ఉద్యమ‘కారు’లకే చోటు?

 ` కేసిఆర్‌ సరికొత్త ప్రయోగం.

 `వచ్చే ఎన్నికల్లో ఉద్యకారులకే పెద్దపీఠ

 ` పార్టీకి అండగా ఉన్నవారి ఎంపికకు కసరత్తు!

 ` పార్టీని నమ్ముకున్న వారికి బంఫర్‌ ఆఫర్లు?

 `వ్యతిరేకత ఉన్న స్ధానాల్లో ఉద్యమకారులకు టిక్కెట్లు?

` పార్టీమీద కాదు పాలకుల మీదే ప్రజల వ్యతిరేకత 

` కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి

` పెద్దఎత్తున కార్యకర్తలకు శిక్షణా తరగతులు

` కేసిఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించిన సంకేతాలు

 ` ఆ అదృష్టవంతులు ఎవరన్నది పార్టీలో సాగుతున్న చర్చ 

  హైదరాబాద్‌ , నేటిధాత్రి : 

     ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనలు ఎవరికీ అందేవి కాదు. ఎవరూ ఊహించేవి కావు. ఆయన మౌనం ఒక మహాయుగం. ఆయన మాట మహావేగం. వేసే అడుగు ఒక కాలం. తెచ్చిన తెలంగాణ చరిత్ర సాత్కారం కోసం. ఇంత ఉన్నతంగా వుండేవే కేసిఆర్‌ వ్యూహాలు. సామాన్యంగా ఎవరికీ అర్ధమయ్యేవి కాదు. అందుకే తెలంగాణ ఉద్యమం అన్నది ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. ప్రపంచంలో అమెరికా విప్లవం1689, ప్రెంచి విప్లవం 1789, రష్యా విప్లవం 1919 తర్వాత చెప్పుకోదగ్గ పోరాటాలలో దేశ స్వాతంత్య్రంతోపాటు తెలంగాణ సాయధ పోరాటం, ఆ తర్వాత కేసిఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ సాధన ఉద్యమమే అత్యంత కీలకమైంది. అలాంటి ఉద్యమ కారుడి అడుగులు అంచానా వేయడం అందరి వల్ల కాదు. ఆయనకు తప్ప మరెవరికీ వెల్లడయ్యేవి కాదు. ఆచరణలో పెట్టాలనుకున్నప్పుడు మాత్రమే ఆయన ఇచ్చే లీకులతో ప్రత్యర్ధులకు దిమ్మ తిరిగిపోతుంది. కేసిఆర్‌ ఆలోచనలను అంచాన వేయాలంటే ఇక్కడ చరిత్రను లోతైన అధ్యయం చేసేవారికి మాత్రమే అవగమౌతుంటాయి. అందులోనే అనేక విషయాలు దాగి వుంటాయి. తెలంగాణలో ఆంధ్ర ప్రాంత నాయకుల వలసవాద దాడి, దోపిడీ అన్నది తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచే మొదలైంది. తెలంగాణలో నిజాం వేధింపుల పేరుతో దొరలు, భూస్వాములు, దేశ్‌ ముఖ్‌లు, ఆఖరుకు రజాకార్లు చేసిన దుర్మార్గాలన్నీ నిజాం ఖాతాలో పడ్డాయి. దాంతో అందరూ నిజాంను తిట్టడం మొదలుపెట్టారు. తెలంగాణలో 80శాతం మంది తెలుగు ప్రజలు వుండడం, ఇక్కడ భాషాపరమైన సాంస్కృతిక విప్లవం తెస్తే, ఏలడం సులువైందని ఆంధ్రులు ఆనాడే కన్నేశారు. భారత దేశంలో హైదరాబాద్‌ సంస్ధానం విలీనమైన తర్వాత జనరల్‌ జేఎన్‌. చౌదరి సైనిక పాలనలో పెద్దఎత్తున ఆంధ్రప్రదేశ్‌ నుంచి విద్యావంతులు తెలంగాణకు వచ్చి ఉద్యోగాలు కొల్లగొట్టారు. అప్పటికి తెలంగాణలో పూర్తి స్ధాయిలో ఉర్ధూ మీడియం మాత్రమే వుండేది. పల్లెల్లోనూ అదే చదవాల్సివచ్చేది. దాంతో జేఎస్‌ చౌదరి, ఎం.కే వెల్లోడి పాలనలో పెద్దఎత్తున సీమాంధ్రులు నిండిపోయారు. ఆఖరుకు ఎంత దాకా వచ్చిందంటే 1952లో తెలంగాణ నడిబొడ్డున వున్న సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి బి.వి. రాజు అనే సీమాంధ్ర నాయకుడు గెలవడం, మంత్రి కావడం కూడా జరిగింది. అంటే రాజకీయాల్లో కూడా ఆనాడే పెత్తనానికి అంకురార్పణ జరిగిందనేది ముందుగా ఈ తరానికి తెలియాల్సివుంది. నాడు సీమాంధ్ర ఉద్యోగుల అరాచకాలు మితిమీరిపోయాయి. అన్ని శాఖల్లో వాళ్లే నిండిపోయారు. ఆఖరుకు వరంగల్‌లో పార్ధసారధి అనే డిఈవో. తెలంగాణ టీచర్లను విపరీతంగా వేధించడం మొదలు పెట్టారు. అప్పుడు వరంగల్‌కు చెందిన ఉపాధ్యాయుడు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ గురువు గుండెపోటుతో మరణించాడు. దాంతో సుబ్బయ్య అనే తెలంగాణ విద్యార్ధి నాయకుడు మొదలు పెట్టిన ఉద్యమమే ఇడ్లీ సాంబార్‌ గో బ్యాక్‌. 1952 మొదలైన ముల్కీ ఉద్యమం 2014లో తెలంగాణ వచ్చేదాకా ఆగలేదు. అలాగని అరవై ఏళ్లపాటు సీమాంధ్రుల దోపిడీ మానుకోలేదు. పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో డిల్లీ వెళ్లి, హైదరాబాద్‌ హౌజ్‌లో ఆనాటి హోం మంత్రి గోవింద్‌ వల్లభ్‌పంత్‌ సమక్షంలో సంతాకలు చేసి, తిరిగి హైదరాబాద్‌ చేరేలోగానే తెలంగాణ పేరు లేకుండా చేశారు. తెలంగాణతో కలిసి, తెలుగు జాతి బలం పెంచుకుందామని చెప్పి, 1956లో నాటి హైదరాబాద్‌ ముఖ్యమంత్రి బూర్గుల రామ కృష్ణారావుకు పదవి లేకుండా చేశారు. పెద్ద మనుషుల ఒప్పందలో సంతకాలు చేసిన చెన్నారెడ్డి, రంగారెడ్డి, జేవి నర్సింగరావులకు ప్రాధాన్యత లేకుండా చేశారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు నేటి తెలంగాణ సమాజానికి తెలియాలి. 1952 ఎన్నికల్లో హైదరాబాద్‌ రాష్ట్రంలో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంతో మంది కవులు, పాత్రికేయులు, డాక్టర్లు, లాయర్లు వున్నారు. కాని సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులైన వారిలో ఆధిపత్య తెలివి తేటలు తప్ప, ఏ ఒక్కరు కవి కాదు. జర్నలిస్టు కాదు. మేధావులుకాదు. రచయితలు కాదు. కాని ఆధిపత్యానికి అలవాటు పడ్డారు. హైదరాబాద్‌ రాష్ట్ర తొలి, ఆఖరు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఒక కవి. అధ్భుతమైన కృష్ణ శతకం రాసిని మేధావి. ఆనాడు మండలి చైర్మన్‌గా పనిచేసిన సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ వైతాళికుడు.పాత్రికేయుడు మందమలు నర్సింగరావు..ఇలా చెప్పుకుంటూ పోతే ఒక చరిత్రే… తెలంగాణనుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన పి.వి. నర్సింహారావు ఎంతటి మేధావో ప్రత్యేకంగా చెప్పవలసిన అసవరం లేదు. ఆయన కాకతీయ అనే పత్రికను కూడా నడిపారు. విశ్వనాధ సత్యనారాయణ రాసిన వేయి పడగలు అనే పుస్తకాన్ని సహస్రఫణ్‌ అనే పేరుతో అనువాదం చేశారు. అనేక కావ్యాలు రాశారు. బహుభాషా కోవిదుడు కూడా… తెలంగాణలో అనేక మంది మేధావులున్నారు. అయినా వారందరినీ బురిడీ కొట్టించారు. అతి తెలివితేటలు నింపుకుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూ వచ్చారు. ఒప్పందాలను తుంగలో తొక్కారు. తెలంగాణకు ఇవ్వాల్సిన తెలంగాణ నిధులు పోయి, నీళ్లు పోయి, కొలువులు పోయి, తెలంగాణకు వలస బతుకులు దిక్కు చేశారు. అలాంటి తెలంగాణకు సంపూర్ణ స్వాతంత్య్రం తెచ్చిందే కేసిఆర్‌. ఆ నాయకుడు పాలకుడుగా వుండగానే, తెలంగాణ ఉద్యమం పేరుతో స్వార్ధపూరిత రాజకీయాలకు అలవాటు పడిన వారికి , తెలంగాణను దోచుకుకుంటే గాని పూట గడవని సీమాంధ్ర వలస వాదులకు పదవుల ఆశ తీరలేదు. 

                         తెలంగాణ వాదులంతా ఒక్కసారి బాగా ఆలోచించుకోవాల్సిన తరుణం ఈసన్నమైందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ మధ్యే జరిగిన కొన్ని సంఘటనలు మననం చేసుకోవాలని పార్టీ అధిష్టానం ద్వితీయ శ్రేణి నాయకులను , కార్యకర్తలకు కోరేందుకు ఈ విషయాన్ని పార్టీలో చాలా లోతుగా తీసుకెళ్ళేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు పార్టీ పెద్దలు . వాటి మీద బాగా చర్చ జరగాల్సిన అవసరం వుంది. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు బాగా లేవన్న మాటలు సర్వత్రా వినిపిస్తున్నదే. పత్రికల్లో వార్తలు చూస్తున్నదే. వాస్తవమని అందరూ చెబుతున్నదే. ఇదే విషయాన్ని తెలంగాణ అభివృద్ధిని గురించి చెబుతూ, పొరుగు రాష్ట్రాలను పోల్చడం సహజం. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంటు, మంత్రి రామారావు ఆంధ్రప్రదేశ్‌ రోడ్లపై తన స్నేహిడుతు చెప్పిన మాటలను ఉటంకించారు. ఆ మాటలు విన్న తెలంగాణ వైఎస్‌ఆర్సీసీ అధ్యక్షురాలు షర్మిల గయ్యిమని లేచింది. అన్నతో పడడం లేదనే తెలంగాణకు ఆమె వచ్చింది. కాని జగన్‌ పాలన మీద కేటిఆర్‌ మాట్లాడితే ఆమె అసలు స్వరూపం బైట పెట్టుకున్నది. అంటే ఇలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు ఎంత అప్రమత్తతో వుండాలో తేలిపోయింది. షర్మిల లాంటివారు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతుండడం, అది మనం వింటుండడం కన్నా దౌర్భాగ్యం ఏదైనా వుంటుందా? ఆంధ్రప్రదేశ్‌లో చెల్లని కాసు కేఏపాల్‌ కు కూడా తెలంగాణని ఏలాలని వుందట. తెలంగాణలో ఆయన పార్టీని గెలిపిస్తే లక్ష కోట్లు తెస్తాడట. మరి రోడ్లు లేని ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం రూపాయి సాయం చేసే యోచనలో లేరట. గత ఎన్నికల్లో కేఏపాల్‌ ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసిందే. అక్కడ రోడ్లు బాగు చేస్తేనైనా ప్రజలు జేజేలు పలుకుతారు. అది వదిలేసి తెలంగాణ మీద మొసలి కన్నీరు కార్చేందుకు ఒకరి తర్వాత ఒకరు బయలుదేరుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తే, అక్కడ నోరెత్తులేని చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు నెరపడానికి కుట్ర పన్నుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాట్లాడేందుకు కూడా ధైర్యం చాలక, అక్కడ విమర్శలకు సమాధానం చెప్పలేక ఎక్కెక్కి ఏడ్చిన చంద్రబాబుకు ఆంద్రాలో కోట్లాడే దిక్కులేదు. కాని తెలంగాణలో పెత్తనం కావాలట. నీచ రాజకీయాలు చేయడానికి దండుగా బయలుదేరుతూ, తెలంగాణ మీదకు వస్తున్నారు. కుహనా తెలంగాణ వాదులను కలుపుకుంటున్నారు. సొంత ప్రాంతాల్లో బలం లేని దద్దమ్మలు అక్కడ మొహం చెల్లక, తేరగా తెలంగాణ రాజకీయాల్లో చేరి నీచ బుద్ది చూపిస్తున్నారు. 

                        ఇదిలా వుంటే తెలంగాణలో వున్న కొందరు తెలంగాణ 2004 ఎన్నికల్లో టిక్కెట్లు పొంది, టిఆర్‌ఎస్‌ కారు గుర్తు మీద గెలిచారు. వారిలో చాలా మంది టిఆర్‌ఎస్‌కు ద్రోహం చేశారు. వాళ్ల దారి వాళ్లు చూసుకున్నారు. అందులో చాలా మంది రాజకీయాల్లో తెరమరుగయ్యారు. కాని కొంత మంది పదవుల కోసం ఆశతో వుండి, చివరి నిమిషంలో వారి నైజం చూపించిన వారు కూడా వున్నారు. అలాంటి వారు కాకుండా, ఆది నుంచి పార్టీ కోసం ఎలాంటి స్వార్ధం లేకుండా పనిచేసిన వారికి ఇప్పుడు అవకాశం రానున్నది. ఆ పనిలో కేసిఆర్‌ వున్నారు. అలాంటి వారికి ఈసారి టిక్కెట్లు ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు చెందని నాయకుల లిస్టు తెప్పించుకున్నారు. వారిలో ఎవరు టిఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు. వారి వ్యక్తిగత జీవితాలు, త్యాగాలు అన్ని పరిశీలిస్తున్నారు. గత ముందస్తు ఎన్నికల సమయంలో అందరికీ టిక్కెట్లు ఇచ్చి ఆశ్యర్య పర్చినా, ఐదుగురిని ఆనాడే కేసిఆర్‌ పక్కన పెట్టారు. అంటే భవిష్యత్తులో ఎవరినైనా పక్కన పెడతామన్న సంకేతాలు ఆనాడే పంపినట్లైంది. అయినా ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు గెలుస్తూ వస్తున్న వారిపై కూడా ప్రజల్లో కొంత అసంతృప్తి వుందన్న సంగతి తెలుస్తూనేవుంది. ఇప్పటికే నాలుగైదు సార్లు వారు ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు. గెలిచారు. కాని వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు సన్నగిల్లేలా వున్నవారి లిస్టు కూడా తయారౌతోంది. అలాంటివారిలో ఊగిసలాటలో వున్నవారు కూడా కొందరున్నారన్న సంగతి కూడా తెలుస్తోంది. అలాంటి వారిని పక్కన పెట్టడమే మేలని కూడా కేసిఆర్‌ నిర్ణయానికి వచ్చినట్లు సమచారం. గెలుపు గుర్రాల వేట అన్నది ఈ రోజుల్లో రాజకీయ పార్టీలకు తప్పనిసరైంది. ప్రయోగాలు చెల్లే కాలం కాదు. ఆచి తూచి అడుగేయాల్సిన కాలం. పైగా రాజకీయ అవకాశవాదులు ఎంతో మంది తమ అసంతృప్తిని వెల్లగక్కుతూ తెలంగాణ వాదులు ముసుగులో విపరీత ప్రచారం చేస్తున్నవారు కూడా వున్నారు. సహజంగా రెండుసార్లు వరసగా అధికారంలో వున్న పార్టీలకు ఎంత లేదన్నా, ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. దాన్ని ఆసరా చేసుకొని రాజకీయాలు చేయాలనుకునేవారు కాచుకొని కూర్చున్నారు. వారి బారి నుంచి, పైగా సాధించిన తెలంగాణను ఇంకా సీమాంధ్రుల చేతుల్లో పెట్టేందుకు కొందరు చూస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ముంచేందుకు, ముందూ వెనక ఆలోచించకుండా రాజకీయాలు చేస్తున్నవారు చాలా మందే వున్నారు. అలాంటి కుహనా తెలంగాణ వాదులనుంచి కూడా తెలంగాణను కాపాడుకోవాల్సిన అవరసం మరింత కాలం వుంది. ఆ బాధ్యత ప్రతి తెలంగాణ వాది మీద వుంటుంది. అయినా కేంద్రంలో అధికారంలో వుండి, అనేక రాష్ట్రాలలో అధికారంలోవున్న బిజేపి అక్కడ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోలేని స్ధితిలో వుంటూ, ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటే సరిపోతుందా? అధికారంలోకి అభివృద్ధి చేస్తామంటే అర్ధమేమిటో కూడా చెప్పాల్సిన అసవరం వారిపై ఉంది. అందుకే ఈసారి ఎలాగైనా తెలంగాణను స్వార్ధ పరుల చేతుల్లోకి పోకుండా అక్కడినుంచి సీమాంధ్రుల ఆధిపత్యం కాకుండా చూడాలంటే, ఈసారి టిఆర్‌ఎస్‌లో తెలంగాణ వాదులకే టిక్కెట్లు..? అదే కేసిఆర్‌ రాజకీయ చాణక్యంలో మరో మెట్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!