కోసం, దేవుని సేవలో తరించడం కోసం ఆరాటపడిన వారు వున్నారు. వారిలో సుబ్బిరామిరెడ్డి, ఆదికేశవులు నాయుడు, మురళీ మోహన్‌, బాపిరాజు లాంటి వారు ఆ పదవి కోసం ఎదరుచూస్తున్నట్లు కూడా చెప్పుకున్న సందర్భాలున్నాయి.

కాని ఊహించకుండానే కలియుగ దైవం రెండు సార్లు వరమివ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా టిటిడి చైర్మన్‌ ప్రకటనకు ముందే వివాదాలు సృష్టించి ఎలాగైనా వైవి.సుబ్బారెడ్డిని కాకుండా చేయాలని కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు. కాని ఆ కలియుగ దైవమే వాటిని పటాంపంచలు చేశారు. రెండు సార్లు వరసగా టిటిడి చైర్మన్‌ అయ్యేందుకు మార్గం వేశాడు. తన సన్నిధిలో కాలం గడిపేందుకు ఆశీర్వచనం ఇచ్చాడు. అసలు టిటిడి చైర్మన్‌ అన్నది పదవి కాదు. ఒక వరం. కలియుగ దైవానికి సేవ చేసుకునే పుణ్యకార్యం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సన్నిదే ఒక ఆధ్యాత్మిక ప్రపంచం. అది అందరినీ వరించేది కాదు. ఆ ప్రపంచాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అప్పగించడం అన్నది దైవ కృప లేకుండా జరిగేది కాదు. ఎవరైతే సుబ్బారెడ్డి మీద విమర్శలు చేశారో ఆ సోకాల్డ్‌ నేతలు ఎవరూ కనీసం ఏడాదికోసారైనా గోమాత సేవ చేసుకుంటారో లేదో తెలియదు. కాని సుబ్బారెడ్డి ఇంట్లో నిత్యం గోమాతలు పూజందుకుంటాయి. ఇంతకన్నా కలియుగ దైవానికి ప్రీతి పాత్రుడైన భక్తుడు ఎక్కడుంటాడు. అందుకే రెండు సార్లు ఆ అవకాశం ఆ దైవమే కల్పించాడు. తన సేవలో తరించడమన్నాడు. 

వైవి.సుబ్బారెడ్డి మాట్లాడే మాట, చెప్పే విషయం సూటిగా వుంటుంది. తన మనసులో ఏముంటుందో అది నిర్మొహమాటంగా చెప్పేస్తారు. ఎక్కడా ఎలాంటి సాగదీతకు తావుండదు. ఆయన చెప్పే విధానం అందరికీ నచ్చుతుంది. మనసులో ఒకటి, బైటకు ఒకటి చెప్పడం ఆయనకు తెలియదు. అందుకే ఆయనంటే అందరికీ ఇష్టం. ఆయనతో కాసేపు మాట్లాడితే జీవిత సత్యు తెలుస్తుందంటారు. రాజకీయాలకు ఎప్పుడొచ్చారు? ఎందుకొచ్చారంటే కూడా చాలా సింపుల్‌గా చెబుతారు. రాజకీయాలంటే ఏమిటో కూడా రెండు ముక్కల్లో తేల్చేస్తారు. అలాంటి నాయకులు చాలా తక్కువగా కనిపిస్తారు. వ్యక్తిని ఆరాంధించడం వేరు. ప్రేమించడం వేరు. ఆప్యాయత పంచడం వేరు. గుండెల్లో పెట్టుకోవడం వేరు. ఇవన్నీ ఒకే వ్యక్తిలో వుండడం అన్నది అరుదు. అవన్నీ నమ్మకానికి విలువలు. ఆ విలువతో కూడిన రాజకీయాలు చేయడం తెలిసిన నేత వై.వి. సుబ్బారెడ్డి. తనకు ఏం కావాలో కూడా ఆయన ఆలోచించుకోడు. కావాలనుకున్నది రాకపోతే కలకలమంటుంది. అందుకే వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ పోతే చాలు. అలాంటి సర్ధుకుపోయే మనస్తత్వం వున్న నాయకుడు వై.వి. సుబ్బారెడ్డి. జగన్‌కు అడుగడుగునా అండగా వుంటూ వస్తున్నాడు. ఆయన విజయాలలో పత్యక్ష్యంగా, పరోక్షంగా తన ముద్రను చూపించారు.

కొట్లాడుకోవడం కన్నా మాట్లాడుకోవడం కష్టం. సేవ చేయడం కన్నా, త్యాగం చేయడం కష్టం. అని పెద్దలన్నారు. అంటే మాటకు వున్న విలువ, త్యాగానికి వున్న చరిత్ర అంత గొప్పది. సహజంగా ఎవరైనా నేను నా కుటుంబం అనుకుంటారు. నేను బాగుంటే చాలనుకుంటారు. నా కుటుంబం ఆనందమే నాకు ముఖ్యమనుకుంటారు. కాని నేనేకాదు, నా చుట్టూ వున్న కూడా బాగుండాలనుకునేవారు కొందరే వుంటారు. అలాంటివారిలో బహు అదురైన వ్యక్తిత్వం వున్న నాయకుడు వైవి. సుబ్బారెడ్డి. మాటలో నెమ్మదనం…మనసులో గొప్పదనం..చేతల్లో చురుకుదనం కలగలిసిన నాయకుడు వైవి. సుబ్బారెడ్డి అంటారు. మాటను కూడా ఆలోచించి మాట్లాడతారు. చూసే చూపులో కూడా నిజాయితీని కనబర్చుతారు. ఈ సమాజంలో ఎదుటివారితో మాట్లాడితే, అయిన వారిని దగ్గరకు రానిస్తే ఏం అడుగుతారో? అనుకునేవారు వుంటారు. ఏ సాయమందించాల్సి వస్తుందో అనుకునే సన్నిహితులు, బంధువులు వున్న వారు వుంటారు. కాని త్యాగానికి నిర్వచనమైన, పర్యాయమైన నాయకుడు వైవి. సుబ్బారెడ్డి. ఈ రోజుల్లో ఎవరూ చేయలేని పనిని, చేయని పనిని కూడా నేను చేయగలని నిరూపించారు. సేవలు చేయడమే గొప్ప అనుకునే రోజులివి. త్యాగం అన్నది అంత సులువైన పని కాదు. అసలు త్యాగం ఎందుకు చేయాలని ప్రశ్నించే రోజులు. త్యాగం చేస్తే నాకేంటి అని ఆలోచించే రోజులు. కాని తన సతీమణి మనసులో ఏముందో కూడా తెలుసుకొని, ఆచరణలో పెట్టేంత గొప్ప గుణం ప్రతి భర్తలో కనిపించాలి. కాని అలా ఆచరించేవారు ఎంత మంది వున్నారు? కాని ఒక్కరున్నారు. ఆయనే వైవిసుబ్బారెడ్డి. తన తోడల్లుడైన వైఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రమాదంలో మరణించిన తర్వాత తన అక్క కుటుంబం గురించి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత మధనపడుతుందని అర్ధం చేసుకున్నాడు. కాని ఆమె ఆ విషయం ఆయనకు చెప్పలేక, తనను తాను సముదాయించుకోలేక సతమతమౌతున్న సందర్భం. అంతే ఆమె మనసులో వున్న ఆలోచనను అర్ధం చేసుకొని జగన్‌కు అండగా వుండడానికి తన వ్యాపారాలన్నీ వదిలేసి, వైఎస్‌ కుటుంబానికి అండగా నిలడడానికి నిర్ణయం తీసుకున్నాడు. తన తోడళ్లుడు కొడుకైన వైఎస్‌.జగన్‌ కోసం అన్నీ తానై, అండగా వున్నారు. ఇది ఎవరికీ తెలియని విషయం. అందుకే వైవి. సుబ్బారెడ్డి అంత ప్రత్యేకం. 

రాష్ట్రం ఒక బలమైన నాయకుడిని కోల్పోయింది. రాష్ట్రమంతా కొలిచే దైవమంటి నాయకుడు లేకుండాపోయాడు. జగన్‌ కుటుంబం శోఖసంద్రంలో మునిగిపోయింది. రాష్ట్రమంతా మూడు రోజుల పాటు టివిలకే అతుక్కుపోయింది. ఏ క్షణమైనా వైఎస్‌. వస్తున్నాడన్న మాట వినిపిస్తుందా? అని ఆశగా ఎదురుచూసిన క్షణాలున్నాయి. అదిగో వచ్చే, ఇదిగో వచ్చే అన్న వార్తలు వింటూ, గుండెలు అదిమి పట్టుకొని కూర్చున్నవారు ఎంతో మంది వున్నారు. కనీసం వంటలు కూడా చేసుకోని కుటుంబాలు కొన్ని లక్షలున్నాయి. వైఎస్‌. మరణం గురించి తెలిసి కొన్ని వందల గుండెలు ఆగిపోయాయి. రాష్ట్రంలో గుండె సంబంధమైన వ్యాధులతో ఎవరూ బాధపడకుండా వుండాలని, ఆరోగ్య శ్రీ తెచ్చిన కొన్ని లక్షల మంది ఆరోగ్యాలను కాపాడిన దేవుడు, లేడని తెలిసి గుండెలాగిపోయిన కుటుంబాలను కూడా చూసుకోవాల్సిన బాధ్యత జగన్‌ మీద పడిరది. అటు కుటుంబం. ఇటు రాష్ట్రం. రాజకీయాలు. వైఎస్‌. మరణం తట్టుకోలేక ప్రాణాలు పోయిన వారి కుటుంబాల కోసం జగన్‌ ముందు వున్న బరువైన బాధ్యతల్లో పాలు పంచుకోవాలి. జగన్‌ ప్రమేయం లేకుండా సాగుతున్న రాజకీయాలను పసిగట్టాలి. జగన్‌కు తెలియకుండానే సాగిన సంతకాల సేకరణ మూలంగా అప్పటికే జగన్‌ను నిందించడం మొదలైన సమయం. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో జగన్‌ ఓదార్పు యాత్రను ఆపడం. చివరికి జగన్‌ మీద సిబిఐ కేసులు నమోదు చేయడం. ఆయనను జైలుకు పంపడం. అంతా గందరగోళం. ఆ కుటుంబానికి ఏం జరగుతుందో అర్ధం కాని అయోమయం. జగన్‌ను రాజకీయంగా తొక్కేయడమే కాకుండా, ప్రజల్లో లేకుండా కొంత కాలం దూరం చేస్తే, జనం మర్చిపోతారన్న కుత్సిత రాజకీయాలు సాగిన దుర్మార్గ కాలం. ఆ సమయంలో అటు కుటుంబానికి, ఇటు పార్టీకి రెండు కళ్లలాగా కంటికి రెప్పలాగా కాపాడడంలో వైవి. సుబ్బారెడ్డి పోషించిన పాత్ర అసామాన్యమైంది. 

జగన్‌ జైలు నుంచి విడుదలైన తర్వాత ఎల్లవేళలా జగన్‌కు తోడుంటూ, డిల్లీ రాజకీయాలను పర్యవేక్షించే బాధ్యత వైవి. సబ్బారెడ్డి తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి పార్లమెంటుకు పోటీ చేసి గెలిచారు. 2018 ఎప్రిల్‌ 6న వైసిసి ఎంపిలంతా రాజీనామాలు చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీ కోసం పని చేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో ఎలాగైనా పార్టీ గెలవాలి. అసలు 2014 ఎన్నికల్లోనే వైసిసి గెలవాలి. నాడు మూడు పార్టీలు ఏకమైన సాగడం వల్ల వైసిసికి నష్టం జరిగింది. కాని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. దాంతో జగన్‌లో మరింత కసి మొదలైంది. తెల్లారి లేస్తే తెలుగుదేశం పార్టీ అడుగడుగునా వైసిపిని ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆయన వెన్నంటే వుంటూ, ఆయన కొండంత ధైర్యం ఇస్తూ ముందుకు సాగిన వ్యక్తి వై.వి. సుబ్బారెడ్డి. ఏనాడు తాను పదవుల కోసం ఆశపడలేదు. ఆశించలేదు. జగన్‌ను రాష్ట్రనేతగా చూడాలనుకున్నాడు. రెండు సార్లు రాష్ట్రంలో ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చిన వైఎస్‌ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సహించలేక రాజకీయాల్లోకి వచ్చారు. జగన్‌కు అండగా నిలిచారు. ఆయన వేసిన ప్రతి అడుగునూ జాగ్రత్తగా వేయిస్తూ వచ్చారు. జగన్‌ జైలులో వున్నంత కాలం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. అటు కుటుంబానికి ధైర్యం చెబుతూ, ఇటు పార్టీని కాపాడుకుంటూ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది భుజాన వేసుకున్న వారికే తెలుస్తుంది. 2014 ఎన్నికల్లో కూడా ఆయన ఒంగోలునుంచి పోటీ చేయాలని అనుకోలేదు. జగన్‌ ఒత్తిడి మేరకే పోటీ చేశారు. గెలిచారు. గత ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోలేదు. జగన్‌ సూచనల మేరకు నడుచుకున్నారు. పైగా జగన్‌ పాదయాత్రను కూడా దగ్గరుండి ప్రతి క్షణం పర్యవేక్షించారు. ప్రజల్లో మరింత నమ్మకాన్ని కల్గించేందుకు కూడా తన శక్తియుక్తులను కూడదీసుకొని పార్టీకి అఖండ మెజార్టీ వచ్చేందుకు కారకుడయ్యాడు. 

వైఎస్‌. రాజశేఖరరెడ్డి సోదరుడు దివంగత వైఎస్‌.వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీగా మంత్రి పదవి తీసుకున్నారే గాని, జగన్‌ను ఎందుకు ముఖ్యమంత్రిని చేయరని ఏనాడు ప్రశ్నించలేదు. వైఎస్‌ ఆత్మగా చెప్పుకునే నాయకుడైన కేవిపి. కూడా జగన్‌కు అండగా నిలవలేదన్నది వాస్తవం. వైఎస్‌ బతికున్నంత కాలం ఆయన ఆశీస్సులతో రాజకీయంగా వెలుగువెలిగిన ఎంతో మందినేతలు ఆ తర్వాత జగన్‌కు దూరమయ్యారు. జగన్‌పై చాటుమాటుగా చేయాల్సిన విమర్శలు చేశారు. ఆయనకు తోడుగా వుండడానికి రాలేదు. కాని తన తోడళ్లుడి కుటుంబం మళ్లీ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం కోసం కృషి చేసిన ఏకైక నాయకుడు, బంధువు వై.వి. సుబ్బారెడ్డి..!

త్యాగం కూడా గర్వపడే గుణవంతుడు .పేదల పాలిట పెన్నిధి పొంగులేటి శ్రీనివాసుడు.

త్రిబుల్‌ కె వర్సెస్‌ సింగిల్‌ ఆర్‌ 

మిస్టర్‌ కూల్‌ లైఫ్‌…

గెలుపు నాడు పొంగిపోలేదు.

టిక్కెట్టు రాకపోతే కుంగిపోలేదు

నమ్మిన సిద్దాంతం కోసం సాగుతున్నారు..

వివాదాలకు దూరంగా వున్నా… విమర్శలను ఎదుర్కొన్నారు…

పార్టీలో ఇబ్బందులూ ఎదురైనా..అయినా చిరునవ్వుతోనే సాగతించారు.

ఆ ఓపికే నేడు ఎంతో పనికొచ్చింది..

పార్టీకి జిల్లాలో ఆయన పెద్ద దిక్కుగా కనిపిస్తోంది….

కొట్టుకున్నా, తిట్టుకున్నా రాజకీయంగా తొక్కుకున్నా, కమ్మలంతా ఒక్కటే అని తెలుగు రాజకీయాల్లో వున్న రాజీ నానుడి. అది ఖమ్మంలోనూ వుందంటారు. అలాంటి ఖమ్మంలో సై అంటే సై అంటూ త్రిబుల్‌ కెలను ఎదుర్కొని నిలిచిన సింగిల్‌ ఆర్‌ ….పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. బ్రాండ్‌ కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన, చెప్పగలిగిన ఏకైక నాయకుడు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. అవకాశాలు కలిసొచ్చినా కొన్ని సార్లు అదృష్టం కూడా కలిసి రావాలి. అదృష్టం కలిసొచ్చినా అవకాశాలన్నీ కళ్ల ముందు వాలాలి. ఈ రెండిరటిలో ఏది ఒక సెకన్‌ ఆలస్యమైనా ఇబ్బందే. ఎంచుకోవడంలో ఒక్క నిమిషం తొందర పడినా చిందర వందరే…! అన్నీ వున్నా కొన్ని సార్లు ఏదీ కనిపించదు. ఏదీ లేకపోయినా అన్నీ ఒక్కసారిగా కళ్లముందు మెదులుతాయి. వీటికి సరిగ్గా సరిపోయే నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఎంపిగా గెలిచినప్పుడు ఆయన ముందు ఏదీ కనిపించలేదు. గెలిచిన పార్టీ వైసిపికి తెలంగాణలో చోటు లేదు. ఆ తర్వాత ఆయన టిఆర్‌ఎస్‌ చేరినా, పార్టీ అధికారంలో వున్నా ఆయనకు ఏ పదవి లేదు. ఇలాంటి విచిత్రమైన చరిత్రలో ఎదుర్కొన్న నాయకుడు ఒక్క శ్రీనివాస్‌ రెడ్డి మాత్రమే కావొచ్చు. ఖమ్మం ఎంపిగా గెలిచేదాకా ఆయన ఎవరో చాలా మందికి తెలియదు. తను అడుగు పెట్టిన రంగంలో విజయాలు తప్ప అపజయాలు లేకుండా అప్రతిహాతంగా శ్రీనివాస్‌ రెడ్డి సాగిపోతున్నారు. ఎన్టీఆర్‌ కాలంలో చిన్నగా ప్రభుత్వ కాంట్రాక్టులు మొదలు పెట్టి, ఇంతింతై వటుడిరతై అన్నట్లు అనేక రాష్ట్రాల్లో కొన్ని వేల కోట్ల రూపాయల పనులు నిర్వహిస్తున్నారు. అనుకోకుండా ఎంపి అయ్యే అవకాశం వచ్చింది. ప్రజల దీవించారు. ఎవరూ ఊహించని విధంగా ఖమ్మం నుంచి వైసిపి పార్టీ తరుపున గెలిచారు. కాని ఆ పార్టీ తెలంగాణలో ఖమ్మం మూలలో తప్ప, మరోచోట లేకుండాపోయింది. దాంతో శ్రీనివాస్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడ అవకాశం కలిసొచ్చింది. కాని అదృష్టమే కొంత కొంటెచూపు చూసింది. ఇక టిఆర్‌ఎస్‌లో చేరే అదృష్టం ఎదురైంది. కాని తర్వాత ఎన్నికల్లో టిక్కెట్‌రాకుండా పోయింది. అదృష్టం,అవకాశం రెండూ ఒకేసారి పొంగులేటిని వరించకపోవడంతో రాజకీయ జీవితం మళ్లీ మొదటికొచ్చింది. అయినా ఎన్ని వార్తలు నిత్యం చక్కర్లు కొడుతున్నా గుబాబీకి తోడుగా, కారుకు అండగా పొంగులేటి సాగుతున్నారు. ఎలాంటి విభేదాలు పొడసూపకుండా చూసుకుంటున్నారు. 

                               ఖమ్మం జిల్లా రాజకీయాలు ప్రస్తుత పరిస్ధితుల్లో హాట్‌ టాపిక్‌. గత ఏడాది కాలంగా ఆ జిల్లాలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవి పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితి మీద ప్రభావం చూపేలా వుంటున్నాయి. అవి అనుకోకుండా జరిగినా, జరగాల్సి వచ్చి జరిగినా నాయకుల స్వయం కృతాపరాధం మూలంగానే జరిగాయన్నది మాత్రం వాస్తవం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. కాని ఇన్ని జరగుతున్నా జిల్లాలో మిస్టర్‌ కూల్‌గా వున్న ఏకైక నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమితికి బలమైన నాయకుడు. ఎమ్మల్యే వనమా నాగేశ్వరరావు కొడుకు వ్యవహారం, తాజాగా మంత్రి అజయ్‌ మూలంగా పార్టీకి జరిగిన డ్యామేజ్‌ అంతా ఇంతా కాదు. అయినా పార్టీలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వున్నాడన్న నమ్మకం కార్యకర్తలో ధైర్యాన్ని నింపుతోందని చెప్పడంలో సందేహం లేదు. భవిష్యత్తు ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆయన చుట్టే పరిభ్రమిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. పదవి వున్నా, లేకున్నా, ప్రజల కోసం, ప్రజల మధ్యే వుండే నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. అదే టిఆర్‌ఎస్‌కు బలమౌతుందని చెప్పడంలో సందేహం లేదు. రాష్ట్ర స్ధాయి నుంచి జిల్లాకు ఎన్ని రకాల మంచి పనులు అందించినా, క్షేత్ర స్దాయిలో నాయకుల వ్యవహార శైలి కూడా పార్టీని ఇబ్బందుల పాలు చేస్తుంది. నమ్మి పార్టీ ఎంతో చేస్తే ఖమ్మం జిల్లాలో ఇద్దరు నాయకుల మూలంగా పార్టీకి తలనొప్పులు వచ్చాయి. వాటిని అధిగమించాలంటే మళ్లీ పార్టీకి కనిపిస్తున్న ఏకైక నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. తమ స్వార్ధ రాజకీయాల కోసం శ్రీనివాస్‌ రెడ్డిని ప్రజాక్షేత్రానికి దూరం చేసే ఎత్తుగడలు చాలా మంది వేశారు. కాని వాళ్లే దూరయ్యే పరిస్ధితి వచ్చింది. 

మనిషిగా సాత్వికం. పట్టుదలలో కొండంత బలం. ఒక సామాన్యమైన రైతు కుటుంబం. ఇప్పుడు వేల కోట్ల వ్యాపారం సామ్రాజ్యం. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక, కేరళ, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ లాంటి రాష్ట్రాల్లో కూడా వ్యాపారాలున్నాయి. అయినా ఆయన ప్రజా సేవలో వున్నారు. ప్రజలకు సేవ చేయడంలోనే తరిస్తున్నారు. పేదలంటే ప్రేమిస్తారు. వారిని అక్కున చేర్చుకుంటారు. వారి కోసం ఆయన సంపాదనలో చాలా వరకు ఖర్చు చేస్తుంటారు. కాని ఎక్కడా తన సామాజిక సేవా కార్యక్రమాల గురించి చెప్పుకోరు. ఉత్తుంగ తరంగం లాగా రాజకీయ యవనిక మీదకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌తో జత కట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో వైపిసి తీర్ధం పుచ్చుకున్నారు. రాష్ట్రం విడిపోయినా వైసిపితోనే వున్నారు. ఆ పార్టీనుంచి ఖమ్మం నుంచి పోటీ చేశారు. ప్రస్తుత టిఆర్‌ఎస్‌ ఎపి. నామా నాగేశ్వరరావు మీద 2014లో 11వేల ఓట్లతో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి గెలిచారు. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు ఆయన వైపు చూసేలా చేసుకున్నారు. అప్పటి వారకు ఆయన ఖమ్మం జిల్లాకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత రాష్ట్రంలోని కొత్త తరం రాజకీయ నాయకులకు ఐకాన్‌గా నిలిచారు. ఎలాంటి రాజకీయ బ్యాక్‌ గ్రౌండ్‌ లేదు. తను నిర్మించుకున్న గ్రౌండ్‌తో మాత్రమే తనను తాను నిరూపించుకున్నారు. సక్సెస్‌కు తనే చిరునామా అని నిరూపించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వైసిపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆహ్వానం మేరకు ఒకే ఒక్క మాటతో ఆయన టిఆర్‌ఎస్‌లో చేరారు. తలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. 

వచ్చే ఎన్నికల్లో నీ సీటు నీదే అన్న ఒకే ఒక్క మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర సమితిలో పొంగులేటి చేరారు. నిజానికి ఓ ఎంపిగా, ఆయనకు వున్న పేరుకు ప్రతిష్టలకు, మరో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వుంటూ మరో పార్టీలో చేరరు. మరో నాయకుడైతే ఆ రూటు మరోలా వుండేది. కాని ఒక కమిట్‌ మెంటు అన్న దానిని ఆధారం చేసుకొని శ్రీనివాస్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. అయినా గత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు రాలేదు. విధి విచిత్రమైంది. 2014 ఎన్నికల్లో ఏ నాయకుడినైతే ఓడిరచారో, అదే నాయకుడి గెలుపు కోసం పొంగులేటి శ్రమించాల్సివచ్చింది. బాధ్యతలు తీసుకోవాల్సివచ్చింది. దగ్గరుండి గెలిపించాల్సివచ్చింది. అయినా చిరునువ్వుతోనే అన్నీ స్వీకరించారు. గత ఎన్నికల సమయంలో పార్టీలో పదవులు పొందికలో తప్పకుండా పార్టీ సరైన సమయంలో సరైన గుర్తింపునిస్తుందన్న మాటను కట్టుబడి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిన మాటకు, ఇచ్చిన హామీ కోసమే ఎదురుచూస్తున్నారు. ఎంత ఆజాశత్రువైనా రాజకీయాలల్లో చేరితే శత్రువులు తయారౌతారని అంటారు. అదే జరిగింది. ఏ పార్టీ కోసమైతే ఆయన శ్రమించారో ఆ పార్టీలో కూడా తోటి నాయకుల స్వార్ధం మూలంగా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ఆఖరుకు ఖమ్మం రావాలంటే పాస్‌ పోర్టు తెచ్చుకోవాలా? అని ప్రశ్నించేంత ఇబ్బంది పడ్డారు. అయినా ఎక్కడా ఆయన పార్టీని గాని, పార్టీ నాయకులపై భహిరంగంగా విమర్శలు చేయలేదు. అదేంటో కొన్ని రాజకీయాల్లో విచిత్రమైన అనుభవాలు ఎదురౌతుంటాయి. ఒక వ్యాపార వేత్తగా అనేక ఎత్తు పల్లాలు చూసిన శ్రీనివాస్‌ రెడ్డి, రాజకీయాల్లో తొలిగెలుపును చూశారు. ఓటమి తెలియని నాయకుడుగా నిలిచారు. అందుకే ఆయన ఎప్పుడూ మిస్టర్‌ కూల్‌గానే వుంటారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఆయన వివాదాలు ఎదుర్కొన్నారు. మాజీ మంత్రి తుమ్మల ఓటమికి కారణమయ్యాడన్న అపవాదులు ఎదుర్కొన్నాడు. కాని లోతుగా అధ్యయనం చేస్తే 2014లోనే తుమ్మల ఓడిపోయారు. అప్పుడు శ్రీనివాస్‌ రెడ్డి గెలిచారు. తుమ్మల వల్ల ఆయన రాజకీయాల్లోకి రాలేదు. తుమ్మల వల్ల రాజకీయంగా నష్టపోలేదు. కాని కొన్ని వివాదాలు మాత్రం ముసురుకున్నాయి. అయినా ఎక్కడా తొనకని మనస్తత్వంతో ముందుకు సాగుతున్నారు. త్యాగశీలి నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు. భవిష్యత్తు ఖమ్మం జిల్లా టిఆర్‌ఎస్‌ రాజకీయాలకు పెద్ద దిక్కుగా వున్నారు.

జనగామ అవుటర్ రింగ్ రోడ్డు, నెల్లుట్ల ఫ్లై ఓవర్ మీద యాక్సిడెంట్

*రెండు టూ వీలర్ లు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు*

 

*అటుగా వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహాయక చర్యలు*

 

*అందులో భాగంగా గంజాయి తో పట్టుబడిన ఓ యువకుడు, ఇద్దరి పరార్*

 

*గాయపడిన వారిని జనగామ హాస్పిటల్ కు పంపించి పట్టుబడిన యువకుడిని విచారిస్తున్న పోలీసులు*

 

జనగామ, మే 4:

జనగామ సమీపంలోని అవుటర్ రింగ్ రోడ్డు నెల్లుట్ల ఫ్లైఓవర్ మీద ఈ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు టూ వీలర్స్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆ వాహనాలపై ప్రయాణం చేస్తున్న యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా జనగామ జిల్లా పర్యటనలో భాగంగా ఇదే సమయంలో అదే దారిలో అటుగా వెళుతూ ఈ ఘటనను చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తన కాన్వాయ్ ని ఆపారు. వెంటనే డీసీపీ, పోలీస్ లకు ఫోన్ చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ లోగా చుట్టుముట్టు ప్రజలు చేరారు. వారి సహాయంతో గాయపడిన వారిని పక్కన కూర్చోపెట్టారు. ఈ లోగా ఘటన స్థలానికి పోలీస్ లు చేరారు. పోలీస్ లను చూసిన వెంటనే ఇద్దరు యువకులు అక్కడి నుండి పరార్ అయ్యారు. అనుమానం వచ్చిన పోలీసులు పట్టుబడిన యువకుడిని విచారించారు. అతడి వద్ద ఉన్న సంచులను చెక్ చేశారు. అందులో గంజాయి ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని స్టేషన్ కి తీసుకెళ్లారు. గాయపడిన యువకులను జనగామ హాస్పిటల్ కి పంపించారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

 

కాగా, ఘటన జరిగిన వెంటనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్పందించి తమకు ఫోన్ చేయడం వల్ల సహాయక చర్యలు అందడమే గాక, గంజాయి పట్టుబడి, సరఫరా చేస్తున్న ముఠా కూడా దొరికిందని, మంత్రి కి పోలీసు అధికారులు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.  

 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ, యాదృచ్ఛికంగా జరిగిన ఘటనలో గంజాయి పట్టుబడటం ఆశ్చర్యంగా, ఆందోళన గా ఉందన్నారు. అందులోనూ యువకులు పట్టుబడటం చూస్తే, ఇబ్బందిగా ఉందన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడటం మంచిది కాదని, ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు మంచి దారిలో పయనించాలని అన్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మత్తు పదార్థాల వినియోగాన్ని, సరఫరా ను అరికట్టాలని అదేశించారు. తనతో సహాయక చర్యల్లో పాలు పంచుకున్న ప్రజలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

కార్యకర్తలెప్పుడూ కరివేపాకులే!


ఒక్క తెలుగుదేశంలోనే కనీసం సైకిల్‌పై తిరిగిన వాళ్లు మోటార్‌ సైకిల్‌ కొనుక్కున్నారు.


కాంగ్రెస్‌లో మొండిచేయే చూశారు….


కమలం పువ్వు చెవుల్లో పెట్టుకున్నారు…


పేరుకే కారు.. ఎక్కింది లేదు..కొన్నది లేదు
తెలంగాణ అన్నంత కాలం అటుకులే బుక్కారు…


తెలంగాణ వచ్చాక ఆ చరిత్ర చెప్పుకుంటూ బతుకుతున్నారు…


కడుపు కాలుతుందని ఆనాడు చెప్పలేదు..ఇప్పుడు చెప్పడం లేదు…


కన్నీళ్లు దిగమింగుడు అలవాటు చేసుకున్నారు…


కమ్యూనిస్టులు చెప్పేది కాళ్లకు పనే…


కార్యకర్తలే కష్టపడి విరాళాలు సేకరించి,పార్టీని బతికించాలి
ఏ పార్టీలోనూ కార్యకర్తలు బతికింది లేదు. బాగు పడ్డలేదు.


ఎన్నేళ్లైయినా కార్యకర్తలు అక్కడే…


నాయకులకు ఊడిగాలు చేసుడే…


ఏ రాజకీయ పార్టీచూసినా ఏమున్నది గర్వకారణం…కార్యకర్తలు సమస్తం సొంత పార్టీల పీడన పరాయణత్వం. ఇది దేశంలోని రాజకీయా పార్టీలలో పనిచేసే కార్యకర్తలు అనుభవించే వేధన. వెలుబుచ్చే ఆవేదన. జెండా కట్టే కాడ…జెండాలు మోసే కాడా మాత్రమే ముందుండాలి…తర్వాత అన్నిట్లో వెనుకేవుండాలి. పచ్చిగా చెప్పాలంటే దూరంగానే వుండాలి. నాయకులు పిలిస్తేనే రావాలి. లేకుంటే ఇంటి భయట కాపలా కాయాలి. నాయకుడు ఎప్పుడు పిలస్తాడా అని కళ్లు కాయలయ్యేలా ఎదరుచూడాలి. ఇదీ సగటు కార్యకర్త బతుకు…..నాయకులకు జైకొట్టే దగ్గర ముందుండాలి….ఇలా చెప్పుకుంటూ అన్నింటా కార్యకర్తలు వెనుకే వుండాలి. నాయకుల అనుమతి వుంటేనే ముందుకు రావాలి…నాయకులెప్పుడూ ముందు నడుసుడే…నాయకుల అడుగులో అడుగులై, వారికి ఓట్లేయించే యాంత్రాలుగా అలుపెరగని పని చేయాలి. ఎన్నికలయ్యాక నాయకుల చుట్లూ దీపపు మెణుగురులు తిరిగినట్లు తిరాగాలి. రాత్రనక, పగలనక నాయకులకు వెన్నంటే వుండాలి. వారికి రక్షణగా నిలవాలి. ఒక రకంగా చెప్పాలంటే కూలీ లేని పని వాడు అనలేక కార్యకర్త అని గౌరవంగా పిలిస్తే పొంగిపోవాలి. నాయకుడు ఇళ్లు కట్టుకుంటే నీళ్లు కొట్టాలి. నాయకులకు కావాల్సిన పనులు దగ్గరుండి చూసుకోవాలి. తన ఇల్లు మర్చిపోవాలి. తన కుటుంబం ఏం తింటుంది చూసుకోకుండా వుండాలి. ఎల్లప్పుడూ నాయకుడి జపం చేస్తుండాలి. వారి నాయకులను ఎవరైనా దూషిస్తే వారి మీద తిరగబడాలి. తమ నాయకుడిపై ఈగ వాలకుండా చూసుకోవాలి. జీవితాంతం ఇంతే…వందల మందిలో ఏ ఒక్కడికే అవకాశం వస్తే, ఆ నాయకుడి చెప్పుచేతుల్లో పదవులు అనుభవించాలి. వచ్చే రూపాయి ఆ నాయకుడి చేతిలో పెట్టి, అవే పాత చింత కాయపచ్చడి మెతుకులు తింటూ పార్టీకి జై కొట్టాలి. నాయకుడికి జేజేలు పలకాలి. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీలోనే కాదు..అన్ని రాజకీయ పార్టీల్లో కార్యకర్తల పరిస్ధితి ఇదే..ఇంతకన్నా ఘోరంగా వుంటాయంటే ఆశ్చర్యపోవాల్సిందే…
మేం సంతోషంగా వున్నామని చెప్పుకునే కార్యకర్త ఏపార్టీలో వుండడు. వున్నాడంటే ఆ కార్యకర్త మనసు చంపుకొని అబద్దం చెబతున్నట్లే లెక్క. పని లేదు. రూపాయి సంపాదన లేదు. తెల్లారితే తెల్లబట్టలు వేసుకోవాలి. నాయకుడి వెంట తిరగాలి. నాయకుడు ఎప్పుడు తింటే అప్పుడు నాలుగులు మెతుకులు తినాలి. ఇంట్లోనే నాయకుడు తిని బైటకు వెళ్తే, ఆ పూటంతా కార్యకర్త పస్తులే వుండాలి. ఆఖరుకు అయ్యో! ఇయ్యాల తినకపోతివి గదా? అని సానుభూతి మాటలు నాయకుడు మాట్లాడితే కన్నీళ్లు పెట్టుకోవాలి. నాయకుడిని మరింత గుండెల్లో పెట్టుకోవాలి. ఇదేనా కార్యకర్తలకు దక్కాల్సింది…ఇదేనా కార్యకర్తలకు నాయకులు ఇచ్చేది…..రాజకీయ పార్టీల పేరుతో కార్యకర్తలను వెట్టికి వినియోగిస్తున్నారు.
పార్టీ కోసం మూడువందల అవరై ఐదు రోజులు పనిచేసేది ఒక్క కార్యకర్త మాత్రమే… అప్పులు చేసి, ఆశలు తీరకపోతాయా? మంచి రోజులు రాకపోతాయా? అని జీవితాంతం ఎదురు చూసేది కార్యకర్తలు. ఆయా గ్రామాల్లో ఏదైనా పని చేయాలనుకుంటే భుజనా వేసుకొనేది కార్యకర్తలే. హైదరాబాద్‌లో వుండే నాయకుడు ఆర్డరస్తే, అప్పు చేసి సాయం చేయాల్సింది కార్యకర్తే. పేరు నాయకుడికి, అప్పు మీదపడేది కార్యకర్తకే. నాయకుడికి జేజేలు..కార్యకర్తకు ఇబ్బందులు…కార్యకర్తలే పార్టీలకు సైనికుల వంటి వాళ్లు అని గొప్ప సంబోధనలు. ఎన్నికల సమయంలోనే కాదు, నిరంతరం పార్టీ కోసం పని చేసే కూలీ లేని వెట్టికి నిదర్శనమైన వాళ్లు. అలా తయారు చేశారు. వాళ్లు ఎలాంటి పనులు చేసుకోవద్దు. కేవలం పార్టీ కోసమే బతకాలి. నాయకులకే జీవితం అంకితం చేయాలి. వాళ్లేమైనా కానీ, వాళ్ల కుటుంబాలేమైనా కాని నాయకులకు అవసరం లేదు. ఏదైనా జరగరానిది జరిగితే ఆ సమయంలో పార్టీ అండగా వుంటుందని ఒక్క మాట చెప్పాలి. మరుసటి రోజు మర్చిపోవాలి. అలా చెప్పి నాయకులు మర్చిపోయిన కుటుంబాలు దేశం మొత్తం మీద కొన్ని లక్షలుంటాయి. ఒక్కసారి మన రాష్ట్రంలో వున్న పార్టీలలో ఏ పార్టీలు కార్యకర్తలకు కనీసం కడుపు నిండా భోజనం పెడుతున్నవేమైనా వున్నాయా? మణి వున్నప్పుడు మంచినీళ్లు పోయకపోయినా మా కార్యకర్తలకు జీవిత భీమా చేయించాం? అని గొప్పగా చెప్పుకుంటున్నాయి? ఇదేనా కార్యకర్తలకు రాజకీయ పార్టీలు ఇచ్చే గౌరవం.
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్న సమయంలో కార్యకర్తలు ఎంత కొంత బాగుపడ్డారన్న మాట సర్వత్రా వినిపించేది. చిన్న చిన్న కాంట్రాక్టు పనులు నాయకులు, కార్యకర్తలకు ఇప్పించేవారు. గ్రామ స్ధాయిలో కొన్ని పనులు కార్యకర్తలను చేసుకొమ్మనేవారు. ఇక పనికి ఆహార పధకం బియ్యం వంటి కార్యక్రమాలు చేసి, నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు. అలా కనీసం పార్టీలో పని చేస్తున్నందుకు ఓ మోటర్‌ సైకిల్‌ కొనుక్కున్నామని గర్వంగా చెప్పుకున్న కార్యకర్తలున్నారు. కాని అలా చెప్పుకున్నవాళ్లు కాంగ్రెస్‌లో లేరు. ఊడిగం చేయడం తప్ప వారికి మిగిలిందేమీ లేదు. ఇక కారు కోసం ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న లక్షలాది మంది కార్యకర్తల్లో ఎంత మంది కార్యకర్తలు కార్లు కొనుక్కున్నారు? ఎందుకంటే గ్రామ స్ధాయి పనులు కూగా కార్యకర్తలకు రావడం లేదు. గుడ్డిలో మెల్లలాగా మిషన్‌ కాకతీయ పనుల మూలంగా కొంత వెసులుబాటు కలిగినట్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత మరొకటి ఏదీ రాలేదు. ఎంత సేపు సొంత వ్యాపారాలు చేసుకోవాలి. పగలనక రాత్రనక రియల్‌ వ్యాపారం చేసుకోవాలి. పార్టీ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో వుండాలి. అంతే తప్ప పార్టీ వల్ల వచ్చిన పనులు లేవు. ప్రభుత్వ పథకాల ద్వారా పొందిన లబ్ధి లేదు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు అనే పధకం పెద్దఎత్తున అమలు చేసినప్పుడు, ప్రజలతోపాటు, కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా ఇండ్లు రాసుకున్నారు. కట్టుకున్నారు. కనీసం అలా అయినా లబ్ధి పొందారు. కాని కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి మూలంగానైనా, రాష్ట్రంలో అధికారంలో వున్న టిఆర్‌ఎస్‌ మూలంగానైనా కార్యకర్తలకు నయాపైస లాభం జరిగినట్లు ఎవరూ చెప్పింది లేదు. విన్నది లేదు. ప్రజలందరికీ అందే కార్యక్రమాలే తప్ప, ప్రత్యేకంగా కార్యకర్తలకు ఒనగూరిందేమీ లేదు. వారికి అందిందేమీ లేదు. డబుల్‌ బెడ్‌ రూంలు కూడా కార్యకర్తలకు వచ్చింది లేదు. సిసి రోడ్లు వేసి బాగుపడ్డది లేదు. గతంలో ప్రతి గ్రామంలో చెక్‌డ్యాంల నిర్మాణం పేరుతో కార్యకర్తలకు కాంట్రాక్టులు అందేవి. కాని ఇప్పుడు ఆ పనులు లేవు. కార్యకర్తలకు రూపాయి అందుతున్నది లేదు. నాయకులు దావత్‌ చేసుకోవడానికి ఇచ్చే నాలుగు రూపాయలు తప్ప, కుటుంబానికి అక్కరకొచ్చే ఒక్క పైసా కార్యకర్త సంపాదించింది లేదు. ఇంటికి నాలుగు స్వీటు ముక్కలు తీసుకెళ్లింది లేదు. కార్యకర్తలంటే పార్టీలకు సైనికులు అని మాత్రమే గొప్పగా చెప్పుకోవాలి. వారు వేయించే ఓట్లతో గద్దెనెక్కి కులుకుతూ వుండాలి. అవసరం వచ్చినప్పుడు కార్యకర్తలను దగ్గరకు పిలిపించుకోవాలి. అసవరం లేనప్పుడు కనీసం దగ్గరకు కూడా రాకుండా చూసుకోవాలి. జేజేలు కొట్టించుకోవాలి. జిందాబాద్‌లకు మాత్రమే కార్యకర్తలు పనికి రావాలి…అంతే…! ఎన్నికలప్పుడు నాయకులు కార్యకర్తలకు తమ కష్టాలు చెప్పుకోవాలి. గెలిచిన తర్వాత వారి సుఖాలు చూడకుండా కార్యకర్తలను దూరం పెట్టాలి!! కాదని ఎవరైనా అనగలరా???

మండలానికి కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

కేసముద్రం (మహబూబాద్), నేటిదాత్రి:

ఇనుగుర్తి మండలం కాంక్షను

వ్యక్తం చేస్తూ సాగిస్తున్న నిరవధిక నిరహార దీక్షలు 82 వ

రోజుకు చేరుకున్నవి.

దీక్షలో కూర్చున్న నాయకులూ మాట్లాడుతూ …గాంధేయ మార్గం లో శాంతియుతంగా అర్థాకలితో దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి పట్టదా ..పలు సందర్భాలలో ఇచ్చిన హామీలు ఏమైనవి 

సెల్ టవర్ మీద 26 గం పాటు సహస దీక్ష చేసినప్పుడు దీక్ష 

విరమింపజేయడానికి ఇచ్చిన

హామీలు, పాదయాత్ర సమయంలో చేసిన బాసలు,కందునూరి

కొమురయ్య సార్ స్మారకార్దం

పెట్టిన టోర్నమెంట్ ముగింపు

కార్యక్రమంలో చెప్పిన మాటలు

ఇవి అన్ని ఏమైనవి. ఇవి అన్ని

నీటి మూటలేనా ?

బాధ్యతగల MLA,ఎంపీ , రాష్ట్ర నాయకులూ ,మంత్రులు బాధ్యత లేకుండా నోటికి ఏది వస్తే అదే

చెప్తారా ? వాటి పర్యవసానాలు ఆలోచించరా ?ప్రభుత్వం వైపునుండి బాధ్యత

గల వ్యక్తులు MLA , ఎంపీ,రాష్ట్ర నాయకులూ ,

మంత్రులు , డిప్యూటీ ముఖ్యమంత్రి, చివరికి ముఖ్యమంత్రి కూడా ఒప్పుకుని మాట ఇచ్చారు . మరి మన మండలం ఎక్కడాగింది ?

ఇది ఒక చిదంబర రహస్యం మేనా 

ప్రభుత్వం లోని పెద్దలు ఇకనైనా ఒక నిర్ణయం తీసుకొని మండలం

ఆందోళనలకు ముగింపు పలకాలని, 

ప్రజల ఆకాంక్షలు నేరవేర్చాలని లేకుంటే ఉద్యమకారులు 90 నుండి 100 రోజుల మధ్య ఎదో ఒక బలమైన తీవ్రమైన అలజడికి చేయడానికి నిర్ణయం తీసుకున్న దరిమిలా దాని కంటే ముందే మండలం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ రోజు దీక్షలో కూర్చున్నవారు……గుజ్జునురి లక్ష్మయ్య ,గంజి శ్రీనివాస్ రెడ్డి ,కాల్సని ప్రభాకర్ రెడ్డి,కాదునూరి సతీష్ ,చిన్నాల కట్టయ్య .సంఘీభావం తెలిపిన వారు….ఉద్యమకారులు ,అఖిల పక్ష నాయకులూ ,మహిళలు అధిక సంఖ్యలో దీక్ష శిభిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు

బతుకమ్మ పండగ కు ఆటంకం కలిగిస్తున్న సర్పంచ్

తెలంగాణ బతుకమ్మ పండుగ సంస్కృతిని ఆగం చేస్తున్న గ్రామ సర్పంచ్

ఆడపడుచులు బతుకమ్మ పండుగను

జరుపుకునే స్థలంలో 

నిర్మించ బోయే బిల్డింగ్ ను,

-వేరే ప్రభుత్వ స్థలంలో నిర్మించాలి.

-బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు

-ఆబోతు రాజు యాదవ్ 

ఆడపడుచులు బతుకమ్మ ఎక్కడ ఆడాలి అని గ్రామ మహిళలు అంటున్నారు

ఖానాపురం నేటిధాత్రి 

 మనబోతులగడ్డ గ్రామంలో తెలంగాణ సంస్కృతి పడుచుల పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ జరుగు స్థలము లో బిల్డింగ్ నిర్మిస్తున్నారు ఆ బిల్డింగ్ నిర్మించడం వల్ల మహిళలు బతుకమ్మ పండుగ చాలా ఇబ్బందికరంగా ఉంటుందని అని ఈ బిల్డింగ్ లు వెంటనే వేరే ప్రభుత్వ చోటుకు నిర్మించాలని అన్నారు.బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాజు యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మనుబొతులగడ్డ గ్రామంలో ,గ్రామం నిర్మాణం జరిగినప్పటి నుంచి హిందూ ఆడపడుచులు బతుకమ్మ పండుగను జరుపుకునే స్థలంలో అక్రమంగా ,బిల్డింగ్ ను నిర్మించడం మంచి పద్దతి కాదని, ప్రస్తుతం గ్రామంలో గ్రామ పంచాయతీ కి అందుబాటులో వేరే ప్రదేశంలో భూమి ఉన్న కూడ ,ప్రజా ప్రతినిధులు,అధికారులు అక్కసుతో బతుకమ్మ ఆడుకునే స్థలంలో నిర్మాణం చేపట్టడం అన్యాయని తెలిపారు.ఒక ముస్లిం నాయకుని కనుసన్నల్లో ప్రజా ప్రతినిధులు,హిందూ ఆడపడుచులు బతుకమ్మ పండుగను జరుపుకునే స్థలంలో నిర్మాణం చేపట్టడం మంచి పద్దతి కాదని తెలిపారు.తక్షణమే నిర్మాణాన్ని వేరే ప్రాంతానికి తరలించలని డిమాండ్ చేశారు.తెలంగాణ సంస్కృతి అయిన హిందూ ఆడపడుచులు ఎంతో వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగను అదే స్థలంలో జరిగే విధంగా అధికారులను చొరవ తీసుకోని నిర్మాణాన్ని వేరే చోటికి తరలించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజెవైఎం మండల ప్రధాన కార్యదర్శి ఎద్దు రాజు,బీజేపీ గ్రామ పార్టీ కార్య దర్శి రాజ బోయిన వెంకటేష్,ఉపాధ్యక్షులు మంచే వెంకన్న,బీ జెవైఎం మండల నాయకులు మహేందర్,జున్ను సూరయ్య,కిన్ను,తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం.

 కేసముద్రం,: భవన నిర్మాణ కార్మిక సంఘం సి ఐ టి యు ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం మే డే బేరువాడ గ్రామం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ముదిగిరి సాంబయ్య, మాజీ సింగిల్విండో చైర్మన్ బండారు వెంకన్న, మాజీ ఎంపీటీసీ ఈసం లక్ష్మీనారాయణ, పాల్గొని మాట్లాడుతూ.. భారతదేశంలో కార్మిక హక్కులను చట్టబద్ధం చేసి కార్మిక హక్కులకై పోరాడిన కార్మిక సంస్కర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు, సమాన పనికి సమాన కూలి కల్పించారని వారు అన్నారు. గ్రామ సీఐటీయూ అధ్యక్షులు బోడ వీరన్న జెండా ఆవిష్కరించారు,ఉపాధ్యక్షులు చిట్టి మల్ల శ్రీను, కార్యదర్శి చిట్టి మల్ల చిన్న శ్రీను, కోశాధికారి గుండెపాక యాకయ్య, సిఐటియు అనుబంధ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

కేసముద్రం విలేజ్ లో పేద ముస్లింలకు సరుకుల పంపిణీ  

కేసముద్రం విలేజ్ లో ఆదివారం 15 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ముస్లిం యువకుల ఆధ్వర్యంలో రూ.15వేల విలువైన సరుకులను రంజాన్ పండుగ సందర్భంగా పంపిణీ చేశారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.650 విలువైన సరుకుల కిట్ తో పాటు రూ.250 విలువ గల చీరె, రూ.100 నగదు ను అందజేశారు. 

 

రంజాన్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకునేందుకు ఆర్థిక స్థోమత లేనివారికి సహాయం అందజేస్తున్నామని ముస్లిం యువకులు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ముస్లిం యువకులు ఎండీ.మున్వర్, షబ్బీర్, నవాజ్, ఎస్కే.హాశాం, ఖలీల్, నూరొద్దిన్, యాకూబ్ పాషా, అక్బర్, హుస్సేన్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక అమరవీరుల ఆశయ సాధనకై పోరాడతాం……

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లి గ్రామ శివారులోని మిడ్వెస్ట్ గ్రానేట్ లిమిటెడ్ కంపెనీ కార్మిక వర్గ అధ్యక్షుడు సింగని రవి ఆధ్వర్యంలో136వ మే డే సందర్బంగా ఐఎప్టియు జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మగాని వెంకన్న మాట్లాడుతూ మేము మనుషులమే మాశక్తికి కొన్ని పరిమితులుంటాయని,రోజులో 8గంటలు మాత్రమే పని దినంగా ఉండాలని 1886 మే 1 అమెరికాలో భారీ ప్రదర్శన నిర్వహించారు, ఈ ప్రదర్శనకి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత చికాగో నగరంలోని హే మార్కెట్లో భారీ ప్రదర్శన జరుగుతుండగా కార్మికులపై పోలీసులు కాల్పులు జరపిన తరుణంలో చాలామంది మరణించారని మరణించిన వారి రక్తంలో పుట్టిన ఈ అరుణాపతకాన్ని ఎత్తుకొని మరణించిన ఆ కార్మిక అమరవీరుల జ్ఞాపకార్ధంగా ప్రతి సంవత్సరం మే ఒకటో తారీఖున జెండా ఆవిష్కరించి ఆ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎండీ మధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నీరుగర్చే ప్రయత్నం చేస్తుందని, మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మాజీ అధ్యక్షులు మోడం రాజు, గుర్రాల శ్రీను,వెంకన్న,తిరుపతి,బాషా, నర్సయ్య,యాకంభ్రం తదితరులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదానికి గురి అయిన శనిగ కుంట గ్రామానికి మరొక సారి పెద్ద ఎత్తున సహాయం!

యుద్ధ ప్రాతిపదికన బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తక్షణ సహాయంగా లక్ష రూపాయలను ఇవ్వాలి

దాదపు 15 లక్షల విలువ గల సామాగ్రిని నగదు ని దాతల ద్వారా అందజేసిన ఎమ్మెల్యే సీతక్క

ధైర్యాన్ని కోల్పొకండి ఎల్లప్పుడూ మీకు తోడుగా నేనున్నా అని దైర్యం చెప్పిన ఎమ్మెల్యే సీతక్క

మంగపేట – నేటిధాత్రి

మంగపేట మండలము శనిగకుంట గ్రామ అగ్నిప్రమాదం జరిగిన కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క పిలుపు మేరకు మరొక సారి పెద్ద ఎత్తున వివిధ ఫౌండెషన్ మరియూ స్వచ్చంద సంస్థల ద్వారా గ్రామానికి సహాయము చేసిన దాతలు ఎమ్మెల్యే

 

సీతక్క ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వివిధ సంస్థల ద్వారా దాదాపు 15 లక్షల విలువ గల సామాగ్రి వస్తురూపెన మరియూ కొంత నగదు రూపాన ఈ ఒక్క రోజే అందజేశారు..! ఈకార్యక్రమములొ భాగంగా దాతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే సీతక్క మీ ఎమ్మెల్యే అవ్వడం మీరు చేసుకున్న అదృష్టం అని వారి పిలుపు మేరకు మాకు తోచినా సహాయం మేము చేశామని రాష్ట్ర నలు మూలల నుండి మేము ఇక్కడికి వచ్చామంటె కేవలం సీతక్క కారణము అని దాతలు అన్నారు ఫౌండెషన్ ద్వార 40 ఫ్యాన్ లు,అమ్మ అనాధ వృద్దాశ్రమం వారు 50వెల గల సామాగ్రి వనవాసి కళ్యాణ పరిషత్ 20వెల సామాగ్రి,

సాధ్య ఫౌండేషన్ హైదరాబాద్ దాదాపు లక్ష రూపాయలా సామాగ్రి, లుడి ఎస్ ఎస్ ఎస్, ప్యూర్ వారి వితరణ వారి దగ్గర నుండి 3 లక్షల విలువ గల సామాగ్రి,ఎస్సి ఎల్ ఐటి, టెక్నాలజీ నుండి రెండు లక్షల విలువగల సామాగ్రి, తెలంగాణ రీడ్ ఫౌండేషన్ నుండి 50కిలొల బియ్యం,హెల్పింగ్ ఫ్రెండ్స్ పాల్వంచ నుండి నెలకు శ్రీపాద నిత్యావసర, సరుకులు సోను సూద్ ఫౌండేషన్ నుండి నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు ఆదివాసి ఉద్యోగుల సంఘం నర్సంపేట డివిజన్ నుండి ఇంటికి దాదాపు, రెండు లక్షల రూపాయల విలువ గల సామానులు, ఆదివాసి గంగారం టీచర్స్ అసోసియేషన్ నుండి దాదాపుగా లక్ష రూపాయల విలువ గల సామగ్రి అందజేశారు, అమ్మ స్వచ్ఛంద సంస్థ వెంకటాపురం 50 వేల విలువగల

సామాగ్రి, గుంటూరు జిల్లా నుండి విచ్చేసిన శివ పార్వతి 20వేల నగదు ఇచ్చి 50 కిలోల బియ్యం చీరలు వస్తువులు ఇచ్చారు, వికాస్ అగ్రి ఫౌండేషన్ అకినేపల్లి మల్లారం నుండి నా సి రెడ్డి సాంబశివారెడ్డి దాదాపు లక్ష రూపాయలు విలువగల పరదాలు ఇచ్చారు, శ్రీ ఎస్ పి ఆర్, హైదరాబాద్ చారిటబుల్ ట్రస్ట్ నుండి పూన్న రెడ్డి 30వెల విలువ గల సామాగ్రి, ఆర్ సి ఫౌండేషన్ రేలారే గంగ దాదాపు 30 వేల విలువగల వస్తు సామాగ్రి, శ్రీనివాస సేవ ట్రస్ట్ హనుమకొండ 50వెల రూపాయల సామాగ్రి, సయ్యద్ యాకూబ్ పాషా ఉయ్యూరు నుండి 50 మంది చిన్న పిల్లలకు బట్టలు,వనితా క్లబ్ వరంగల్ నుండి 40వేల విలువ గల సామాన్లు 4వెలు నగదు,లైఫ్ సేవర్ ఫౌండేషన్ 20వేలు సామాను,అశ్వపురమ్ వాస్తవ్యులు క్వింటా బియ్యం,కాకతీయ యూనివర్సిటి నుండి విద్యార్థులు యువత దాదాపు 50 విలువ గల సామాగ్రి అందజేశారు..!

ఈ సహాయం ఇంతటితో ఆగిపోదు అని మీకు వెన్ను దన్నుగ మేమంతా ఉన్నామని అన్నారు ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతీది వీలైనంత తొరగా వచ్చేలా చేస్తామని అన్నారు 

కార్యక్రమములొ జిల్లా కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు మండల నాయకులు జిల్లా మండల అనుబంధ సంఘాల నాయకులు యూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీ 

కార్య కర్తలు పాల్గొన్నారు

ఫొర్జరీకి సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారిక రిజిస్ట్రేషన్‌

విచారణలో నమ్మలేని నిజాలు

సంతకం స్కాన్‌ చేసి ఇచ్చినా గుర్తించలేని స్థితిలో సబ్‌ రిజిస్ట్రార్‌

ఓనర్‌షిప్‌ డాక్యుమెంట్‌ ఫోర్జరి ఐనట్లు గుర్తించిన అధికారులు

బోచ్చు సుజాత,సమ్మయ్యకు ఓనర్‌షిప్‌ ఇవ్వలే… సృష్టించారు

నిజంగా నకిలీ స్టాంపులు ఆ కార్యలయంలో ఉన్నాయా..?

సెక్రటరీ పాత సంతకాన్ని స్కాన్‌ చేసి నకిలీ దృవీకరణలు

రిజిస్ట్రేషన్‌ నకిలీని గుర్తించే చేసారా లేక గుర్తించలేదా..?

గుర్తించపోతే ఫోర్జరీ చేసి ఏది తెచ్చినా రిజిస్ట్రేషన్‌ చేసేస్తారా..?

ప్రభుత్వ భూమా లేక కోనుగోలు చేసిందా తేల్చడంలో అధికారుల నిర్లక్ష్యం

ఇంటి నంబర్‌ తెచ్చుకుంటే చాలు భూమేదైనా రిజిస్ట్రేషన్‌…?

ములుగులో ఇలాంటి అక్రమాలెన్నో ఉన్నాయనే అరోపణలు

విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చిన పచ్చి నిజాలు

బోచ్చు సమ్మయ్య , సుజాతలు విచారణకు హాజరు కాలేదు : ఎంపివో హన్మంతరావు

బ్యూరో నేటిధాత్రి : ములుగు

ఇలాఖాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న అక్రమాలపై నేటిధాత్రి గత కొంతకాలంగా నిర్విరామంగా అక్షర పోరాటం చేస్తున్నది. అధికారుల అక్రమాల వలన రోడ్డున పడ్డ బాధితులు నేటిధాత్రి కార్యాలయానికి క్యూ కడుతున్న క్రమంలో పలు కథనాలను ప్రచురిస్తూ వచ్చింది. ఈ కథనాలపై అక్రమ అధికారులకు సంబంధించిన అనుచరులు అనేక ఆరోపణలు నిందలు వేసి నేటిధాత్రిని ఇబ్బందులకు గురి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశారు. అంతేకాదు ఎంగిలి మెతుకులకు ఆశపడే కొన్ని సంఘాల నాయకులను అద్దెకు తీసుకు వచ్చి చిల్లర ప్రకటనలు ఇప్పించి రాక్షసానందం పొందారు. అయినా నేటిధాత్రి అడుగు వెనక్కి ముందు

నుండి చెప్పిన మాట తప్పలేదు , మడమ తిప్పలేదు. ఇప్పటికి ఆ కార్యలయం కేంద్రంగా వందల , వేల కోట్ల అక్రమాలు జరిగాయని స్థానికంగా వస్తున్న సమాచారం ప్రకారంగా ఇంకా లోతుగా మా ప్రత్యేకమైన విధానంలో విచారణ సాగిస్తూనే ఉన్నాం.

రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉన్న కొందరు అక్రమ అధికారుల ధనదాహాన్ని ఆసరాగా చేసుకుని ఎంతమంది వ్యక్తులు ఎన్ని చోట్లు ఎన్ని వందల ఎకరాల భూములు లాక్కున్నారో ఆ చిట్టా అంతా సేకరించేందుకు ఏ మాత్రం బెరుకు లేకుండా ముందుకే వెళుతున్నాం. ఈ క్రమంలో గత కొన్ని రోజుల క్రితం ములుగు బండారుపల్లి గ్రామానికి చెందిన బోచ్చు సమ్మయ్య , బోచ్చు సుజాతల పేర ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ చేసిన భూమి ప్రభుత్వ భూమని దీనికి ఎలాంటి అనుమతులు , హక్కులు లేకున్నా అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసి అక్రమాలకు పాల్పడినట్లు వస్తున్న వార్తలను నేటిధాత్రి ప్రచురించింది. దీనికి సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆన్‌లైన్‌ ఆసెస్‌మెంట్‌ , ఓనర్‌షిప్‌ సర్టిఫికేట్‌ సహా అన్ని అర్హత పత్రాలు పరిశీలించాకే రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ప్రకటించారు. అయితే ఈ అంశంపై వార్తలు వచ్చిన క్రమంలో సంబంధిత మండల పంచాయితీ అధికారి శనివారం బండారుపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడ రిజిస్టర్‌లు , సంబంధిత ల్యాండ్‌కు సంబంధించిన వివరాలను గురించి స్థానిక పంచాయితీ కార్యదర్శి సహా ఇతర సిబ్బందితో కలిసి చేసిన విచారణలో బోచ్చు సమ్మయ్య, బోచ్చు సుజాతలకు ఎలాంటి ఓనర్‌షిప్‌ సర్టిఫికేట్‌ గాని , ఆన్‌లైన్‌ ఆసెస్‌మెంట్‌గాని జారీ చేసినట్లు రికార్డుల్లో లేదని నిగ్గు తేల్చారు. ఆంతేకాకుండా ఈ విచారణ వివరాలతో కూడిన రిపోర్టును ఆయన ఎంపిడివోకు తద్వారా ఆర్డీవోకు అందించనున్నట్లు తెలిసింది. 

సంతకం స్కాన్‌ చేసి ఇచ్చినా గుర్తించలేని స్థితిలో సబ్‌ రిజిస్ట్రార్‌ 

ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా చిన్న పని కావాలంటే ఎన్ని కాగితాలు ఎన్ని సార్లు తిప్పి తిప్పి చూస్తారో ప్రతి ఒక్కరం ఏదో సంధర్భంలో అనుభవించే ఉంటాం. కాని ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పెద్దగా కాగితాలను చూడకుండానే రిజిస్ట్రేషన్లు చకచకా జరుగుతున్నట్లు శుక్రవారం ఓ విచారణలో నిగ్గు తేల్చారు మండల అధికారులు. మండలంలోని బండారుపల్లి గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ భూమికి ఇంటి నంబర్‌ సృష్టించి దానికి ఫోర్టరీ సంతకాలతో ఓనర్‌షిప్‌ సర్టిఫికేట్‌ సృష్టించి వీటిని ఆధారంగా చేసుకుని 1571.98 స్క్వేర్‌ ఫీట్ల భూమిని రిజీస్ట్రేషన్‌ చేశారు ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ 13 సంవత్సరాలుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్న కనీసం ఫోర్జరీ సంతకాన్ని గుర్తించకుండా రిజిస్ట్రేషన్‌ చేసి విధి నిర్వహణలో జరిగే తప్పులను గుర్తించంలో వారు ఎంతటి మేధావులో ఈ ఘటనతో చెప్పకనే చెప్పారు.

` నిజంగా నకిలీ స్టాంపులు ఆ కార్యలయంలో ఉన్నాయా..? 

ములుగు చుట్టు పక్కల ప్రాంతాల్లోనే గాక భూపాలపల్లిలో గ్రామ పంచాయితీల్లో వందల , వేల సంఖ్యలో నకిలీ ఇంటినంబర్లతో ఇలాంటి రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆనేక అనుమానాలను స్థానిక ప్రజలు వ్యక్త పరుస్తున్నారు. కనీపసం గ్రామపంచాయితీ అధికారులకు తెలియకుండానే ఓనర్‌షిప్‌ సర్టీఫికేట్లు , ఇతర అనుమతి పత్రాలను సృష్టించి అనేక రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆరోపనలు వస్తున్నాయి. పైగా రిజిస్ట్రేషన్‌కు అవసరమైన అన్ని నకిలీ పత్రాలను ఆ కార్యలయంలోనే అందుబాటులో ఉంచకుని ఆ అధికారికి దగ్గరగా ఉండే వ్యక్తులకు వందల ఎకరాల భూములను పంచినట్లు తెలుస్తున్నది. 

 ` బోచ్చు సమ్మయ్య , సుజాతలు విచారణకు హాజరు కాలేదు : ఎంపివో హన్మంతరావు 

అక్రమ ధృవీకరణ ఆరోపణలు ఎదుర్కోంటున్న బోచ్చు సుజాత , బోచ్చు సమ్మయ్యలను శనివారం జరిగే విచారణకు హాజరు కావలని సమాచారం అందించాం కాని వారు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. విచారణకు హాజరు కాలేదు. దాంతో పాటు ఆర్డీవోకు అందిన ఫిర్యాధు, వార్త కథనాల నేపథ్యంలో బండారుపల్లి గ్రామపంచాయితీలో ఎంపిడీవో ఆదేశాల మేరకు విచారణ చేశాÊ . ఈ విచారణలో బోచ్చు సమ్మయ్య, సుజాతల పేర ఉన్న ఓనర్‌షిప్‌ సర్టిఫికేట్‌గాని , ఇంటి నంబర్‌గాని గ్రామ పంచాయితీ అధికారి ఇవ్వలేదు. పూర్తిగా ఆ ఆధారాలు నకిలీవి . దాంతో పాటు వారు చూపుతున్న తేదిల్లో ఒక్కడ విధులు నిర్వహించిన సేక్రటరీ సతీష్‌ విచారణకు హాజరయ్యారు. విచారణలో తాను వీరికి ఎలాంటి అనుమతులు గాని ధృవికరణ పత్రాలు గాని ఇవ్వలేదని చెప్పారు. ఇట్టి విచారణలో పూర్తిగా సమ్మయ్య, సుజాతలు కలిగి ఉన్న ఆధారాలు నకిలీవి మరియు సేక్రటరీ సతీష్‌ సంతకాన్ని ఫోర్టరీ చేసినట్లు తెలుస్తున్నది. దీనిపై పై అధికారులకు సమాచారమిచ్చి తగిన చర్యలను కోరతాం.

హస్త రేఖలు మారేనా?

కార్యకర్తలు కరెక్టుగానే వున్నారు.

శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు.

అనేక త్యాగాలు చేస్తున్నారు.

నాయకులే గందరగోళంలో వున్నారు.

జనం నమ్మకుండా చేసుకుంటున్నారు

కుర్చీలాటలో కుమ్ములాటలో మునిగి తేలుతున్నారు

పదవుల పందేరమే చూసుకుంటున్నారు

ఆధిపత్యాలే ముఖ్యమనుకుంటున్నారు

రాహుల్‌ పర్యటన జోష్‌ నింపేనా?

నేతల మధ్య సఖ్యత కుదిరేనా?

లుకలుకలు తొలిగేనా?

తాజాగా రేవంత్‌, కోమటి రెడ్డి వివాద టీ కప్పులో తుఫానేనా?

అందరి చూపు రాహుల్‌ సభ మీదే!

రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక్కసారిగా వేడివేడిగా సాగుతున్నాయి. అసలే ఎండా కాలం. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర కాలముంది. కాని ఇప్పుడే తట్టుకోలేనంత రాజకీయ వేడి మొదలైంది. రాజకీయమంతా హాట్‌ హాట్‌గా సాగుతోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దేశ రాజకీయాలపై దృష్టిపెడుతోంది. దేశ రాజకీయాలను సమూలంగా మార్చే స్కెచ్‌ వేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి తిరిగి మేమే వస్తామన్న ధీమా కనిపిస్తోంది. ఆ వాదన బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో కనిపిస్తున్న అభివృద్ధి దేశానికంతటికీ అందిస్తామని టిఆర్‌ఎస్‌ అంటోంది. కాని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ, బిజేపి పార్టీలు లుకలుకలు చవి చూస్తున్నాయి. ఎవరు ఏ రోజు ముందుకొస్తారో? ఎవరు ఏ రోజు వెనకబడి పోతారో? ఎప్పుడు ఎవరు అసంతృప్తి వ్యక్తం చేస్తారో తెలియకుండా బిజేపి, కాంగ్రెస్‌లున్నాయి. అయితే ఓ వైపు బిజేపి రాష్ట్రంలో తామే ప్రత్నామ్నాయం అనుకుంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేపట్టిండు. ఎర్రటిఎండల్లో పాదయాత్ర సాగిస్తున్నాడు. కాకపోతే ప్రజా సంగ్రామయాత్ర అంటున్నాడు. అది బిజేపి సంగ్రామ యాత్రలాగే వుంది తప్ప, ప్రజలతో సాగుతున్నట్లు లేదన్న విమర్శలున్నాయి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల్లో కూడా జోష్‌ పెంచే దిశగానే అడుగులేస్తోంది. వచ్చే నెలలో వరంగల్‌లో రాహుల్‌ గాంధీ భహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. పెద్దఎత్తున జన సమీకరణ కోసం ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. పిసిసి అధ్యక్షుడు రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. కాకపోతే దేశంలో , రాష్ట్రంలో ధరల పెరుగుదల ఆగడం లేదు. రైతుల గందరగోళ పరిస్ధితుకు కారణం బిజేపి. పెట్రోల్‌ చార్జీల పెంపును కూడా సమర్ధించుకుంటూ, రాష్ట్రాల మీద నెపం నెట్టేస్తూ బైట పడాలని బిజేపి చూస్తోంది. వరి వేయండి. కేంద్రంతో కొనిపిచ్చే బాధ్యత నాది అని బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్‌ అప్పుడు చెప్పి,ఇప్పుడు మర్చిపోయాడు. పాదయాత్ర మొదలుపెట్టాడు. ఆఖరుకు వరి రాష్ట్రమే కొంటోంది. అటు కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి, ఇటు రాష్ట్రంలో అధికారంలో వున్న టిఆర్‌ఎస్‌ ఆడుతున్న రాజకీయ చాణక్యంలో ఎటు వైపు మొగ్గాలో తెలియక కాంగ్రెస్‌ సతమతమౌతోంది. ఏ వైపు దారి ఎంచుకున్నా ఇబ్బందికరమైన పరిస్ధితేవుంది. ధరలకు కారణం బిజేపి అంటే, టిఆర్‌ఎస్‌ లాభం. వరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది బిజేపికి లాభం? మరి కాంగ్రెస్‌కు ఏం లాభం? ఎలా లాభం? ఆలోచించుకోవడానికి కూడా కాంగ్రెస్‌కు ఉపిరి సలపకుండా బిజేపి, టిఆర్‌ఎస్‌ రాజకీయాలు చేస్తున్నాయి. రెండుపార్టీలను తిట్టాల్సిన సమయంలో ఎవరిని ఎక్కువ తిట్టినా, ఎవరిని తక్కువ తిట్టినా తూకం వేసి మరీ కాంగ్రెస్‌ను కంగారు పెట్టేందుకు రెండు పార్టీలు కాపు కాచుకొని కూర్చొని వున్నాయి. 

                    మరి ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ నాయకులు ఏం చేయాలి? ఎలా స్పందించాలి. ఎలా ముందుకెళ్లాలి? ఎలా టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనాలి? ఎలా బిజేపిని ఎండగట్టాలి? ఇది కాదా? రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆలోచించాల్సింది. కాని ఏం చేస్తున్నారు? ఒకరినొకరు నిచ్చెన మీదనుంచి ఎలా లాగేసుకుందామని ఎదరుచూస్తున్నారు? క్షణం పడక ఎడమొహం, పెడమొహం పెట్టుకుంటున్నారు. నిన్నటిదాకా నీ లెక్కెంత? అంటే నీ లెక్కంత అనుకున్నారు? పార్టీ కేంద్ర పెద్దలు తలంటడంతో సర్ధుకున్నట్లే కనిపించింది. మళ్లీ నల్లగొండ ఎపిసోడ్‌తో వేడి రాజుకుంది. రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్ద పెద్ద నాయకులు ఎప్పుడు కలిసుంటారో తెలియదు? ఎంత సేపు కలిసుంటారో తెలియదు? కలిసున్నంత సేపు ఎలా వుంటారో కూడా తెలియదు? ఎంత సేపట్లో కయ్‌,కయ్‌ అనుకుంటారో అసలే తెలయదు. ఎంత చెప్పినా ఎందుకు కలిసుండరో వాళ్లకే తెలియదు. ఎంత మంది నచ్చజెప్పినా అప్పుడే ఎలా దులిపేసుకుంటారో తెలియదు? ఇంత గందరగోళం ఏ పార్టీలోనూ వుండదు. అసలు పార్టీ అధికారంలోకి రావాలని వాళ్లలో వుందో లేదో కూడా తెలియదు? వాళ్లకు ఏదీ తెలియదు? కాని పిసిపి మాత్రం అందరికీ కావాలి. వాళ్ల ప్రమేయం లేకుండానే పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కావాలి. అందుకు ఎప్పుడు ఎన్నికల ముచ్చట వచ్చినా నేనే సిఎం అనుకోవాలి. ఓ కర్చీప్‌ వేసుకొని చూడాలి. ఇలాగే ఎదురుచూస్తుండండి అని జనం తిట్టుకున్నా సరే…మేం మారం…మీరు మారకండి అని ప్రజలకు చెప్పినట్లే వుంది కాంగ్రెస్‌ నేతల పరిస్ధితి. తాజాగా నల్లగొండ జిల్లా వివాదం అవసరమా? పిసిసి స్టార్‌ క్యాంపైనర్‌ నల్ల గొండ జిల్లా నుంచి కోమటి రెడ్డి వెంకటరెడ్డి వుంటే మాత్రం పిపిసి అధ్యక్షుడు రేవంత్‌ వెళ్లొద్దా? రావొద్దా? ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయాలో అర్ధం కాదు. మీరంతా ఒక్కటే. మీ పార్టీ ఒక్కటే. అయితే సీనియర్లుగా పేరున్న వారి జిల్లాలకు పిసిసి. రావాల్సిన అవరసం లేదు. వస్తే మేం హజరుకాలేము అని చెప్పడమేమిటో? ఎవరికీ అర్ధం కాదు. మొన్నటిదాకా జగ్గారెడ్డిది ఇదే తీరు…ఆయన కొంచెం మారిండేమో అనుకునే సరికి మళ్లీ కోమటి రెడ్డి మొదలైండు. ఎంత సేపు నేను సీనియర్‌ని అనుకుంటూ పోతే సరిపోతుందా? పార్టీ నేతలందరికీ ఒక్క గొడుకు కిందకు తెచ్చే యోచన లేదా? ఆ అవసరంలేదా? 

                      నాయకులు తిట్టుకున్నా, నాయకులు చాల మంది పార్టీలు మారినా, పార్టీ కోసం నిలబడ్డ వారిలో కాంగ్రెస్‌ కార్యకర్తలను ఎవరైనా అభినందించాల్సిందే. వారికి పార్టీ మీద వున్న కమిట్‌ మెంటు సామాన్యమైంది కాదు. నిత్యం తిట్టుకుంటూ, కొట్టుకుంటూ సాగుతున్న సీనియర్‌ నాయకులు పార్టీ కార్యకర్తలకు నిత్యం క్షీరాభిషేకాలు చేసినా తప్పులేదు. పాద పూజలు చేసినా నష్టం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పాపం కార్యకర్తలు ఏనాడు సుఖపడిరది లేదు. సంతోషంగా వున్నది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ కాలంలో అధికారంలో వుండి కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నది ద్వితీయ శ్రేణి నాయుకులు, కార్యకర్తలే. నాడు అడుగడుగునా ఉద్యమ కారులు కాంగ్రెస్‌నాయకులను తిట్టినా, దుమ్మెత్తి పోసినా ఓపికతో వున్నారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్‌ పార్టీయే అని నమ్మకంతో పార్టీలో కొనసాగారు. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోయినా ఆ పార్టీనే పట్టుకొని వేళాడుతున్నారు. కాని ఎంతో మంది ఎన్నెన్నో పదవులు అనుభవించిన సీనియర్లు పార్టీని వీడిపోయారు. పదవుల కోసం పార్టీని ముంచి పారిపోయారు. కాని కార్యకర్తలు ఎక్కడా చెక్కు చెదరలేదు. ఇప్పుడు టిఆర్‌ఎస్‌ నుంచి ఇబ్బందులు ఎదురౌతున్నా ఎనమిదేళ్లుగా భరిస్తూనే వున్నారు. కాని నాయకుల్లో ఈ కృతజ్ఞత లేదు. ఆ విశ్వాసం లేదు. కార్యకర్తలే ఇన్ని త్యాగాలు చేస్తుంటే కనీసం మనం కాస్త తగ్గి వుంటే సరిపోతుందన్న ఆలోచన కూడా లేదు. సహజంగా రాజకీయ నాయకులు పదేళ్లపాటు క్రియాశీల రాజకీయల్లో లేకుంటే కనుమరుగౌతారు. అలాంటిది ఉద్యమ కాలంలోనూ ఇబ్బందులు ఎదుర్కొని, ఎనమిదేళ్లుగా అంతకన్నా ఇబ్బందులు ఎదుర్కొంటూ కాంగ్రెస్‌ జెండా పట్టుకొని నడుస్తున్న వారి కోసమైనా సీనియర్లు కలిసుండాలి. అధికారం ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వస్తుంది . కార్యకర్తలకున్నంత నమ్మకం పార్టీ నాయకులకు లేదు. కార్యకర్తలకున్నంత ధైర్యం నాయకులకు లేదు. కార్యకర్తలు చేస్తున్నంత త్యాగం నాయకులు చేయలేకపోతున్నారు. రాహుల్‌ గాంధీ సభతోనైనా సీనియర్లు మారుతారా? లేక మేమింతే అని నిరూపిస్తారో చూద్దాం???

దేశ విధాత…భావి ప్రగతి ప్రధాత

సాగునీటి రంగంలో కొత్త పుంతలు.

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు

రైతు బంధు దేశమంతా తోడు

దళితబంధు అమలు తీరు

దేశమంతా కోతలు లేని విద్యుత్ వెలుగులు

పారిశ్రామిక రంగంలో పరుగులు

శాస్త్ర, సాంకేతిక రంగాలలో లక్ష్యాలు

భావి భారత ఆవిష్కరణలు

కొత్త తరం సంక్షేమాభివృద్ధికి బాటలు

చెప్పే మాట, చేసే చేత, వేసే అడుగు, చూపే బాట, రాసే రాత, గీసే గీత అన్నీ సరిగ్గా వున్నప్పుడు వెనకడుగు వుండదు. అని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పుడో నిరూపించాడు. ఇప్పుడు కొత్త మరో కొత్త అడుగుకు శ్రీకారం చుడుతున్నారు. దేశ రాజకీయాలలో మార్పులకు నాంది పలుకుతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట మరవలేదు. తెలంగాణ తెస్తానన్నాడు. మాట తప్పలేదు. చెప్పిన మాట విడువ లేదు. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడిరడు. తెలంగాణ నినాదం, ఉద్యమం పద్నాళుగేళ్లు పదిలం చేశాడు. లక్షలాది మంది ఉద్యమకారులలో తెలంగాణ నినాదం నింపిండు. ప్రతి ఒక్కరు జై తెలంగాణ అని నినదించేలా చేశాడు. ఒక్కొక్క తెలంగాణ వాదిని ఒక్కొక్క కేసిఆర్‌లా తయారు చేసిండు. ఏ మాటైతే చెప్పిండో అదే మాటను చేత చూపించిండు. నిరంతరం పోరాటం చేసిండు. నిత్యం ప్రజల్లో ఉద్యమ కాంక్ష రగిలించిండు. ప్రతి నిమిషం తెలంగాణ పదాన్ని గుర్తుచేసుకునేలా చేశాడు. వేసిన ప్రతి అడుగు తెలంగాణ కోసమే వేసిండు. ఇప్పుడు రాకపోతే ఇక తెలంగాణ ఇక ఎప్పుడూ రాదని తెగువు చూపిండు. తెగింపు చూపిండు. తెలంగాణ ప్రజలందరికీ అదే బాట చూపిండు. తెలంగాణ తోవలో నడిపించిండు. తెలంగాణ కోసమే రాతలు రాసిండు…తెలంగాణ వస్తే తెచ్చుకున్న తెలంగాణ ఎలా వుండాలన్నదానిపై ముందే గీతలు గీసిండు…లెక్కలేసి తెలంగాణను బంగారు తెలంగాణ చేసిండు. ఇది నిత్యం..సత్యం. తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే కరంటు కోతలు లేకుండా చేసిండు. 

                      ఎండా కాలం కూడా కరంటు నిరంతరం ఇచ్చిండు. రెప్పపాటు పోకుండా కరంటు సరఫరా చేసిండు. తెలంగాణ వస్తే చీకటౌతుందని చెప్పిన వారికి రాత్రిళ్లు తెలంగాణలో కరంటు వెలుగులు నింపిండు. వస్తున్న కరంటే సత్యం… రెప్ప పాటు కాలం కూడా పోని విద్యుత్తే సాక్ష్యం. కండ్ల నిండా కరంటు గోసచూసిన తెలంగాణ కండ్ల నిండా కరంటు చూస్తుంది. తెలంగాణ రాకుంటే ఇంకా ఎన్నేండ్లు ఈ చీకట్లు చూడాల్సివచ్చేదో… ఆ కోతలు ఇంకా ఎన్నేళ్లు అనుభవించాల్సివచ్చేదో…ఈ తరానికి తెలియాలి..నాడు పడిన గోసలు పొరుగు రాష్ట్రాలలో వున్నాయన్న సంగతి చెప్పాలి..ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికిన ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిండు. కరంటు వెలుగుల్లో తెలంగాణ ఆత్మగౌరవం చాటిండు. ఏ రాష్ట్రానికి సాధ్యం కానిది సుసాధ్యం చేసి చూపిండు. తెలంగాణలో వ్యవసాయానికి కూడా ఇరవైన నాలుగు గంటల సరఫరాచేసి ఇదీ తెలంగాణ అని ఎలుగెత్తి చాటిండు. మరి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ, ఆఖరికి ఆంధ్రప్రదేశ్‌లోనూ కూడా నిరంతర కరంటు సరఫరా లేదు. కోతలు లేకుండా ఎన్నడూ లేదు. ఇదీ కాదా! తెలంగాణ విజయం. అదంతా ఒక్క రోజులో రాలేదు. పద్నాళుగేళ్ల పోరాటం, కేసిఆర్‌ నాయకత్వంలో, తెలంగాణ స్వయం పాలనా అస్ధిత్వంతో సాధ్యమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే నీళ్ల గోస తీరింది. తడారిన గొంతు తెలంగాణ తల్లి తడిసింది. ఫ్లోరైడ్‌ భూతం పారిపోయింది. తినే తిండిలో కూడా కలిసి, కాళ్లు చేతులు వంకర్లు పోయేలా చేసిన ఫ్లోరైడ్‌ కనిపించకుండా భూగర్భంలోకి జారుకున్నది. తెలంగాణలో పెరిగిన నీటి మాట్టాలతో అట్టడుగుకు చేరింది. తెలంగాణ రాకుంటే ఫ్లోరైడ్‌ భూతం మరింత పెరిగేది. సగం తెలంగాణ నడవలేని స్ధితిలో వుండేది. 

                         రాజకీయ చైతన్యం ఏనాడో తెలంగాణలో వుంది. పాలనా సామార్ధ్యం తెలంగాణలో ఎప్పుడో వుంది. తెలుగు చరిత్రకు శ్రీకారం చుట్టిన శాతవాహనులు మన కోటి లింగాల తొలి రాజ్యం. మన కరీంనగర్‌ నుంచి పాలనకు శ్రీకారం. డిల్లీ దాకా పాలన కోసం ప్రయత్నం చేసిన గౌతమీ పుత్ర శాత కర్ణి మనకు ఆదర్శం. దేశంలో తొలి మహిళా తెలంగాణ వీర వనిత, మహారాణి రుద్రమహారాజు పేరుతో పాలన చేసింది. పాలన కొత్త కాదు. కొట్లాడుడు కొత్త కాదు. విజయాలు కొత్త కాదు. చాకలి ఐలమ్య తెగువ, మల్లు స్వరాజ్యం తెగింపు తెలిసిన నేల తెలంగాణ. ఇలా అడుగడుగునా, అణువణువునా చైతన్యమే…ఆ బాటలోనే విరిసిన కుసుమమే కేసిఆర్‌. పోరాట యోధుడే కేసిఆర్‌. ఆ వీరుడే తెలంగాణ విజయాలు దేశానికి అందాలంటున్నాడు. దేశం సుభిక్షంగా వుండాలంటున్నాడు. దేశమంతా సస్యశ్యామలం కావాలంటున్నాడు. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత నీటి సంపద మనకు వుందని గుర్తు చేస్తున్నాడు. అటు గంగ, ఇటు యమున, గోదావరి, కృష్ణా, మహానది, కావేరి, నర్మద, తపతి వంటి పెద్ద నదులున్నాయి. ఐదు నదులను కలుపుకొని ఒక రాష్ట్రంగా మారిన సింధు నదితో పాటు దాని ఉప నదులున్నాయి. చీలం, జీతం, చినాబ్‌, రావి, బియాస్‌ వంటి నదులు నీళ్లు పుష్కలంగా వున్నాయి. బ్రహ్మ పుత్ర నది నిండా నీళ్లున్నాయి. ఎన్ని నీళ్లున్నా వున్నా సద్వినియోగం ఎందుకు సద్వినియోగం చేసుకోలేపోతున్నామంటుంటున్నాడు కేసిఆర్‌. దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో సగంకూడా వినియోగించుకోకుండానే వృధా అవుతుందంటున్నాడు. నలభై ఏళ్ల క్రితం మన దేశం కంటే వెనుకబడి వున్న చైనా ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశంగా ఎలా ఎదిగిందో చెబుతున్నాడు. ఎడారిలో కూడా మొక్కలు నాటి, వనాలు చేసి, దేశాన్ని చైనా ఎలా సాగుభూమిగా మార్చిందన్నదానిని గుర్తు చేస్తున్నారు. ఇలా అనేక రంగాల్లో ఇప్పటికే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సి వుండాల్సింది. కాని లేదు. ఎందుకు? అని కేసిఆర్‌ ప్రశ్నిస్తున్నాడు. ప్రజల్లో చర్చ జరగాలంటున్నాడు. ఇంకా సబ్సిడీ బియ్యంతో దేశ ప్రజలు బతికే రోజుల్లోకే దేశ ఎకానమీని ఎందుకు నెట్టేస్తున్నారని నిలదీస్తున్నాడు. 

                       ఇప్పటి వరకు ఇలా నిలదీసిన నాయకుడు లేదు. ఏఏ రంగాల్లో మన దేశం వెనుకబడి వుందో చెప్పిన నాయకుడు లేదు. దేశంమీద ఇంత అవగాహన వున్న నాయకుడు మరొకరు లేరు. ఇప్పుడు కావాల్సింది దేశానికి నాయకత్వం కాదు. దిశ`నిర్ధేశం చేసే మార్గం. అయితే నేను, లేకుంటే నువ్వు అని దేశాన్ని పాలిస్తున్న పార్టీలకు ప్రత్నామ్నాయ రాజకీయ వేధిక రావాలి. అది తెలంగాణ నుంచే పరుడు పోసుకోవాలి. ఇది కేసిఆర్‌ రూపంలో రావాలన్నదే తెలంగాణ ప్రజల అభిమతం. ఆకాంక్ష. దేశం సర్వతోముఖాభివృద్ధి సాధనకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. అందుకు రాజకీయ పార్టీల పునరేకీకరణ కాదు..కావాల్సింది మరో ప్రత్నామ్నాయ రాజకీయ శక్తి. అది తెలంగాణ గొంతులోనుంచి రావాలి. తెలంగాణ తెగింపులో నుంచి రావాలి. తెలంగాణ స్వరంగా వినిపించాలి. తెలంగాణ చైతన్యం దేశమంతా నింపాలి. నూతన ప్రజాస్వామ్య వ్యవస్ధకు దిక్సూచీ కావాలి. దేశ ప్రగతికి బాటలు వేయాలి. దేశమంతా పచ్చబడాలి. పల్లెలన్నీ చిగురించాలి. పచ్చదనం వెల్లివిరియాలి. ప్రతి ఎకరానికి నీరందాలి. ప్రతి మూలలో పంటలు పండాలి. ప్రతి రైతు సంతోషంగా వుండాలి. ఆ రైతుకు తెలంగాణలో అందుతున్నట్లు రైతు బంధు అందాలి. రైతు భీమా అందాలి. పండిన పంటకు గిట్టుబాటు ధర రావాలి. స్వేచ్చా మార్కెట్‌ ఏర్పాటు కావాలి. రైతుల వద్దకే వచ్చి వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసుకునే రోజులు రావాలి. ఇది కేసిఆర్‌ కల. 

               తెలంగాణలో నెరవేరిన కల కళ్లారా చూస్తున్న రైతు దేశమంతా కావాలి. ఆ కల నిజమై దేశమంతా చూడాలి. దేశరైతులు సుబిక్షంగా వుండాలి. ప్రపంచానికే మన ఎగుమతులు పెరగాలి. నాణ్యమైన పంటలు ప్రపంచానికి అందించాలి. ఎకానమీలో కూడా సాగు విప్లవం చూపించాలి. ఇదీ ప్రతి రాజకీతిజ్ఞుడు కోరుకోవాలి. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో నైపుణ్యమైన యువత మన దేశానికి మెండుగా వున్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువ శక్తి మన దేశంలో వుంది. దాన్ని వినియోగించుకోవాల్సిన అసవరం ప్రభుత్వాలకు వుంది. కాని దాన్ని విస్మరిస్తున్నారు. మన దేశ పౌరులు ప్రపంచ దేశాలకు తమ మేధోశక్తిని వినియోగిస్తున్నారు. ఇక్కడ వారి తెలివి తేటలను వాడుకునే పాలకులు కావాలి. వారికి సరైన నమ్మకం, విశ్వాసం కలిగించే పాలకుల రావాలి. దేశాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లాలి. పొరుగున్న వున్న దేశాకంటే కొన్ని రెట్లు ముందు పురోగమించేలా చేయాలి. అందుకు పెద్ద సమయం కూడా అసవరంలేదు. పాలకుల్లో చిత్తు శుద్ధి కావాలి. లక్ష్య శుద్ధి కావాలి. అన్నదే కేసిఆర్‌ నినాదం. తను ఆచరించి చూపిస్తున్న విధానం. ఒకనాడు తెలంగాణలోని అనేక మంది యువకులు పెద్ద ఎత్తున కర్నాటక, పూన, వంటి నగరాలకు వెళ్లేవారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్‌ ఐటి ఎగుమతులు రూ.15వేల కోట్లు వుంటే, ఇప్పుడు రెండు లక్షలకు పైగా ఎగుమతుల్లో టాప్‌ సెకండ్‌ ర్యాంక్‌లో వున్నాం. దేశంలోని అనేక రాష్ట్రాలనుంచి యువత పెద్దఎత్తున ఐటి కొలువు కోసం హైదరాబాద్‌ వస్తున్నారు. ఇది దేశమంతా విస్తరించాలి. అందుకు పాలకులకు సరైన ప్రణాళికా వుండాలి. అలాంటి ఆలోచన, ఆచరణ వున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌. అందుకే కేసిఆర్‌ దేశ్‌కి నేత కావాలని ప్రజల కోరిక. అది త్వరలో తీరాలని, కేసిఆర్‌ నాయకత్వంలో , నేతృత్వంలో పురోగమించాలని తెలంగాణ వాదులు, టిఆర్‌ఎస్‌ నాయకుల ఆకాంక్ష. ఆ రోజులు తొందరగా రావాలని కోరుకుందాం…దేశ ప్రగతి కళ్లారా చూద్దాం..!

నవ యుగ వైతాళికుడు

ఆచరణాత్మక కార్యదక్షుడు

కార్యాచరణకు కృషీవలుడు,

తెలంగాణ స్వాప్నికుడు

తెలంగాణ కల సాధకుడు,

రేపటి తరం దార్శనికుడు,

దేశ భవిష్యత్తుకు రాజకీయ నిర్ధేశకుడు

తెలంగాణ వెలుగులు, దేశానికి అద్దే కార్యశీలుడు.

తెలంగాణ ప్రగతిలో దేశానికి ఆదర్శప్రాయుడు……

 సహజంగా వైళాలికుడు అని కవులను, సంస్కర్తలను పిలుస్తుంటారు. అయితే కేసిఆర్‌ నవయుగ వైతాళికుడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకుడే కాదు. ఉద్యమ కారుడు. పోరాట యోధుడు. రాజకీయ చాణక్యుడు. కవి, వక్త, సంస్కర్త కలగలిసిన ఈరం ఏకైక నాయకుడు. భవిష్యత్‌ తరాలకు దార్శనికుడు…నిన్నటి తరం కల నిజం చేసిన స్వాప్పికుడు. రేపటి తరాన్ని గురించి నిరంతం ఆలోచించే నిర్ణయాత్మక కృషీవలుడు. ఉద్యమ కారుడిగా అరవైఏళ్ల తెలంగాణ కలను నిజం చేసిన నవతరం నాయకుడు. తెలంగాణ వచ్చే దాకా తెగించి కొట్లాడిన శూరుడు. పద్నాలుగేళ్లు అనేక అవంతరాలను ఎదుర్కొని విజయాన్ని తెలంగాణ ముద్దాడేలా చేసిన వీరుడు. జన సామాన్యంలో బహుళ ప్రచార సాధనమైన తెలంగాణ పాటలకు వన్నెలద్దాడు. పాటకు వెన్నల, వెలుగులద్దిన నాయకుడు కేసిఆర్‌. స్వయంగా పాటలు రాసి, తెలంగాన ఉద్యమ పాటలను ఉర్రూతలూగించాడు. పోరాటాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశాడు. గారడి చేస్తుండ్రు, గడిబిడ చేస్తుండ్రు అంటూ పాలకుపై విరుచుకుపడ్డాడు.

నాటి కుటిల నీతిని ఎత్తి చూపాడు. పాటతో ఎలుగెత్తి చాటాడు. తెలంగాణ సాంస్కృతిక రంగానికి పూర్వ వైభవం తెచ్చిండు. తెలంగాణ అంటే పాట…పాట అంటే తెలంగాణ అనేంతగా గుర్తింపు తెచ్చిండు. తెలంగాణ ఉద్యమంలో పాటల ప్రస్తానం కీలక భూమికచేశాడు. కొన్ని వేల మంది కళాకారులకు కొత్త జీవితాలు ఇచ్చాడు. పాటకు వేనోళ్ల తెలంగాణ గొంతులకు జీవం పోశాడు. పాటగా ప్రపంచమంతా తెలంగాణను గోసను విపించాడు. ఇప్పుడు తెలంగాణను కీర్తించేలా చేస్తున్నాడు. ఒకనాడు పాటంటే అంద్రాది. రాతంటే ఆంద్రాది. గొంతంటే ఆంద్రాది…స్వరాలు, సరిగమలు, గమకాలంటూ ధీర్ఘాలు!! అవి జీవం లేని గీతాలు..జీవితాలు ఆవిష్కరించలేని గేయాలు. మాటకు రాగమేంది? పాటకు స్వరమేంది? గొంతు సవరిస్తే వినిపించే గోస కూడా పాట కావాలి. పిడికిలెత్తి గొంతెత్తితే రాగం రావాలి. అది పాట కావాలి. జనం గుండెను తట్టాలి. సమాజాన్ని నిద్ర లేపాలి. అది పాటంటే…తెలంగాణ మాటంటే…! తెలంగాణ మాటలో, పాటను చేసి, పాటను రాగంగా మలిచిన మలి తరం పోరాటమే పాట. ఆ పాటకు జీవం దైవం కేసిఆరే… ఆకలి కేకలు పాటలై తెలంగాణ ఉద్యమ కదన రంగంలో భూకంపం సృష్టించింది తెలంగాణ పాట. అలాంటి పాటను ప్రభావితం చేసిన తెలంగాణ యాస విప్లవానికి కేసిఆర్‌ నాంది పలికిండు. అందుకే కేసిఆర్‌ తెలంగాణ నవయుగ వైతాళికుడైండు.

                            నిన్నటి తరం నిజవాది, తెలంగాణ కార్యశీలి, నిర్మాణాత్మక ఆచరణ వాది, రేపటి తరం ఆశల ప్రగతి కేసిర్‌. అతి సందర్భం. అతి ప్రయోజనం. అతి అవసరం అన్నవి రాజకీయాల్లో ఎంతో అవసరం. లేకుంటే ప్రజలు అంత తొందరగా దేన్నీ నమ్మరు. సాధించిన తెలంగాణ కూడా అంతే…కాలం గడిస్తున్న కొద్దీ నమ్మకం పెరుగుతుంది. అలాగే తెలంగాణ ఉద్యమం కూడా పెరిగింది. జనం గుండెల్లో నిండిరది. సకల జనులు తెగించి కొట్లాడిరది. అతి ప్రయోనం కూడా అవసరమే. ఏదైనా మనకు కావాలనుకున్నప్పుడు దాన్ని సాధించుకోవాలి. అందుకు మాటలు చెబితే సరిపోదు. కలలు గంటే నీ దరి చేరదు. దానికోసం నిరంతరం ప్రయత్నించాలి. తెలంగాణ విషయంలో కేసిఆర్‌ చేసింది అదే…జనం ఆచరించేలా చేసింది కూడా ఉద్యమ స్వరూపమే…అతి అవసరం కూడా ఉద్యకారులకు కావాలి. ఈ మూడు గుర్తించిన నాయకుడు ఏదైనా సాధించగలడు. తెలంగాణ ఒక అవసరం అరవై ఏళ్లు గోసపడ్డందకు…అతి అవసరం. తెలంగాణ పల్లెలకు అసవరం. పొలాలకు అవసరం. అస్ధిత్వానికి అవరసం. అతి కూడ కొన్ని సందర్భాలలో అవసరమే అన్నది కూడా కేసిఆర్‌ చూపించారు. అందుకే తెలంగాణ సాధించగలిగాడు. మనకు తెలంగాణ స్వేచ్చను, సంతోషాన్ని, స్వీయ పాలనను కూడా అందిచాడు. బంగారు తెలంగాణ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అరవై ఏళ్ల పాలనలో పడిన అగాధాలన్నీ పూడ్చాడు. ఆ గోసలన్నీ తీర్చాడు. నీళ్లు తెప్పించాడు. చెరువులు నింపించాడు. ప్రాజెక్టులు కట్టించాడు. కాలువ ద్వారా నీటి పరవళ్లు చూపించాడు. తెలంగాణలో పడిపోయిన భూగర్భ జలాల మట్టాలను పెంచారు. నడి ఎండల్లో కూడా చెరువులు నింపుతూ నీళ్ల కొదువ లేకుండా చేశాడు. అటు రైతు రాజ్యం, ఇటు కుటుంబ సంక్షేమంతో అనేక రంగాల్లో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తున్నాడు. కరంటు కోతలు , ఉక్కపోతలు, పంటలు ఎండుడు చూసిన తెలంగాణలో కరంటు వెలుగులు చూస్తున్నాం. ఉక్కపోతులు లేకుండా చేసుకున్నాం. పంటలు ఎండుడన్న ముచ్చటే లేకుండా చేసుకున్నాం…. 

                           తెలంగాణ ప్రజలు ఎంత రాజకీయ చైతన్య వంతులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1971లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితికి పార గుర్తు కేటాయించినా పది మందిని లోక్‌సభకు పంపిన చరిత్ర తెలంగాణ ప్రజలది. తెలంగాణ ఉద్యమానిది. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన నెహ్రూ కన్నా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో భూమి కోసం, భుక్తి కోసం, బాసినసంకెళ్ల విముక్తి కోసం కొట్లాడిన రావి నారాయణ రెడ్డికి 1952 తొలి ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో పార్లమెంటు భవనం ప్రారంభం చేసిన రావినారాయణ రెడ్డి మూలంగా ఆ ఘనత కూడా తెలంగాణకే దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ అన్న పదంలోనే ఒక వైబ్రేషన్‌ వుంది. అది ముఖ్యమంత్రి కేసిఆర్‌ను చుట్టుకున్నది. అందుకే ఉద్యమ స్వరూపం ఎంచుకోవడానికి ముందే ఎన్నికల ప్రక్రియ ఎదురొచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన కొంత కాలానికే స్ధానిక సంస్ధల ఎన్నికల రూపంలో తొలి పరీక్ష ఎదురైంది. అనూహ్యమైన సీట్ల గెలుపుతో తెలంగాణ ఉద్యమ బలానికి ఓట్లు తోడయ్యాయి. 2001 జూలైలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తెరాస మొత్తం తెలంగాణలో 87 జడ్పీటీసిలు, 84 ఎంపిపిలు, 1000 ఎంపిటిసీలు గెల్చుకున్నది. కేసిఆర్‌కు అడుగకు బలమొచ్చింది. తెలంగాణ ఆశయానికి బలం చేకూరింది. తెలంగాణ తెవాలన్న కసిని మరింత కేసిఆర్‌లో పెంచింది. 

                          తెలంగాణ ప్రజల్లో గూడుకట్టుకొని వున్న తెలంగాణ భావజాలం మరోసారి నిరూపనైంది. తెలంగాణ వాదాన్ని అటు ఉద్యమ రూపంలో, ఇటు ఎన్నికల రూపంలోనూ ముందుకు తీసుకెళ్తే విజయం తప్పదు అని మరోసారి రుజువైంది. 1969లో పాలపొంగులా ఒక్కసారి ఉవ్వెత్తున ఎగసి తెలంగాణ ఉద్యమం హింసాత్మకమైంది. రాజకీయ నాయకుల స్వార్ధానికి తెలంగాణ బలైంది. చప్పున చల్లారింది. అందుకే ఆ తప్పు జరక్కుండా సుధీర్ఘ ఉద్యమ ప్రస్ధానాన్ని ఎంతో ఓపికతో కేసిఆర్‌ నడిపించారు. అందుకు సాక్ష్యంగా రaార్ఖండ్‌ ముక్తి మోర్చా లాగా రాష్ట్రం సిద్ధించేదాకా కొట్లాడతానని ఒక నమ్మకం నింపాడు. తెలంగాణ ప్రజల్లో భరోసా కల్పించేందుకు కరీంనగర్‌లో జరిగిన సింహగర్జనకు శిబూసోరేన్‌ ను పిలిపించారు. కేసిఆర్‌ తన కర్తవ్యం, పట్టుదలను తొలి సభలోనే చూపించాడు. కృష్ణా నదీ జాలాల విషయంలో రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ పేరుతో జరుగుతున్న దోడిపీని ఎండగట్టారు. ఆలంపూర్‌ నుంచి గద్వాల దాకా 128 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆకలి చావులకు చలించి, భూదాన్‌ పోచంపల్లి లో బిక్షాటన చేసి, ఒక్కో కుటుంబానికి ఆ రోజుల్లో రూ.50వేలు అందజేశారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో టిఆర్‌ఎస్‌ ప్రజలకు మరింత చేరువైంది. తెలంగాణ సాధన తన భుజాన వేసుకున్నాడు. ఆ విశ్వాసం ప్రజల్లో నింపేందుకు కేసిఆర్‌ పడరాని పాట్లు పడ్డారు. అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. జాతీయ స్ధాయిలో తెలంగాణ ఉద్యమాన్ని తొలి దశలోనే దేశమంతా చూసేలా చేశారు. 1969 ఉద్యమ కాలంలో తెలంగాణ ఇవ్వడం కన్నా కుదరని తేల్చి చెప్పిన అప్పటి హోం శాఖ సహాయ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌తోనే 2003లో తెలంగాణనుంచి డిల్లీకి సాగిన కారు ర్యాలీకి స్వాగతం పలికించాడు. ఇలా తెలంగాణ ఉద్యమాన్ని చిన్న చూపు చూసిన వారిలోనూ మార్పు తీసుకొచ్చి, తెలంగాణకు అనుకూలంగా మార్చారు. ముప్పై ఎనమిది పార్టీల మద్దతు కూడగట్టాడు.

                           కేంద్ర ప్రభుత్వం నుంచి బైటకు వచ్చిన మరుసటి రోజే కేసిఆర్‌ జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షను చేపట్టాడు. తమకు పదవులు కాదని నిరూపించాడు. తమకు రాష్ట్రం ముఖ్యమని ప్రజల్లో మరోసారి ఉద్యమ స్పూర్తిని రగిలించారు. తెలంగాణ ఉద్యమంలో పదవుల రాజీనామాలను తెలంగాణ బాపూజీ కొండా లక్ష్మన్‌ బాపూజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు కదలాడు. అడుగడుగునా తెలంగాణ ఉద్యమాన్ని రగిలించడానికి, ఉవ్వెత్తున తెలంగాణ ఎగసిపడేందుకు రాజీనామాల అస్త్రాలను కేసిఆర్‌ వాడుకున్నాడు. కొత్త తరం ఉద్యమ రాజకీయ పంథాతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారులు వేశాడు. తన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ప్రకటనకు కారణమయ్యాడు. చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదమయ్యాడు. తెలంగాణ చరిత్ర వున్నంత కాలం తన పేరును పదిలం చేసుకున్నాడు. కేసిఆర్‌ అనే మూడక్షరాలను తెలంగాణలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. తెలంగాణ జాతిపితయ్యారు.

కేటిఆర్‌ సిఎం…ప్లీనరీలో నిర్ణయం?

నాయకుల సాక్షిగా ప్రకటన వెలువడడం ఖాయం?

 యువతరం ప్రతినిధులకు పెద్ద పీట?

 సీనియర్ల వారసులకు వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత?

అంతా కొత్త తరం?

వందేళ్ల చరిత్రకు జరిగిన నిర్మాణంలో నూతన శకానికి శ్రీకారం?

మరో ముప్పై ఏళ్లు తిరుగులేని శక్తిగా కేటిఆర్‌ ప్రస్ధానం? 

ఉద్యమ కాలం నేతలంతా పార్టీ కోసం?

యువతరమంతా కొత్త తరానికి వారధులు కావడమే లక్ష్యం?

                              తెలంగాణ యువశక్తికి కొత్త ఉత్సాహం?

                             అతి త్వరలో కల్లకుంట్ల తారకరామావు అభిమానుల కల నెరవేరబోతోంది. కేటిఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే సమయం ఆసన్నమైంది. ఆ తరుణం వచ్చేస్తోంది. టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో గత కొంత కాలంగా కనిపిస్తున్న మార్పులే ఇందుకు సంకేతాలనిపిస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ప్రజాస్వామ్య బద్దంగా ముఖ్యమంత్రి కేటిఆర్‌ ఎంపికతో కొత్త ఒరవడికి శ్రీకారం జరగనుంది. తెలంగాణ ఉద్యమ కారుడిగా, పలు మార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సుధీర్ఘ కాలం అనుభవం వుంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటుగా కేటిఆర్‌ పాలనాపరమైన దక్షతలో, యువతకు దార్శనికతలో ఐకాన్‌గా నిలిచారు. తాజాగా ఆయన ప్లీనరీ ముందు మొదలు పెట్టిన జిల్లాల పర్యటనలతోపాటు, పెద్దఎత్తున మీడియా ఇంటర్వూలు కూడా ఇందులో భాగమే అని తెలుస్తోంది. తను రాష్ట్ర రాజకీయాలపై స్పష్టతనిసూ వస్తున్నారు. నర్మగర్భంగా తన దార్శనికతను చూపిస్తున్నారు. ప్రతిపక్షాలను కడిగిపారేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ను తలపించేలా ప్రతిపక్షాలను చెడుగు ఆడుకుంటున్నాడు. వరంగల్‌లో ఇటీవల జరిగిన సభలో కేటిఆర్‌ ప్రసంగాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా విన్నారు. టిఆర్‌ఎస్‌ నాయకులు ఫిదా అయ్యారు. కేటిఆర్‌లో నెల కొన్న జోష్‌కు టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉద్యమ కాలంలోలాగా కేరింతలు కొట్టారు. గతంలో ఎప్పుడూ కేటిఆర్‌ స్పీచ్‌లో ఇంత దమ్మున్న మాటలు లేవు. వైవిధ్యభరితమైన ప్రాసలు లేవు. కాని వరంగల్‌లో భూకంపం సృష్టించినంత పనిచేశారు. ఒక రకంగా ఇది త్వరలో సిఎం అవుతున్నట్లు ఆయన పరోక్ష సంకేతాలు పంపించినంత పనిచేశారు. ఇక ఆ సారి టిఆర్‌ఎస్‌కు చెందిన సీనియర్‌ నాయకుల వారసులు పెద్దఎత్తున బరిలో నిలువనున్నారు. అందువల్ల సీనియర్లంతా పార్టీ నిర్మాణంకోసం పనిచేయాల్సిన అసవరం వుంది. వారివారి వారసులను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వుంది. రేపటి తరం కోసం, నూతన రాజకీయాల ఆవిష్కరణ కోసం, మరో ముప్పైఏళ్ల ప్రస్ధానం కోసం కేటిఆర్‌ను త్వరలో సిఎంను చేయడం తధ్యం…? టిఆర్‌ఎస్‌ వందేళ్లు తెలంగాణ రాజకీయాలను ఏలాలంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయంకూడా ఎంతో కీలకం?

                       గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్‌లో ఒక్కసారిగా కేటిఆర్‌ విశ్వరూపం చూపించారు. ఇక ప్రతిపక్షాలకు ముందున్నది ముసళ్ల పండగ అన్నట్లుగానే ఆయన ప్రసంగం సాగించాడు. అంతే కాకుండా ఎక్కడా తగ్గేదే లేదన్నట్లు కేంద్ర స్ధాయి నుంచి క్ష్రేత్ర స్ధాయిదాకా బిజేపిలో ఏ ఒక్కరినీ వదలకుండా దుమ్ము దులిపాడు. తన మాటలతో వారిని మొక్కజొన్న కంకిని ఒలిచినట్లు ఒలిచేశాడు.. తడబడకుండా, తటబాటు లేకుండా కందిపొల్లును కొట్టినట్లు బిజేపిని పొల్లుపొల్లు తిట్టిండు. .తిట్టిన తిట్టుతిట్టకుండా, పొట్టు పొట్టు తిట్టి,తిట్టి తూర్పార పట్టిండు. అదీ కేటిఆర్‌ అని మరోసారి నిరూపించాడు. ఇక్కడ మొదలు పెట్టి ఎక్కడిదాకా తీసుకెళ్తానో చూడండి అని ప్రతిపక్షాలకు రుచి చూపించాడు. కర్ణాటకలో ఆ రాష్ట్ర బిజేపి పరిపాలనను ఉద్ధేశించి అనేక సాక్ష్యాలు చూపించాడు. ఉచిత విద్యుత్‌తో మొదలు, రాష్ట్రంలో అమౌలౌతున్న ఏ ఒక్క పథకాన్పి పోలిన ఒక్కటంటే ఒక్కటైనా సంక్షేమ పధకం అమలౌతుందా? అని బిజేపి శ్రేణులను నిలదీశారు. కడిగేశారు. గుక్క తిప్పుకోకుండా మాట్లాడిన కేటిఆర్‌, బిజేపి నేతలు గుక్కపెట్టి ఏడ్చేంత తిట్ల వర్షం కురిపించారు. ఉప్పెనలా బిజేపి మీద విరుచుకుపడ్డారు. అవినీతికి పాల్పడిన వారందరికీ కేఆరాఫ్‌ అడ్రస్‌ బిజేపి అంటూ నిప్పులు చెరిగారు. 

                     ఏ రకంగా చూసినా బిజేపికి రాష్ట్రంలో ఎలాంటి స్కోప్‌ లేదు. అంతో ఇంతో కొంత కాంగ్రెస్‌కు పరిస్ధితి ఎలా వుంటుందో అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేనిది. అందువల్ల బిజేపిని సమర్ధవంతంగా ఎదుర్కొవాలన్నా, కాంగ్రెస్‌ను ఎదగకుండా చేయాలన్న తెలంగాణలో యువతరం రాజకీయాలు ఈ సారి ఎంతో అవసరం. ఎందుకంటే రాష్ట్రం మీద జాతీయ పార్టీలు బిజేపి, కాంగ్రెస్‌లు రెండూ దృష్టిపెట్టాయి. గత ఎన్నికల సమయం వరకు బిజేపితో టిఆర్‌ఎస్‌ సఖ్యత, సాన్నిహిత్యం వున్నాయి. కాని ఇప్పుడు వాటి మధ్య స్నేహం చెడిరది…దూరం పెరిగింది. ఎలాగైనా తెలంగాణలో టిఆర్‌ఎస్‌ రాకుండా చేయలేకపోయినా, రాజకీయాలను అస్ధిరపర్చే అవకాశం కోసం బిజేపి ఎదురుచూస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలా బిజేపి అడుగులేస్తుందనేది స్పష్టమౌతోంది. పైగా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం, దానిపై దుమారం రేపడం వంటికి వినూత్నమైన పంధాలో బిజేపి తీసుకెళ్తుంది. దాంతోపాటు గవర్నర్‌ను ముందు పెట్టి బిజేపి రాజకీయం చేయాలని చూస్తుందన్నదానిపై కూడా టిఆర్‌ఎస్‌, బిజేపిల్లోనూ స్పష్టత వుంది. ఇలాంటి సందర్భాలలో టిఆర్‌ఎస్‌లో యువతరాన్ని ముందుకు తేవాలి. కేటిఆర్‌ను యువతరం నాయకుల ప్రతినిధిగా ముఖ్యమంత్రిని చేయాలి. వారికి భవిష్యత్తు భరోసా కేటిఆర్‌లో కనిపించాలి. అందుకు ఇక ఆలస్యం చేయకుండా కేటిఆర్‌ను సిఎం చేయాలన్న నిర్ణయానికి పార్టీ పెద్దలతోపాటు, ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. 

                   ఇక కాంగ్రెస్‌కూడా సందిట్లో సడేమియా? అంటూ వస్తోంది. కేంద్ర స్ధాయినుంచి రోజుకో రకమైన ప్రకటన వెలువుడుతోంది. జాతీయ స్ధాయిలో కూడా ఈసారి రాజకీయ సమీకరణాలు పెద్దఎత్తున మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను కట్టడి చేయాలంటే, ఇప్పుడున్న నాయకత్వాన్ని బలహీన పర్చాలంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ డిల్లీలో మకాం వేయాలి. అక్కడి రాజకీయాల్లో చక్రం తిప్పేస్ధాయిలో వుండాలి. జాతీయ రాజకీయాలకు అందుబాటులో వుండాలి. పైగా రాష్ట్ర పాలనపై ఎలాంటి ప్రభావం పడకూడదు. రాహుల్‌ గాంధీ తెలంగాణ మీద ఫోకస్‌ చేసింది తెలిసిన సంగతే…అసలు కలలో కూడా ఊహించలేని సంఘటనలు ఈ మధ్య రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు, కాంగ్రెస్‌పార్టీకి మధ్య ఒక అవగాహన జరిగిందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఏదైనా జరగొచ్చు…జగన్‌ ప్రభావం కూడా తెలంగాణలో కాంగ్రెస్‌కు ఉపయోగపడే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు కొంత ఇబ్బందికరమైన పరిస్ధితి రాక మానదు. అందువల్ల కేటిఆర్‌ ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికలను ఎదుర్కొవాలి. అప్పుడు జగన్‌ కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్ధితి వస్తుంది. ఏది ఏమైనా త్వరలో కేటిఆర్‌ సిఎం కావడం ఖాయం..అన్నది మాత్రం తెలుస్తోంది.

ప్లీనరీకి ముందే పువ్వాడ అవుట్?

ఏ క్షణమైనా ప్రకటన రావొచ్చు?

రాష్ట్ర ప్రభుత్వం మీద పెరుగుతున్న ఒత్తిడి!

ఇంత కాలం ఉపేక్షించినా ఇక వేటు తప్పదని పార్టీ సీనియర్ల చర్చ?

పిలిచి పీటేస్తే, పార్టీని పాతర పెట్టేదాకా తెచ్చాడని టిఆర్ఎస్ నేతల ఆగ్రహం?

టిఆర్ఎస్ నే గెలవకుండా చేసి పెత్తనమెత్తున్నాడని ఉద్యమకారుల మండిపాటు?

అటు బిజేపి, ఇటు కాంగ్రెస్ లకు మాట్లాడే అవకాశం ఇంకా ఇవ్వొద్దు?

పువ్వాడపై ధ్వజమెత్తుతున్న కమ్మ సంఘాలు?

పెద్ద ఎత్తున కరపత్రాలు, బహిరంగ లేఖల విడుదల?

కులం ఇంత కాలానికి గుర్తొచ్చిందా? అని ఎద్దేవా!

ఖమ్మంలో మారనున్న సమీకరణాలు?

పువ్వాడ వైరి వర్గాలలో నెలకొన్న జోష్?

పువ్వాడ పై సిఎం కేసిఆర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి?

 రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఏ క్షణమైనా పదవినుంచి భర్తరఫ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలైన ప్లీనరీ సమావేశాలకు ముందే ఈ తలనొప్పి తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి కేసిఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పువ్వాడ అజయ్ మీద ముఖ్యమంత్రి కేసిఆర్ సీరియస్ గా వున్నట్లు చెప్పుకుంటున్నారు. వామపక్ష రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పువ్వాడ లో ఆదర్శ భావాలుంటాయని సిఎం భావించారు. అందుకే ఎనలేని ప్రాధాన్యతను కూడా అజయ్ కు కల్పించారు. గత ఎన్నికలలో పువ్వాడ అజయ్ సొంత పార్టీ నేతల ఓటమికి పాల్పడినట్లు అనేక ఆరోపణలున్నాయి. సీనియర్లను లెక్క చేయడం లేదన్న విమర్శలు వున్నాయి. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్ వాటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చారు. పార్టీలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరు సహజం. కాని వేధింపు రాజకీయాలు అసహజమైనవి. సరైనవి కాదు నాయకులు తన రాజకీయ పలుకుబడి ముందు ఎవరూ నిలబడకూడదనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. పువ్వాడకు అటు ప్రతిపక్ష పార్టీలతో పడక, ఇటు సొంత పార్టీ నేతలతో పొసగదన్నది అనేక సందర్భాలు రుజువు చేశాయి. హింసాపూరిత రాజకీయాలు ఎప్పటికైనా నష్టదాయకమే…ఖమ్మం ఘటన పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయకముందే పువ్వాడ ను సాగనంపితే మేలని సిఎం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

 

తక్కువ సమయంలో ఎక్కువ ప్రాధాన్యత. పార్టీలో సీనియర్లను కాదని గుర్తింపు… జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు అవకాశం. ఎదురులేని నాయకుడయ్యేందుకు కూడా పార్టీ ప్రోత్సాహం. అయితే ఏమిటి? ఎంత ఎంత ప్రోత్సాహిస్తే ఏముంది? తనను నమ్మి పార్టీ అన్ని విధాల సహరిస్తే పార్టీ నిండా మునిగేదాక తెచ్చిండు. వ్యక్తిగా, నాయకుడుగా తనకు జరిగే నష్టం పక్కన‌ పెడితే పార్టీ పరువు తీసే పనులు చేయడం ఆహ్వనించదగ్గది ఏ మాత్రం కాదు. అసలు ఇంత కాలం పార్టీ ఉపేక్షంచడం కూడా పువ్వాడ రూపంలో తీవ్ర ఒడిదుడుకులు కోరికోరి తెచ్చున్నట్లైంది. 

 

పార్టీకి కీలక నేతలు దూరం చేశాడు. నాయకుడంటే ప్రజల్లో నాలుకలా వుండాలి. తోటి నాయకులకు భుజమైనడవాలి. కానీ పువ్వాడ తోటి నాయకుల కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నమే చేశాడని ప్రచారం. జిల్లాకే ఒకప్పుడు పెద్ద దిక్కుగా తుమ్మల నాగేశ్వరరావు వున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం మంత్రిగా పనిచేశారు. అవినీతి ఆరోపణలు లేని నాయకుడుగా గుర్తింపు పొందాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. గతంలో పాలేరు గెలిచి డబుల్ బెడ్ రూం ఇళ్లలో చరిత్ర సృష్టించారు. పాలేరు రిజర్వాయర్, విద్యుత్ ఉత్పత్తి వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. తుమ్మల పాలేరు రూపురేఖలు మార్చారు. అలాంటి తుమ్మల ఓటమిలో పువ్వాడదే కీలక పాత్ర అన్న ఆరోపణలున్నాయి. ఇక నామా నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలవకుండా చేశారన్న అపవాదు వుండనే వుంది. చివరకు ఎంపిగా నామా నాగేశ్వరరావు గెలుపుకోసం తుమ్మల నాగేశ్వరరావులు ఎంత కష్టపడాల్సివచ్చిందో అందరికీ తెలుసు. వైసిపి నుంచి గెలిచినా టిఆర్ఎస్ లోకి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని నెగలకుండా పువ్వాడ చేశారన్నది ప్రచారంలో వున్నదే…పైగా సొంత పార్టీ నాయకులను వేధించడం, పార్టీకి దూరమయ్యేలా చేయడం జరిగిందన్న చర్చ కొత్తది కాదు. ఇలా ఏ వర్గంతోనూ పువ్వాడ సఖ్యత నెరిపిన ధాఖలాలు లేవన్న ప్రచారమే ఎక్కువ. ఇక జిల్లా అభివృద్ధిలో కీలకమైన మైనింగ్ వ్యాపారాన్ని కుదేలు చేయడంలో పువ్వాడ చేసిన అన్యాయంపై గ్రానైట్ వ్యాపారులు గుర్రుగా వున్న సంగతి తెలిసిందే. మంత్రి పువ్వాడ మూలంగా గ్రానైట్ వ్యాపారులు కూడా అరిగోస పడుతున్నారట. జిల్లాలో సుమారు 500ల వరకు గ్రానైట్ కంపెనీలున్నాయి‌. సుమారు 2000 వరకు కట్టర్లున్నారు. పువ్వాడ అజయ్ మూలంగా వారికి పనులు లేకుండా పోయాయని అంటున్నారు. ఇటు సొంత పార్టీని, అటు జిల్లాకు ఆదాయాన్ని సమకూర్చే వ్యాపారాలను అడ్డుకొని అభివృద్ధి నిరోధకుడు పువ్వాడ మారాడని చెప్పుకుంటున్నారు. 

 

బీజేపీ యువనేత సామినేని సాయి గణేష్ ఆత్మహత్య ఘటన దురదృకరం. ఈ ఘటన రాజకీయంగా పెద్ద దుమారాన్ని సృష్టించింది. దేశ వ్యాప్తంగా సంచలనమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై ఆరా తీసినట్లు తెలిసిందే. బిజేపి నేతలు జిల్లా మొత్తం ఉద్యమాలు సాగిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. గవర్నర్ తమిళి సై కూడా ఖమ్మం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో సాగుతోంది. రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో మంత్రి తనపై కుట్ర చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై కమ్మ‌ సంక్షేమ సంఘం ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. డీసీసీబీ ఛైర్మన్ గా పనిచేసిన మువ్వా విజయ్ బాబు ను కేసుల్లో ఇరికించినట్లు లేఖలో పేర్కొన్నారు. పువ్వాడ కోసం పనిచేసిన మందడపు సుధాకర్ అతని తమ్ముడు మాధవరావు మరియు ఎల్లంపల్లి హన్మంతరావు పై సుఫారీ కిల్లర్స్ కేసు పెట్టి జైలుకు పంపినట్లు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులను ఏకతాటిపై నడిపిన ఏలూరి శ్రీనివాసరావు పై అక్రమ కేసులు పెట్టి,సస్పెన్సన్ చేయించిన‌ట్లు లేఖలో వెల్లడించారు. ఖమ్మంలో పార్టీకోసం వారి డివిజన్స్ లో నిత్యం ప్రజల మధ్య ఉండే మిక్కిలినేని నరేంద్ర పై అక్రమ కేసులు. మమత మెడికల్ కాలేజ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన పెద్దమనిషి ఎర్నేని రామారావు పై అక్రమ కేసులు. నల్లమల్ల వెంకటేశ్వర్ రావు రైతు సమన్వమ సమితి జిల్లా అధ్యక్షుడుగా ఉంటే ఎంత అవమానకరంగా పార్టీ కార్యాలయం వైపు రావోద్దు అన్న సందర్భాలను కూడా ఉటంకించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ముళ్ల కిషోర్ పెట్టిన అక్రమ కేసులు. తెలుగుదేశం నేత నల్లమల్ల రంజిత్ పై అక్రమ కేసులు. చివరికి సీనియర్ సిటిజన్ నెల్లూరి చంద్రయ్య ను వదలిపెట్టకుండా కేసులు పెట్టించాని ఆ లేఖలో పువ్వాడను ఎద్దేవా చేశారు. మమత హోటల్ కు కూవేధింపులు తప్పలేదు అంటూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారినే టార్గెట్ చేసి, ఇప్పుడు కులాన్ని రాజకీయం వాడుకోవడాన్ని స్వాగతించమని ఆ సంఘం పేర్కొంది. పైగా ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ పరిశోధనాత్మక జర్నలిస్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక సార్లు చెస్ విజేతగా నిలిచిన, పలు సార్లు మిస్టర్ ఏపిగా అవార్డులు అందుకున్న అనంచిన్ని వెంకటేశ్వర రావు పై అక్రమ కేసులు నమోదైతే అప్పుడు ఎందుకు నోరు మెదపలేదని కమ్మ‌ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పైగా టివి9 రవిప్రకాశ్ కు కులపరంగా ఏనాడైనా మద్దతు పలికిన సందర్భం ఒక్కటైనా వుందా? వారు ప్రశ్నించారు.

 

ప్లీనరీకి ముందే పువ్వాడ అవుట్?

ఏ క్షణమైనా ప్రకటన రావొచ్చు?

రాష్ట్ర ప్రభుత్వం మీద పెరుగుతున్న ఒత్తిడి!

ఇంత కాలం ఉపేక్షించినా ఇక వేటు తప్పదని పార్టీ సీనియర్ల చర్చ?

పిలిచి పీటేస్తే, పార్టీని పాతర పెట్టేదాకా తెచ్చాడని టిఆర్ఎస్ నేతల ఆగ్రహం?

టిఆర్ఎస్ నే గెలవకుండా చేసి పెత్తనమెత్తున్నాడని ఉద్యమకారుల మండిపాటు?

అటు బిజేపి, ఇటు కాంగ్రెస్ లకు మాట్లాడే అవకాశం ఇంకా ఇవ్వొద్దు?

పువ్వాడపై ధ్వజమెత్తుతున్న కమ్మ సంఘాలు?

పెద్ద ఎత్తున కరపత్రాలు, బహిరంగ లేఖల విడుదల?

కులం ఇంత కాలానికి గుర్తొచ్చిందా? అని ఎద్దేవా!

ఖమ్మంలో మారనున్న సమీకరణాలు?

పువ్వాడ వైరి వర్గాలలో నెలకొన్న ఆసక్తి?

పువ్వాడ పై సిఎం కేసిఆర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి?

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఏ క్షణమైనా పదవినుంచి భర్తరఫ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలైన ప్లీనరీ సమావేశాలకు ముందే ఈ తలనొప్పి తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి కేసిఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పువ్వాడ అజయ్ మీద ముఖ్యమంత్రి కేసిఆర్ సీరియస్ గా వున్నట్లు చెప్పుకుంటున్నారు. వామపక్ష రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పువ్వాడ లో ఆదర్శ భావాలుంటాయని సిఎం భావించారు. అందుకే ఎనలేని ప్రాధాన్యతను కూడా అజయ్ కు కల్పించారు. గత ఎన్నికలలో పువ్వాడ అజయ్ సొంత పార్టీ నేతల ఓటమికి పాల్పడినట్లు అనేక ఆరోపణలున్నాయి. సీనియర్లను లెక్క చేయడం లేదన్న విమర్శలు వున్నాయి. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్ వాటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చారు. పార్టీలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరు సహజం. కాని వేధింపు రాజకీయాలు అసహజమైనవి. సరైనవి కాదు నాయకులు తన రాజకీయ పలుకుబడి ముందు ఎవరూ నిలబడకూడదనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. పువ్వాడకు అటు ప్రతిపక్ష పార్టీలతో పడక, ఇటు సొంత పార్టీ నేతలతో పొసగదన్నది అనేక సందర్భాలు రుజువు చేశాయి. హింసాపూరిత రాజకీయాలు ఎప్పటికైనా నష్టదాయకమే…ఖమ్మం ఘటన పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయకముందే పువ్వాడ ను సాగనంపితే మేలని సిఎం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

మీ నేటిధాత్రి లో ఈరోజు ఎక్స్ క్లూజివ్ గా…

మారెవరకు ..వదలం..!

 అక్షర సైన్యం కలం కవాతు ఆపం.

పిర్యాధులు చేయడం మీకే కాదు..మాకు తెలుసు?

కేసులపై వార్తలే కాదు…కేసులు కూడా నమోదు చేస్తాం?

అవినీతి అధికారుల బాగోతం డిల్లీ దాకా తీసుకెళ్తాం..

మీడియా మీద కేసులపై ప్రెస్‌కౌన్సిల్‌కు పిర్యాధు చేస్తాం…

రాష్ట్ర పతి దృష్టికి తీసుకెళ్తాం…

సుప్రిం కోర్టుకు విన్నవిస్తాం…

                                            ఉద్యోగుల హక్కులు రాసేది మీడియా…

                                             ఉద్యోగుల కష్టసుఖాలు రాసేది మీడియా…

                                            ఉద్యోగుల ఉద్యమాలు రాసేది మీడియా….

                                             ఆఖరుకు మీకు జీతాలందకపోతే రాసేది మీడియా…

                                       అలాంటి మీడియాపై నిందలు మోపితే ఎలా వుంటుందో చూపిస్తాం…

                                    ప్రతి కార్యాలయంలో ఇక్కడ అవినీతికి తావులేదు…అనే బోర్డులు పెట్టేదాకా విశ్రమించం!

                                 మా కార్యాలయాల్లో అవినీతికి తావులేదు…ప్రజలు ఏ పని కోసమొచ్చినా ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్న బోర్డులు ప్రతి కార్యాలయంలో ఏర్పాటు చేసేదాకా నేటిధాత్రి అవినీతిపై పోరాటం ఆగదు. మేం మారామని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు చెప్పుకునే వరకు వారిని వదలం…ఇది మీడియా శపధం…? సమాజం కోసం…సమాజంలో అవినీతి రూపుమాపడం కోసం నేటిధాత్రితోపాటు మీడియా అంతా కదులతున్న క్షణం. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆస్ధులు అన్యాక్రాంతమౌతున్నాయి? వాటికి కాపాడాల్సిన కొందరు ఉద్యోగులే వాటిని పప్పు బెల్లాలు చేస్తున్నారని నేటిధాత్రి చెప్పడం తప్పా? అటు ప్రభుత్వ సొమ్ము, ఇటు నేరుగా ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకుంటున్న అవినీతి అధికారులను వెలుగులోకి తేవడం నేరమా? మన రాష్ట్రంలో కూడా కొన్ని లక్షల మంది నిజాయితీ ఉద్యోగులు, అధికారులున్నారు. వారిలో కొద్ది మంది అవినీతి అధికారుల మూలంగా మొత్తం వ్యవస్ధనే భ్రష్టుపట్టిపోతోంది. దయచేసి నిజాయితీ అధికారులారా? అవినీతి చేసే ఉద్యోగులకు మద్దతివ్వకండి. వారికి సానుభూతి చూపకండి? మీ లాంటి మంచి వారిని కూడా గాడిన కట్టేలాగా వ్యవహరిస్తున్న వారిని దూరం పెట్టండి? అప్పుడు గాని సమాజంలో మార్పు రాదు…నేటిధాత్రి అవినీతిపై పోరు మొదలు పెట్టింది. అక్షర యుద్ధం చేస్తోంది. నిజాయితీ యజ్ఞం మొదలుపెట్టింది. మీరూ సహకరించండి. సమాజంలో సంతోషం వెల్లివిరిసే ప్రయత్నంచేద్దాం…అవినీతి రహిత తెలంగాణ సమాజ నిర్మాణం చేపడదాం…దేశమంతా తెలంగాణ ఉద్యోగ సమాజాన్ని చూసి గర్వించేలా చేద్దాం…ఇదే నేటిధాత్రి మంగళకార్యం…!

                              అవినీతిని అంతం చేస్తాం…ఎన్నికల ముందు చెప్పిందే…చెప్పి…డెబ్బై ఏళ్లుగా చెబుతూనే వున్నారు. తెలంగాణ వచ్చాక కూడా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ మొదటి సారి వరంగల్‌ వచ్చిన సందర్భంలో ఏ అధికారికి రూపాయి లంచం ఇవ్వొద్దు. ఎవరైనా అడిగితే గల్లా పట్టుకొమ్మన్నారు. నా ఫోన్‌ నెంబర్‌ ఇస్తాను…వారి సంగతి చెబుతానన్నారు. కాని రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ప్రశ్నించిన రైతునే ఓ డిప్యూటీ తహిసిత్ధార్‌ తన కార్యాయలంలో రైతును కింద పడేసి తొక్కాడు. తన్నాడు..పైగా రైతు తన విధులకు అడ్డొచ్చాడని కేసు నమోదు చేశారు..! ప్రశ్నించమనేది మీరే…కేసులు నమోదు చేస్తుంటే చూస్తుండేది పాలకులే అయితే సామాన్యుడికి రక్షణేది…అందుకే మీడియా వున్నది. ప్రజల పక్షాన ఎప్పుడైనా నిలబడేది మీడియానే…! సమాజంలో జరిగే అసమానతలు వెలుగులోకి తెచ్చేది మీడియానే… ఉద్యోగుల్లో అవినీతి కార్యకలాపాలు బట్టబయలు చేసేది మీడియానే…అలాంటి మీడియాను కూడా అధికారులు బుల్డోజ్‌ చేస్తామనే స్ధాయికి ఎదిగితే ఇక ప్రజలకు దిక్కెవరు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోరు..నాయకులు ప్రజలకు న్యాయం చేయరు. ఇలాంటి సమయంలో అధికారులు తమ ఇష్టారాజ్యం చేసుకుంటారు..అందిన కాడికి దోచుకుతింటారు…పేదలను కూడా వేధించుకుతింటారు..! ఇవన్నీ మన కళ్లముందు కనిపిస్తున్న నిజాలే..సాక్ష్యాలే ఇంకే కావాలి? కాని ప్రభుత్వానికి తీరిక లేదు. అధికారులకు అడ్డూ అదుపు లేదు….కొందరు అధికారులు అడ్డదిడ్డంగా సంపాదించుకుంటున్నారు. అదేమిటని ప్రశ్నించినందుకు మీడియా మీద కేసులు నమోదు చేస్తామన్నంత భరితెగింపుకు దిగజారుతున్నారు. ఇక మీడియా ఉపేక్షిస్తుందనుకుంటే పొరపాటు…

                                  నరనరాన సామాజిక సేవను, బాధ్యతను, సృహను నింపుకున్న ఏకైక సమాజం మీడియా…ఇది తెలిసి కూడా మీడియా మీద పడిపోతాం..బుల్డోజ్‌ చేస్తాం…నిందలేస్తాం…అంటే నిప్పుకణికల్లాంటి మీడియాను ముట్టుకుంటే కాలేది ఉద్యోగులకే…! తెలంగాణ ఉద్యమం కాలంతోపాటు, ఇప్పటికీ ఎలాంటి లాభాపేక్ష లేని ఏకైక సమాజం మీడియా…జర్నలిస్టులు…తెలంగాణ ఉద్యమానికి అక్షర భీజాలు వేసింది జర్నలిస్టులు..అడుగుగడుగునా వినిపించిన తెలంగాణ గళాన్ని అక్షరబద్దం చేసింది జర్నలిస్టులు…మారు మూల ప్రాంతాలకు కూడా ఆ పదం వేదమయ్యేలా ప్రచురించి అక్షర యజ్ఞం చేసింది జర్నలిస్టులు..ఒక్క మాటలో చెప్పాలంటే జర్నలిస్టులే నిజమైన ఉద్యమకారులు. తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు…అని చెప్పక తప్పదు. ఉద్యమ కాలంలో ఉద్యోగాలను కూడా తృణ ప్రాయంగా వదులుకున్నది జర్నలిస్టులు…కాని కొలువులు వదులుకున్న ఒక్క ఉద్యోగిని చూపించండి. మీ జీతాల గురించి రాయాలన్నా జర్నలిస్టులే కావాలి. మీ హక్కుల సాధనను కవర్‌ చేయాలన్నా కావాల్సింది జర్నలిస్టులే…నెల నాడు జీతాలు రాకపోతే పస్తులుంటున్న ఉద్యోగులు అని అక్షరాలు రాయాల్సింది జర్నలిస్టులే…మీ హక్కులను గుర్తు చేసేది జర్నలిస్టులే…మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చేది జర్నలిస్టులే..!ఆఖరకు మీకు కొలువు విషయంలో వ్యక్తిగతమైన సమస్యలపై మొర పెట్టుకోవాలన్నా కావాల్సింది జర్నలిస్టులే…మీడియా లేకుండా ఒక్క క్షణం గడవదు…అలాంటి మీడియా మీరు తప్పులు చేయకండి…అవినీతికి పాల్పడకండి అని చెబితే నచ్చదా? మీరు ఒత్తిళ్లు ఎదుర్కొన్నప్పుడు మీడియా కావాలి…కాని మీ తప్పులను ఎత్తి చూపకూడదా? ఇదెక్కడి న్యాయం? అయినా మీడియాకు తన, మన అన్న తేడా వుండదు? తప్పు చేసేవారిని ఎత్తి చూపడం..మంచి చేసే వారిని ప్రపంచానికి పరిచయం చేయడమే మీడియాకు తెలుసు…తెగువ తప్ప ఏ తెగులు అంటనిదే మీడియా….

                    ఓ వైపు చేయాల్సినంత తప్పుడు పనులు చేసుకుంటూనే మా అంత మంచి వాళ్లు లేరని అవినీతి ఉద్యోగులు ప్రచారం చేసుకుంటే…సరిపోతుందా? అబద్దం నిజమౌతుందా? చేసిన తప్పులు మాసిపోతాయా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరింత అంకితభావంతో పనిచేయాల్సిన బాధ్యతను కొంత మంది అవినీతి అధికారులు విస్మరించారు. పేట్రేగిపోతున్నారు. తెలంగాణ వచ్చాక బాగుపడిన సమాజం ఏదైనా వుందంటే అది ఉద్యోగులే…జీతాలు పెరిగాయి…ప్రమోషన్లు వచ్చాయి. ఇంకే కావాలి. ఇంకా ఇంకా కావాలనుకుంటే ప్రభుత్వంతో కొట్లాడి జీతాల పెంచుకోండి. జనం రక్తం తాగాలన్నంత కక్కుర్తి ఎందుకు? శవాల మీద పేలాలు ఏరుకోవడం ఎందుకు? పేదల కడుపు కొట్టకండి? పేదల రక్తం తాగకండి?..ప్రతి పనికి ఓ రేటు అంటూ వేధించడం మానుకోండి…ఇదే కథా! నేటిధాత్రి చెబుతోంది…అది మాత్రం మా వల్ల కాదనుకునే కొందరు ఉద్యోగుల మూలంగానే మొత్తం వ్యవస్ధకు చీడ తగులుతోంది. అధికారి అంటే ఒక రకమైన భావన సమాజంలో ఎందుకు ఏర్పడిరది. అది ఉద్యోగ వ్యవస్ధకే మచ్చ కాదా? అందుకే ఆ మచ్చ తుడిపేయాలంటే మీడియాకు సహకరించండి! అయినా మేం మారం అంటే…మీకున్న మార్గాలు మీకుంటే…మాకున్న మార్గలు మాకున్నాయి? ప్రెస్‌ కౌన్సిల్‌లో పిర్యాధు చేస్తాం…రాష్ట్రపతిని కలిసి వివరిస్తాం…సుప్రింకోర్టును ఆశ్రయిస్తాం…అవినీతి అధికారుల భరతం పడతాం…! ఇది సూచన ప్రాయంగానే చెబుతున్నాం…హెచ్చరికగా మారేదాకా చూడకండి!! మార్పు కోసం ప్రయత్నించండి…మార్పు అన్నది ఒక్కరితోనే మొదలౌతుంది! ఒక్క కార్యాలయంలో మా కార్యాలయం దేవాలయం అని రాసిపెట్టండి!! చాలు అవినీతి అగిపోతుంది..! ఒక ప్రయత్నం చేయండి!! వ్యవస్ధలో మార్పు ఎందుకు రాదో చూద్దాం…అవినీతి ఎందుకు అంతం కాదో పంతం పడదాం..దాని అంతు చూద్దాం!!!

అంత ఆమ్ధాని అధికారులకెక్కడిది..?


అంతంత సంపాదన అధికారులకెక్కడిది?
ఇన్నిన్ని ఆస్ధులులెలా పోగేసుకుంటిరి?


కోట్లకెలా పడగలెత్తుతుంటురి?
ఎన్నికలంటే నాయకులే భయపడుతుంటే, మేం సై అని ఎలా అనగల్గుతుంటిరి?
మీ జీతాలెంత? పొదపు చేసుకున్నా లాభమెంత?
ఎకరాలకెకరాల భూములెలా కొనుగోలు చేస్తున్నారు?
ఫామ్‌హౌజ్‌లు ఎక్కడినుంచి తెస్తున్నారు?
ఖరీధైన ప్రాంతాల్లో స్థలాలెలా వస్తున్నాయి?
కోట్లుకు కోట్లు ఖరీదు చేసే విల్లాలు ఎలా కొంటున్నారు?
అవినితిని ప్రశ్నిస్తే కేసులు పెట్టే పరిస్ధితి వస్తే…ప్రజలకు దిక్కెవరు?
మీడియాను కూడా అధికారులు బెదిరిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?
ఒక్కసారి కలాలన్నీ కదిలితే తెలుస్తుంది?
అక్షరం విలువేమిటో…మీడియా అంటే ఏమిటో కూడా తెలియాల్సిన సమయం ఆన్నమైంది!
కోట్లకు పడగలెత్తుతున్నారు? మార్కెట్‌లోకి వచ్చే లగ్జరీ కార్లు కొంటున్నారు. ఏడాదికోటి మారుస్తున్నారు. ఖరీధైన ఏరియాల్లో స్థలాలు కొంటున్నారు. ఫామ్‌ హౌజ్‌ల పేరుతో ఎకరాలకెకరాలు భూములు కొనుగోలు చేస్తున్నారు. విలాసవంతమైన విల్లాలు సొంతం చేసుకుంటున్నారు.

రాత్రికిరాత్రి అందనంత నాలుగు తరాలు తిన్నా తరగనంత సంపాదనా పరులౌతున్నారు. ఇంతకీ ఏమైనా జాక్‌ పాట్‌లు కొడుతున్నారా? అంటే కాదు…లాటరీలేమైనా తగలుతున్నాయా? అదీ లేదు. కాని విచ్చల విడి సంపాదన మాత్రం వారి వచ్చి వాలుతోంది. కరెన్సీ సామ్రాజ్యం వారి సొంతమౌతోంది. విదేశాల టూర్లు, రేవ్‌ పార్టీలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు… నాలుగు తరాలకు సరిపడా సంపాదించుకొవచ్చు అనుకునేవారట. ఇది మూడు దశాబ్దాలక్రితం మాట. ఇప్పుడు ప్రభుత్వ అధికారి సంపాదనలో మనమెంత? అన్న మాటలు ఎమ్మెల్యేలే మాట్లాడుతుంటే వింటున్న మాట. తాజాగా ఇటీవల ఓ పబ్‌లో జరిగిన సంఘటన విషయంలో ఓ మాజీ ఎంపి. మీడియాతో మాట్లాడుతూ మేమెంత? మాకు అంత లేదు? మా పిల్లలకు అంత స్వేచ్ఛ లేదు. మాకు అంత సంపాదన లేదు? అక్కడ పట్టుబడ్డ వారంతా పెద్ద పెద్ద అధికారుల పిల్లలేనట? అన్నాడు. ఇలా ఎక్కడ ఏ సంఘటన జరిగినా అక్కడ ఉన్నత స్ధాయి అధికారుల పిల్లలే అన్న వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ఏ రేవ్‌ పార్టీలో యువకులు దొరికినా వాళ్లలో ఉన్నతాధిరుల పిల్లలే వుంటున్నారు. సరిగ్గా ఓ ఏడాది క్రితం సంస్ధాన్‌ నారాయణ పురంలోని ఓ రిసార్టులో దొరికిన యువకులంతా బడా బడా ఉద్యోగుల పిల్లలే అన్నారు. అంటే అలాంటి జల్సాలు చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. పిల్లలు అలా విచ్చలవిడిగా ఖర్చు చేసేంత ఇస్తున్నారంటే, ఎంత వెనకేసుకుంటున్నట్లు అన్నదానిపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. పైగా అవినీతిని ప్రశ్నించే మీడియా మీద దాడులు, మీడియా మీద కేసులా? ఎక్కడికి తీసుకుపోతున్నారు సమాజాన్ని? అన్న ప్రశ్నపై చర్చ జరగాలి. కనీసం గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వంలో ఒక చర్చ జరిగితే…నిజమేమిటో…అబద్దమేమిటో తెలిపోతుంది.
గతంలో ఏకంగా ఓసారి అసెంబ్లీలో ఒక రోజు రచ్చ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనికి ఆహార పధకం అమౌతున్న సమయం. దేశవ్యాప్తంగా కరువు ఛాయలు అలుముకున్న రోజులు. దాంతో కేంద్ర ప్రభుత్వం పనికి ఆహార పధకం అమలు చేసేది. పేదలతో మట్టి రోడ్లు, ఇతర పనులుచేయించే వారు. సాయంత్రం వారికి బియ్యం ఇచ్చి పంపించేవారు. అయితే ఇందులో నాయకులు కాంట్రాక్టర్లుగా వ్యవహరించేవారు. బియ్యం పంపిణీకి కోసం ఎంబిలు తయారు చేయడం కోసం పై స్ధాయి నుంచి కింది స్ధాయి దాకా అందులో వాటలు వెళ్లేవి. పది మంది పని చేస్తే వంద మంది పని చేసినట్లు లెక్కలురాసుకోవడం అధికారుల కమీషన్లు తీసుకోవడం పెద్ద దుమారం రేగింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ నాయకులు చేసే పనులకు అధికారులు ఎంబిలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న సమయంలో అసలు ప్రభుత్వం వుందా? అధికారులు ఇంతగా చెలరేగిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందన్న చర్చ అసెంబ్లీని కుదిపేసింది. సైకిల్‌ మీద వచ్చే తెలుగుదేశం నాయకులు పనికి ఆహార పథకం పుణ్యమా? అని స్కూటర్లు, కార్లు కొనుక్కుంటున్నారని, వాళ్లకు సహకరిస్తున్న అధికారులు పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారని చర్చ జరిగింది. అధికారులకు కళ్లెం వేయకపోతే అది సమాజానికి తలవంపులు తెస్తుందని కూడా శాసనసభ్యులు ఆందోళన చేశారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ కుక్క తోకను ఆడిస్తుందా? లేక తోక కుక్కను ఆడిస్తుందా? అంటూ చంద్రబాబుకు చురకలు పెట్టారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువైందని టిఆర్‌ఎస్‌ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అడ్డగోలు సంపాదనకు అడ్డూ అదుపు లేకుండాపోతోందని సాక్ష్యాత్తు టిఆర్‌ఎస్‌ నాయకులే మధనపడుతున్నారు. అధికార పార్టీ నాయకులైనా సరే అధికారులు తమ ఇష్టారాజ్యం చేస్తున్నారన్న మాటలే వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే కాంగ్రెస్‌కు చెందిన అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి చెందని ఓ ఐఏఎస్‌. అధికారి గుర్‌గావ్‌లో వందల కోట్లతో మల్లీ ప్లెక్స్‌ నిర్మాణం చేస్తున్నాడన్నారు. ఇక ఆ మధ్య ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంట్లో జరిగిన శుభకార్యానికి ఫలక్‌ నుమా ప్యాలెస్‌లో భోజనాలు ఏర్పాటు అన్నది సంచనలంగా మారిందన్న సంగతి తెలిసిందే…
ఆ మధ్య కీసరలో వంద ఎకరాల భూమి పాస్‌ పుస్తకాల కోసం జరిగిన డీల్‌ ఎన్ని కోట్లో ప్రజలకు తెలుసు. ఆ తహసిల్ధార్‌ జైలులో ఉరి వేసుకొని చనిపోయిన ఘటన తెలుసు. నారాయణ ఖేడ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి చేసిన లీలలు అప్పట్లో విన్నవే. ఉప్పల్‌లో వారి ఇళ్లలో చేసిన సోదాలు జనం చూసినవే…ఇలా కొందరు మండల, జిల్లా, రాష్ట్ర స్ధాయిల అధికారులు సాగిస్తున్న అవినీతి బాగోతాలు వెలుగులోకి వచ్చినా, పట్టుబడినా, అవినీతి కార్యకలాపాలు ఎక్కడా ఆగడం లేదు. సాక్ష్యాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇదే విషయం చెప్పారు. ఓ ఎమ్మెల్సీ కూడా తనకు జరిగిన అనుభవం గురించి చట్టసభలోనే వివరించారు.
అపరిచితుడు సినిమా చూస్తాం….ఠాగూర్‌ సినిమా చూస్తాం…ఆఖరుకు బొబ్బిలి పులి సినిమా టివిల్లో వస్తే చూస్తుంటాం. ఆ క్షణం నిట్టూరుస్తుంటాం. సమాజం ఎటు పోతుందని మధనపడుతుంటాం. కొద్ది సేపటికే అన్నీ మర్చిపోతుంటాం. కాని మనం ప్రశ్నించం? ప్రశ్నించడం హక్కు అన్న సంగతి మనం మర్చిపోతుంటాం? అధికారులు మనతో మాట్లాడడమే గొప్ప అనుకుంటాం? వాళ్లు పనులు చేసి పెడితే చాలనుకుంటాం? వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెట్టుబడలు పెట్టేవారి దగ్గర నుంచి, చిన్నా, చితక వ్యాపారాలు చేసుకునే వారి వరకు ముందు పైసలు చేతిలో పెట్టి పని చేయించుకుంటున్నారు. పైస ఇవ్వందే పని చేయమని అధికారులు కూడా మొహం మీదే చెప్పేస్తున్నారు. ఇది ఎవరు ఎవరకి అలవాటు చేశారో గాని, అవినీతి మాత్రం బలంగా పాతుకుపోయేలా చేశారు. ఎవరైనా అధికారులు మీ పని కావాలంటే ఇంతివ్వాలని అడిగితే? ఎందుకివ్వాలని మాత్రం ప్రశ్నించం? ఎదిరించం? పని ఎందుకు చేయవని నిలదీయం? ఎంత కాలం పనిచేయవో చూస్తామని అల్టి మేటమ్‌ జారీ చేయం? అంతే కాదు ఎవరైనా అధికారులతో వాగ్వాదం చేసుకుంటుంటే ఇదేం అన్యాయం అని అడగం? సినిమా చూస్తున్నట్లు చూస్తాం…? చోద్యం జరుగుతున్నట్లు నవ్వుకుంటాం? అక్కడి నుంచి జారుకుంటాం? మనకే ఇబ్బంది ఎదురైనప్పుడు మాత్రం ఎవరూ సహకరించడం లేదని లోకాన్ని నిందిస్తాం!! అవినీతి అధికారులకే ముందు సలాం కొడతాం…అడిగినంత చేతుల్లో పెట్టి, ఆయన పని చేసి పెట్టడమే మహాద్భాగ్యమనుకుంటాం. ప్రశ్నించేవారు ఎవరైన ఎదురైతే వాణ్ణి చూసి నవ్వుకుంటాం…వాడి చాదస్తం కాకపోతే ఏమిటి? ఎంతో కొంత చేతిలో పెట్టి పనిచేయించుకుంటే పోలా? అని నిట్టూరుస్తుంటాం? ఇదే అధికారులకు వరం. ఎంత చిన్న పనైనా పది నిమిషాలు నిలబడి పని చేయించుకోవాలంటే మనకు బద్దకం. పది రూపాయలు పడేసి రెండు నిమిషాల్లో పని పూర్తిచేసుకోవాలన్నది మన ఆత్రం, ఆరాటం. అందుకే మనం కూడా మారుదాం…అవినీతిని ప్రశ్నిద్దాం…నిలదీస్తున్న మీడియాకు అండగా వుండేందుకు ప్రజా సంఘాలు కూడా ముందుకు రావాలి. మీడియా మీద అవినీతి అధికారులు కేసులు నమోదు చేసేంతు దుర్మార్గం పెరిగిపోతుందటే ప్రశ్నించే సమాజం రావాలి. ప్రజల్లో మరింత చైతన్యం నెలకొనాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version