వితరణశీలి వద్దిరాజు

దానగుణంలో రంతిదేవుడు….

గుడి కట్టాలన్నా వద్దిరాజు ను గుర్తుచేసుకుంటారు…

బడి కావాలన్నా వద్దిరాజు వద్దకు పోతారు…

స్నేహంలో ఆయనకు సాటి ఎవరూ రారు…

హితులకు ఆయన ఆయన మేలు మాటలకందనిది….

రెండు జిల్లాలో ఆయన రాజకీయబలం….

బిసిలకు మరో బలమైన నాయకత్వం…

సత్యం, సుహృద్భావం, సమ్మతం, నిర్మలం, దరహాసం మనిషికి ఆభరణాలు. వ్యక్తి జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని నింపడమే కాదు, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేవి. అవి నిండుగా, మెండుగా వుండేవారు జీవితంలో ఎదురులేని, తిరుగులేని శక్తియుక్తులు సాధించి, ఉతన్న స్ధాయికి చేరుకుంటారని పెద్దలు

చెబుతుంటారు. పట్టుదల, పరిశ్రమ, కార్యదీక్ష, ఎంచుకున్న లక్ష్యం స్ధిరమైంది,నిత్యమైందైతే గమ్యం చేరడం సులువంటారు. అలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి మార్గం ఎంచుకొని విజయాలలో ఉన్నత శిఖరాలు అందుకొని, తెలుగు రాష్ట్రాలలో అందరికీ తెలిసి, గుర్తుపట్టగలిగే నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. ఆయన ఒక గొప్ప వ్యాపార వేత్త. కాని అందరికీ ఒక తెలంగాణ ఉద్యమ కారుడిగానే చాలా వరకు పరిచయం. వితరణశీలిగా మరింత మందికి తెలిసిన దయామయ గుణం. సంపాదనా పరులు ఎంతో మంది వుండొచ్చు. కాని వితరణశీలురు బహు అరుదు. అడిగిన వారికి లేదనడు. ఇంటికొచ్చిన వారికి కాదనడు. దేవాలయాల నిర్మాణం అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించడు. బడుల నిర్మాణం అంటే సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటాడు. పేదలకు అండగా వుంటాడు. వారిని ఆదుకుంటాడు. తాను సంపాదించిన దానిలో పేదల కోసమే ఎక్కువ ఖర్చు చేస్తుంటాడు. పది మందిలో అందరూ సమాన గౌరవంతో బతకాలని కోరుకునే సామాజిక వేత్త ఆయనలో దాగివున్నారు. అందుకు ఏదైనా గొప్ప కార్యక్రమం చేయాలన్నా, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టాలన్నా తెలుగు రాష్ట్రాలలో ముందు గుర్తొచ్చేవారిలో వద్దిరాజు ఒకరు. అదే ఆయనకున్న గొప్ప గుణం. అందుకే ఆయన అందరికీ సుపచితం. 

వద్దిరాజు రవిచంద్ర…అనే పేరు తెలియని తెలంగాణ వాది లేదు. నాయకుడు లేడు. పార్టీ లేదు. వ్యాపార సామ్రాజ్యంలో రారాజు…వ్యక్తిగత జీవితంలో మహారాజు. వితరణలో కర్ణుడంతటి పేరు సంపాదించుకున్నాడు. పుట్టిన ఊరు,తాగే నీరు, పీల్చే గాలి కూడా జీవితాలపై ప్రభావం చూపుతుందని చెప్పడానికి మన కళ్ల మందు చాలా మంది కనిపిస్తుంటారు. అలాంటి గొప్ప ఆలోచనలు, మనస్తత్వం కలబోసిన వ్యక్తే వద్దిరాజు. ఎందుకంటే కుటుంబ నేఫధ్యం ఎంత గొప్పదో, ఆయన పుట్టిన ఊరు కూడా అంత ప్రత్యేకమైంది. కాకతీయలు మొదట పాలించిన నేల. అరి గజకేసరి అనే బిరుదుతో ప్రసిద్ధిగాంచిన కాకతీయ మొదటి ప్రోలరాజు నిర్మాణం చేసిన గ్రామం కేసముద్రం. గణపతి దేవుడు సోదరి మైలాంబ, తన తల్లి బయ్యాంబ పేరు మీద నిర్మాణం చేసిన బయ్యారం దరిదాపు ప్రాంతం. ఇవన్నీ వున్న మహాబూబాద్‌ జిల్లా అంటే ఒకప్పుడు కవులకు కాణాచి. సాహితీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. తొలి తెలుగు పత్రిక తెనుగు ఆవిష్కరణ జరిగిన ఇనుగుర్తి గ్రామం రవిచంద్ర స్వస్ధలం. ఆ జిల్లా తొలి తరం స్వతంత్ర కాకతీయ రాజరిక పాలనకు నెలవు. అలాంటి ప్రాంతంలో పుట్టి పెరిగిన వారిలో దేశాన్ని ఏలిన మాజీ ప్రధాని పివి కూడా వున్నారు. ఆ ప్రాంతంలో వ్యాపార సామాజ్య్రంలో నెంబర్‌ వన్‌గా పేరు గాంచిన వద్దిరాజు రవిచంద్ర వున్నారు.  

వద్దిరాజు రవిచంద్రది వ్యవసాయ కుటంబం. వ్యాపారాలు ఆదినుంచి నెరుపుతున్న కుటుంబం. కిరాణ వ్యాపారం నుంచి 1972లో రైస్‌ మిల్లు వ్యాపారం, ఆ తర్వాత అంచెలంచెలుగా గ్రానైట్‌ వ్యాపారం ఇలా ఒక్కొ మెట్టు ఎదుగుతూ వచ్చారు. తిరుగులేనిశక్తిగా ఎదిగారు. బ్లాక్‌ గ్రానైట్‌ వ్యాపారంలో నెంబర్‌ వన్‌ స్ధానంలో కొనసాగుతున్నారు. పెద్దగా పైకి ఆయన ప్రజల్లో కనిపించినట్లు అనిపించకపోయినా ప్రజలంటే ఆయనకు ఎంతో ఇష్టం. పేదలకు సాయం చేయడమంటే కూడా ఎంతో సంతోషం. వారి కళ్లలో ఆనందం చూడాలని కోరుకుంటారు. అందుకే ఆయన సన్నిహితులు, హితులు,మిత్రులు, బంధువులు, ఆఖరుకు తన వద్ద విధుల్లో వుండే చిన్నా, పెద్ద ఉద్యోగులను కూడా ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటారని అంటుంటారు. అందుకే ఆయనంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. పార్టీలకు అతీతంగా ఆయనను అభిమానిస్తుంటారు. అదే తెరాసకు దగ్గర చేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముఖ్య అనుచర గణంలో ఒకడిని చేసింది. ఆయనకు దగ్గర చేసింది. ఆత్మీయుడిగా మార్చింది. ఎంతో మంది సీనియర్లు వున్నప్పటికీ వద్దిరాజు రవిచంద్ర గొప్పదనం, వ్యక్తిత్వం మూలంగానే ఆయనకు రాజ్యసభ సీటు వరించింది. నిజానికి వద్దిరాజు తెరాసలో చేరి కొంత కాలమే అవుతుంది. కాని ఆయన ఏనాడు పదవుల కోసం ఆలోచించలేదు. ఆశించలేదు. పార్టీకోసం చేయాల్సినంత సేవ చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నారు. 

నాయకులకు అండగా వుంటున్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అటు ఖమ్మం, ఇటు వరంగల్‌ రెండు జిల్లాల్లో ఆయన నాయకులను, కార్యకర్తలను ఆదరించడం అన్నది ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కదిలించింది. మెప్పించింది. పార్టీపై వద్దిరాజుకు వున్న అభిమానం గురించి తెలిసేలా చేసింది. అందుకే వద్దిరాజను రాజ్యసభ వరించింది. ఇదిలా వుంటే పార్టీ పరంగా ఆయనకు జాతీయ స్ధాయిలో వున్న పరిచయాలు, సంబంధాలు కూడా ఇప్పుడున్న పరిస్ధితుల్లో తెరాసకు ఎంతో అవసరం కూడా. ముఖ్యమంత్రి కేసిఆర్‌ జాతీయ స్ధాయి రాజకీయాల్లో క్రియాశీలం కానున్నారు. వద్దిరాజు రవిచంద్రకు ఆది నుంచి జాతీయ స్ధాయి నాయకులతో పెద్దఎత్తున పరిచయాలున్నాయి. వద్దిరాజు వ్యాపారాలు దేశంలో అనేక రాష్ట్రాలలో వున్నాయి. దాంతో ఆయనకు విసృతమైన పరిచయాలు కూడా వున్నాయి. కాకపోతే ఆయన ఎక్కడా వాటిని ప్రచారం చేసుకున్న సందర్భం లేదు. లోప్రొఫైల్‌ మెంటైన్‌ చేయడమే ఆయనకు ఆది నుంచి అలవాటు. కాని ఆయన గురించి తెలిసిన వారికి మాత్రమే వద్దిరాజు జీవన ప్రయాణం తెలుసు.

గత ఎన్నికల్లో ఆయన వరంగల్‌ తూర్పు నుంచి పోటీ చేశారు. ఎన్నికలకు కేవలం పదిహేను రోజుల ముందు టిక్కెట్టు తెచ్చుకున్నా, నియోజకవర్గంలో రెండో స్ధానంలో నిలిచారు. అంటే ఆయనకు ప్రజల్లో వున్న అభిమానం ఎంతటిదో ఈ ఒక్క లెక్క చాలు. అటు నాయకుడిగా ప్రజలకు చేరువగా, దాతగా వితరణశీలిగా సామాన్య జనం గుండెల్లో వుంటూ, వ్యాపారవేత్తగా దేశ వ్యాప్తంగా పరిచయాలున్నాయి. దాంతో గత ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ సూచనల మేరకు టిఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటినుంచి ఆయన పార్టీకి తన సేవ చేస్తూ వస్తున్నారు. కాని ఏనాడు తనకు పదవులు కావాలని కోరలేదు. అర్హత వున్న నాయకుడికి పదవులు వచ్చి ఒళ్లో వాలుతాయి. అదే నిజమైంది. వద్దిరాజు లాంటి బలమైన బిసి నేతకు పదవి రావడం అంటే బిసి సామాజిక వర్గానికి ఒక ధైర్యమనే చెప్పాలి. ఆయన ఇప్పటికే కాపు రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడుగా వున్నారు. రాష్ట్ర గ్రానైట్‌ అసోసియేషన్‌కు ప్రెసిడెంటుగా కొనసాగుతున్నారు. పైగా కరీంనగర్‌కు చెందిన మంత్రి గంగులకమలాకర్‌ సోదరుడికి వద్దిరాజు వియ్యంకుడు. ఆయన వ్యాపారవేత్తగా ఆయనేంటో ఖమ్మం ప్రజలకు తెలుసు. సినిమాల్లో చెప్పినట్లు ఇంట్లో జరిగే పెళ్లి పది తరాలు చెప్పుకునేలా వుండాలన్నది ఎవరైనా కలే కల. కాని ఆ కల అందరికీ తీరదు. కాని వద్దిరాజు తన కుమారుడి పెళ్లి అంగరంగవైభవంగా చేయడం ఖమ్మం ఇంకో పదేళ్లు చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. సంతోషాన్ని కూడా అందరితో పంచుకునే సహృదయుడు. అలాంటి నేతకు రాజ్యసభ సభ్యుడు కావడం ఆయన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతో సంతోషిస్తున్నారు. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, రాజకీయంగా ఆయన మరిన్ని పదవులు అదిష్టించాలని నేటిధాత్రి కోరుకుంటోంది….

KCR trains his guns on BJP-led Centre, he steps up his battle for the nation

Telangana Rastra Samithi (TRS) supremo and Chief Minister of Telangana State K Chandrashekhar Rao, popularly known as KCR, who achieved a separate State for Telangana after a prolonged peaceful, but

strategic fight, is now training his guns on the Bharatiya Janata Party led by Union government for its indifferent attitude towards States, and anti-people policies. 

 KCR, who has been expressing his displeasure over the Modi’s government for anti-federal approach while dealing with the issues related to taxes and sanctioning of funds to the States, has once again sent strong signals to the BJP government at the Centre that he would not budge to the pressure of the BJP. He sent this message through his recent meetings with former Chief Minister of Uttar Pradesh Akhilesh Yadav, and AAP founder President and Delhi Chief Minister Arvind Kejriwal during his visit to Delhi.  Chandrashekhar Rao, who is known for his oratory skills in Telugu, Hindi and English, is making all out efforts to prove the BJP-led Central government accountable for the poor economic growth of the country. He is trying to blame the BJP government for the crisis of agriculture, and loss of livelihood of the labourers in the country.  During his visit to the Northern States, KCR has explained the conspiracy of the BJP to impose a huge burden on the farming community with its attempts to fix meters for the agriculture pump sets at farmlands. He termed the Centre a wicked and cruel government that is insensitive towards the farmers and the poor of the nation.

 

He already made it clear on the floor of the Assembly that he would not yield to the dictates of the Centre for fixing meters for the motors of the farmers. “I cannot remain a mute spectator while the Centre is doing injustice to the farming community,” he said, and this was reiterated by him in Delhi. He issued an ultimatum to the Centre. Addressing the farmers of Punjab, KCR minced no words on the issue. Thus, he has almost begun his war with Centre. He is all set to meet different leaders of the States in the country with the nationwide tour. 

 

With his lengthy discussions on the anti-people policies being adopted by the Centre, he is pitching for a nationwide debate on the Centre’s attitude towards the people of the nation, and its attempts to trample on the rights of the States. KCR is leaving no stone unturned to bring up the issue of the suffering of the common man with soaring prices of essential commodities, petrol, diesel and LPG and  drawing out the difference between the circumstances during the previous governments and the situations prevalent at present.

 

“Debts have risen, but not the GDP.  GST has been brought in. Taxes have gone up. There is not a single new irrigation project built in these eight years with the money that has entailed in the increase of revenue. There has not been a single nationwide multipurpose project.  Neither new universities nor hospitals like AIIMS,” KCR said.

 

“There has been a widespread discussion on the achievement of GST. Needless to say, what about the promises that the prices would be under control with a uniform tax system in the country. What about rising prices? What are the traces of millions of industries that were shut down due to the GST.

 

 

What about the loss of jobs to the millions with the closure of industries? What benefit was there with the ban of currency?

Who got the benefit of bringing in 2,000 notes? Have the poor been benefited? Has there ever been a time in the past when farmers in our country were on a warpath for months at a stretch? Why did this happen? Why did the Prime Minister finally have to apologize to the farming community? Why are the cases against those who question? There is a need to bring more awareness among the people of the country on many such issues. These are the questions being raised by the TRS Chief.

 

It seems that KCR has almost entered national politics with his nationwide tour. He is trying to project Telangana as a model for the development in the country by comparing the Telangana region while it was with the united Andhra Pradesh, and the development made after the formation of the separate State.

 

He is questioning as to why such projects are not coming up in other States. About 60 TMCs of water from various rivers of the country is going waste into the seas. “At least one-tenth of it is not consumed by the country. In the past, the Centre lent a helping hand in the construction of the projects. But with the advent of the BJP government, there has been no new shift in agriculture in the country. Not a single project has been built in the field of irrigation. Our country is basically an agricultural country. It is the largest producer of cotton and jute in the world. Along with them food crops are grown in large quantities. It is the number one vegetable grower in the world besides a leader in the dairy industry. All these are just successes to the State governments. Before the formation of Telangana State, paddy was cultivated in 23 lakh acres in the State, but presently it has risen to 56 lakh acres. Earlier, groundnut, green gram and other pulse varieties were not given importance because then Telangana became a desert with scarcity of water,” according to CM KCR.

 

Telangana succumbed to the onslaught of the leaders of the combined State. Drought was widely prevalent. In the early days of formation of the Telangana State, with the restoration of ponds under the name of Mission Kakatiya, water could be traced again in the villages. Godavari water is made to reach every village and the lakes and ponds were filled to the brim.  Emptied wells are now full and the dried bores are continuously working. Meanwhile, drought across Telangana has disappeared due to flooding of reservoirs constructed due to lift irrigation projects like Kaleshwaram Lift Irrigation Scheme (KLIS).

 

Telangana farmers are now getting water, and 24/7 electricity supply free of cost.  Telangana is the only State in the country which has made the dream of the farmers come true. All these should be spread across the country. The whole country should be green. The industrial sector should also compete with that of the other countries in the world. China, which was once inferior to us, is competing with America. We are the only country with the largest youth population and extensive human resources with whom the country can work wonders.

 

Chief Minister Chandrashekhar Rao is leaving no stone unturned to explain to the people of the nation that the BJP is not doing anything towards the development of the country

ఆట మొదలైంది!

బిజేపితో కేసిఆర్‌ రణమే!

అటు బిజేపిని ఎండగడుతూ…..

ఇటు తెలంగాణ సంక్షేమాలను ప్రజల దృష్టికి తెస్తూ…..

అతి తక్కువ కాలంలో తెలంగాణ విజయాలు వివరిస్తూ….

సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన పురోభివృద్ధి….

తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే విద్యుత్‌ వెలుగుల దీప్తి….

పారిశ్రామిక,ఐటి రంగంలో పురోగతి…

వ్యవసాయం రంగంలో పెరిగిన దిగుబడులు…

తెలంగాణలో రైతులకు అందుతున్న రైతు బంధు….

ఆసరా పించన్లు….

తెలంగాణ వ్యాప్తంగా అమలౌతున్న సంక్షేమాలన్నీ గుర్తుచేస్తూ….

బిజేపి పాలిత రాష్ట్రాలలో మాటల పాలనలో లోపాలు ఏకరుపు పెడుతూ….

కొత్తగా….సరికొత్తగా దేశ రాజకీయాల్లో మార్పుల దిశగా…కేసిఆర్‌ అడుగులు….

ఆట మొదలైంది…తెలంగాణ గడ్డ సాక్షిగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిండు అసెంబ్లీలో ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటినే డిల్లీ నడిబొడ్డున నిలబడి చెప్పాడు. సమర శంఖం పూరించాడు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది తప్పని ప్రపంచానికి చాటాడు. బిజేపి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. డిల్లీలో కూర్చొని పల్లెల్లో రైతుల ఉసురు బిజేపి నేతలు ఎలా తీస్తున్నారో వివరించారు. రైతులనుంచి కరంటు బిల్లులు వసూలుకు పన్నుతున్న కుట్రను బైటపెట్టారు. కరంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్రాల మీద తెస్తున్న ఒత్తిడిని దేశ ప్రజలకు తెలిపారు. కేంద్రాన్ని తూర్పార పట్టిండు. కేంద్ర ప్రభుత్వం అసలు రంగు బైట పెట్టిండు. అంతే కాదు తాను తమ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా మోటర్లు ఏర్పాటు చేసే ప్రసక్తి లేదని కేంద్రానికి తేల్చిచెప్పినట్లు డిల్లీలో కూడా బదులిచ్చారు. ప్రాణం పోయినా సరే రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గతంలో తెలంగాణలో అనేక సభల్లో, అసెంబ్లీలో ఎంత గట్టిగా చెప్పిండో, ఇప్పుడు కూడా ఆ మాటను ముఖ్యమంత్రి కేసిఆర్‌ మరోమారు స్పష్టం చేశారు. కేంద్రానికి అల్టిమేటమ్‌ జారీ చేశారు. పంజాబ్‌ రైతుల సమావేశంలోనే ఈ విషయాన్ని సూటిగా కేంద్రానికి చెప్పిండు. అంటే ఇక కేంద్రంతో రణమే..అన్న విషయాన్ని కేసిఆర్‌ స్పష్టం చేసినట్లే లెక్క. అందర్నీ కూడగట్టే ప్రయత్నం మొదలు పెట్టిండు. దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిండు. 

                        ముందు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నాయకులను కలుస్తున్నారు. వారితో మాటా మంతితో వారితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. పైగా రాష్ట్రాల హక్కులను కేంద్రం ఎలా కాలరాస్తుందన్న విషయాలపై కూడా పెద్దఎత్తున దేశ వ్యాప్తంగా చర్చ సాగాల్సిన తరుణం ఆసన్నమైందన్న సంగతని గుర్తు చేస్తున్నారు. కుతకుతలాడుతున్న ప్రజల అసంతృప్తిని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ధరల మోతతో సామాన్యుడు పడుతున్న వేధనపై మాట్లాడుతున్నాడు. బిజేపి అధికారంలోకి వచ్చిన నాడున్న పరిస్ధితులకు నేటికి తేడాలను పూస గుచ్చినట్లు వివరిస్తున్నాడు. దేశానికి అప్పు పెరిగింది. కాని జీడిపి పెరగలేదు. జిఎస్టీ తెచ్చారు. పన్నులు పెరిగాయి. దాంతో వసూళ్లు పెరిగాయే గాని ఆ సొమ్ముతో కొత్తగా ఈ ఎనమిదేళ్లలో కట్టిన ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేదు. దేశంలో కొత్తగా అఖిలభారత స్దాయిలో జరగాల్సిన నిర్మాణాలు జరగలేదు. కొత్త యూనివర్సిటీల నిర్మాణం లేదు. ఎయిమ్స్‌ లాంటి ఆసుపత్రలు వచ్చింది లేదు. జిఎస్టీవల్ల సాధించిందేమిటి? అన్న చర్చ ఇప్పటికే వుంది. దేశమంతా ఒకే రకమైన పన్ను విధానంతో ధరలు అదుపులోకి వస్తాయని చెప్పిన మాటలేమయ్యాయి? పెరుగుతున్న ధరల సంగతేమిటి? జిఎస్టీ మూలంగా మూత బడిన లక్షలాది పరిశ్రమల జాడేది.  

                       పరిశ్రమల మూతతో కోట్లాది మంది కోల్పోయిన కొలువుల గతేమిటి? నోట్ల రద్దు వల్ల ఒరిగిందేమిటి? పెద్ద నోట్ల రద్దు పేరు చెప్పి, తెచ్చిన 2వేల నోట్ల వల్ల ఎవరికి లాభం జరిగింది. పేద వాళ్లకేమైనా ఒనగూరిందా? మన దేశంలో కొన్ని నెలల పాటు ఏకథాటిగా రైతులు ఆందోళన చేసిన సందర్భం గతంలో ఎప్పుడైనా వుందా? ఈసారే ఎందుకు జరిగింది? సాక్ష్యాత్తు ప్రధాని చివరికి రైతులకు ఎందుకు క్షమాపణ చెప్పాలి వచ్చింది? కనీరెందుకు పెట్టుకోవాల్సివచ్చింది? ప్రశ్నిస్తే కేసులేమిటి? దేశ ద్రోహులన్న ముద్రలేమిటి? ఇలాంటి అనేక విషయాలపై దేశ ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం వుంది. దాని కోసం కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌ కార్యరంగంలోకి దిగారు… అందుకే ఇక దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. మొదటి పర్యటన విజయవంతంగా సాగిస్తున్నారు. ఇదిలా వుంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ముఖ చిత్రం. ఇప్పుడు తెలంగాణ ప్రగతి చిత్రం…. దేశానికంతటికీ తెలియాల్సిన అవసరం వుంది. తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పథకాలు ఏమిటి? వాటి వల్ల తెలంగాణలో వచ్చిన మార్పులేమిటి? సాగునీటి రంగంలో కేవలం ఏడేళ్ల తక్కువ సమయంలో సాధించిన విజాయలేమిటి? అన్న విషయాలన్నీంటినీ వివరిస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ప్రగతిని చూపిస్తున్నారు. 

                మరి మిగతా రాష్ట్రాల్లో అలాంటి ప్రాజెక్టులు ఎందుకు రావడం లేదన్నదానిని ప్రశ్నిస్తున్నారు? దేశంలో నదుల నుంచి వృధాగా సముద్రాలలో కలుస్తున్న నీరు సుమారు 60వేట టిఎంసిలు. అందులో కనీసం పదో వంతు కూడా దేశం వినియోగించుకోవడం లేదు. అంతో ఇంతో గతంలో ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించేది. కాని బిజేపి ప్రభుత్వం వచ్చాక దేశంలో సాగు రంగానికి కొత్తగా ఒరిగిందేమీ లేదు? సాగునీటి పారుదల రంగంలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు. మనదేశమే వ్యవసాయం దేశం. ప్రపపంచంలో అత్యధికంగా పత్తి, జనుము పండిచే దేశం. వాటితోపాటు ఆహార పంటలు పెద్దఎత్తున పండుతాయి. కూరగాయల సాగులో ప్రపంచంలోనే మొదటి స్ధానంలో వుంది. పాడి పరిశ్రమలోనూ ముందుంది. ఇవన్నీ కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మూలంగా దేశానికి వస్తున్న విజయాలు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 23లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఇప్పుడు 56 లక్షల ఎకరాల్లో వరిసాగవుతోంది. గతంలో మితగా ఆరుతడి పంటలుకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయింది. కారణం నాడు నీరు లేక తెలంగాణ ఎడారిలా బీడు వారి పోయింది. 

                       సమైక్య పాలకుల దాష్టికానికి తెలంగాణ బలైంది. నీటి జాడులు లేక కరువు విలయతాండవం చేసింది. తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలోనే మిషన్‌ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్దరణతో గ్రామాల్లో మళ్లీ నీటి జాడలు పెంపొందాయి. గోదావరి నీళ్లను ప్రతి గ్రామానికి చేరే విధంగా చేసి, చెరువులు నింపడంతో ప్రతి కుంట నిండిరది. ప్రతి బావి ఎల్లబోసింది. ఎండిన బోర్లు నిరంతరం పనిచేస్తున్నాయి. ఇదిలా వుంటే కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పధకం మూలంగా నిర్మాణమైన రిజర్వాయర్లు నిండడంతో తెలంగాణ వ్యాప్తంగా కరువు మాయమైపోయింది. తెలంగాణ వచ్చిన మూడు నెలల్లో ఇరవై నాలుగు గంటల కరంటు అందించడం జరిగింది. పల్లెలు, పట్టణాలు, రైతులు, పరిశ్రమలు అనే తేడా లేకుండా అన్ని రంగాలకు ఇరవైనాలుగు గంటల విద్యుత్‌ సరఫరా ఒక్క తెలంగాణలోనే జరుగుతోంది. అంతే కాదు వ్యవసాయానికి ఇరవైనాలుగు గంటల ఉచిత విద్యుత్‌ ఒక్క తెలంగాణలోనే అమలౌతోంది. ఇవన్నీ దేశంతా విస్తరించాలి. దేశమంతా పచ్చబడాలి. పాడి పంటలతో కళకళలాడాలి. పారిశ్రామిక రంగం ప్రపంచానికి దీటుగా పరుగులందుకోవాలి. ఒకనాడు మన కన్నా తక్కువ స్ధాయిలో వున్న చైనా , అమెరికాతో పోటీపడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక యువతరం వున్న వున్న దేశం మనది. విసృతమైన మానవ వనులున్నాయి. వారితో దేశంలో అద్భుతాలు సృష్టించొచ్చు. కాని బిజేపి అవేవీ చేయడం లేదన్నదే ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 

                   సహజంగా ప్రాంతీయ పార్టీలకు వున్నంత అంకిత భావం జాతీయ పార్టీలకు వుండదు. కాని దాన్ని వ్యతిరేకంగా జాతీయ పార్టీలు పనిగట్టుకొని ప్రచారం చేసి, ప్రాంతీయ పార్టీలపై విషం చిమ్ముతున్నారు. దేశాన్ని బాగు చేయాలన్న చిత్తశుద్ది అన్ని పార్టీలలోనూ వుండాలి. ఎంత సేపు మత రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని గాలికి వదిలేస్తే, పాలన గాడిలో పడదు. ప్రజలకు భారాలు తప్పవు. అందుకే దేశంలో నూతన రాజకీయ ఆవిష్కరణలు జరగాలి. అందుకు మరోసారి దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలి. కలిసి కట్టుగా బిజేపిని ఎదుర్కొవాలి. ఇప్పటికే దేశం అన్ని రంగాల్లో కునారిల్లుతోంది. బలమైన కేంద్రం పేరుతో రాష్ట్రాలను మరింత బలహీనం చేస్తోంది. రాష్ట్రాలను కేంద్రం చెప్పుచేతుల్లో పెట్టుకొని ఆధిపత్యం చేయాలనుకోవడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని కేసిఆర్‌ ప్రజల్లో చైతన్యం నింపేందుకు బయలు దేరారు. తొలి దశగా ఉత్తర ప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఐక్యతలో తొలి అడుగు వేశారు. తర్వాత డిల్లీ ఆప్‌ జాతీయ అధ్యక్షుడు కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. దేశ కాల మాన పరిస్ధితులపై చర్చలు జరిపారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనే ప్రతిపక్షాల ఐక్యత చూపిస్తేగాని, బిజేపిలో మార్పు రాదన్న సంకేతాలు పంపాలన్న ఆలోచనలో ముందగులు వేస్తున్నారు. దేశమంతా కేసిఆర్‌ వైపు ఆసక్తిగా చూసేలా రాజకీయాలకు అంకురార్పణ చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యతా బలం విలువేంటో చూపించాలనుకుంటున్నాడు. దేశానికి కొత్త తరం రాజకీయాలు పరిచయం చేయాలనుకుంటున్నాడు.

ఆట మొదలైంది!

బిజేపితో కేసిఆర్‌ రణమే!

రాజకీయ సమరమే!!

అటు బిజేపిని ఎండగడుతూ…..

ఇటు తెలంగాణ సంక్షేమాలను ప్రజల దృష్టికి తెస్తూ…..

అతి తక్కువ కాలంలో తెలంగాణ విజయాలు వివరిస్తూ….

సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన పురోభివృద్ధి….

తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే విద్యుత్‌ వెలుగుల దీప్తి….

పారిశ్రామిక,ఐటి రంగంలో పురోగతి…

వ్యవసాయం రంగంలో పెరిగిన దిగుబడులు…

తెలంగాణలో రైతులకు అందుతున్న రైతు బంధు….

ఆసరా పించన్లు….

తెలంగాణ వ్యాప్తంగా అమలౌతున్న సంక్షేమాలన్నీ గుర్తుచేస్తూ….

బిజేపి పాలిత రాష్ట్రాలలో మాటల పాలనలో లోపాలు ఏకరుపు పెడుతూ….

కొత్తగా….సరికొత్తగా దేశ రాజకీయాల్లో మార్పుల దిశగా…కేసిఆర్‌ అడుగులు….

ఆట మొదలైంది…తెలంగాణ గడ్డ సాక్షిగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిండు అసెంబ్లీలో ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటినే డిల్లీ నడిబొడ్డున నిలబడి చెప్పాడు. సమర శంఖం పూరించాడు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది తప్పని ప్రపంచానికి చాటాడు. బిజేపి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. డిల్లీలో కూర్చొని పల్లెల్లో రైతుల ఉసురు బిజేపి నేతలు ఎలా తీస్తున్నారో వివరించారు. రైతులనుంచి కరంటు బిల్లులు వసూలుకు పన్నుతున్న కుట్రను బైటపెట్టారు. కరంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్రాల మీద తెస్తున్న ఒత్తిడిని దేశ ప్రజలకు తెలిపారు. కేంద్రాన్ని తూర్పార పట్టిండు. కేంద్ర ప్రభుత్వం అసలు రంగు బైట పెట్టిండు. అంతే కాదు తాను తమ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా మోటర్లు ఏర్పాటు చేసే ప్రసక్తి లేదని కేంద్రానికి తేల్చిచెప్పినట్లు డిల్లీలో కూడా బదులిచ్చారు. ప్రాణం పోయినా సరే రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గతంలో తెలంగాణలో అనేక సభల్లో, అసెంబ్లీలో ఎంత గట్టిగా చెప్పిండో, ఇప్పుడు కూడా ఆ మాటను ముఖ్యమంత్రి కేసిఆర్‌ మరోమారు స్పష్టం చేశారు. కేంద్రానికి అల్టిమేటమ్‌ జారీ చేశారు. పంజాబ్‌ రైతుల సమావేశంలోనే ఈ విషయాన్ని సూటిగా కేంద్రానికి చెప్పిండు. అంటే ఇక కేంద్రంతో రణమే..అన్న విషయాన్ని కేసిఆర్‌ స్పష్టం చేసినట్లే లెక్క. అందర్నీ కూడగట్టే ప్రయత్నం మొదలు పెట్టిండు. దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిండు. 

                        ముందు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నాయకులను కలుస్తున్నారు. వారితో మాటా మంతితో వారితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. పైగా రాష్ట్రాల హక్కులను కేంద్రం ఎలా కాలరాస్తుందన్న విషయాలపై కూడా పెద్దఎత్తున దేశ వ్యాప్తంగా చర్చ సాగాల్సిన తరుణం ఆసన్నమైందన్న సంగతని గుర్తు చేస్తున్నారు. కుతకుతలాడుతున్న ప్రజల అసంతృప్తిని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ధరల మోతతో సామాన్యుడు పడుతున్న వేధనపై మాట్లాడుతున్నాడు. బిజేపి అధికారంలోకి వచ్చిన నాడున్న పరిస్ధితులకు నేటికి తేడాలను పూస గుచ్చినట్లు వివరిస్తున్నాడు. దేశానికి అప్పు పెరిగింది. కాని జీడిపి పెరగలేదు. జిఎస్టీ తెచ్చారు. పన్నులు పెరిగాయి. దాంతో వసూళ్లు పెరిగాయే గాని ఆ సొమ్ముతో కొత్తగా ఈ ఎనమిదేళ్లలో కట్టిన ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేదు. దేశంలో కొత్తగా అఖిలభారత స్దాయిలో జరగాల్సిన నిర్మాణాలు జరగలేదు. కొత్త యూనివర్సిటీల నిర్మాణం లేదు. ఎయిమ్స్‌ లాంటి ఆసుపత్రలు వచ్చింది లేదు. జిఎస్టీవల్ల సాధించిందేమిటి? అన్న చర్చ ఇప్పటికే వుంది. దేశమంతా ఒకే రకమైన పన్ను విధానంతో ధరలు అదుపులోకి వస్తాయని చెప్పిన మాటలేమయ్యాయి? పెరుగుతున్న ధరల సంగతేమిటి? జిఎస్టీ మూలంగా మూత బడిన లక్షలాది పరిశ్రమల జాడేది.  

                       పరిశ్రమల మూతతో కోట్లాది మంది కోల్పోయిన కొలువుల గతేమిటి? నోట్ల రద్దు వల్ల ఒరిగిందేమిటి? పెద్ద నోట్ల రద్దు పేరు చెప్పి, తెచ్చిన 2వేల నోట్ల వల్ల ఎవరికి లాభం జరిగింది. పేద వాళ్లకేమైనా ఒనగూరిందా? మన దేశంలో కొన్ని నెలల పాటు ఏకథాటిగా రైతులు ఆందోళన చేసిన సందర్భం గతంలో ఎప్పుడైనా వుందా? ఈసారే ఎందుకు జరిగింది? సాక్ష్యాత్తు ప్రధాని చివరికి రైతులకు ఎందుకు క్షమాపణ చెప్పాలి వచ్చింది? కనీరెందుకు పెట్టుకోవాల్సివచ్చింది? ప్రశ్నిస్తే కేసులేమిటి? దేశ ద్రోహులన్న ముద్రలేమిటి? ఇలాంటి అనేక విషయాలపై దేశ ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం వుంది. దాని కోసం కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌ కార్యరంగంలోకి దిగారు… అందుకే ఇక దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. మొదటి పర్యటన విజయవంతంగా సాగిస్తున్నారు. ఇదిలా వుంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ముఖ చిత్రం. ఇప్పుడు తెలంగాణ ప్రగతి చిత్రం…. దేశానికంతటికీ తెలియాల్సిన అవసరం వుంది. తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పథకాలు ఏమిటి? వాటి వల్ల తెలంగాణలో వచ్చిన మార్పులేమిటి? సాగునీటి రంగంలో కేవలం ఏడేళ్ల తక్కువ సమయంలో సాధించిన విజాయలేమిటి? అన్న విషయాలన్నీంటినీ వివరిస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ప్రగతిని చూపిస్తున్నారు. 

                మరి మిగతా రాష్ట్రాల్లో అలాంటి ప్రాజెక్టులు ఎందుకు రావడం లేదన్నదానిని ప్రశ్నిస్తున్నారు? దేశంలో నదుల నుంచి వృధాగా సముద్రాలలో కలుస్తున్న నీరు సుమారు 60వేట టిఎంసిలు. అందులో కనీసం పదో వంతు కూడా దేశం వినియోగించుకోవడం లేదు. అంతో ఇంతో గతంలో ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించేది. కాని బిజేపి ప్రభుత్వం వచ్చాక దేశంలో సాగు రంగానికి కొత్తగా ఒరిగిందేమీ లేదు? సాగునీటి పారుదల రంగంలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు. మనదేశమే వ్యవసాయం దేశం. ప్రపపంచంలో అత్యధికంగా పత్తి, జనుము పండిచే దేశం. వాటితోపాటు ఆహార పంటలు పెద్దఎత్తున పండుతాయి. కూరగాయల సాగులో ప్రపంచంలోనే మొదటి స్ధానంలో వుంది. పాడి పరిశ్రమలోనూ ముందుంది. ఇవన్నీ కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మూలంగా దేశానికి వస్తున్న విజయాలు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 23లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఇప్పుడు 56 లక్షల ఎకరాల్లో వరిసాగవుతోంది. గతంలో మితగా ఆరుతడి పంటలుకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయింది. కారణం నాడు నీరు లేక తెలంగాణ ఎడారిలా బీడు వారి పోయింది. 

                       సమైక్య పాలకుల దాష్టికానికి తెలంగాణ బలైంది. నీటి జాడులు లేక కరువు విలయతాండవం చేసింది. తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలోనే మిషన్‌ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్దరణతో గ్రామాల్లో మళ్లీ నీటి జాడలు పెంపొందాయి. గోదావరి నీళ్లను ప్రతి గ్రామానికి చేరే విధంగా చేసి, చెరువులు నింపడంతో ప్రతి కుంట నిండిరది. ప్రతి బావి ఎల్లబోసింది. ఎండిన బోర్లు నిరంతరం పనిచేస్తున్నాయి. ఇదిలా వుంటే కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పధకం మూలంగా నిర్మాణమైన రిజర్వాయర్లు నిండడంతో తెలంగాణ వ్యాప్తంగా కరువు మాయమైపోయింది. తెలంగాణ వచ్చిన మూడు నెలల్లో ఇరవై నాలుగు గంటల కరంటు అందించడం జరిగింది. పల్లెలు, పట్టణాలు, రైతులు, పరిశ్రమలు అనే తేడా లేకుండా అన్ని రంగాలకు ఇరవైనాలుగు గంటల విద్యుత్‌ సరఫరా ఒక్క తెలంగాణలోనే జరుగుతోంది. అంతే కాదు వ్యవసాయానికి ఇరవైనాలుగు గంటల ఉచిత విద్యుత్‌ ఒక్క తెలంగాణలోనే అమలౌతోంది. ఇవన్నీ దేశంతా విస్తరించాలి. దేశమంతా పచ్చబడాలి. పాడి పంటలతో కళకళలాడాలి. పారిశ్రామిక రంగం ప్రపంచానికి దీటుగా పరుగులందుకోవాలి. ఒకనాడు మన కన్నా తక్కువ స్ధాయిలో వున్న చైనా , అమెరికాతో పోటీపడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక యువతరం వున్న వున్న దేశం మనది. విసృతమైన మానవ వనులున్నాయి. వారితో దేశంలో అద్భుతాలు సృష్టించొచ్చు. కాని బిజేపి అవేవీ చేయడం లేదన్నదే ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 

                   సహజంగా ప్రాంతీయ పార్టీలకు వున్నంత అంకిత భావం జాతీయ పార్టీలకు వుండదు. కాని దాన్ని వ్యతిరేకంగా జాతీయ పార్టీలు పనిగట్టుకొని ప్రచారం చేసి, ప్రాంతీయ పార్టీలపై విషం చిమ్ముతున్నారు. దేశాన్ని బాగు చేయాలన్న చిత్తశుద్ది అన్ని పార్టీలలోనూ వుండాలి. ఎంత సేపు మత రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని గాలికి వదిలేస్తే, పాలన గాడిలో పడదు. ప్రజలకు భారాలు తప్పవు. అందుకే దేశంలో నూతన రాజకీయ ఆవిష్కరణలు జరగాలి. అందుకు మరోసారి దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలి. కలిసి కట్టుగా బిజేపిని ఎదుర్కొవాలి. ఇప్పటికే దేశం అన్ని రంగాల్లో కునారిల్లుతోంది. బలమైన కేంద్రం పేరుతో రాష్ట్రాలను మరింత బలహీనం చేస్తోంది. రాష్ట్రాలను కేంద్రం చెప్పుచేతుల్లో పెట్టుకొని ఆధిపత్యం చేయాలనుకోవడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని కేసిఆర్‌ ప్రజల్లో చైతన్యం నింపేందుకు బయలు దేరారు. తొలి దశగా ఉత్తర ప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఐక్యతలో తొలి అడుగు వేశారు. తర్వాత డిల్లీ ఆప్‌ జాతీయ అధ్యక్షుడు కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. దేశ కాల మాన పరిస్ధితులపై చర్చలు జరిపారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనే ప్రతిపక్షాల ఐక్యత చూపిస్తేగాని, బిజేపిలో మార్పు రాదన్న సంకేతాలు పంపాలన్న ఆలోచనలో ముందగులు వేస్తున్నారు. దేశమంతా కేసిఆర్‌ వైపు ఆసక్తిగా చూసేలా రాజకీయాలకు అంకురార్పణ చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యతా బలం విలువేంటో చూపించాలనుకుంటున్నాడు. దేశానికి కొత్త తరం రాజకీయాలు పరిచయం చేయాలనుకుంటున్నాడు.

ఆసుప్రతులన్నింటిలో అత్యాధునిక వైద్యసేవలు: హరీష్ రావు.

మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ…

గాంధీ ఆసుపత్రిలో ఈరోజు రూ. 13 కోట్ల విలువైన అత్యాధునిక ఎంఅర్ఐ మిషన్, రూ. 9 కోట్ల విలువైన క్యాత్ ల్యాబ్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మొదటి సారి వచ్చినపుడు ఇక్కడ రు. 2.14 కోట్ల విలువైన సిటీ స్కాన్ ను ప్రారంభించుకున్నం.

గాంధీ ఆసుపత్రిలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దాదాపు 100 కోట్లతో అత్యంత అధునాతన వైద్య పరికరాలు, సదుపాయాలు సమకూరుతున్నాయి.

గాంధీలో రు. 55 కోట్లతో ఎం సి హెచ్ నిర్మాణ పనులు, రు. 2 కోట్లతో 100 పడకల ఐసియు పనులు, దాదాపు కోటి రూపాయలతో పేషంట్ షల్టర్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.

రు. 30 కోట్లతో స్టేట్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రు. 2.50 కోట్లతో ఏర్పాటు చేసే ఇన్ ఫెర్టిలిటీ సెంటర్ సంతాన సాఫల్య కేంద్రం త్వరలో అందుబాటులోకి రానుంది.

సంతానం లేని దంపతులకు ఇది వరంగా మారనుంది. రాష్ట్రంలో ప్లేట్ల బురుజు, వరంగల్, గాంధీ ఆసుపత్రుల్లో 7.50 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నాం.

సంతానం లేని వారి నుండి ప్రైవేటు కేంద్రాలు పెద్ద మొత్తంలో ఫీజులు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేంద్రాలను తొలిసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది.

గాంధీ ఆసుపత్రికి ఘన చరిత్ర ఉంది. తెలంగాణ జిల్లాల నుండి మాత్రమే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. 

సమైక్య పాలనలో గాంధీ ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఏర్పాటు నుండి ఇప్పటి వరకు గాంధీ ఆసుపత్రి అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. వసతులు, మౌలిక సదుపాయాలు సమకూర్చడం వల్ల కరోనా సమయంలో గాంధీ ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రభుత్వ ఆసుపత్రుల సత్తా చాటింది.

 

గాంధీ ఆసుపత్రి కరోనా సమయంలో అపద్భందువుగా మారింది. సుమారు లక్ష మంది పాజిటివ్ కేసులకు చికిత్స అందించింది. 1698 కోవిడ్ డెలివరీలు చేసింది. 1163 మందికి బ్లాక్ ఫంగస్ సర్జరీలు చేసింది. 

 

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. ఉమ్మడి పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఆసుపత్రులు..ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కొత్త రూపు సంతరించుకున్నాయి.

 

ఖర్చుకు వెనకాడకుండా ఆసుపత్రుల ఆధునికీకరణ, అధునాతనమైన వైద్య పరికరాలు సమకూర్చడం వల్ల, ఖరీదైన వైద్య సేవలు పేదలకు ఉచితంగా అందుతున్నాయి.

 

మోకాలి చిప్ప మార్పిడి అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైసలు ఉన్నోళ్లు సర్జరీ చేసుకుంటే పేదలు పంటి కింద ఆ బాధను అనుభవిస్తూ జీవితాంతం ఉండే పరిస్థితి. ఒక్కో ఆపరేషన్ కు ప్రైవేటు లో 2 నుండి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 

 

గాంధీ ఆసుపత్రిలో నాలుగు నెలల్లో 48 మోకీలు ఆపరేషన్లు జరుగగా, ఉస్మానియాలో గత 6 నెలల్లో 50 పైగా మోకీలు మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. వీటి విలువ మొత్తంగా దాదాపు 2 కోట్ల పైనే ఉంటుంది.  

 

 

నిజామాబాద్, వేములవాడ, సిద్దిపేట లో మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లు ప్రారంభం అయ్యాయి. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

 

 

రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టిందా లేదా తెల్సుకునేందుకు, తద్వారా స్టంట్ లు అమర్చి ప్రాణాలు కాపాడేందుకు ఈరోజు గాంధీలో ఏర్పాటు చేసుకున్న క్యాత్ ల్యాబ్ ఉపయోగ పడుతుంది. ఉస్మానియాలో ప్రారంబించిన క్యాత్ ల్యాబ్ వల్ల 250 మందికి గుండె సంబంధ రోగులకు యంజియోప్లాస్టీ, యాంజియో గ్రామ్ చికిత్సలు అందించడం జరిగింది. ఇక నుండి ఈ సేవలు గాంధీలో అందుబాటులోకి వస్తాయి. ఎంజీఎం, ఖమ్మం, అదిలాబాద్ లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. క్యాత్ ల్యాబ్ వల్ల దాదాపు 21 రకాల ప్రొసీజర్స్ చేయడం సాధ్యమవుతుంది.

 

ఇలాంటి ఖరీదైన చికిత్సలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే ఉండేవి. ఇవన్నీ ఇప్పుడు మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా అందుతున్నాయి. ఫలానా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన చికిత్స జరిగింది అని మీడియాలో రావడం చూస్తున్నాం.

 

ఉమ్మడి పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. వైద్య సేవలు అందుబాటులో లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఆ పరిస్థితులు కళ్ళ నిండా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేయడం ప్రారంభించారు. 

 

ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకణ చేయడంతో పాటు, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుతున్నారు. సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు థియేటర్ ఎక్విప్మెంట్, సర్జికల్, ఐసియు, డయాగ్నొస్టిక్ ఎక్విప్మెంట్ సహా అవసరమైన అన్ని వైద్య పరికరాలను ప్రభుత్వం సమకూర్చుతున్నది. 

 

తద్వారా అన్ని రకాల రోగనిర్ధారణ ప‌రీక్ష‌లు పేద‌ల‌కు ఉచితంగా అందేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ పాటు ప్ర‌ధాన ఆసుప‌త్రుల్లో వెంటిలేటర్లు, అత్యాధునిక ICU, మోడ్యులర్ థియేటర్స్ , ఎండోస్కోప్స్ , క్యాథ్ ల్యాబ్ వంటి అధునాత‌న వైద్య ప‌రిక‌రాలు అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

గాంధీ, ఒస్మానియా, నిలోఫర్, చెస్ట్, ఎంజీఎం, ENT, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ఆసుపత్రులకు 21 సిటీ స్కాన్ పంపిణీ చేయడం జరిగింది.

 

అయితే వీట‌న్నింటి నిర్వహణ ఎప్పటికప్పుడు చేయకుంటే అనుకున్న ల‌క్ష్యం నెర‌వేర‌న‌ట్టే. మ‌ర‌మ్మ‌త్తుల పేరిట వైద్య ప‌రిక‌రాలు వినియోగంలో లేకపోతే అనేక మంది ప్రజలు ఇబ్బంది ప‌డుతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కెసిఆర్ ఆలోచనల మేరకు ప్ర‌భుత్వం రు. 20 కోట్లతో తొలిసారి బ‌యోమెడిక‌ల్ ఎక్విప్‌మెంట్ మెయింట‌నెన్స్ పాల‌సీని తీసుకువస్తున్నది. దీని వ‌ల్ల అన్ని ఆసుప‌త్రుల్లో వైద్య ప‌రిక‌రాలు ఎల్ల‌ప్పుడూ క్రియాశీల‌కంగా ఉండ‌నున్నాయి. త‌ద్వారా ప్రజలకు త‌క్ష‌ణం నిరంతర వైద్య సేవ‌లు అందుతాయి.

 

 

ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు గతంతో పోల్చితే డబుల్ కేటాయింపులు చేశారు. 11, 440 కోట్లు 

 

ఆసుపత్రులలో వ్యాధినిర్ధారణ పరీక్షలకొరకు : 300 కోట్లు 

ఆసుపత్రులలో వైద్య పరికరాలు : 500 కోట్లు 

ఆసుపత్రులలో సర్జికల్ కొరకు : 200 కోట్లు 

ఆసుపత్రులలో మందులకొరకు : 500 కోట్లు

ఆసుపత్రుల నిర్మాణానికి : 2,000 కోట్లు 

వైద్య కళాశాల ఆసుపత్రులు : 1,000 కోట్లు 

సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులు : 1,000 కోట్లు 

 

 

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌.. అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు ఈ ధర్మాసుపత్రులే దిక్కు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలు ఏ పెద్ద రోగమొచ్చినా వీటివైపే చూస్తారు. ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఏండ్లు గడిచినా.. జనాభా అంతకంతకు పెరిగినా.. ఈ ఆస్పత్రులపై భారం గణనీయంగా పెరుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క పెద్దాసుపత్రి నిర్మాణం జరుగలేదు.

 

కాని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒకటి, రెండు.. కాదు.. ఏకంగా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు కాబోతున్నాయి. 2679 కోట్లతో ఏర్పాటయ్యే tims ఆసుపత్రులకు ముఖ్యమంత్రి గారు ఇటీవల శంకుస్థాపన చేశారు. ఇవి ప్రస్తుత ఆసుపత్రులపై పేషెంట్ల ఒత్తిడిని తగ్గించనున్నాయు.

 

హైదరాబాద్ బస్తీ ప్రజల ఆరోగ్యం కోసం 259 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగింది. మరో 91 ఏర్పాటు చేసుకోబోతున్నం. ఇవి బస్తీ ప్రజల సుస్తీ పోగొట్టి, దోస్తీ దవాఖానలుగా మారాయి. ఇక పరీక్షలు ఉచితంగా చేసేలా ఏర్పాటు చేసిన టి డయాగ్నొస్టిక్ లో 57 రకాల పరీక్షలు చేస్తున్నాం. వీటి సంఖ్య 134 పెంచబోతున్నము. ఈసిజి, ఎక్స్ రే, 2 డీ ఏకో వంటి రేడియాలజీ సేవలు 20 హబ్స్ ద్వారా ప్రారంబించుకున్నాము.

 

ఆసుపత్రుల్లో ఉండే పేషంట్ సహాయకుల కోసం 18 చోట్ల రు. 5 భోజనం అందిస్తున్నాం. షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇలా వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నది. ప్రజలకు వైద్య ఖర్చుల భారం లేకుండా చేస్తున్నది.

 

కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, Tsmsidc ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఇ రమేష్ రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తదితరులు

 పాల్గొన్నారు.

పై నుంచే మొదలు` ప్రక్షాళన షురూ!

నేటిధాత్రి వరస కథనాల ఎఫెక్ట్‌

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో అవకతవకలపై సిఎం. సీరియస్‌?

పెద్ద ఎత్తున అందినట్లు తెలుస్తున్న పిర్యాధులు?

కమీషనర్‌ శేషాద్రి మౌనం వెనక అనుమానాలు?

అంత జరుగుతున్నా ఎందుకు పట్టనట్లున్నారన్నదానిపై ఆరా?

శేషాద్రి బదిలితోనే అసలు వ్యహారం మొదలు?

రాహుల్‌ బొజ్జా రాకతో అవినీతి పరుల గుండెల్లో గుబులు?

నిజాయితీకి ప్రతిరూపంగా రాహుల్‌బొజ్జాకు పేరు?

అవినీతిని సహించరు? ఎంతటివారైనా ఉపేక్షించరు?

ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌పై సిఎంకు చేరిన సామాజిక కార్యకర్తల పిర్యాధు లేఖలు?

అవినీతి అధికారుల ఏరివేతలకు శ్రీకారం?

గేమ్స్‌ స్టార్ట్‌ నౌ…అంటున్న పై స్ధాయి అధికారులు?

మంచి మీద చెడు ఎప్పుడూ విజయం సాధించలేదు. తాత్కాలికంగా చెడు తనను తాను రక్షించుకుంటున్నట్లు కలలు గన్నా అవి నిజం కావు…ఆ కలలు కాపాడవు. ఆ ప్రచారం పుట్ట పగలక మానదు. నిజమెప్పుడూ అబద్దపు ముసుగును నిప్పుతో దహించేస్తూనే వుంటుంది. చెడును దోషిగా నిలబెడుతూనే వుంటుంది. . చెడు మార్గం అన్నది ఎప్పటికైనా ముప్పే….అది తప్పే అని తెలిసిన కొందరు ఉద్యోగులైన ఉన్నత విద్యావంతులు కూడా అదే దారిలో నడవడం విడ్డూరం. సమాజానికి మంచి చెప్పి, మంచి చేయాల్సిన స్ధానంలో వున్నవాళ్లే అవినీతికి అక్రమాలకు పాల్పడడం చట్ట ప్రకారం నేరమే కాదు, నైతికంగా పాపం కూడా…? అలాంటి నమ్మకాలకు కూడా తూట్లు పొడుస్తున్నారు. తమకు తామే గొప్ప అనుకునేంత దౌర్భాగ్యం నింపుకున్నవాళ్లే అన్యాయాలకు తెగబడుతుంటారు. అలా అక్రమాలు ఆపకుండా, సామాన్యలను అన్యాయాలకు గురిచేసేవారి ఏనాటికైనా పాపం పండకపోదు. తప్పు చేస్తే శిక్ష తప్పదని తెలిసికూడా… శిక్ష పడ్డప్పుడు కదా? అన్నంత నీతిలేని తనం, నికృష్టతనం నింపుకుంటున్నారు. ఆ అవినీతి అధికారులు చుక్కలు చూసే కాలం త్వరలో రానున్నది. తెలిసి తెలిసి తప్పులు ఎందుకు చేశామా? పేదలను ఎందుకు పీల్చుకుతిన్నామా? అవినీతికి ఎందుకు పాల్పడ్డామా? అని మధనపడాల్సిన రోజులు రాకమానవు. తప్పులు చేస్తూ కూడా కొందరు దర్జా వెలగబెడుతున్నారు. వారు చేసిన తప్పులు రుజువై ఉద్యోగాలు కోల్పోయి, పది మందిలో తలెత్తుకోలేని రోజులు వస్తాయని తెలిసి కూడా తప్పులు చేస్తున్నవారిని ఉపేక్షించొద్దు. వారిపై చర్యలకు ఉపక్రమించకుండా వుండొద్దు. ఇదే సగటు వ్యక్తి కోరుకునేది. అవినీతి కూపంలో కూరుకుపోయిన శాఖలు కొన్ని వున్నాయి. ఈ విషయం సాక్ష్యాత్తు ఈ మధ్యే మున్సిపల్‌ శాఖ మంత్రి కేటిఆర్‌ కూడా వెల్లడిరచడం జరిగింది. ప్రజల్లో ఆయా శాఖలపై అసహనం పెరిగిపోతోందన్న విషయం కూడా ఆయన వెలుబుచ్చారు. అలాంటి శాఖల్లో అడ్డూ అదుపు లేకుండా, విచ్చలవిడి తనంతో సంపాదనకు ఎగబడిన స్టాంఫ్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ కూడా వుంది. అందులోనూ కొంత మంది నిజాయితీ కలిగిన ఉద్యోగులున్నారు. 

                           కాని కొందరు ఉన్నత విద్యావంతులుగా సమాజ సేవ, సామాజిక సేవ ముసుగును వేసుకున్న అత్యంత అవినీతి పరులు కూడా వున్నారు. రాష్ట్ర స్ధాయి పేరు ప్రఖ్యాతుల ముసుగులో కూడా అవినీతిని పాల్పడుతూ అడ్డంగా సంపాదించుకుంటున్నారు. అడ్డగోలు సంపాదనకు ఎగబడ్డారు. అలాంటివారికి ఇక చెక్‌ పడే సమసయం ఆసన్నమైంది. అవినీతిపై అక్షర సమారం సాగిస్తున్న నేటిధాత్రి కృషి ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్రేషన్‌ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి తంతును చీల్చి చెండాడుతూ నేటిధాత్రి అక్షరయాగం చేస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖలో జిల్లాల వారిగా జరుగుతున్న అక్రమాలపై అక్షర సాక్ష్యాలతో తప్పులను అక్షర బద్దం చేస్తోంది. పుంఖాను పుంఖాలుగా ఆ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై అనేక కథనాలు ప్రచురించింది. వీటిపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందిచింది. వివరాలు ముఖ్యమంత్రి దాకా చేరవేసింది. ఆ శాఖలో అవినీతిని ప్రక్షాళన చేస్తాడనుకున్న కమీషనర్‌ శేషాద్రి మౌనంలో కూడా ఏదో మతలబు వుందన్న విషయం వెలుగులోకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన కూడా జరుగుతున్న విషయాల మీద స్పందించకపోవడానికి కూడా కొన్ని కారణాలున్నట్లు కూడా పై స్ధాయిలో చర్చ జోరుగానే సాగుతోంది. అందుకే ఆయనను బదిలీ చేసి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖకు రాహుల్‌ భొజ్జాకు అప్పగించారు. రాహుల్‌ బొజ్జాకు రాష్ట్ర స్ధాయి ఐఏఎస్‌లలో మంచి అధికారిగా గుర్తింపు వుంది. అవినీతిని అసలే సహించడన్న పేరుంది. ఆదర్శవంతమైన ఆయన కుటుంబ నేపధ్యం కూడా గొప్పది. తెలుగుజాతి గర్వించదగ్గది. అందుకే ఐఎఎస్‌ అధికారి రాహుల్‌ బొజ్జ అంటే ప్రత్యేకత వుంది. గతంలో వరంగల్‌, హైదరాబాద్‌ కలెక్టర్లుగా విధులు నిర్వర్తించారు. సిఎం. కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ, దళిత బంధు లాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఆయన కనుసన్నల్లో అమలు జరుపుతున్నారు. అదనంగా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖను కూడా సిఎం. అప్పగించారు. ఇక ఆయన రంగంలోకి దిగితే అవినీతి అధికారులకు చుక్కలే. ఈ విషయం ఇప్పటికే తెలిసిన ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. 

                 నేటిధాత్రి గత కొంత కాలం రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖల్లో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపై విసృతమైన సమాచారంతో కూడిన కథనాల ప్రచురణ జరిగింది. దాంతో యంత్రాంగంలో కదలిక మొదలైంది. ఇటీవల మంత్రి కేటిఆర్‌ స్పందనతోనే అవినీతి అధికారులపై చర్యలు మొదలౌతాయన్న విషయాన్ని నేటిధాత్రి అదే రోజు చెప్పింది. అంతే కాదు ముఖ్యమంత్రి కార్యాయంతో పాటు సాక్ష్యాత్తు సిఎం. కేసిఆర్‌ కూడా ఆయా శాఖలపై దృష్టిపెట్టాలని లేకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని సూచించినట్లు సమాచారం. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు కూడా తెలుస్తోంది. అందుకే సిఎం వెంటనే కొన్ని శాఖలకు సంబంధించిన కమీషనర్ల బదిలీలు చేపట్టినట్లు చెబుతున్నారు. ప్రత్యేకంగా ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ల బాగోతాలపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. పైగా ములుగు సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం అడ్డాగా చేసుకొని, సబ్‌ రిజిస్ట్రార్‌ కొంత మంది ప్రైవేటు సైన్యంతో మొగుళ్ల భద్రయ్య అనే సామాజక కార్యకర్త మీద దాడి చేయడం వంటి విషయాలన్నీ సిఎం దాకా వెళ్లాయి. పైగా ఆయన హ్యూమన్‌ రెట్స్‌ కమీషన్‌ను ఆశ్రయించేదాకా అధికారయంత్రాంగం కదలకపోవడంపై కూడా సిఎం సీరియన్‌ అయినట్లు సమాచారం. అందుకే అవినీతి పెద్దఎత్తున పెరిగిపోతున్న శాఖలు, నిర్లిప్తతతో వున్న శాఖాధిపతులను మార్చడం జరిగిందంటున్నారు. అందులో నేటిధాత్రి వరస కధనాలు తీవ్ర ప్రభావం చూపాయని సిఎం కార్యాలయ వర్గాలు ఇచ్చిన సమాచారం.

తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వద్దిరాజు రవిచంద్ర

 

హాజరైన మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్,

శ్రీనివాస్ గౌడ్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, రైతు బంధు స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి,

మ‌హ‌బూబాబాద్ ఎంపీ మాలోత్ క‌విత, ఎమ్మెల్సీ బండా ప్ర‌కాశ్‌, జ‌న‌గామ‌, వ‌రంగ‌ల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌, దాస్యం వినయ్ భాస్కర్.

వీరంతా వెంట రాగా, రాజ్య‌స‌భ‌కు పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్య‌ర్థి వ‌ద్దిరాజు ర‌విచంద్ర (గాయ‌త్రి ర‌వి) ఈ రోజు అసెంబ్లీలో నామినేష‌న్ వేశారు. నామినేష‌న్ల అనంత‌రం మంత్రుల‌తో స‌హా అంతా క‌లిసి ర‌విచంద్ర‌ను అభినందించారు. శాలువాతో స‌త్క‌రించారు. అనంతరం జరిగిన కృతజ్ఞతా సభలో అశేషంగా హాజరైన మున్నూరు కాపులు తమ అభ్యర్థికి ప్రాధాన్యతనిచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

వద్దిరాజు రవిచంద్ర గారికి శుభాకాంక్షలు

ఈ రోజు రాజ్యసభ కు ఎంపికేనా వద్దిరాజు రవిచంద్ర

గారికి శుభాకాంక్షలు తెలిపిన *తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్* *మెంట్ చైర్మన్ మెట్టు* *శ్రీనివాస్* మరియు రాష్ట్ర మున్నూరుకాపు సంఘ నాయకులు కొండ.దేవయ్య బండి కుమారస్వామి, కూసం శ్రీనివాస్

దేవయ్యకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.

తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడుగా ఎన్నికైన కొండ దేవయ్యకు ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అభినందనలు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, నాయకులు బండి కుమార స్వామి, కూసం శ్రీనివాస్, జల్లి సిద్దయ్య తదితరులు.

తెరాసకు తిరుగులేదు! కేసిఆర్‌కు ఎదరు లేదు!!

ప్రతి పక్షాలకు బలం లేదు… యంత్రాంగం అంతకన్నా లేదు…

వారి ప్రచారంలో నిజం లేదు…వారికి నమ్మకమైన నాయకత్వం లేదు…


రాజ్యసభ అభ్యర్థుల విజువల్స్…

 


కాంగ్రెస్‌ వరంగల్‌ డిక్లరేషన్‌ అంతా డొల్ల?

బిజేపి ప్లీజ్‌..ప్లీజ్‌ మహానటన?

పార్టీలో నాయకుల మధ్యే సఖ్యత లేదు? 

ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలో వారిలో క్లారిటీ లేదు?

ఎంత సేపు అధికారం యావ తప్ప, గెలిపిస్తే ఏం చెస్తారో చెప్పే బ్లూ ప్రింట్‌ లేదు…

అసలు ఇంతకీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ అడుగులేమిటి? ఆయన ఆలోచనలేమిటి? వ్యూహాలేమిటి? వేస్తున్న ఎత్తులేమిటి? ప్రతిపక్షాలను ఎలా చిత్తు చేయాలనుకుంటున్నారు? కొంత కాలంగా ఆయన రహస్యంగా సాగిస్తున్న మంతనాలేమిటి? ఇది సగటు వ్యక్తిలో మెదులుతున్న ఆలోచనలే కాదు…తమ పార్టీ పనులు గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీలు కూడ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న ప్రశ్నలు.

ప్రతిపక్షాలు గతం కన్నా మిన్నగా దూకుడును ప్రదర్శిస్తున్నాయి. అయినా కేసిఆర్‌ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. గతంలో ఉద్యమ కాలంలోనూ ఇదే వరస. కేసిఆర్‌ ఒక్కసారి మాట్లాడితే అది ఆరునెలలు చర్చ. ఆయన మౌనం వహిస్తే మరింత రచ్చ. అని చెప్పుకునేవారు. ఇప్పుడు కూడా అదే దారిలో కేసిఆర్‌ నడుస్తున్నా, రెండు దశాబ్ధాలు గడుస్తున్నా కేసిఆర్‌ వ్యూహాలను అంచనా వేయడం ఎవరి వల్ల కావడం లేదు. మధ్య మధ్యలో కేసిఆర్‌ ఇచ్చే లీకులను ఆధారం చేసుకొని ప్రతిపక్షాలు మాట్లాడడం తప్ప, కొత్తగా కనిపెట్టినట్లు చెప్పుకునే విషయాలు ఏమీ వుండదు. అదే కేసిఆర్‌ గొప్పదనమని చెప్పకతప్పదు. ఇలాంటి విషయాలకొస్తే 2011 మార్చి 10న మిలియన్‌ మార్చ్‌ నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమ కారులు, తెలంగాణరాష్ట్ర సమితి కార్యకర్తలు,నాయకులు హైదరాబాద్‌ నిండిపోయారు.

ట్యాంక్‌ బండ్‌ మీద రక్తం చిందినా పోలీసు దెబ్బలకు ఎదురొడ్డి వేలాది మంది ట్యాంక్‌ బండ్‌ చేరుకున్నారు. ఉదయం పది గంటలకు పట్టుమని పది మంది లేని సమయం నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకు ట్యాంక్‌ బండ్‌ ఉద్యమ కారులతో నిండిపోయింది. నాడు హరీష్‌ రావు హుస్సేన్‌ సాగర్‌నుంచి బోటులో ట్యాంక్‌ బండ్‌ చేరుకున్నారు. ఆ సమయంలో ట్యాంక్‌ బండ్‌మీద శ్రీకృష్ణదేవరాయ విగ్రహం కూల్చివేత, మీడియా ఓబి వ్యాన్లు తగలబడి పోవడం వంటివి జరిగాయి. 

                             తెలంగాణ ఉద్యమచరిత్రలో మిలియన్‌ మార్చి ఒక మైలు రాయిగా మిగిలిపోయింది. అయితే అలాంటి సందర్భం మరొకటి సృష్టించి సాగర హారం నిర్వహిస్తారని ఎవరూ ఊహించలేదు. మళ్లీ 2011 సెప్టెంబర్‌ 30 సాగరహారం నిర్వహించారు. నాటి ప్రభుత్వం ట్యాంక్‌ బండ్‌ మొత్తం పోలీసులతో నింపేస్తే, హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ సాగరహారం నిర్వహించారు. మిలియన్‌ మార్చి అయినంత సక్సెస్‌ సాగరహారం కాదని అందరూ అనుకున్నారు. కాని అంతకు మించి సాగరహారం నిర్వహించిన ఘనత కేసిఆర్‌ది. అంటే ఉద్యమమైనా, పాలనైనా కేసిఆర్‌ వేసే అడుగులను అంచనా వేయడం ఎవరి వల్ల కాదు. ఆయన వ్యూహాలు అర్ధం కాక, ఆయనను అర్ధం చేసుకోలేక, అంత ఓపిక లేక, రాజకీయాలను మాత్రమే ఎంచుకొని కేసిఆర్‌ను వదిలిపెట్టిపోయిన స్వార్ధ పరులు కూడా వున్నారు. కాని ఎక్కడా కేసిఆర్‌ పట్టు సడలలేదు. మరింత పట్టుదలగా ముందుకు సాగారు. అందుకే కేసిఆర్‌ ఏది చేసినా ఒక్కడిగానే సాగుతాడు. ఒక్కడిగానే ఆలోచిస్తాడు. ఒక్కడుగానే అమలు పర్చుతాడు. అందుకే ఆయనను అంచనా వేయడం ఎవరి వల్ల కాదు. 

                      ఇంతకీ కేసిఆర్‌ ముందస్తు ప్లాన్‌ చేసుకుంటున్నాడా? లేదా? అన్నదానిపై ప్రతిపక్షాల్లో సాగుతున్న తర్జన భర్జన అంతా ఇంకా కాదు. గతంలో ముందే లీకులు ఇచ్చి మరీ ప్రతిపక్షాలను కేసిఆర్‌ కోలుకోలేని దెబ్బకొట్టారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా సరే గత ఎన్నికల్లో ఎంతో కట్టడి చేయగలిగారు. గతంలో ఏ నాయకుడికి రానంత, ఊహించనంత మెజార్టీలు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సొంతం చేసుకున్నారు. దీనంతటీకి కారణం ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిపాలనపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం. ఉద్యమ కాలంలో సైతం అంత మెజార్టీలు ఎవరూ సాధించలేదు. కాని ఒకసారి అధికారం కొనసాగించిన తర్వాత మరసటి ఎన్నికల్లో మెజార్టీ స్ధానాలేకాదు, అల్టిమేట్‌ మెజార్టీ సాధించడం అన్నది కూడా సామాన్యమైన విషయం కాదు. అందుకే ప్రతిపక్షాలకు ఎటూ పాలుపోవడం లేదు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నంత తీవ్రంగా వ్యతిరేకత ప్రజల్లో లేదు. చైతన్యం నింపుదామంటే ప్రతిపక్షాలకు అంత సీన్‌ లేదు. తెలంగాణ ప్రజలకు పాఠాలు చెప్పడం వారికి సాధ్యం కాదు. అడుగులు ఎటు వేయాలో ప్రతిపక్షాలకు పాలుపోవడం లేదని కూడా తెలుస్తోంది. ప్రతిపక్షాలు ఎక్కడైనా ప్రభుత్వం మీద పోరాటంతో ఆధిపత్యం ప్రదర్శించే పరిస్ధితులుంటాయి. కాని తెలంగాణలో భిన్నమైన పరిస్ధితులున్నాయి. ప్రతిపక్షాలు ఒకదానికొకటి నేనేంటే, నేనే అనిపించుకుంటే గాని తమ ఉనికిని నిరూపించుకోలేరు. ప్రతిపక్షాలకు ఇది సందిగ్ధ పరిస్ధితి. కాకపోతే అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా ఇది సంధి కాలం. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సమయం. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు అటు తిరిగి, ఇటు తిరిగి అధికార పార్టీ మీదకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వుంది. ఎందుకంటే ప్రతిపక్షాలైన బిజేపి, కాంగ్రెస్‌లు ఎదగడానికి చేసే ఆరోపణలు అంతిమంతా అధికార పార్టీనే వేలెత్తిచూపుతాయి. దాన్ని గమనించుకొని టిఆర్‌ఎస్‌ అడుగులేయాల్సిన అవసరం వుంది.. 

                       ఎంత బలంగా వున్నా, బలమైన ఎదురుదాడికి టిఆర్‌ఎస్‌ సిద్ధం కావాలి. ప్రతిపక్షాలు ప్రతి విషయంలోనూ మాటల దాడి చేస్తాయి. వాటిని అనుక్షణం టిఆర్‌ఎస్‌ తిప్పికొట్టాలి. ప్రతిపక్షాలు ప్రతి నిమిషం బట్ట కాల్చి మీదేయాలని చూస్తాయి. దాన్ని తట్టుకుంటూ ఆ సెగను ప్రతిపక్షాల మీదకు టిఆర్‌ఎస్‌ మళ్లీంచేందుకు ప్రతి సందర్భంలోనూ సిద్ధంగా వుండాలి. లేకుంటే ప్రతిపక్షాలు చెప్పే విషయాలే ప్రజలు నమ్మే పరిస్ధితి రావొచ్చు. నిజాలకన్నా, అబద్దాలనే ఎవరైనా ముందు నమ్ముతారు. తెలంగాణలో ఇన్ని ప్రజా సంక్షేమ పధకాలు అమలౌతున్నా, ఎనమిదేళ్లుగా అధికారం కోసం ఎదరు చూస్తున్నవారు కొత్తగా పాలిస్తారేమో! అన్న ఆలోచనలు రావొచ్చు. అందువల్ల దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలౌతున్నాయన్నదానిని బలంగా టిఆర్‌ఎస్‌ నాయకులు,కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాకపోతే గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ గెలుకు దోహదం చేసినా, విఫలమైన పధకాల మీద ప్రతిపక్షాలు దృష్టిపెట్టే అవకాశం వుంది. అందువల్ల వాటిని అధిగమించేందుకు కూడా టిఆర్‌ఎస్‌ కొత్త కొత్త మార్గాలను అన్వేషించాలి. నాయకులు, కార్యకర్తలు కూడా ఎన్నికల తరుణం దగ్గరకొస్తున్న సమయంలో క్రియాశీలకంగా పనిచేయాల్సిన అసవరం వుంది. తెలంగాణలో బిజేపికి బలం లేదు. బలగం లేదు. కార్యకర్తల యంత్రాంగంలేదు. అందుకు అవసరమైన నాయకత్వం కూడా లేదు. పేరుకు చెప్పుకోవడానికి పట్టు మని పది మంది కూడా ఆ పార్టీలో బలమైన నేతలు లేరు. వాళ్లే పార్టీ అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వున్న ఆ కొద్ది మందైనా కార్యకర్తలు సోషల్‌ మీడియా వేధికగా పార్టీని విసృత ప్రచారం చేసుకుంటున్నారు. ఇక అంతో ఇంతో క్షేత్రస్ధాయిలో బలంగానే వున్నది కాంగ్రెస్‌. కాని నాయకులే సరిగ్గా లేదు. అక్కడ కూడా డజన్‌ మంది ముఖ్యమంత్రులు కావాలనుకనేవారు తప్ప, పార్టీని గట్టెక్కించేవారు లేదు. పార్టీ కోసం అహర్నిషలు పనిచేసే వారు లేదు. అందరూ మూకుమ్మడిగా ఏకమైనా, వారిని నమ్మేందుకు పెద్దగా ప్రజలు సుముఖంగా లేరు. ఇది ముందు తెరాస కార్యకర్తలు తెలుసుకుంటే చాలు…ప్రతిపక్షాల అసత్యాలు, అర్ధసత్యాలను తిప్పికొడితే చాలు… తెలంగానలో తెరాసకు తిరగులేదు. ఎదురులేదు…

మా గోడు…

వాళ్లు అకారణంగా,అన్యాయంగా ఉద్యోగాలనుంచి తొలగించబడిన హోంగార్డులు… కష్టేఫలి అనుకున్నారు..కష్టపడి పనిచేశారు.


రాజ్యసభ అభ్యర్థుల విజువల్స్…

 


అన్ని రకాల అర్హతలతోనే ఎంపికయ్యారు. కొలువులు సంపాదించుకున్నారు. ఇష్టంగా విధులు నిర్వర్తించారు.

ఉద్యోగ నిర్వహణలో ఏనాడు పొరపాట్లు చేయలేదు. తప్పులు దొర్లలేదు. అజాగ్త్రతలు లేవు. అవినీతి ఆరోపణలు లేవు. వివాదాలు లేవు. విమర్శలు లేవు. అంతగా వృత్తిని ధర్మంగా భావించి పని చేశారు. ఉద్యోగాన్ని పవిత్రంగా భావించారు. జీవితం నిలబడుతుందని ఆశించారు. బతుకు బాగుపడుతుందనుకున్నారు. భవిష్యత్తు మీద ఎన్నో కలలుగన్నారు. మరింత ఉన్నత స్ధితికి వెళ్తామన్న ఆశతో త్రికరణశుద్ధితో పనిచేశారు. సెలవులు లేకున్నా సర్ధుకుపోయారు. రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా వుంటూ విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో తిండి తిప్పలు లేకున్నా పనిచేశారు. కంటిమీద కునుకులేని రోజులు కూడా వున్నాయి. అర్ధరాత్రి, అపరాత్రులైనా పనిచేశారు. ఎండననక, వాననక కర్తవ్యనిర్వహణగావించారు. అనేక సార్లు అనారోగ్యాల పాలయ్యారు.

అయినా ఉద్యోగాన్ని నమ్ముకుంటూ బతికారు. కాని కాలం కాటేసినట్లు గత పాలకులు వాడుకున్నన్ని రోజులు వాడుకొని కూరలో కరివేపాకులా తీసేశారు. అంతే కాదు ఆ సమయంలో సీమాంధ్రకు చెందని వాళ్లనెవరినీ తొలగించకుండా, కక్ష్య కట్టినట్లు తెలంగాణ ఉద్యమం సాగుతున్న తరుణంలో ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించారు. నాటి నుంచి తొలగించబడిన హోంగార్డులు పడుతున్న అసవస్ధలు అన్నీ ఇన్నీ కాదు. బతుకులు వీధినపడ్డాయి. మళ్లీ హోంగార్డు ఉద్యోగాలొస్తాయన్న నమ్మకంతోపాటు, పదేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన కొలువులు తిరిగొస్తాయన్న విశ్వాసం. ప్రైవేటు సంస్ధలలో కూడా ఇలా అర్ధాంతరంగా తొలగించే పరిస్ధితి వుండదు. కాని నాడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హోం గార్డుల జీవితాల్లో మట్టి కొట్టింది. దాంతో క్షోభ పడుతూ తనువు చాలించిన హోంగార్డులున్నారు. తిరిగి తిరిగి ఉద్యోగాలొస్తాయన్న నమ్మకంతో ఇంకా వారు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. సగం కడుపు కట్టుకొని, కూలీ నాలీ చేసుకుంటున్నవారు కూడా వున్నారు. కొందరు రకరకాలు వృత్తులను చూసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాని ఉద్యోగాల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ హోంగార్డులకు జరిగిన అన్యాయం తెలిసింది. ఎలాగైనా వారికి న్యాయం జరగాలని కూడా అన్నారు. వారికి ఉద్యోగ కల్పన జరగాలని చెప్పారు. అయితే యంత్రాంగంలో కదలిక లేకుండాపోయింది. ఈ మధ్యే హోంగార్డులు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను కలిశారు. ఉద్యోగాలు పోయినప్పటినుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను తరుచూ కలుస్తూనే వున్నారు. ఆయన కూడా వీళ్లకు న్యాయం చేయడానికి కృషిచేస్తూనే వున్నారు. కాని కాలం కలిసి రావడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్‌ వినోద్‌కుమార్‌ను కలిశారు. వారి గోడు వినిపించారు. విద్యుత్‌శాఖ మంత్రిని కూడా కలిశారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కూడా వీరికి అసరాగానే వుంటూ వస్తున్నారు. ఈ మధ్య వీరి గురించి కదలిక వచ్చినట్లు కనిపించింది. హోంమంత్రి మహమూద్‌ అలీని కూడా హోంగార్డులు కలిసి తమ గోడు వినిపించుకున్నారు. వారు ఎంతో బాధలోవున్నారు. ఈ మధ్యే ప్రభుత్వం పెద్దఎత్తున కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ప్రకటించింది. అన్ని వేల మందిని ఏక కాలంలో రిక్రూట్‌ చేసే సమయంలో బాధితులుగా మిగిలిపోతున్న ఈ హోంగార్డుల జీవితాలను కూడా నిలబెట్టాలని కోరుతున్నారు. అకారణంగా, అన్యాయంగా తెలంగాణ ఉద్యోగులమైన కారణంగా తొలగించబడిన హోంగార్డులను ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పధంతో విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

కమలాపూర్ లో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు.

కమలాపూర్ మండల కేంద్రంలో గౌడ కులస్తులు రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

మహిళలు అమ్మవారికి కొత్త కుండలో నైవేద్యం తయారు చేసి సమర్పించారు. ఉదయం గ్రామంలోని మహిళలు తలపై బోనాలను పెట్టుకొని పురవీధుల్లో డప్పు చప్పుళ్ళ మధ్య

శివ సత్తులు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తమ కుటుంబాలకు క్షేమంగా ఉండాలని, వర్షాలు విస్తారంగా కురియాలని కోరుతూ చల్లంగ దీవించమ్మ అంటూ ఎల్లమ్మ తల్లిని వేడుకుంటూ బోనాలు రేణుక ఎల్లమ్మ తల్లి గుడి వద్దకు మంగళవారం రాత్రి భక్తి శ్రద్దలతో బయలు దేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు పబ్బు మల్లేష్ గౌడ్ ఉపాధ్యక్షులు జెరుపోతు లక్ష్మణ్ గౌడ్ క్యాషియర్ జక్కు కోటేశ్వర్ గౌడ్,సభ్యులు బాలసాని రవి గౌడ్, దేశిని పరలోకం గౌడ్, కూనురి రవిగౌడ్, పబ్బు ఎల్లా గౌడ్ పచ్చిమట్ల శీనివాష్ గౌడ్, మండ శ్రీనివాస గౌడ్, కుల పెద్దలు, పెద్ద ఎత్తున మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమ‘కారు’లకే చోటు?

ఉద్యమ‘కారు’లకే చోటు?

 ` కేసిఆర్‌ సరికొత్త ప్రయోగం.

 `వచ్చే ఎన్నికల్లో ఉద్యకారులకే పెద్దపీఠ

 ` పార్టీకి అండగా ఉన్నవారి ఎంపికకు కసరత్తు!

 ` పార్టీని నమ్ముకున్న వారికి బంఫర్‌ ఆఫర్లు?

 `వ్యతిరేకత ఉన్న స్ధానాల్లో ఉద్యమకారులకు టిక్కెట్లు?

` పార్టీమీద కాదు పాలకుల మీదే ప్రజల వ్యతిరేకత 

` కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి

` పెద్దఎత్తున కార్యకర్తలకు శిక్షణా తరగతులు

` కేసిఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించిన సంకేతాలు

 ` ఆ అదృష్టవంతులు ఎవరన్నది పార్టీలో సాగుతున్న చర్చ 

  హైదరాబాద్‌ , నేటిధాత్రి : 

     ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనలు ఎవరికీ అందేవి కాదు. ఎవరూ ఊహించేవి కావు. ఆయన మౌనం ఒక మహాయుగం. ఆయన మాట మహావేగం. వేసే అడుగు ఒక కాలం. తెచ్చిన తెలంగాణ చరిత్ర సాత్కారం కోసం. ఇంత ఉన్నతంగా వుండేవే కేసిఆర్‌ వ్యూహాలు. సామాన్యంగా ఎవరికీ అర్ధమయ్యేవి కాదు. అందుకే తెలంగాణ ఉద్యమం అన్నది ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. ప్రపంచంలో అమెరికా విప్లవం1689, ప్రెంచి విప్లవం 1789, రష్యా విప్లవం 1919 తర్వాత చెప్పుకోదగ్గ పోరాటాలలో దేశ స్వాతంత్య్రంతోపాటు తెలంగాణ సాయధ పోరాటం, ఆ తర్వాత కేసిఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ సాధన ఉద్యమమే అత్యంత కీలకమైంది. అలాంటి ఉద్యమ కారుడి అడుగులు అంచానా వేయడం అందరి వల్ల కాదు. ఆయనకు తప్ప మరెవరికీ వెల్లడయ్యేవి కాదు. ఆచరణలో పెట్టాలనుకున్నప్పుడు మాత్రమే ఆయన ఇచ్చే లీకులతో ప్రత్యర్ధులకు దిమ్మ తిరిగిపోతుంది. కేసిఆర్‌ ఆలోచనలను అంచాన వేయాలంటే ఇక్కడ చరిత్రను లోతైన అధ్యయం చేసేవారికి మాత్రమే అవగమౌతుంటాయి. అందులోనే అనేక విషయాలు దాగి వుంటాయి. తెలంగాణలో ఆంధ్ర ప్రాంత నాయకుల వలసవాద దాడి, దోపిడీ అన్నది తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచే మొదలైంది. తెలంగాణలో నిజాం వేధింపుల పేరుతో దొరలు, భూస్వాములు, దేశ్‌ ముఖ్‌లు, ఆఖరుకు రజాకార్లు చేసిన దుర్మార్గాలన్నీ నిజాం ఖాతాలో పడ్డాయి. దాంతో అందరూ నిజాంను తిట్టడం మొదలుపెట్టారు. తెలంగాణలో 80శాతం మంది తెలుగు ప్రజలు వుండడం, ఇక్కడ భాషాపరమైన సాంస్కృతిక విప్లవం తెస్తే, ఏలడం సులువైందని ఆంధ్రులు ఆనాడే కన్నేశారు. భారత దేశంలో హైదరాబాద్‌ సంస్ధానం విలీనమైన తర్వాత జనరల్‌ జేఎన్‌. చౌదరి సైనిక పాలనలో పెద్దఎత్తున ఆంధ్రప్రదేశ్‌ నుంచి విద్యావంతులు తెలంగాణకు వచ్చి ఉద్యోగాలు కొల్లగొట్టారు. అప్పటికి తెలంగాణలో పూర్తి స్ధాయిలో ఉర్ధూ మీడియం మాత్రమే వుండేది. పల్లెల్లోనూ అదే చదవాల్సివచ్చేది. దాంతో జేఎస్‌ చౌదరి, ఎం.కే వెల్లోడి పాలనలో పెద్దఎత్తున సీమాంధ్రులు నిండిపోయారు. ఆఖరుకు ఎంత దాకా వచ్చిందంటే 1952లో తెలంగాణ నడిబొడ్డున వున్న సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి బి.వి. రాజు అనే సీమాంధ్ర నాయకుడు గెలవడం, మంత్రి కావడం కూడా జరిగింది. అంటే రాజకీయాల్లో కూడా ఆనాడే పెత్తనానికి అంకురార్పణ జరిగిందనేది ముందుగా ఈ తరానికి తెలియాల్సివుంది. నాడు సీమాంధ్ర ఉద్యోగుల అరాచకాలు మితిమీరిపోయాయి. అన్ని శాఖల్లో వాళ్లే నిండిపోయారు. ఆఖరుకు వరంగల్‌లో పార్ధసారధి అనే డిఈవో. తెలంగాణ టీచర్లను విపరీతంగా వేధించడం మొదలు పెట్టారు. అప్పుడు వరంగల్‌కు చెందిన ఉపాధ్యాయుడు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ గురువు గుండెపోటుతో మరణించాడు. దాంతో సుబ్బయ్య అనే తెలంగాణ విద్యార్ధి నాయకుడు మొదలు పెట్టిన ఉద్యమమే ఇడ్లీ సాంబార్‌ గో బ్యాక్‌. 1952 మొదలైన ముల్కీ ఉద్యమం 2014లో తెలంగాణ వచ్చేదాకా ఆగలేదు. అలాగని అరవై ఏళ్లపాటు సీమాంధ్రుల దోపిడీ మానుకోలేదు. పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో డిల్లీ వెళ్లి, హైదరాబాద్‌ హౌజ్‌లో ఆనాటి హోం మంత్రి గోవింద్‌ వల్లభ్‌పంత్‌ సమక్షంలో సంతాకలు చేసి, తిరిగి హైదరాబాద్‌ చేరేలోగానే తెలంగాణ పేరు లేకుండా చేశారు. తెలంగాణతో కలిసి, తెలుగు జాతి బలం పెంచుకుందామని చెప్పి, 1956లో నాటి హైదరాబాద్‌ ముఖ్యమంత్రి బూర్గుల రామ కృష్ణారావుకు పదవి లేకుండా చేశారు. పెద్ద మనుషుల ఒప్పందలో సంతకాలు చేసిన చెన్నారెడ్డి, రంగారెడ్డి, జేవి నర్సింగరావులకు ప్రాధాన్యత లేకుండా చేశారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు నేటి తెలంగాణ సమాజానికి తెలియాలి. 1952 ఎన్నికల్లో హైదరాబాద్‌ రాష్ట్రంలో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంతో మంది కవులు, పాత్రికేయులు, డాక్టర్లు, లాయర్లు వున్నారు. కాని సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులైన వారిలో ఆధిపత్య తెలివి తేటలు తప్ప, ఏ ఒక్కరు కవి కాదు. జర్నలిస్టు కాదు. మేధావులుకాదు. రచయితలు కాదు. కాని ఆధిపత్యానికి అలవాటు పడ్డారు. హైదరాబాద్‌ రాష్ట్ర తొలి, ఆఖరు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఒక కవి. అధ్భుతమైన కృష్ణ శతకం రాసిని మేధావి. ఆనాడు మండలి చైర్మన్‌గా పనిచేసిన సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ వైతాళికుడు.పాత్రికేయుడు మందమలు నర్సింగరావు..ఇలా చెప్పుకుంటూ పోతే ఒక చరిత్రే… తెలంగాణనుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన పి.వి. నర్సింహారావు ఎంతటి మేధావో ప్రత్యేకంగా చెప్పవలసిన అసవరం లేదు. ఆయన కాకతీయ అనే పత్రికను కూడా నడిపారు. విశ్వనాధ సత్యనారాయణ రాసిన వేయి పడగలు అనే పుస్తకాన్ని సహస్రఫణ్‌ అనే పేరుతో అనువాదం చేశారు. అనేక కావ్యాలు రాశారు. బహుభాషా కోవిదుడు కూడా… తెలంగాణలో అనేక మంది మేధావులున్నారు. అయినా వారందరినీ బురిడీ కొట్టించారు. అతి తెలివితేటలు నింపుకుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూ వచ్చారు. ఒప్పందాలను తుంగలో తొక్కారు. తెలంగాణకు ఇవ్వాల్సిన తెలంగాణ నిధులు పోయి, నీళ్లు పోయి, కొలువులు పోయి, తెలంగాణకు వలస బతుకులు దిక్కు చేశారు. అలాంటి తెలంగాణకు సంపూర్ణ స్వాతంత్య్రం తెచ్చిందే కేసిఆర్‌. ఆ నాయకుడు పాలకుడుగా వుండగానే, తెలంగాణ ఉద్యమం పేరుతో స్వార్ధపూరిత రాజకీయాలకు అలవాటు పడిన వారికి , తెలంగాణను దోచుకుకుంటే గాని పూట గడవని సీమాంధ్ర వలస వాదులకు పదవుల ఆశ తీరలేదు. 

                         తెలంగాణ వాదులంతా ఒక్కసారి బాగా ఆలోచించుకోవాల్సిన తరుణం ఈసన్నమైందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ మధ్యే జరిగిన కొన్ని సంఘటనలు మననం చేసుకోవాలని పార్టీ అధిష్టానం ద్వితీయ శ్రేణి నాయకులను , కార్యకర్తలకు కోరేందుకు ఈ విషయాన్ని పార్టీలో చాలా లోతుగా తీసుకెళ్ళేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు పార్టీ పెద్దలు . వాటి మీద బాగా చర్చ జరగాల్సిన అవసరం వుంది. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు బాగా లేవన్న మాటలు సర్వత్రా వినిపిస్తున్నదే. పత్రికల్లో వార్తలు చూస్తున్నదే. వాస్తవమని అందరూ చెబుతున్నదే. ఇదే విషయాన్ని తెలంగాణ అభివృద్ధిని గురించి చెబుతూ, పొరుగు రాష్ట్రాలను పోల్చడం సహజం. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంటు, మంత్రి రామారావు ఆంధ్రప్రదేశ్‌ రోడ్లపై తన స్నేహిడుతు చెప్పిన మాటలను ఉటంకించారు. ఆ మాటలు విన్న తెలంగాణ వైఎస్‌ఆర్సీసీ అధ్యక్షురాలు షర్మిల గయ్యిమని లేచింది. అన్నతో పడడం లేదనే తెలంగాణకు ఆమె వచ్చింది. కాని జగన్‌ పాలన మీద కేటిఆర్‌ మాట్లాడితే ఆమె అసలు స్వరూపం బైట పెట్టుకున్నది. అంటే ఇలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు ఎంత అప్రమత్తతో వుండాలో తేలిపోయింది. షర్మిల లాంటివారు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతుండడం, అది మనం వింటుండడం కన్నా దౌర్భాగ్యం ఏదైనా వుంటుందా? ఆంధ్రప్రదేశ్‌లో చెల్లని కాసు కేఏపాల్‌ కు కూడా తెలంగాణని ఏలాలని వుందట. తెలంగాణలో ఆయన పార్టీని గెలిపిస్తే లక్ష కోట్లు తెస్తాడట. మరి రోడ్లు లేని ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం రూపాయి సాయం చేసే యోచనలో లేరట. గత ఎన్నికల్లో కేఏపాల్‌ ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసిందే. అక్కడ రోడ్లు బాగు చేస్తేనైనా ప్రజలు జేజేలు పలుకుతారు. అది వదిలేసి తెలంగాణ మీద మొసలి కన్నీరు కార్చేందుకు ఒకరి తర్వాత ఒకరు బయలుదేరుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తే, అక్కడ నోరెత్తులేని చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు నెరపడానికి కుట్ర పన్నుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాట్లాడేందుకు కూడా ధైర్యం చాలక, అక్కడ విమర్శలకు సమాధానం చెప్పలేక ఎక్కెక్కి ఏడ్చిన చంద్రబాబుకు ఆంద్రాలో కోట్లాడే దిక్కులేదు. కాని తెలంగాణలో పెత్తనం కావాలట. నీచ రాజకీయాలు చేయడానికి దండుగా బయలుదేరుతూ, తెలంగాణ మీదకు వస్తున్నారు. కుహనా తెలంగాణ వాదులను కలుపుకుంటున్నారు. సొంత ప్రాంతాల్లో బలం లేని దద్దమ్మలు అక్కడ మొహం చెల్లక, తేరగా తెలంగాణ రాజకీయాల్లో చేరి నీచ బుద్ది చూపిస్తున్నారు. 

                        ఇదిలా వుంటే తెలంగాణలో వున్న కొందరు తెలంగాణ 2004 ఎన్నికల్లో టిక్కెట్లు పొంది, టిఆర్‌ఎస్‌ కారు గుర్తు మీద గెలిచారు. వారిలో చాలా మంది టిఆర్‌ఎస్‌కు ద్రోహం చేశారు. వాళ్ల దారి వాళ్లు చూసుకున్నారు. అందులో చాలా మంది రాజకీయాల్లో తెరమరుగయ్యారు. కాని కొంత మంది పదవుల కోసం ఆశతో వుండి, చివరి నిమిషంలో వారి నైజం చూపించిన వారు కూడా వున్నారు. అలాంటి వారు కాకుండా, ఆది నుంచి పార్టీ కోసం ఎలాంటి స్వార్ధం లేకుండా పనిచేసిన వారికి ఇప్పుడు అవకాశం రానున్నది. ఆ పనిలో కేసిఆర్‌ వున్నారు. అలాంటి వారికి ఈసారి టిక్కెట్లు ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు చెందని నాయకుల లిస్టు తెప్పించుకున్నారు. వారిలో ఎవరు టిఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు. వారి వ్యక్తిగత జీవితాలు, త్యాగాలు అన్ని పరిశీలిస్తున్నారు. గత ముందస్తు ఎన్నికల సమయంలో అందరికీ టిక్కెట్లు ఇచ్చి ఆశ్యర్య పర్చినా, ఐదుగురిని ఆనాడే కేసిఆర్‌ పక్కన పెట్టారు. అంటే భవిష్యత్తులో ఎవరినైనా పక్కన పెడతామన్న సంకేతాలు ఆనాడే పంపినట్లైంది. అయినా ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు గెలుస్తూ వస్తున్న వారిపై కూడా ప్రజల్లో కొంత అసంతృప్తి వుందన్న సంగతి తెలుస్తూనేవుంది. ఇప్పటికే నాలుగైదు సార్లు వారు ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు. గెలిచారు. కాని వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు సన్నగిల్లేలా వున్నవారి లిస్టు కూడా తయారౌతోంది. అలాంటివారిలో ఊగిసలాటలో వున్నవారు కూడా కొందరున్నారన్న సంగతి కూడా తెలుస్తోంది. అలాంటి వారిని పక్కన పెట్టడమే మేలని కూడా కేసిఆర్‌ నిర్ణయానికి వచ్చినట్లు సమచారం. గెలుపు గుర్రాల వేట అన్నది ఈ రోజుల్లో రాజకీయ పార్టీలకు తప్పనిసరైంది. ప్రయోగాలు చెల్లే కాలం కాదు. ఆచి తూచి అడుగేయాల్సిన కాలం. పైగా రాజకీయ అవకాశవాదులు ఎంతో మంది తమ అసంతృప్తిని వెల్లగక్కుతూ తెలంగాణ వాదులు ముసుగులో విపరీత ప్రచారం చేస్తున్నవారు కూడా వున్నారు. సహజంగా రెండుసార్లు వరసగా అధికారంలో వున్న పార్టీలకు ఎంత లేదన్నా, ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. దాన్ని ఆసరా చేసుకొని రాజకీయాలు చేయాలనుకునేవారు కాచుకొని కూర్చున్నారు. వారి బారి నుంచి, పైగా సాధించిన తెలంగాణను ఇంకా సీమాంధ్రుల చేతుల్లో పెట్టేందుకు కొందరు చూస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ముంచేందుకు, ముందూ వెనక ఆలోచించకుండా రాజకీయాలు చేస్తున్నవారు చాలా మందే వున్నారు. అలాంటి కుహనా తెలంగాణ వాదులనుంచి కూడా తెలంగాణను కాపాడుకోవాల్సిన అవరసం మరింత కాలం వుంది. ఆ బాధ్యత ప్రతి తెలంగాణ వాది మీద వుంటుంది. అయినా కేంద్రంలో అధికారంలో వుండి, అనేక రాష్ట్రాలలో అధికారంలోవున్న బిజేపి అక్కడ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోలేని స్ధితిలో వుంటూ, ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటే సరిపోతుందా? అధికారంలోకి అభివృద్ధి చేస్తామంటే అర్ధమేమిటో కూడా చెప్పాల్సిన అసవరం వారిపై ఉంది. అందుకే ఈసారి ఎలాగైనా తెలంగాణను స్వార్ధ పరుల చేతుల్లోకి పోకుండా అక్కడినుంచి సీమాంధ్రుల ఆధిపత్యం కాకుండా చూడాలంటే, ఈసారి టిఆర్‌ఎస్‌లో తెలంగాణ వాదులకే టిక్కెట్లు..? అదే కేసిఆర్‌ రాజకీయ చాణక్యంలో మరో మెట్టు.

ఉద్యమ‘కారు’లకే చోటు?

 ` కేసిఆర్‌ సరికొత్త ప్రయోగం.

 `వచ్చే ఎన్నికల్లో ఉద్యకారులకే పెద్దపీఠ

 ` పార్టీకి అండగా ఉన్నవారి ఎంపికకు కసరత్తు!

 ` పార్టీని నమ్ముకున్న వారికి బంఫర్‌ ఆఫర్లు?

 `వ్యతిరేకత ఉన్న స్ధానాల్లో ఉద్యమకారులకు టిక్కెట్లు?

` పార్టీమీద కాదు పాలకుల మీదే ప్రజల వ్యతిరేకత 

` కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి

` పెద్దఎత్తున కార్యకర్తలకు శిక్షణా తరగతులు

` కేసిఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించిన సంకేతాలు

 ` ఆ అదృష్టవంతులు ఎవరన్నది పార్టీలో సాగుతున్న చర్చ 

  హైదరాబాద్‌ , నేటిధాత్రి : 

     ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనలు ఎవరికీ అందేవి కాదు. ఎవరూ ఊహించేవి కావు. ఆయన మౌనం ఒక మహాయుగం. ఆయన మాట మహావేగం. వేసే అడుగు ఒక కాలం. తెచ్చిన తెలంగాణ చరిత్ర సాత్కారం కోసం. ఇంత ఉన్నతంగా వుండేవే కేసిఆర్‌ వ్యూహాలు. సామాన్యంగా ఎవరికీ అర్ధమయ్యేవి కాదు. అందుకే తెలంగాణ ఉద్యమం అన్నది ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. ప్రపంచంలో అమెరికా విప్లవం1689, ప్రెంచి విప్లవం 1789, రష్యా విప్లవం 1919 తర్వాత చెప్పుకోదగ్గ పోరాటాలలో దేశ స్వాతంత్య్రంతోపాటు తెలంగాణ సాయధ పోరాటం, ఆ తర్వాత కేసిఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ సాధన ఉద్యమమే అత్యంత కీలకమైంది. అలాంటి ఉద్యమ కారుడి అడుగులు అంచానా వేయడం అందరి వల్ల కాదు. ఆయనకు తప్ప మరెవరికీ వెల్లడయ్యేవి కాదు. ఆచరణలో పెట్టాలనుకున్నప్పుడు మాత్రమే ఆయన ఇచ్చే లీకులతో ప్రత్యర్ధులకు దిమ్మ తిరిగిపోతుంది. కేసిఆర్‌ ఆలోచనలను అంచాన వేయాలంటే ఇక్కడ చరిత్రను లోతైన అధ్యయం చేసేవారికి మాత్రమే అవగమౌతుంటాయి. అందులోనే అనేక విషయాలు దాగి వుంటాయి. తెలంగాణలో ఆంధ్ర ప్రాంత నాయకుల వలసవాద దాడి, దోపిడీ అన్నది తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచే మొదలైంది. తెలంగాణలో నిజాం వేధింపుల పేరుతో దొరలు, భూస్వాములు, దేశ్‌ ముఖ్‌లు, ఆఖరుకు రజాకార్లు చేసిన దుర్మార్గాలన్నీ నిజాం ఖాతాలో పడ్డాయి. దాంతో అందరూ నిజాంను తిట్టడం మొదలుపెట్టారు. తెలంగాణలో 80శాతం మంది తెలుగు ప్రజలు వుండడం, ఇక్కడ భాషాపరమైన సాంస్కృతిక విప్లవం తెస్తే, ఏలడం సులువైందని ఆంధ్రులు ఆనాడే కన్నేశారు. భారత దేశంలో హైదరాబాద్‌ సంస్ధానం విలీనమైన తర్వాత జనరల్‌ జేఎన్‌. చౌదరి సైనిక పాలనలో పెద్దఎత్తున ఆంధ్రప్రదేశ్‌ నుంచి విద్యావంతులు తెలంగాణకు వచ్చి ఉద్యోగాలు కొల్లగొట్టారు. అప్పటికి తెలంగాణలో పూర్తి స్ధాయిలో ఉర్ధూ మీడియం మాత్రమే వుండేది. పల్లెల్లోనూ అదే చదవాల్సివచ్చేది. దాంతో జేఎస్‌ చౌదరి, ఎం.కే వెల్లోడి పాలనలో పెద్దఎత్తున సీమాంధ్రులు నిండిపోయారు. ఆఖరుకు ఎంత దాకా వచ్చిందంటే 1952లో తెలంగాణ నడిబొడ్డున వున్న సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి బి.వి. రాజు అనే సీమాంధ్ర నాయకుడు గెలవడం, మంత్రి కావడం కూడా జరిగింది. అంటే రాజకీయాల్లో కూడా ఆనాడే పెత్తనానికి అంకురార్పణ జరిగిందనేది ముందుగా ఈ తరానికి తెలియాల్సివుంది. నాడు సీమాంధ్ర ఉద్యోగుల అరాచకాలు మితిమీరిపోయాయి. అన్ని శాఖల్లో వాళ్లే నిండిపోయారు. ఆఖరుకు వరంగల్‌లో పార్ధసారధి అనే డిఈవో. తెలంగాణ టీచర్లను విపరీతంగా వేధించడం మొదలు పెట్టారు. అప్పుడు వరంగల్‌కు చెందిన ఉపాధ్యాయుడు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ గురువు గుండెపోటుతో మరణించాడు. దాంతో సుబ్బయ్య అనే తెలంగాణ విద్యార్ధి నాయకుడు మొదలు పెట్టిన ఉద్యమమే ఇడ్లీ సాంబార్‌ గో బ్యాక్‌. 1952 మొదలైన ముల్కీ ఉద్యమం 2014లో తెలంగాణ వచ్చేదాకా ఆగలేదు. అలాగని అరవై ఏళ్లపాటు సీమాంధ్రుల దోపిడీ మానుకోలేదు. పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో డిల్లీ వెళ్లి, హైదరాబాద్‌ హౌజ్‌లో ఆనాటి హోం మంత్రి గోవింద్‌ వల్లభ్‌పంత్‌ సమక్షంలో సంతాకలు చేసి, తిరిగి హైదరాబాద్‌ చేరేలోగానే తెలంగాణ పేరు లేకుండా చేశారు. తెలంగాణతో కలిసి, తెలుగు జాతి బలం పెంచుకుందామని చెప్పి, 1956లో నాటి హైదరాబాద్‌ ముఖ్యమంత్రి బూర్గుల రామ కృష్ణారావుకు పదవి లేకుండా చేశారు. పెద్ద మనుషుల ఒప్పందలో సంతకాలు చేసిన చెన్నారెడ్డి, రంగారెడ్డి, జేవి నర్సింగరావులకు ప్రాధాన్యత లేకుండా చేశారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు నేటి తెలంగాణ సమాజానికి తెలియాలి. 1952 ఎన్నికల్లో హైదరాబాద్‌ రాష్ట్రంలో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంతో మంది కవులు, పాత్రికేయులు, డాక్టర్లు, లాయర్లు వున్నారు. కాని సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులైన వారిలో ఆధిపత్య తెలివి తేటలు తప్ప, ఏ ఒక్కరు కవి కాదు. జర్నలిస్టు కాదు. మేధావులుకాదు. రచయితలు కాదు. కాని ఆధిపత్యానికి అలవాటు పడ్డారు. హైదరాబాద్‌ రాష్ట్ర తొలి, ఆఖరు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఒక కవి. అధ్భుతమైన కృష్ణ శతకం రాసిని మేధావి. ఆనాడు మండలి చైర్మన్‌గా పనిచేసిన సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ వైతాళికుడు.పాత్రికేయుడు మందమలు నర్సింగరావు..ఇలా చెప్పుకుంటూ పోతే ఒక చరిత్రే… తెలంగాణనుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన పి.వి. నర్సింహారావు ఎంతటి మేధావో ప్రత్యేకంగా చెప్పవలసిన అసవరం లేదు. ఆయన కాకతీయ అనే పత్రికను కూడా నడిపారు. విశ్వనాధ సత్యనారాయణ రాసిన వేయి పడగలు అనే పుస్తకాన్ని సహస్రఫణ్‌ అనే పేరుతో అనువాదం చేశారు. అనేక కావ్యాలు రాశారు. బహుభాషా కోవిదుడు కూడా… తెలంగాణలో అనేక మంది మేధావులున్నారు. అయినా వారందరినీ బురిడీ కొట్టించారు. అతి తెలివితేటలు నింపుకుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూ వచ్చారు. ఒప్పందాలను తుంగలో తొక్కారు. తెలంగాణకు ఇవ్వాల్సిన తెలంగాణ నిధులు పోయి, నీళ్లు పోయి, కొలువులు పోయి, తెలంగాణకు వలస బతుకులు దిక్కు చేశారు. అలాంటి తెలంగాణకు సంపూర్ణ స్వాతంత్య్రం తెచ్చిందే కేసిఆర్‌. ఆ నాయకుడు పాలకుడుగా వుండగానే, తెలంగాణ ఉద్యమం పేరుతో స్వార్ధపూరిత రాజకీయాలకు అలవాటు పడిన వారికి , తెలంగాణను దోచుకుకుంటే గాని పూట గడవని సీమాంధ్ర వలస వాదులకు పదవుల ఆశ తీరలేదు. 

                         తెలంగాణ వాదులంతా ఒక్కసారి బాగా ఆలోచించుకోవాల్సిన తరుణం ఈసన్నమైందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ మధ్యే జరిగిన కొన్ని సంఘటనలు మననం చేసుకోవాలని పార్టీ అధిష్టానం ద్వితీయ శ్రేణి నాయకులను , కార్యకర్తలకు కోరేందుకు ఈ విషయాన్ని పార్టీలో చాలా లోతుగా తీసుకెళ్ళేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు పార్టీ పెద్దలు . వాటి మీద బాగా చర్చ జరగాల్సిన అవసరం వుంది. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు బాగా లేవన్న మాటలు సర్వత్రా వినిపిస్తున్నదే. పత్రికల్లో వార్తలు చూస్తున్నదే. వాస్తవమని అందరూ చెబుతున్నదే. ఇదే విషయాన్ని తెలంగాణ అభివృద్ధిని గురించి చెబుతూ, పొరుగు రాష్ట్రాలను పోల్చడం సహజం. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంటు, మంత్రి రామారావు ఆంధ్రప్రదేశ్‌ రోడ్లపై తన స్నేహిడుతు చెప్పిన మాటలను ఉటంకించారు. ఆ మాటలు విన్న తెలంగాణ వైఎస్‌ఆర్సీసీ అధ్యక్షురాలు షర్మిల గయ్యిమని లేచింది. అన్నతో పడడం లేదనే తెలంగాణకు ఆమె వచ్చింది. కాని జగన్‌ పాలన మీద కేటిఆర్‌ మాట్లాడితే ఆమె అసలు స్వరూపం బైట పెట్టుకున్నది. అంటే ఇలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు ఎంత అప్రమత్తతో వుండాలో తేలిపోయింది. షర్మిల లాంటివారు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతుండడం, అది మనం వింటుండడం కన్నా దౌర్భాగ్యం ఏదైనా వుంటుందా? ఆంధ్రప్రదేశ్‌లో చెల్లని కాసు కేఏపాల్‌ కు కూడా తెలంగాణని ఏలాలని వుందట. తెలంగాణలో ఆయన పార్టీని గెలిపిస్తే లక్ష కోట్లు తెస్తాడట. మరి రోడ్లు లేని ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం రూపాయి సాయం చేసే యోచనలో లేరట. గత ఎన్నికల్లో కేఏపాల్‌ ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసిందే. అక్కడ రోడ్లు బాగు చేస్తేనైనా ప్రజలు జేజేలు పలుకుతారు. అది వదిలేసి తెలంగాణ మీద మొసలి కన్నీరు కార్చేందుకు ఒకరి తర్వాత ఒకరు బయలుదేరుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తే, అక్కడ నోరెత్తులేని చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు నెరపడానికి కుట్ర పన్నుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాట్లాడేందుకు కూడా ధైర్యం చాలక, అక్కడ విమర్శలకు సమాధానం చెప్పలేక ఎక్కెక్కి ఏడ్చిన చంద్రబాబుకు ఆంద్రాలో కోట్లాడే దిక్కులేదు. కాని తెలంగాణలో పెత్తనం కావాలట. నీచ రాజకీయాలు చేయడానికి దండుగా బయలుదేరుతూ, తెలంగాణ మీదకు వస్తున్నారు. కుహనా తెలంగాణ వాదులను కలుపుకుంటున్నారు. సొంత ప్రాంతాల్లో బలం లేని దద్దమ్మలు అక్కడ మొహం చెల్లక, తేరగా తెలంగాణ రాజకీయాల్లో చేరి నీచ బుద్ది చూపిస్తున్నారు. 

                        ఇదిలా వుంటే తెలంగాణలో వున్న కొందరు తెలంగాణ 2004 ఎన్నికల్లో టిక్కెట్లు పొంది, టిఆర్‌ఎస్‌ కారు గుర్తు మీద గెలిచారు. వారిలో చాలా మంది టిఆర్‌ఎస్‌కు ద్రోహం చేశారు. వాళ్ల దారి వాళ్లు చూసుకున్నారు. అందులో చాలా మంది రాజకీయాల్లో తెరమరుగయ్యారు. కాని కొంత మంది పదవుల కోసం ఆశతో వుండి, చివరి నిమిషంలో వారి నైజం చూపించిన వారు కూడా వున్నారు. అలాంటి వారు కాకుండా, ఆది నుంచి పార్టీ కోసం ఎలాంటి స్వార్ధం లేకుండా పనిచేసిన వారికి ఇప్పుడు అవకాశం రానున్నది. ఆ పనిలో కేసిఆర్‌ వున్నారు. అలాంటి వారికి ఈసారి టిక్కెట్లు ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు చెందని నాయకుల లిస్టు తెప్పించుకున్నారు. వారిలో ఎవరు టిఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు. వారి వ్యక్తిగత జీవితాలు, త్యాగాలు అన్ని పరిశీలిస్తున్నారు. గత ముందస్తు ఎన్నికల సమయంలో అందరికీ టిక్కెట్లు ఇచ్చి ఆశ్యర్య పర్చినా, ఐదుగురిని ఆనాడే కేసిఆర్‌ పక్కన పెట్టారు. అంటే భవిష్యత్తులో ఎవరినైనా పక్కన పెడతామన్న సంకేతాలు ఆనాడే పంపినట్లైంది. అయినా ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు గెలుస్తూ వస్తున్న వారిపై కూడా ప్రజల్లో కొంత అసంతృప్తి వుందన్న సంగతి తెలుస్తూనేవుంది. ఇప్పటికే నాలుగైదు సార్లు వారు ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు. గెలిచారు. కాని వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు సన్నగిల్లేలా వున్నవారి లిస్టు కూడా తయారౌతోంది. అలాంటివారిలో ఊగిసలాటలో వున్నవారు కూడా కొందరున్నారన్న సంగతి కూడా తెలుస్తోంది. అలాంటి వారిని పక్కన పెట్టడమే మేలని కూడా కేసిఆర్‌ నిర్ణయానికి వచ్చినట్లు సమచారం. గెలుపు గుర్రాల వేట అన్నది ఈ రోజుల్లో రాజకీయ పార్టీలకు తప్పనిసరైంది. ప్రయోగాలు చెల్లే కాలం కాదు. ఆచి తూచి అడుగేయాల్సిన కాలం. పైగా రాజకీయ అవకాశవాదులు ఎంతో మంది తమ అసంతృప్తిని వెల్లగక్కుతూ తెలంగాణ వాదులు ముసుగులో విపరీత ప్రచారం చేస్తున్నవారు కూడా వున్నారు. సహజంగా రెండుసార్లు వరసగా అధికారంలో వున్న పార్టీలకు ఎంత లేదన్నా, ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. దాన్ని ఆసరా చేసుకొని రాజకీయాలు చేయాలనుకునేవారు కాచుకొని కూర్చున్నారు. వారి బారి నుంచి, పైగా సాధించిన తెలంగాణను ఇంకా సీమాంధ్రుల చేతుల్లో పెట్టేందుకు కొందరు చూస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ముంచేందుకు, ముందూ వెనక ఆలోచించకుండా రాజకీయాలు చేస్తున్నవారు చాలా మందే వున్నారు. అలాంటి కుహనా తెలంగాణ వాదులనుంచి కూడా తెలంగాణను కాపాడుకోవాల్సిన అవరసం మరింత కాలం వుంది. ఆ బాధ్యత ప్రతి తెలంగాణ వాది మీద వుంటుంది. అయినా కేంద్రంలో అధికారంలో వుండి, అనేక రాష్ట్రాలలో అధికారంలోవున్న బిజేపి అక్కడ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోలేని స్ధితిలో వుంటూ, ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటే సరిపోతుందా? అధికారంలోకి అభివృద్ధి చేస్తామంటే అర్ధమేమిటో కూడా చెప్పాల్సిన అసవరం వారిపై ఉంది. అందుకే ఈసారి ఎలాగైనా తెలంగాణను స్వార్ధ పరుల చేతుల్లోకి పోకుండా అక్కడినుంచి సీమాంధ్రుల ఆధిపత్యం కాకుండా చూడాలంటే, ఈసారి టిఆర్‌ఎస్‌లో తెలంగాణ వాదులకే టిక్కెట్లు..? అదే కేసిఆర్‌ రాజకీయ చాణక్యంలో మరో మెట్టు.

మేమూ పంపగలం లీగల్‌ నోటీసులు?

అవినీతికి తెగబడినవాళ్లు లీగల్‌ నోటీసులతో తప్పించుకోలేరు?
నేటిధాత్రి నిజాలకు నిలువెత్తు నిదర్శనం
అక్రమాలను ఎన్నడూ సహించేది కాదు?


అవినీతి పరులను ఉపేక్షించేది కాదు?
పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోదు?


అక్షరాలతో ప్రజల ముందు దోషిగా నిలబెడుతుంది!
కంచే చేను మేసినట్లు అధికారులు వ్యవహరిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
శాఖలను అవినీతికి అడ్డాలుగా మార్చిన వారు తప్పించుకోలేరు?
అక్రమ రిజిస్ట్రేషన్లు ఇప్పటికైనా ఆపకపోవడాన్ని ఏమంటారు?
బాధితులకు న్యాయం జరిగేదాకా నేటిధ్రాత్రి నిద్రపోదు!
అవినీతి పరులను శిక్షించేదాకా నేటిధాత్రి విశ్రమించదు.
నిజం ఎప్పుడూ ప్రచారంలోనే వుండాలి. లేకుంటే అబద్దాన్నే నిజమని నమ్మే ప్రమాదముందని డాక్టర్‌. బాబా సాహెబ్‌ అంబెద్కర్‌ ఏనాడో చెప్పాడు. మీడియా అంటే దాని మీద అవగాహన లేని వాళ్లు చాలా మంది వుంటారు. వారు చేసే విచిత్రమైన ఆలోచనలు వింతగా వుంటాయి. మీడియా అన్నది హంస లాంటింది. అది ఎప్పుడూ నిజాన్ని మాత్రమే ప్రపంచానికి పరిచయం చేస్తుంది. తప్పులను ఎత్తి చూపుతోందంటేనే నిజాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నట్లు లెక్క. పాలు,నీళ్లను వేరు చేసినట్లే, తప్పులు, ఒప్పులను పక్క పక్కన చేర్చి చూపించడమే మీడియా కర్తవ్యం. మీడియా ఆ బాధ్యతనుంచి ఎప్పుడూ తప్పుకోలేదు. అది సాధ్యం కాదు కూడా. అందుకే నిజాలు చెప్పే మీడియా అంటే తప్పుడు పనులు చేసేవారికి నచ్చదు. తమ తప్పులను వేలెత్తి చూపడం తప్పుడు మనుషులకు గిట్టదు. సమాజంలో సామ్యవాదం కోసం పనిచేసేదే మీడియా. సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతే మీడియా లక్ష్యం.

అంతే కాని దోచుకునేవారికి కొమ్ము కాయడం అన్నది ఏ మీడియా చేయదు. నేటిధాత్రి దిన పత్రిక పురుడుపోసుకున్న నాటి నుంచి కూడా ఎక్కడ అన్యాయాన్ని సహించలేదు. ఎక్కడ అక్రమాన్ని ఉపేక్షించలేదు. ఎంత పెద్ద నాయకుడైనా విడిచిపెట్టలేదు. ఎంతటి ఉన్నతాధికారి చేసిన తప్పులనైనా ప్రపంచానికి చాటకుండా ఊరుకోలేదు. నిజాన్నే మీడియా సమర్ధిస్తుంది. అన్యాయాన్ని ప్రతి క్షణం ఖండిస్తుంది. జనానికి చేరవేస్తుంది. అలాంటి నిజాలను దిగమనించుకోలేని వారు చూసే ఆరోపణలు మీడియాకు కొత్తకాదు. ఏ ఆరోపణలకు మీడియా తలొంచేది కాదు. అందుకే నిజానికి శత్రువులెక్కువ. అబద్దానికి మిత్రులెక్కువ. నిజాలు రాసే పత్రికలపై దుష్ట ప్రచారాన్ని ఏడాడు జనం నమ్మరు. నిజం మాట్లాడలేని వ్యక్తికి కోపమెక్కువ. నిజం చెప్పకపోతే పత్రిక ప్రజల ఆదరణ తక్కువ. ఈ రెండిరటి సంఘర్షణే సమాజ సంక్షేమం. అది ఎప్పుడూ నేటిధాత్రి వదిలిపెట్టదు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వెర్రి వేషాలు వేసేవారిని అసలే వదిలిపెట్టదు. పరిశోధనాత్మక జర్నలిజం అన్నది మీడియాకు పెద్ద సవాలు. ఈ విషయంలో అవరోధాలు ఎదరౌతాయని తెలిసి కూడా చేసే సాహసం. అలాంటి సాహసాలు మీడియాకు కొత్తకాదు. నేటిధాత్రికి అసలే కొత్త కాదు. ప్రజలకు నిజాలు చెప్పడంలో ఎల్లప్పుడూ నేటిధాత్రి ముందుంటుంది. నేటిధాత్రి అనేది నిప్పుకణం. దానికి చెదపట్టించాలని చూలా మంది చూశారు. కాని కుదరలేదు. నేటిధాత్రి మీద నిందలేస్తే నిప్పుతో తల గోక్కున్నట్లే..! అయినా నిజాయితీ పనిచేయండని చెప్పడం కూడా నచ్చకపోతే అవినీతి అధికారులు ఉద్యోగాలు వదిలేసుకోవాలి. సామాజిక సృహ వున్న ఎంతో మంది నవతరం యువత ఉద్యోగాలు లేక అల్లాడుతోంది. కాని అంది వచ్చిన అవకాశాలతో ఉద్యోగాలు పొందిన వాళ్లు కొందరు అవినీతికి పాల్పడడమే దురదృష్టకరం. అవినీతి చేయడం తమకు కలిసొచ్చిన అదృష్టం అన్నట్లుగా నిత్యం లంచం లేనిదే పట గడవదన్నట్లు పనిచేస్తున్నవారినెవరినీ నేటిధాత్రి వదిలిపెట్టదు.
ఒక అధికారి మీద ఆరోపణలు ఊరికే రావు. తెలిసీ తెలియకుండా జరిగిన తప్పులను ఎవరూ వెలెత్తి చూపించరు. మీడియా దాకా రాదు. కాని కొందరు అధికారులు పనిగట్టుకొని చేసే అవినీతి మూలంగానే అది పది మందినోటిలో నానుతుంది. బాధితుల ద్వారా మీడియాకు చేరుతుంది. అది అవినీతి అక్రమాలు మీడియాలో వార్తలౌతాయి. నేను చేసేది చేస్తా? రాసేందుకు మీరెవరు? అని ఉన్నతోద్యోగులు ప్రశ్నించడం అంటేనే విచిత్రం. వారి దౌర్భాగ్యానికి నిదర్శం. మీడియా మీద పరువు నష్టం దావాలు అనేవి ఒకరిని చూసి ఒకరు అలవాటు చేసుకుంటున్నారు. కాని తాము సచ్చీలురమని ప్రకటించుకునేందుకు తాము ఎలాంటి తప్పు చేయలేదని ఎంక్వరీ చేయండని మాత్రం అడగడం లేదు. అంటే తాము తప్పు చేశామని అంగీకరించినట్లే…మనోభావాలు అన్నవి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు మాత్రమే వుంటాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజలు చెల్లించే పైసా, పైసా పన్నులతో నెలనెల జీతాలు తీసుకుంటూ, వారిని నిత్యం గోస పెడుతూ, వారిని నిండా ముంచుతామంటే మీడియా కళ్లు మూసుకొని వుంటుందా? నిజాలు రాకుండా వుంటుందా? కలుగులో దాగి చేస్తున్న అక్రమాలను బైట పెట్టకుండా వుంటుందా? అదే నేటిధాత్రిచేసింది. అందుకు కేసులు నమోదు చేస్తాం…పరువు నష్టందావాలేస్తామంటే ప్రజలు హర్షించరు. ఆ మనోభావాలు నేటిధాత్రికి అంతకన్నా ఎక్కువే వుంటాయి. ఎందుకుంటే నేటిధాత్రి ప్రజల గొంతుక. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల వేధిక.
ములుగు సబ్‌రిజిస్ట్రార్‌ నేటిధాత్రి మీద చేసే ఆరోపణలను జనం వింతగానే తీసుకుంటున్నారు. నేటిధాత్రి ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏం జరుగుతోందన్నదానిపై వరస కథనాలు రాస్తోంది. అందులో నిజాలు లేకుంటే బహిరంగంగానే వాటిని ఖండిరచొచ్చు. కాని ఇంత వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆ పని చేయలేదు. ఎందుకంటే అలా ప్రకటించాల్సివస్తే, తనమీద తనే విచారణ చేయమని ఉన్నతాధికారులకు సవాలు చేసినట్లౌతుంది. అదే జరిగితే తాను చేసిన అక్రమ రిజిస్ట్రేషన్లన్నీ బైటకు వస్తాయి? ఉద్యోగ ప్రమాణాలు పాటించాల్సిన చాలా మంది ఉద్యోగులు రాజకీయ నాయకుల దారిలో నడవాలనుకుంటున్నారు. అది తెలిసి చేస్తున్నారో,తెలియక చేస్తున్నారో గాని, నాయుకులు వేరు…ఉద్యోగులు వేరు. ఒక నాయకుడు ప్రజా ప్రతినిధి అయినా ఆయన పదవీ కాలం ఐదేళ్లే…ప్రతి ఐదేళ్లకోసారి గెలవాల్సిందే. ఆ సమయంలో తప్పులు చేసినా,చేయకపోయినా ఆరోపణలు వస్తే స్పందించాల్సిందే! ఒత్తిడిని బట్టి విచారణ కోరాల్సిందే..! ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే ఎక్కడో వుండే మంత్రి రాజీనామా చేస్తాడు. అదే ప్రజాస్వామ్య సూర్తి. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని వేమన ఏనాడో చెప్పారు. కొందరు ఉద్యోగుల పరిస్దితి అలాగే వుంది. నేటి ధాత్రి రాసే ప్రతి అక్షరం ఒక నిబద్దతతో కూడుకున్నదే. ములుగు సబ్‌రిజిస్ట్రార్‌కార్యాలయంలో ఎప్పుడు ఏంజరిగిందన్నదానిపై స్పష్టమైన ఆధారాలతో వార్తలు ప్రచురిస్తోంది. ఓ వైపు నేటిధాత్రి రాస్తూనే వున్న కాలంలోనే తప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే వ్యవస్ధ కళ్లు మూసుకుంటుందా? ఆ శాఖ దృష్టికి రాకుండాపోతుందా? కింది నుంచి పై స్ధాయిదాకా నేటిధాత్రి అందర్నీ నిద్రలేపుతోంది. ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగే ప్రతి అంశం పై స్ధాయి దాకా అందరకీ ఆధారాలను పక్కాగా పంపించడం జరుగుతోంది. అది తెలియక పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు, సబ్‌ రిజిస్ట్రార్‌ పనిగట్టుకొని చేస్తున్న అక్రమాలు ఎవరికీ తెలియవనుకుంటే పొరపాటు. చర్యకు ప్రతి చర్య వుంటుంది. నేటిధాత్రికి అక్షర పోరాటమే కాదు, న్యాయ పోరాటం కూడా తెలుసు. ఇలా తప్పులు చేసే వారే బెదిరింపులకు గురి చేస్తామంటే వెనుకడుగు అలవాటు నేటిధాత్రికి లేదు. నోటీసులతో పవిత్రమైన అక్షర యజ్ఞం చేస్తున్న నేటిధాత్రిని బెదిరించాలని చూస్తే కుదరదు. నోటీసులు నేటిధాత్రి కూడా పంపగలదు. అయినా మీడియాకు ఐట ఆక్టును ఆపాదించడం కుదరదు. అయినా జరిగిన తప్పులను సరిదిద్దుకునే క్రమంలో తొందపాటుకు గురై నోటీసులు పంపాల్సిన సమయంలో కేసులు నమోదు చేయించి, ప్రచారం చేసుకోవడం కూడా నేరమన్న సంగతి సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ తెలుసుకోవాలి. పరువు నష్టం అన్నది నేరం చేసిన వారు చెప్పాల్సిన మాటలు కాదు. సామాన్యులను వేధించినట్లు ఆరోపణలున్న వారు కాదు మధనపడాల్సింది. తాను చేసిన రిజిస్ట్రేషస్లు అక్రమం కాదని, అన్నీ సక్రమమే అని రుజువు కావాలంటే తనపై తాను ఎంక్వరీకి శాఖ పెద్దలను కోరడం తప్ప మరో మార్గం లేదు. కాని అది వదిలేసి నిజాలు రాసిన మీడియాను తూర్పారపడతా? అంటే కుదురుతుందా?

ఈ ధరలేంది? ఆ పన్నుల మోతలేంది?

ధరలు తగ్గే మార్గమే లేదా?

ఇలా నడ్డివిరుస్తూ అలా అధికారంలోకి వస్తామంటే భావ్యమేనా?

ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంటే కనిపించడం లేదా? 

అర్ధాకలితో కాలం వెల్లబుచ్చుతుంటే పాపం అనిపించడం లేదా?

రాజరికంలోనైనా ప్రజలు సుబిక్షంగా వున్నారా? అని రాజులు తెలుసుకునేవారట!

కళ్లముందు ప్రజల కష్టాలు చూస్తూ స్పందించని నాయకులను ప్రజలు ఆదరించాలా?

ఓట్లు కావాలి? గద్దెనెక్కాలి? ప్రజల నడ్డివిరవాలి?

తెలంగాణలో జరిగినంత అభివృద్ధి దేశంలో ఎక్కడైనా జరిగిందా? 

బిజేపి పాలిత ప్రాంతాల్లో కనీసం నిరంతర కరంటు వుందా?

కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో రైతుబంధు అమలౌతుందా?

 

ఆసరా పించన్లు రూ.2వేలు ఇస్తున్నారా?

కళ్యాణలక్ష్మి వంటి ఫథకాలున్నాయా?

రుణమాఫీ పేరుతో ఈ పథకాలను మాయం చేయాలని చూస్తున్నారా?

దళిత బంధు ఎలా సాధ్యమని ప్రశ్నించిన కాంగ్రెస్‌కు రుణమాఫీ ఎలా సాధ్యమో చెప్పాలి?

రాజకీయ దండయాత్రలు కాదు…ధరా ఘాతాలు తగ్గాలి?

జనం గోడు రాజకీయ పార్టీలకు పట్టాలి.

చిత్తం శివుని మీద రాజకీయం అధికారం మీద అన్నట్లుంది బిజేపి, కాంగ్రెస్‌ల పరిస్ధితి. 

నటించడం నేర్చుకున్న నాయకులు ఎప్పుడూ కళ్లు మూసుకొనే వుంటారని సామెత. మంచి జరిగితే మేం చేస్తున్న యాగమంటారు? నష్టం జరిగితే, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చలించకుండా వుంటారు? ఎందుకంటే తిప్పలు పడేది జనం. నేతలు కాదు? అందుకే ప్రజల కష్టాలు వారికి పట్టవు? ఎంత సేపు రాజకీయాలు? ఎన్నికలు? గెలుపులు? ప్రభుత్వాలు? వస్తే అదిస్తాం? ఇదిస్తాం? అవన్నీ అమలు చేసేందుకు పన్నులతో నడ్డి విరుస్తాం? ఇదేనా పాలనంటే? వినిమయం పోయి, వినియోగం అన్న పదం తెచ్చి చేర్చిన నాయకులకు ప్రజల గోడు తెలియకుండా పోతోంది? ఏమిటీ ధరలు? ఎందుకీ వాతలు? ఏమిటీ పరిస్ధితులు? తినడం కష్టమే అయితే జనం బతికేదెలా? వారి బతుకులకు మెతుకెలా? ఎంత సేపు అంతార్జాతీయ మార్కెట్‌ పేరు చెప్పుకుంటూ గడ్డు కాలం ఎల్లకాలం గడుపుతూనే వుందామా? ప్రపంచ మార్కెట్‌ను బూచీగా చూపి అర్ధాకలితో బతికేస్తూనే వుందామా? ఇంత కాలమైనా నిత్యావసర వస్తువుల మీద పరాయిదేశాల మీదే ఆధారపడి బతుకుతూ పోదామా? సన్నుల వాతలు ,ధరల మోతలు, దినదిన గండాలు తప్ప, సామాన్యుడి దిక్కేలేదా? తినేదెలా?బతికేదెలా? అది ఎవరూ ఆలోచించడం లేదు? కాని మేం పాలిస్తాం? మేమే పాలిస్తాం? కేంద్రంలో మేమే వుంటాం. రాష్ట్రాల్లోనూ మేమే పరిపాలనచేస్తాం? బాగానే వుంది? ప్రజల ఆశీస్సులు వుంటే ఎవరైనా గెలుస్తారు? ప్రజలకు మేలైన పాలన అంటే సంక్షేమం రాజ్యమేలాలి. సంక్షోభం కాదు. కుడుపునిండా తిండి, కంటినిద్ర ప్రజల కల్పిస్తే, వాళ్లు ఆరోగ్యంగా వుంటారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మిస్తారు. పొద్దుందాక కష్టం చేయాలి? వచ్చిన డబ్బుతో ఆకలి తీర్చుకోవాలి. అందుకు చేసిన కష్టమంతా ఖర్చు పెట్టాలి. చేసిన కష్టమంతా ఒక్క రోజు తిండికే పోతే మనిషి మనగడ ఎంత దుర్భరం. 

                          మళ్లీ మర్నాడు తెల్లారే పని బాట పట్టాలి. ఇక మనిషికి తీరికేది. మనసుకు సుఖమేది? వెట్టి చాకిరీ చేసిన కాలంలో కూడా ప్రజలు ఇంతగా బాధపడి వుండకపోవచ్చ మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. సగటు జనం ఏది కొనలేని పరిస్దితి. ఏది తిన లేని పరిస్ధితి. పెట్రోలు ధరలు అలా నిత్యావసర వస్తువులు ఇలా…ఆఖరకు ఆరోగ్యం కోసం వాడేమందుల ధరలు కూడా పెంచితే ఇక బతుకున్న వారు జీవచ్చవాలుగా మారడం తప్ప మరేమౌతుంది. ప్రభుత్వాలకు ఎందుకు పట్టడంలేదు. దేశంలో వున్న బిజేపి పాలిత రాష్ట్రాలకు పట్టడం లేదు. ప్రతిపక్షాలకు చెందని పార్టీలు కూడా అనేక రాష్ట్రాలలో పాలన సాగిస్తున్నాయి కదా! ఆ పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ల ప్రజలకు ధరలు పెంచుకుంటూ పోవడాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? తప్పనిసరై ప్రజలు ప్రశ్నిస్తే తప్ప, నాయకులు కదల్లేరా? రాజకీయ పార్టీలు ముందుకు రావా? తెలంగాణ రాష్ట్ర సమితి, ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రులు కేటిఆర్‌, హరీష్‌రావులు అంతో ఇంతో కేంద్రాన్ని నిలదీస్తున్నారు. కాని మిగతా రాష్ట్రాలలో ఆ చలనం లేదు. కాకపోతే ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ఎనమిది సంవత్సరాల కాలంలో తెలంగాణలో జరిగినంత ప్రగతి అన్నది దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఇది ముమ్మాటికీ సత్యం. ఇక అప్పుల బూచీ చూపి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే బిజేపి కేంద్రంలో చేసిన అప్పుల గురించి కూడా చెప్పాలి. అందుకు కొన్ని సాక్ష్యాలు చెప్పుకుంటేనైనా ప్రజల్లో కూడ ఆలోచన వస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా నిరంతర విద్యుత్‌ తెలంగాణలో అమలౌతుంది. పట్టణాల నుంచి మొదలు పల్లెల దాకా నిరంతర విద్యుత్‌ సరఫరా అవుతోంది. కాని ఈ సరఫరా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. పైగా వ్యవసాయానికి మొత్తంగా ఉచిత విద్యుత్‌ ఎక్కడా అందించడం లేదు. కాని ఒక్క తెలంగాణలోనే అమలౌతోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎనమిదేళ్ల కాలంలో పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. 

                              పొరుగు రాష్ట్రమైన మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పొలవరం నిర్మాణం ఎంత నత్తనడకన సాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోలవరం, కాళేశ్వరం దాదాపు ఏక కాలంలో ప్రారంభమైంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు. కాని కాళేశ్వరానికి కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదు. అంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు. కాని పోలవరం అక్కడే ఆగిపోయింది. సగం పనులు కూడా పూర్తి కాలేదు. కాని కాళేశ్వరం మొత్తం పూర్తయింది. ఆ ప్రాజెక్టు స్టేజీలన్నీ నీటిసరఫరా చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం. అంతే కాదు అంత తక్కువ సమయంలో బహుళార్ధక ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా పూర్తి కాలేదు. కాని తెలంగాణ చేసి చూపించింది. దానిని ఆధారం చేసుకొని అనేక రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయింది. ఒకనాడు నీటి చుక్క జాడలేని తెలంగాణలో ఎక్కడ చూసినా నీటి పరవళ్లే…పల్లెల్లో పచ్చదనమే…ఇది తెలంగాణ ప్రజలక తెలియడం లేదా? ఈ మధ్య కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన వరంగల్‌ డిక్లరేషన్‌ అంటుంటే ఆసక్తిగా చూస్తున్న రైతులకు, అరవైఏళ్లు పాటు తెలంగాణ ఎండబెట్టింది కాంగ్రెస్‌కాదా? పాలించినంత కాలం, అభివృద్ధి చేయాల్సినంత కాలం, అవకాశం వున్నా తెలంగాణలోని చెరువుల్లో తట్టెడు మట్టి తీయని పార్టీ కాంగ్రెస్‌ కాదా? కాంగ్రెస్‌ పార్టీ రైతుకు ఏక కాలంలో రెండు లక్షల రుణ మాఫీసాధ్యమా? ఎలాగైనా ఆచరణ సాధ్యం కాని హమీలు ఇచ్చి, అధికారం కోసం పాకులాడడం తప్ప కాంగ్రెస్‌ ప్రకటనల్లో నిజాయితీ వుందా? కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వున్న రాష్ట్రాలలో రైతు రుణమాఫీ ఏక కాలంలో పూర్తి చేశారా? అక్కడ రైతులు రుణాలు తీసుకోలేదా? మరి వారి గురించి ఎందుకు ఆలోచించడం లేదు? ఇక పెరుగుతున్న ధరలపై పోరాటం లేదు. వాటిని అడ్డుకోవడం లేదు. కాని అధికారంలోకి వస్తే అరచేతిలో వైకుంఠం చూపిస్తామని చెప్పడం మాత్రం అందరూ నేర్చుకున్నారు. తెలంగాణలో దళిత బంధు అమలుకు డబ్బు ఎక్కడినుంచి తెస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌ ఏక కాలంలో రైతులకు రుణమాఫీకి ఎక్కడినుంచి డబ్బులు సమకూర్చుతారో కూడా చెప్పాలి కదా! కాని దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతు బంధు వంటి స్కీమ్‌ తెలంగాణలో అమలౌతుందన్న సంగతి కాంగ్రెస్‌ మర్చిపోవద్దు. ఇక బిజేపి లెక్కలే వేరు…క్షేత్రస్ధాయిలో వాటికి విలువే లేదు. ఇటీవల బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముందు మహిళల ఏకరువు పెట్టిన విషయాలు చూస్తే అర్ధమౌతోంది. బిజేపి నేతల వద్ద ఆ సమాధనాం లేదు. 

                           తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై బండి సంజయ్‌ నిందల మీద నిందలేస్తున్నారు. మేమే ఎంతో మేలు అని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో అందుకున్న అక్కడున్న మహిళలు నూనెల ధరలేంది? ఉప్పుపప్పు ఎట్లా కొనాలే? గ్యాస్‌ ధర గంతైతే ఎట్లా? మేమేం తినాలే? లేనొళ్ల సంగతి ఏంది? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిన మహిళలకు సమాధనం చెప్పలేక బిక్క మొహం వేయడం బండి వంతైంది. ఆ ప్రశ్నించిన మహిళలకు సమాధానం చెప్పలేక, చెప్పడానికి ఏమీ లేక, ధరల పెరుగుదలపై నోరు మెదపలేక ఒక్కసారిగి దిక్కులు చూడడం మొదలు పెట్టారు. అప్పుడే బండి సంజయ్‌కు అనిపించొచ్చు. ఇన్ని రోజులు తన ప్రజాసంగ్రామయాత్ర వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదన్న తెలిపోయినట్లైంది. ముందు పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయలేరు. కాని అధికారంలోకి వస్తామంటే ప్రజలు సరే అంటారా? స్వాగతిస్తారా? ఎప్పుడో అమాసకో, పున్నానికో అన్నట్లు ఆరు నెలలో, ఏడాదికో పైసల్లో పెట్రోలు ధరలు పెరిగితే దేశమంతా ఉద్యమాలు జరిగేవి. ఏ విధమైన పన్నులు వేయాలన్న ప్రభుత్వాలు నానా రకాలుగా ఆలోచించేవారు. తప్పనిపరిస్ధితుల్లో పెరిగినా, మళ్లీ ప్రజాగ్రహానికి గురై తగ్గించేవారు. దేశాన్ని అవరై ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఇలా ధరలతో ప్రజలను నడ్డి విరిచే పరిస్దితి వుంటే, అంత కాలం పాలన సాగించేది కాదు? రాక రాక బిజేపికి అవకాశం రెండుసార్లు ప్రజలు ఇచ్చారు. మెరుగైన పాలన చేయమన్నారు. పేద ప్రజలకు అండగా నిలవమన్నారు. కాని ఇలా ఖాయిలా పరిన పరిశ్రమల పేరుతో లక్షల కోట్ల విలువైన స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు అడ్డికి పావుసేరు అప్పగించడాలను ప్రజలు సమర్ధిస్తారా? ఈ ఎనమిదేళ్ల కాలంలో కేంద్రంలో అధికారంలో వుండి ఏ ఒక్క జాతీయ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేశారా? 

                           దేశంలో మెరుగైన వైద్యం కోసం ఎన్ని ఎయిమ్స్‌ నిర్మాణం చేశారా? మేకిన్‌ ఇండియా అన్నారే గాని, ఎన్ని ఐఐటిలు స్ధాపించారు. ఇవి కదా? ప్రగతి అంటే…పెంచిన, పెరిగిన ధరలను ప్రజలు తట్టుకుంటూ, వస్తు వినియోగం జరుగుతోందంటేనే ప్రగతి అనుకునే వాళ్లు పాలిస్తే, ప్రజల పరిస్ధితి ఇలాగే వుంటుంది. కొనుగోలు శక్తి అంటే, పొదుపు లేకపోవడం కాదు? మొత్తం జేబు ఖాళీ చేసుకోవడమే కొనుగోలు శక్తికి నిదర్శనం కాదు..? రేపటి కోసం మనిషి నిశ్చితంగా వున్నప్పుడే ప్రగతి. అంతే కాని రేపటి కోసం కూడా ఇప్పటినుంచే పరుగెత్తే పరిస్ధితిని స్ధిరత్వం అనలేరు…ఆర్ధిక సుస్ధిరతకు తావు లేదు. నిత్యావసర వస్తువుల కొనుగోలకే సగటు మనిషి కష్టపడుతుంటే విలాసవస్తువులు ఎలా కొనుగోలు చేస్తాడు? సంతోషంగా ఎప్పుడు జీవిస్తాడు? ఓటు వేసిన పాపానికి కష్టం కొనితెచ్చుకున్నానని ప్రజలు బాధపడని రోజే నిజమైన పండగ.

నకిలీ అసెస్‌మెంట్‌లతో అక్రమాలు

 

`అమాయకులు భూములు ఆగమౌతున్నాయి?

`అన్యాక్రాంతమౌతున్నాయి?

`ఒకరి భూములు మరొకరి వశమౌతున్నాయి? 

`పక్కాగా పట్టాలౌతున్నాయిఎలా?

`రికార్డుల్లో ఇంటి నంబర్‌ లేకుండానే రిజిస్ట్రేషన్‌ 

` ములుగులో అంతుచిక్కని అక్రమ రిజిస్ట్రేషన్లు 

` గ్రామ పంచాయితీ అధికారులకు తెలియకుండా నకిలీ రికార్డుల సృష్టి

` నకిలీ ఇంటి నంబర్లకు తోడు లేని ఇళ్లను సృష్టిస్తున్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయం 

` అసెస్‌మెంట్‌లు నకిలీవా , నిజమైనవా కూడా నిర్ధారించుకోలేని అధికారులు 

` అక్రమాలకు అడ్డాగా ములుగు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

`కనిలీ రిజిస్ట్రేషన్ల కోరకు చేతులు మారుతున్న లక్షల రూపాయలు

`ఘనపురం మండలం గాంధీనగర్‌లో అక్రమ రిజిస్ట్రేషన్‌

                                      

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఫలాన భూమి నాదని ఎవరు ఎక్కడనుంచి కాగితాలు సృష్టిస్తారో…. చూపిస్తారో కూడా తెలియకుండా పోతోంది. రిజిస్రేషన్లు చేయిస్తున్నారు. మా భూములు అంటూ వస్తున్నారు. అసలైన భూ హక్కుదారులను ఆగం చేస్తున్నారు. వారి జీవితాల్లో చిచ్చు రేపుతున్నారు. వారి భూములు కాజేస్తున్నారు. అవి అసైన్డ్‌ భూములైనా సరే పక్కాగా పట్టాలు తెచ్చుకుంటున్నారు. లెక్క ప్రకారం అసైన్డ్‌ పట్టాలు చేయొదు? కావొద్దు? కాని దర్జాగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం అడ్డాగానే ఇవన్నీ సాగుతున్నాయి. ప్రైవేటు భూముల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడైతే ప్రజలకు న్యాయం జరగాలో అక్కడే అన్యాయం రాజ్యమేలుతుంది. ప్రజలను అన్యాయాలకు గురిచేస్తోంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేకం పుట్టుకొస్తున్నాయి? అని జనం చెప్పుకుంటున్నారు. బాధితులు బావురుమంటున్నారు. వాళ్ల గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక విలవిలాడుతున్నారు. 

కన్నీరు మున్నీరౌతున్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఆధారం లేకపోయినా, భూములను నమ్ముకొని బతకడమే ఎవరికైనా తెలుసు. అది కూడా లేకుండా చేస్తే వారి జీవితాలు వీధినపడతాయి? చాలా మంది ఇప్పటికే నేటిధ్రాత్రిని ఆశ్రయిస్తున్నారు. వివరాలు వెల్లడిస్తున్నారు. విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రైవేటు భూములా? ప్రభుత్వ భూములా? జాంతానై? రిజిస్రేషన్‌ కావాలా? అన్నదే ముఖ్యం. లొసుగులున్నా, లేకున్నా పత్రాలు సృష్టించొచ్చు. అలా జరుగుతున్నవి అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అయినా రిజిస్రేషన్‌ చేసేవారికి భయం లేదు? ఆ శాఖలో పర్యవేక్షణ లేదు? పాలకులకు పట్టింపు లేదు? అధికారపక్షానిక తీరిక లేదు? బిజేపికి అవగాహన లేదు? ప్రజాసంఘాలకు సమాచారం లేదు? ఇన్ని రాజకీయ పార్టీలున్నాయి. అన్యాయం జరుగుతున్న వారి పట్ల మాట్లాడే వారు లేరు? నిత్యం అనేక వార్తలు వస్తున్నాయి. స్పందించే తత్వం లేదు. సమయం లేదు. అవినీతి, అక్రమాలు అణిచివేస్తామని మాత్రం ప్రకటనలకు కొదవ లేదు. దాంతో రిజిస్రేషన్‌ కార్యాలయంలో ఆడిరది ఆట, పాడిరదిపాట,అక్రమరిజిస్ట్రేషన్లకు అడ్డాగా మారింది? ఈ మాటలు అనేక మంది బాధితులు దుమ్మెత్తిపోస్తూ చెబుతున్న మాట. 

                     కాసులు సమర్పించుకుంటే చాలు? ఆ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో కానిదేదీ లేదు? అక్రమ రిజిస్రేషన్లకు కొదువ లేదు? తూకం వేసి తూగితే చాలు…ఎవరి భూమైనా సరే…క్షణాల్లో మీ పేరుమీదకు రావాల్సిందే? కాస్తో, కూస్తో పరపతి వుంటే చాలు? నాలుగు రూకలు ఇచ్చుకనే స్థోమత వుంటే చాలు? అనుకున్న స్ధలం, కన్నేసిన స్థలం మూడోకంటికి తెలియకుండా రిజిస్ట్రేషన్‌ అయిపోతుంది. ఆ స్ధలం మీదైపోతుంది? ఈ మాటలు ములుగు, భూపాల పల్లి జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. ఇన్ని విమర్శలు నిత్యం వస్తున్నా, జరిగేవి జరుతూనే వున్నాయి. సామాన్యులు అన్యాయమైపోతూనే వున్నారు. మరి ఇలా అక్రమ రిజిస్రేష్టన్లు జరిగిపోతూనే వుంటాయా? వాటికి అడ్డుకట్ట పడదా? వాటిని ఆపేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు రాదా? రిజిస్ట్రేషన్ల శాఖ ఎలాగూ పట్టించుకోవడంలేదు. రాజకీయ పార్టీలైనా పట్టించుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఇప్పటికైనా రంగంలోకి దిగాలి. 

                          పేద ప్రజల ఉసురుపోసుకుంటూ ఎవరో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతుంటే బద్‌నాం అవుతున్నది అధికారపార్టీయే. తాజాగా జయశంకర్‌ భూపాల పల్లి జిల్లాకు చెందిన ఘణపురం మండలం, గాంధీ నగర్‌కు చెందిన అప్పాల కొమురయ్యకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం సాక్షిగా అన్యాయం జరిగింది. అక్రమం జరిగింది? ఆయన భూమి రాత్రికి రాత్రే ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ తంతు పూర్తయింది? అదెలా సాధ్యం? అని అమాయకంగా ప్రశ్నించకండి. ఇలాంటివి ఈ మధ్య కాలంలో చాలా జరుతున్నాయి. అప్పాల కొమురయ్య అనే వ్యక్తికి చెందిన 1.21 గుంటల భూమిని, అప్పాల శంకరమ్మ కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు కొమురయ్య చెబుతున్నాడు. శంకరమ్మ తన ముగ్గురు కూతుళ్లుదేన వేణ ఉమా మహేశ్వరి, పుర్రె లావణ్య, కోమల, అప్పాల రాజు పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ జరిగిపోయింది. 

                           ఈ స్ధలం 204 సర్వే నెంబర్‌లో 1.21 గుంటలు. ఈ స్ధలం అసలైన పట్టదారు అప్పాల కొమురయ్య తల్లిగారైన అప్పాల లక్ష్మమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్‌ వుంది. అప్పాల లక్ష్మమ్మ, అతని కొడుకు కొమురయ్యలే ఈ స్ధలాన్ని కొన్ని దశాబ్ధాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. సేద్యం చేస్తూ వస్తున్నారు. అనుకోకుండా ఇటీవల ఈస్ధలం ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయ్యిందని తెలిసి ఆందోళన చెందిన కొమురయ్య సబ్‌ రిజిస్ట్రార్‌ను సంప్రదించడం జరిగింది. నాకు సమర్పించిన సర్టిఫికెట్లను ఆధారం చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేయడం జరిగింది? అదేదైనా వుంటే కోర్టుతో తేల్చుకో…పో? అంటూ సబ్‌ రిజిస్ట్రార్‌ బాధితుడు కొమురయ్యకు తేల్చిచెప్పడం జరిగింది. ఒకరి భూమి, మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ చెప్పాల్సిన సమాధానం ఇదేనా? బాధితుడు కొమురయ్య నేటిధాత్రిని ఆశ్రయించాడని తెలిసిన తర్వాత మేడమ్‌ మాట్లాడడానికి రమ్మంటోందని కుమర్‌ అనే వ్యక్తి పోన్‌ చేసినట్లు కొమురయ్య నేటిధాత్రికి వెల్లడిరచడం జరిగింది. అంటే తప్పు జరిగిందన్న సంగతి సబ్‌ రిజిస్ట్రార్‌ తెలుసు. అమాయకుడిని భయపెడితే బెదిరి పోతాడని సబ్‌ రిజిస్ట్రార్‌ భావించినట్లుంది. కాకపోతే కథ అడ్డం తిరిగేలా వుందన్న సంగతి అర్ధమైంది. రాజీ ప్రయత్నాలు మొదలు పెట్టి, అనుచురుల చేత కొముర్యకు పిలుపులు వస్తున్నాయి? అసలు తప్పులు చేయడం ఎందుకు? అమాయకుల ఉసురుపోసుకోవడం ఎందుకు? సరే కొమురయ్య కాస్త గండె గట్టిది కావడం వల్ల ఏం జరగలేదు. కాని అదే సెన్సిటివ్‌ వ్యక్తి అయితే పరిస్దితి ఎలా వుండేది? కొన్నేళ్లుగా దానిపైనే ఆశలు పెట్టుకొని, సాగు చేసుకుంటూ, భూమిని కాపాడుకుంటూ వస్తున్నాడు. అలాంటి భూమి, ఒక్కసారిగా తనది కాకుండా పోయిందన్న సంగతి తెలిసి గుండె ఆగితే ఎవరు భాధ్యత వహించేవారు? సహజంగా రిజిస్రేషన్‌ కార్యాలయం అంటేనే రకరకాల లిటిగేషన్లు అనుకునే వారు. తప్పుడు డాక్యుమెంట్లకు తావుండదనేవారు? కాని కాలం మరిపోయింది.

                                 సర్వదరిద్రాలకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నెలవైందని ప్రజలు తిట్టుకుంటున్నారు. వెలుగులోకి వస్తున్న విషయలు కూడా అవే రుజువు చేస్తున్నాయి. అసలు కొమురయ్య స్ధలంలో లేని ఇంటి నెంబర్‌ను సృష్టించి పెట్టిన తప్పుడు సర్టిఫికెట్‌ను పొందుపర్చడం జరిగినట్లు తెలుస్తోంది. దానిని ఆధారం చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేసినట్లు స్పష్టమౌతోంది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. కాని గ్రామ పంచాయితీ ఇచ్చిన రసీదులు ఎక్కడా లేవు. అందుకు సంబందించిన వివరాలు ఏవీ లేవు! దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నట్లు డబ్బుల కోసం ఐనవారి మధ్యనే చిచ్చుపెట్టి దందాలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఇలా జీవితాలతో ఆడుకుంటున్నాయి. మరి అప్పాల శంకరయ్యకు న్యాయం ఎవరు చేయాలి? ఆయనకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చాలి. రెండు జిల్లాలో ఏక కాలంలో రెండుచోట్ల విధులు నిర్వహిస్తూ, రిజిస్రేషన్లు సాగిస్తూ, అమాయకుల జీవితాలను వీది పాలు చేస్తున్నారన్న ఆరోపణలకు కారణమౌతున్న వారికి కొమురయ్య ఉదంతం సాక్ష్యం కాదా? ఇప్పుడు చెప్పండి? గతంలో కూడా అనేక రుజువులు బైటకొచ్చాయి. అక్రమాలు వెలుగుచూశాయి? ఇప్పుడు కొమురయ్యకు ఎవరు న్యాయం చేస్తారో చేయండి? అతను పడుతున్న మనోవేధన ఎవరు తీర్చగలరు? లెక్కలేసుకొని, లెక్కబెట్టుకొని లెక్కలేని తనంగా తప్పుల లెక్కలు ఒకదాని తర్వాత మరొకటి లెక్కలేనన్ని చేసుకుంటూ పోతున్నవారు ఎవరు? అందరికీ తెలుసు…అయినా అందరి నోళ్లు ఎందుకు మూగబోతున్నాయి? సమాజమా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో? సాక్ష్యాధారాలతో సహా అన్ని రుజువులు కళ్లముందు కనిపించినా సరే…కాలం సమాధానం చెప్పేదాకా ఆగాల్సిందేనా? అమాయకులు మా బతుకింతే అనుకుంటూ కాలం వెల్లదీయాల్నా?

ఒట్టు తీసి గట్టు మీద పెట్టి ‘లీడర్‌’ నయ్యాను!

భవిష్యత్తు లో ఏమౌతావంటే లీడర్‌…అన్నాను…

మా ఊరికి బ్రిడ్జి కట్టిస్తానని చెప్పాను.

కష్టాలు కన్నీళ్లే తోడుగా పెరిగాను.

పెద్దత్త నీడలో, చిన్నత్త ప్రేమలో ఎదిగాను.

చిన్నప్పటి నుంచే లీడర్‌ ని…

ప్రశ్నించడం నా రక్తంలోనే వుంది.

వకృత్వ పోటీలో నేను చెప్పిన బ్రిడ్జి అప్పటి కలెక్టర్‌ నిర్మాణం చేశాడు…

ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ ప్రోద్బలంతో నిలిచాను.. గెలిచాను…

పార్టీ గుర్తించి అవకాశం ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞతలు.

కేసిఆర్‌ నాయకత్వం బలమైనది…పేదల అభ్యున్నతికి పాటుపడుతోంది…

ములుగులో టిఆర్‌ఎస్‌ పార్టీ బలంగా వుంది.

పార్టీకి అంకిత భావంతో వున్న నాయకులున్నారు.

ఈసారి ములుగు లో ఎగిరేది గులాబీ జెండానే…

ములుగు జడ్పీ వైస్‌ చైర్మన్‌ నాగజ్యోతి అంతరంగం…ఆమె మాటల్లోనే…ఎక్స్‌ క్లూజివ్‌ గా మీ నేటిధాత్రి లో…                                  

 హైదరాబాద్‌,నేటిధాత్రి: త్యాగాల వనంలో పూసిన పువ్వులు వాడుతాయా? పరిమళాలు కోల్పోతాయా? అన్నది ఒక చర్చ. ఎండిన పూ రేకులు కూడా మెలుస్తాయి..మొక్కలై మళ్లీ పూలు విరబూస్తాయి. పరిమళాలు ఎప్పుడూ వెదజల్లుతూనే వుంటాయి. అంటే ఇదేనేమో! బంతి పవ్వు ఎండినా మళ్లీ ఆ రేఖలు జల్లుతే మొక్కలౌతాయి. పూలు పూస్తాయి. ప్రజా సేవలో తరించే వారి వారసులు కూడా అదే దారిలో నడుస్తారని చెప్పడానికి ఇది కూడా ఒక సాక్ష్యమేమో! అంతటా ఇదే జరుగుతుందని కాదు. కొందరి జీవితాల్లోనే ఇలాంటివి నిజమౌతుంటాయి. అది పూర్వజన్మ సుక్రతమో! లేక మరేదో పుణ్యమో కాని పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు కొందరు జీవితాలు చిన్నప్పుడు తెలిసిపోతుంది. వారు ఏ రంగంలో స్ధిరపడిపోతారన్నది కూడా కొన్ని సార్లు చెప్పేయెచ్చు. ములుగు జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ నాగజ్యోతి జీవితంలో కూడా ఇది నిజమైందనే చెప్పొచ్చు. ఆమె జీవితంలో ఎంత విషాదం వుందో…అంతకు మించి ఆత్మవిశ్వాసం వుంది. అకుంఠిత దీక్ష వుంది. కొండంత ధైర్యముంది. ప్రశ్నించే తత్వం వుంది. నిలదీసే గుణం వుంది. ఎవరికీ భయపడని తెగింపు వుంది. తను అనుకున్న లక్ష్యం కోసం సాగే కఠోర పరిశ్రమ వుంది. భవిష్యత్తు మీద ఒక క్లారిటీ వుంది. అందుకే ఆమె చిన్న వయసులోనే లీడరైంది. ప్రజా ప్రతినిధిగా ప్రజల ఆశీర్వాధంతో ఎన్నికల్లో నిలిచి గెలిచింది. ప్రజల కోరిక మేరకు నాయకులరాలైంది. కాకపోతే ఇదంతా ముందుగా చేసుకున్న ప్లాన్‌ ప్రకారం జరగలేదు. 

కాగల కార్యం గంధర్వులే తీర్చుతారన్నట్లు ఆమె వేసిన ప్రతి అడుగును కూడా ఒక రకంగా దేవుడే తీర్చిదిద్దాడేమో అనిపించక మానదు. నాయకురాలు కావడానికి ముందు ఓ రోజు నాగజ్యోతి ఊరికి వచ్చిన సందర్భం ఒకటి. ఆమె భవిష్యత్తుకు పడిన మార్గం మరొకటి. అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం కూడా నాగజ్యోతి జీవితాన్ని మలుపు తిప్పింది. జనం కోరిక మేరకు ఎన్నికల బరిలో నిలిచినందుకు ఊరంతా ఓట్లేశారు. సర్పంచ్‌గా గెలిపించారు. ఆ పదవి చేపట్టి మూడు నెలలు కాకముందే, తాడ్వాయి జడ్పీటీసిగా పోటీ చేసే అవకావం వెతుక్కుంటూ వచ్చింది. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ నుంచి కబురొచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపొచ్చింది. ఎలాగైనా సాయంత్రంలోగా నామినేషన్‌ వేయాలని నన్నపనేని నుంచి నాగజ్యోతికి ఫోన్‌ వచ్చింది. అంతా అయోమయం. అనూహ్యమైన నిర్ణయం. సరిగ్గా ఆ సమయంలో నాగజ్యోతి ఓ శుభకార్యంలో వుంది. ఈ శుభ వార్త ఆమె చెవిన పడిరది. ఇప్పుడెలా, ఎలా అనుకుంటున్న సందర్భం నుంచే ఏమాత్రం ఆలోచించినా, కాల యాపన చేసినా నామినేషన్‌ వేసే అవకాశం చేజారుతుంది. వెంటనే హన్మకొండనుంచి బయలుదేరింది. జిల్లాకేంద్రానికి చేరింది. నామినేషన్‌కు అంతా సిద్ధం చేసుకున్నది. కాని కొత్త బ్యాంకు అకౌంట్‌ బుక్‌ కావాలన్నారు. మళ్లీ ఆందోళన. కాని ఆఖరు నిమిషంలో నామినేషన్‌ అంతా సవ్యంగా సాగింది. టిఆర్‌ఎస్‌ నుంచి బిఫారం అందింది. అధికార తెరాస పార్టీ అభ్యర్ధిగా సమ్మక్క`సారలమ్మల మండలనుంచి గెలిచింది. పార్టీ పెద్దలైన ముఖ్యమంత్రి కేసిఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు కల్వకుంట్ల తారకరామారావు, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ తోపాటు, జిల్లా , మండల స్ధాయి నాయకుల ఆశీస్సులతో ములుగు జడ్సీ వైస్‌ చైర్మన్‌ అయ్యింది. నాగజ్యోతి లీడర్‌ ఎందుకయ్యింది? అన్నదాని వెనక ఆసక్తికరమైన విషయాలు కూడా వున్నాయి.

పసి వయసులోనూ అంతా శూన్యం. కాని నాగజ్యోతికి ఏమీ తెలియదు. కాని ఏదో వెలితి. నా అన్న వారు ఎంత మంది వున్నా పిలిచేందుకు అమ్మ, నాన్న, నానమ్మ, తాత ఇలా ఎవరూ లేరు. ఏ పసివాళ్లకైనా ముద్దు ముద్దు మాటలు వచ్చే ముందు ఎవరైనా అత్తా, అత్తా అనమని ఎందుకంటారో గాని నాగజ్యోతి జీవితాన్ని తెలుసుకుంటే అర్ధమౌతుంది. జన్మనిచ్చినవారు పరలోకం చేరారు. నానమ్మ, తాత వారు దేవుడి సన్నిధికెళ్లిపోయారు. నాగజ్యోతిని మేనత్తలిద్దరూ పెంచుకున్నారు. సాదుకున్నారు. విద్యాబుద్దులు చెప్పించారు. నాగజ్యోతి ప్రయోజకురాలయ్యేందుకు కృషి చేశారు. కాకపోతే ఎంతో చురుకైన ఆడబిడ్డ నాగజ్యోతి. పసి వయసులోనే మా ఊరుకు రోడ్డెందుకు లేదు? వాగు దాటేందుకు బ్రిడ్జి ఎందుకు లేదు? తన కళ్లముందే వాగులో కొట్టుకుపోయిన వారిని చూసింది? అయ్యో అని ఆ పసి తనంలోనే ఎంతో మదనపడేది. అన్నిరకాల సౌకర్యాలు వున్న ప్రాంతాలకు మాకు తేడా? ఎందుకు? మాకు అభివృద్ధి జరగదెందుకు? అన్న ప్రశ్నలు తనలోతానే వేసుకునేది. 

                          ఇలాంటి సందర్భంలో ఓసారి స్కూల్‌లో వకృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో ఏమౌతారు? అనుకున్న లక్ష్యం నెవరేరితే ఏం చేస్తారన్నదానిపై విద్యార్ధులును మాట్లాడమన్నారు. అప్పుడు నాగజ్యోతి నేను లీడర్‌నౌతాను. మన ఊరికి బ్రిడ్జి కట్టిస్తాను. అని చెప్పింది. ఇది జరిగిన కొన్ని రోజులకు వాళ్ల ఊరి వాగు మీద బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆ సమయంలో జిల్లా ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌ వున్నారు. కాకతాళీయంగా జరిగిందో…లేక నాగజ్యోతి అనుకున్నది నెరవేరిందో గాని, వాళ్ల ఊరికి బ్రిడ్జి వచ్చింది. చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు నాగజ్యోతిలో కనిపించేవి. ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులను నుంచి సంక్రమించి ఆస్తిగా ప్రజా సేవ, నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకున్నదనే చెప్పొచ్చు. ఇక తాను హస్టళ్లలో వున్న సమయంలో భోజనం నాణ్యత కోసం కొట్లాడిన రోజులు కూడా వున్నాయి. డిగ్రీ హస్టల్‌ ఏర్పాటు కోసం పోరాటం చేసింది. అయితే ఎక్కడ నాగజ్యోతి కూడా రివల్యూషన్‌ లక్షణాలతో ఎక్కడ అడవిబాట పడుతుందో అన్న ఆందోళన వారి మేనత్తల్లో ఎప్పుడూ కనిపిస్తూనే వుండేది. సహజంగా మేధావులకే తిరుగుబాటు లక్షణాలు ఎక్కువగా వుంటాయి. ప్రశ్నించే తత్వం అలవడుతుంది. ఆ కుటుంబమంతా ఇప్పటికే ప్రజల కోసమంటూ, ప్రజా సేవంటూ అమరులయ్యారు. నాగజ్యోతి కూడా అదే బాట పట్టొద్దని హన్మకొండలోని కాలేజీలో చేర్పించారు. కాని నాయకత్వ లక్షణాలు మాత్రం ఆమెలో ఎప్పుడూ కనిపిస్తూనే వుండేవి. దాంతో నాగజ్యోతి మేనత్తలు ఓసారి ఆమెతో ఒట్టేయించుకున్నారు. నేను ఎప్పుడూ నాయకత్వ లక్షణాల పేరిట, ఉద్యమాలు, పోరాటాలు, ప్రజలు అంటూ వెళ్లనని మాటిచ్చేదాకా ఊరుకోలేదు. ఇక తప్పని పరస్ధితుల్లో నాగజ్యోతి వారికి మాటియ్యాల్సిన పరిస్దితి ఎదురైంది. ఆ తర్వాత పూర్తిగా చదువు మీద దృష్టి సారించిన నాగజ్యోతి ఉన్నతవిద్యావంతురాలైంది. ఎమ్మెస్సీ బోటనీ చేసింది. బిఎడ్‌ పూర్తి చేసింది. అనుకోకుండా ఏ మేనత్తలైతే ఒట్టు వేయించుకున్నారో…ఆ ఒట్టు గట్టుమీద పెట్టక తప్పలేదు. నాగజ్యోతి రాజకీయాల్లోకి రాకతప్పలేదు. కాకపోతే ఎంచుకున్న మార్గం వేరు. ప్రజా సేవ అన్నది మాత్రం కామన్‌. 

మేనత్తలు, వారి పిల్లలతోపాటు స్నేహితులకు కూడా నాగజ్యోతి జీవితంలో ఒక భాగమయ్యారు. డిగ్రీ, పీజిలు చేసిన సమయంలో తన స్నేహితులు కొమురం శైలజ, పాయం తులసీ దేవి, కొప్పుల మల్లీశ్వరి తనకు ఎంతో మేలు చేశారని చెబుతుంటారు. వాళ్లు నా కోసం ఆలోచించింనంతగా, వారి కోసం కూడా ఆలోచించుకోని రోజులు కూడా వున్నాయంటూ నాగజ్యోతి తన స్నేహితురాళ్ల గురించి చెబుతుంది. వారి తోడ్పాటు కూడా తన ఉన్నత విద్యకు ఎంతో తోడ్పడిరదని చెబుతుంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే, అనుకోకుండా జరిగిన సందర్భమే. కాని నన్ను నాయకురాలిని చేసింది కూడా మా గ్రామమే…నా ప్రజలే…సర్పంచ్‌గా గెలిచిన మూడు నెలలకే జడ్పీటీసిగా అవకాశం రావడం అదృష్టం. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ చొరవ, ఆశీస్సులుతో జడ్పీటీసీ అయ్యాను. తన పేరు ప్రతిపాదననను అంగీకరించి తనకు ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసిఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంటు, పురుపాలక, ఐటి శాఖ మంత్రి తారకరామారావుకు ప్రత్యేక ధన్యవాదాలు. కృతజ్ఞతలు. ప్రజా సేవ చేయాలన్న నా ఆశయం ఇంత త్వరగా వస్తుందని కూడా ఊహించలేదు. జిల్లా స్ధాయి సేవలు అందించే అవకాశం ఇచ్చిన పార్టీ కోసం, ప్రజల కోసం అహర్నిషలు పనిచేస్తున్నారు. నా గెలుపుకు కృషి చేసిన మండల రాజశ్రీ, నాగమ్మ, పురుషోత్తం, శివారాజు, జాజి చంద్రంలకు కూడా ధన్యవాదాలు. నా ప్రజలకు ఏం కావాలో తెలుసు. ఎందుకంటే ఆ బాధలనుంచి వచ్చాను. నా కుటుంబం కూడా మా ప్రాంతం కోసం ప్రాణాలొదిలారు. నాకు వచ్చిన ఈ అవకాశంతో వారి ఆశయాలు నెరవేర్చడం కోసం నా జీవితాంతం ప్రజలకు సేవ చేస్తాను. వారి కోసమే రాజకీయాలు చేస్తాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కోసం పనిచేస్తాను. పేదల ప్రజల్లో వెలుగులు నింపడమే నా కల. అది నెరవేరేదాకా విశ్రమించను. అందుకు నా ప్రజల ఆశీస్సులు ఎల్లకాలం వుండేలా చూసుకుంటాను. అటు పార్టీని కాపాడుకుంటూ, ఇటు ప్రజల సంక్షేమం చూసుకుంటూ, తన ప్రాంతం ప్రగతిలో మందుకు సాగేందుకు కృషి చేస్తాను.

సుప్రభాత కాంతులు…సుభాషన్న తెచ్చిన వెలుగులు…

ఊర్లకు ప్రగతి దారులు…

కొత్త తరం విద్యాలయాలు…

పేదలకు ఇండ్ల వరాలు…

ఆపద అని వస్తే ఆదుకుంటాడు

ఆరోగ్యం కోసం వెళ్తే వైద్యం చేయిస్తాడు

గుడి కోసమంటే కదిలొస్తాడు…

 

వైద్యం కోసమంటే చలిస్తాడు…

బడి కోసమంటే ముందూ వెనుక చూసుకోడు…

ఎవరొచ్చినా కాదనడు…లేదనడు..సాయం చేయకుండా పంపడు.

బడైనా, గుడైనా, ఊరంతా బాగు చేయాలన్నా ఆయన చెవిన పడితే చాలు…

                             నేనున్నానంటాడు…ముందుకొస్తాడు…

ఇలాంటి వ్యక్తి తెలంగాణలో మరొకరు లేరు…

జనం గుండెల్లో సుభాష్‌రెడ్డి నింపిన వెలుగులు…

తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయి…ఆ నిర్మాణాలు…

అనుకోవడం వేరు. ఆలోచన చేయడం వేరు. ఆచరించడం వేరు. కల గనడం వేరు. నెరవేర్చగవ వేరు. సాయం చేయడం వేరు. ఆదుకోవడం వేరు. తన వారితో ప్రేమతో వుండడం వేరు. ఆపదలో అండగా నిలవడం వేరు. ఊరు బాగు చేయడం వేరు. ఊరంతా పంగడ చేయడం వేరు. అందరం అనుకోవం వేరు. మనమంతా ఒక్కటే అనకోవడం వేరు. అందరి ఆనందం వేరు. సుభాష్‌రెడ్డి కోరుకునే అందరి సంతోషం వేరు. ఇది ఎవరూ తీర్చలేనంతది.

ఎవరూ ముందుకొచ్చి చేయలేనంతది. అందుకే సాయాలెందరు చేసినా సుభాష్‌రెడ్డి చేసే సాయమే వేరు…ఆయన సాయం సానుభూతితో చేసేది కాదు. సహకారంలో భాగంగా చేయడం. సమాజంలో ప్రగతి కోసం చేసేది. సమాజ పరిణతి కోసం చేసేది. ఆదుకోవడమంటే అలాంటి ఇలాంటి ఆదుకోవడం కాదు. అక్కున చేర్చుకోవడం. దగ్గరుండి అవసరాలు తీర్చడం. ఆపదలో వున్నాడని తెలిసి అండగా వుండడం. ఇవన్నీ మరెవరూ చేయలేనివి. మనసున్న మనిషిగా ఒక్క సుభాష్‌రెడ్డి మాత్రమే చేయగలిగేవి.

                        నేను అనే పదం ఆయన దృష్టిలో చాలా చిన్నది. ఈ రెండక్షరాలను విడదీస్తే విశ్వమంత పెద్దది. నేను అనే పదంలో నువ్వు,నేను అన్నది వున్నది. ఆ రెండు సుభాష్‌రెడ్డి గుండెల్లో వున్నవి. అందుకే అతనొక ప్రపంచం. నేను అన్న స్వార్ధం అతనిలో ఎప్పుడూ లేదు. నాలో మీరంతా వున్నారంటారు. మీ కోసమే నేనున్నారంటారు. మీ కోసం ఏదైనా చేస్తానంటాడు. కష్టపడడమే ఆయనకు తెలుసు. కూడబెట్టడం తెలియదు. దాచుకోవడం అసలే తెలియదు. తోటి వారి అసవరాల కోసమే తన కష్టార్జితం వినియోగిస్తుంటాడు. వారిని ఆదుకుంటుంటాడు. అడిగింది ఇస్తుంటాడు. మీరే నా ప్రాణమంటుంటాడు. సాటి మనుషులను ప్రాణంగా చూసుకుంటుంటాడు. తన చేతికి ఎముక లేనంతగా సాయం అందిస్తుంటాడు. అడిగింది కాదనడు. లేదన్న మాట చెప్పడు. ఎందుకంటే ఆయనకు ఊరంటే ఇష్టం. తోటి వారంటే ప్రాణం. ఆయన ఎప్పుడూ చెప్పేది మనమంతా ఒక కుటుంబం. ఈ రోజుల్లో ఒకరికి మరొకరు సాయం అందించడమే గొప్ప. అలాంటిది అదేదో సినిమాలో మహేష్‌బాబు ఊరును దత్తత తీసుకున్నట్లు తెర మీద చూశాం. ఔరా అని ముక్కున వేలేసుకున్నాం… కాని మన తెలంగాణలో సుభాష్‌రెడ్డిని నిజంగానే చూస్తాం. అయితే ఆయన ఒక్క ఊరు కాదు, ఊర్లను దత్తత తీసుకున్నాడు. దత్తత అంటే అలాంటి ఇలాంటి దత్తత కాదు…ఊరంతా పండగ చేసుకునేంత…

                         ప్రార్ధించే చేతులకన్నా, సాయం చేసే చేతులు మిన్నా అని వివేకానందుకుడు అన్నారు. ఏ గడిలో ఆ మాట అన్నాడో గాని, సుభాష్‌రెడ్డి లాంటి వారు భవిష్యత్తులో వస్తారని ఊహించే అన్నారేమో! అనిపిస్తోంది. వేల కోట్లు వున్నవారు కూడా సాయం చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించే ఈ రోజుల్లో అర్ధించడమే ఆలస్యం. సాయం చేస్తూ పోయేవారున్నారు. అందులో సుభాష్‌రెడ్డి ముందు వరసలో వుంటారు. స్నేహుతుల హితం కోరుతాడు. స్నేహితులంతా సంతోషంగా వుండాలనుకుంటాడు. ఇరుగు పొరుగు ఆనందంగా వుండాలనుకుంటాడు. వారి ఆనందం కోసం ఏదైనా చేస్తాడు. ఊరంతా దత్తత తీసుకుంటాడు. ఊరికేమేమి అవసరమో! అన్నీ సమకూర్చుతాడు. వ్యక్తి గత అవసరాల నుంచి మొదలు, సమాజ అవసరాలన్నీ తీర్చుతాడు. ఊరుకోసం ఏదైనా చేస్తాడు. ఎంతైనా చేస్తాడు. అందుకే ముందుగా తన ఊరి ప్రజలకు తోడుగా నిలిచాడు. అండగా నిలిచాడు. అవసరం కోరి వచ్చిన వారికి ఆదుకున్నాడు. విద్యా, వైద్యం విషయంలో లేదనకుంటా సాయాలు చేస్తూ వస్తున్నాడు. ఎంత ఖర్చైనా సరే ప్రాణాలు నిలుపుతూ వస్తున్నాడు. గుళ్లుకు చందాలు, విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు, వైద్యాని వేలాది రూపాయలు అందిస్తూనే వుంటారు. జిల్లాలో ఏ ఊరులో గుడి కట్టాలనుకున్నా ముందు వచ్చేది సుభాష్‌రెడ్డి గడప తొక్కితే చాలు…అన్నంత పేరు సొంతం చేసుకున్నారు. ఇక తన ఊరు గొప్పగా వుండాలనకున్నాడు. అందుకు ఎంత ఖర్చైనా ఫరవాలేదనుకున్నాడు. బాగు చేయడం మొదలు పెట్టాడు. ఊరును పట్టణమంతా సుందరం చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన రెండు పడకల ఇండ్లను అద్దాల్లాంటి మేడలుగా నిర్మించాడు. పేదల ఇండ్లంటే నమ్మలేనంత సుందరంగా తీర్చిదిద్దాడు. అందమైన కాలనీ నిర్మాణం చేశాడు. ప్రకృతి రమణీయతకు నిలయం చేశాడు. 

                  రాష్ట్రమంతా అబ్బురపడిపోయేలా సుందర వనం చేశాడు. ఊరులోనే కొత్త వాడను కొత్త ఇండ్లతో ముస్తాబు చేశాడు. వారికి కొత్త లోకాన్ని పరియచం చేశాడు. వారి జీవితాలకు భరోసా నింపాడు. వారి సొంతింటి కలను నిజం చేయడం కాదు. ఇల్లే కద స్వర్గ సీమ అంటే ఇలా వుంటుందని కట్టిచూపించాడు. వారికి తన అభిమానాన్ని పంచి, బహుమానంగా ఇండ్లు నిర్మించి ఇచ్చాడు. ఊరురుకి గుడి కావాలి. దేవుడు కొలువుండాలి. అదే ఊరులో బడి వుండాలి. విద్యాలయం ఒక ఉపనిషత్తులుగా వెలుగొందాలి. అది సుందరమైన, సౌకర్యవంతమైనది వుండాలి. విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో బడి వుండాలి. ఏ కార్పొరేట్‌ పాఠశాల కూడా వుండనంత ఉన్నంతగా బడి నిర్మించాడు. తను చదువుకున్న బడిని కొత్తగా ముస్తాబు చేశాడు. మరిన్ని తరాల దాకా చెక్కు చెదరకుండా, ఆయన పేరుకు కీర్తి కిరీంటంగా, తన తల్లిదండ్రుల పేరు చిరస్ధాయిగా నిలిచిపోయలా నిర్మాణం చేశారు. పుస్తకమంటే ఇష్టం. అందుకు పుస్తక ప్రపంచం కోసం గ్రంధాలయం నిర్మించాడు. కన్న ఊరు రుణం ఇలా తీర్చుకుంటున్నాడు. ఇలా ఎంత మంది చేస్తారు. ఒక్క సుభాష్‌ రెడ్డి మాత్రమే కనిపిస్తారు…

అడవిబిడ్డ


త్యాగాల చరిత్రలో విరబూసిన వెలుగు రవ్వ
ఆ కుటుంబమంతా పేదల కోసమే….
వారి ఆశయాలన్నీ జనం కోసమే…


అశువులుబాసింది ప్రజల కోసమే…
అడవిదారిలో చీకటిని చీల్చుకుంటూ వెలుగు ప్రసాదించారు…


ఆ కుటంబం నుంచి ఎదిగిన నాయకురాలు
ములుగు జిల్లాలో కీలకమైన నేత నాగజ్యోతి
తెలంగాణ రాష్ట్ర సమితికి ఆశాజ్యోతి…
త్యాగాల కీర్తి వనంలో రాజకీయ వేకువ కిరణం…నాగజ్యోతి

ఆకుల అలికిడి వింటే గుండె రల్లుమనే కాలం…బూట్ల చప్పుడు వినిపిస్తే చాలు గుండెలు అదిమిపట్టుకున్న సమయం. ఉచ్చ్వాస నిశ్చ్వాసలు కూడా బైటికి వినిపించనంతగా ఊరిపి బిగబట్టుకొని బతికి జనం. ఒక్కసారి ఊహిస్తేనే ఒళ్లు జలధరిస్తోందా? గుండెలో ఎక్కడో అలజడి మొదలైనట్లు అనిపిస్తుందా? కాని మన ఊహకు, అనుభవించిన వాళ్ల పరిస్ధితి ఎలా వుంటుందో ఆలోచించండి. అదీ నాటి ఆది వాసీ ప్రాంతాలలో వుండే అమాయక గిరిజన ప్రజల కష్టం… ఎంత చెప్పినా తక్కువే…ఎంత విన్నా అది సగంలో కూడా ఓ చిన్న భాగమే…అలాంటి పల్లెలో వెలుగుల కోసం ఓ జంట 1990వ దశకంలో రాజ్యంతో కొట్లాడిరది. పల్లె వేకువ కోసం, ప్రగతి కోసం, వారి బతుకుల బాగు కోసం ముందడుగు వేసింది. గరిజనం భక్తి కోసం, విముక్తి కోసం ఆ దంపతులు పడిన తపన, అనుభవించిన వేధన, పరితపించిన యాతన చెప్పడానికి మాటలు సరిపోవు. ఒక కుటుంబంలో ఒక్కరో ఇద్దరో అడవిబాట పట్టారంటే అదే పెద్ద సంచలనం. కాని కుటుంబం మొత్తం జనం కోసం అడువుల్లో పోరాట జీవితం కోరుకున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. మనసు నిండా త్యాగమన్నది కళ్లనిండా కష్టమన్నది కనిపిస్తున్నా కళ్ల పెద్దవి చేసుకొని అడుగులేయాలి. బతుకును బలి చేసుకోవడానికి ప్రతి క్షణం సిద్దంగా వుండాలి. ఇలాంటి ధైర్యం ఎదరింపు వల్లలో, బెదిరింపు వల్లనో పోదు…తొలిపొద్దును కళ్లారా చూడుకుండా కన్నుమూయదు. కన్నీళ్లు దిగమింగుకుంటూ బతికినా, కళ్లలో కన్నీటి చుక్కలు ఇంకినా పోరుబాటలోనే కాలం కాటేసేదాకా ఆ దంపతులు నడిచివారున్నారు. తమ ప్రజల కోసం ప్రాణాలొడ్డినవారిలో ఆ దంపతులు ఆదర్శమయ్యారు. అడవి తల్లి ఒడిలో బతికే వాళ్లకు బుక్కెడు బువ్వ కోసం ఏళ్ల తరబడి పల్లెలు ఏడ్చిన కాలాన్ని ఎదిరించి నిలిచారు. తిరుగుబాటు తెచ్చారు. పోరు బాటను ఎంచుకున్నారు. అడవిబాట పట్టారు. అశువులు బాశారు. అమరులయ్యారు. తరతరాల వెలుగుకు మార్గమయ్యారు. అడవిదివిటీలై వెలుగుతున్నారు. జనం గుండెల్లో నిలిచిపోయారు. ఆ పోరు వీరుల ప్రేమకు మరో తరం పురుడుపోసి, జనం గీతికను సజీవం చేశారు..
బిక్కుబిక్కుమనే బతుకుల మధ్య తుపాకుల మోతల మధ్య, నట్టనడి అడవి మధ్య కడుపులో పడ్డ అడవిబిడ్డ…ఆడబిడ్డ…సమాజం కోసంలో పరితపించే వారి కడుపున పుట్టిన బిడ్డ. అన్యాయాన్ని ఎదిరించిన దంపతుల చైతన్యం నుంచి పుట్టిన బిడ్డ. పిడికిలెత్తి జననినాదాలు చేసిన వారి కళ్లలో నుంచి పుట్టిన వెలుగు రేఖ. సమసమాజ నిర్మాణం కాంక్షించిన వారి ప్రతిరూపంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్న చైతన్య గీతిక. పిడికిలెత్తి జననినాదాలు చేసిన వారి కళ్లలో నుంచి పుట్టిన వెలుగు రేఖ. సమసమాజ నిర్మాణం కాంక్షించిన వారి ప్రతిరూపంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్న చైతన్య గీతిక. నేడు జనం మధ్య ప్రజానాయకురాలిగా నాగజ్యోతి ఎదిగారు.
అదో విద్యావంతమైన కుటుంబం. చుట్టూ చీకటి ప్రపంచం. తోటి సమాజంలో ఆకలి కోసం ఆర్తనాదాలు. చేసుకోవడానికి పని లేక, దాహం తీర్చుకోవడానికి నీరు లేక, ఆకుల అలములు కూడా ముట్టుకునే హక్కులేక, వెట్టికి బలౌతున్న వారి కోసం కదలింది ఆ కుటుంబం. అన్న, ఇద్దరు తమ్ములు అడవిబాట పట్టారు. జనం గుండెల్లో అన్నలుగా మిగిలిపోయారు. అన్న అడవిబాట పట్టాడని తెలిసి, ప్రభుత్వం తమ్ములను ప్రశ్నించడం మొదలు పెట్టింది. చిత్రహింసలు పెట్టడం పరిష్కారమనుకున్నది. అడుగడుగునా ఆ కుటుంబాన్ని పగ పట్టింది. సమాజం అంటే పాపం. అన్యాయం అంటే నేరం. బతుకుల బాగుకోసం మట్లాడితే కేసులు…ఇలా నోరిత్తితే తప్పు…గట్టిగా ఊపిరి తీసుకున్నా తప్పు. అలాంటి కాలంలో సమజాన్ని జాగృతం చేసిన కుటుంబం ఒకటుంది. ములుగు జిల్లా జనం గుండెల్లో ఆ తరం సజీవంగా వుంది. ఆ కుటుంబం ఇంకా ప్రజా సేవలో తరిస్తూనే వుంది.
ఆయన కాల్వపల్లి ఆది వాసీ గూడెంలో ఒక గరువు. పేరు బడే జగన్నాధరావు. ఆయనకు మువ్వురు కొడుకులు. బడే రాంబాబు. బడే నాగేశ్వరరావు, మురళీధర్‌ రావులు అన్నదమ్ములు. ముందు అన్న బడే రాంబాబు అడవి బాట పట్టాడు. ఆయన ఆచూకీ కోసం తమ్ములను ప్రభుత్వం వేధిస్తుంటే జనం కోసం అజ్ఞాతంలోకి దళంలోకి వెళ్లిన నాగేశ్వరరావు, రాజేశ్వరిల మధ్య ప్రేమ చిగురించింది. వారి ప్రేమకు ప్రతిరూపంగా నాగజ్యోతి ఈ ప్రపంచాన్ని చూసింది.
పగిగడ్డుగా నాగజ్యోతి తమ నానమ్మ ఒడిలోకి చేరింది. అమ్మా, నాన్న అన్నీ నానమ్మ లోనే చూసుకుంటు పెరిగింది. కొంత కాలానికి తల్లి రాజేశ్వరి జనజీవన స్రవంతిలోకి వచ్చింది. నాగజ్యోతి కోసం ఇంటిబాట పట్టింది. కాని అవే వేధింపులు…అవే ఇబ్బందులు…ఆఖరుకు అవే తుపాకుల తూటాలకు బలైంది. నాగజ్యోతి నాన్న నాగేశ్వరరావు కూడా కొద్దిరోజుల్లో జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నా, కొందరి స్వార్ధం మూలంగా ఆయన కూడా ప్రభుత్వ తూటాలకు బలయ్యారు. తనను కన్న తల్లి, గెండెల్లో పెట్టుకొని పెంచుకున్న నానమ్మ, సాకిన తాత ఏడాది కాలంలో ముగ్గురూ ఈ లోకాని దూరమయ్యారు. నాగ జ్యోతిని అనాధను చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత నాగజ్యోతి మేనత్తలు పెంచి పెద్దచేశారు. ఆమె భవిష్యత్తుకు బాటలు వేశారు. ప్రజల కోసం జీవితం త్యాగం చేసిన తల్లిదండ్రులను స్మరించుకుంటూ వారి ఆశయాలను తల్చుకుంటూ, వారి గురించి జనం గొప్పగా చెప్పుకుంటున్న మాటలు వింటూ నాగజ్యోతి పెరిగింది. ఉన్నత విద్యావంతురాలుగా తనను తాను తీర్చిదిదుకున్నది. ఎంత కష్టమైనా చదువును పూర్తి చేసింది.. పల్లెజనం గోస చూసింది. ఆ అడవి బిడ్డలు పడే కష్టం తనూ పడిరది. ప్రపంచం ఎంతో ముందుకు పోతున్నా, తమ జాతి ఇంకా ఎందుకు వెనకబడిపోతోందని ప్రతి క్షణం మధనపడిపంది. హస్టళ్లలో చదువుకుంటూ పేదరికం చూసింది. అడవిలో వున్న కష్టం చూసింది. తన తల్లిదండ్రులు కలలు గన్న సమాజం కోసం, నాగజ్యోతి నడుంబిగించింది. ఏ సమాజంలో చైతన్యం లేక, అణిచివేతకు గురైందో…ఆ సమజం నుంచే జన నేతగా ఎదగాలనుకున్నది. ఆ కుటుంబ త్యాగాల పునాదుల మీద అడవిబిడ్డల బాగుకోసం కృషి చేయాలని నాగజ్యోతి నిర్ణయం తీసుకున్నది.
సమజంలో పెరుగుతున్న కుళ్లు, కుతంత్రం కళ్లారా చూసింది. తన వాళ్ల కోసం తల్లిదండ్రులు చేసిన సేవలో శక్తియుక్తులున్నంత వరకు సేవ చేసేందుకు నాగజ్యోతి ఊరు బాట పట్టింది. ఊరందరి కోరిక మేరకు గ్రామ సర్పంచ్‌ ఎన్నికల్లో నిలిచి గెలిచింది. ప్రజల ఆశీర్వాదంతో అఖండ మెజార్టీ సొంతం చేసుకున్నది. ఊరిలో 720 ఓట్లు వుంటే, 700 ఓట్ల మెజార్టీతో నాగజ్యోతి గెలిచింది. ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి దృష్టి నాగజ్యోతిపై పడిరది. ఆ తర్వాత వచ్చిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో భాగమైన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో తాడ్వాయి నుంచి జడ్పీటీసిగా పార్టీ అవకాశం ఇచ్చింది. అక్కడ కూడా నాగ జ్యోతి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. ములుగు జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా ప్రజలకు సేవలందిస్తోంది. భవష్యత్‌ ములుగు జిల్లా రాజకీయాలలో కీలకమైన నేతగా గుర్తింపు పొందింది. ప్రతి క్షణం తన తల్లిదండ్రుల త్యాగాలను తల్చుకుంటూ, తన జాతి బిడ్డలు పడుతున్న వేధనల నుంచి విముక్తికోసం పని చేస్తోంది. వారికి అందాల్సిన న్యాయమైన హక్కుల కోసం పరితపిస్తోంది. తన శక్తి మేరకు ప్రజలకు మేలు చేస్తూ, ప్రజల్లో మరింత గుర్తింపు పొందుతోంది. ఎక్కడికెళ్లినా ప్రజలు జడ్పీ వైస్‌ చైర్మన్‌ నాగజ్యోతితో తన తల్లిదండ్రుల గొప్పదనం ప్రజలే వినిపిస్తుంటే, వారి ఆశయాలు సజీవం చేసేందుకు కృషి చేస్తోంది.
ఇప్పుడున్న పరిస్ధితుల్లో ములుగు జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయాలకు ఆమె ఎంతో కీలకమైన నేత. అడవి తల్లిని నమ్ముకొని బతికే జాతి మేలు కోసం, వారి జీవితాలలో వెలుగు కోసం నాగజ్యోతి ఎంచుకున్న రాజకీయ మార్గంలో అలుపెరగని, ఎదరులేని, తిరుగులేని ప్రయాణం చేస్తే, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version