దమ్మికా కాయ్ షిటోరియె కరాటే హనుమకొండ కిక్ బాక్సింగ్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ముగిసిన సమ్మర్ కరాటే మరియు కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ క్యాంపు

మాస్టర్ బండారి సంతోష్ హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ రిఫరీ

హన్మకొండ – నేటిధాత్రి

 

1 మే 2022 నుండి 10 జూన్ 2022 (40 రోజులు) వరకు దమ్మికా కాయ్ షిటోరియె కరాటే

& హనుమకొండ కిక్ బాక్సింగ్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ ఇంటర్నేషనల్ ప్లే వే స్కూల్, కాకతీయ

కాలనీ, అలంకార్ జంక్షన్ లో (40 రోజులు) కరాటే మరియు కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ క్యాంపునునిర్వహించడం

జరిగింది.ఈ క్యాంపునకు గాను వివిధ ప్రాంతల నుండి 100 విద్యార్థిని విద్యార్థులు హాజరు కావడం జరిగింది.

ఈ క్యాంపును వినియోగించుకున్న విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అథిదులు చేతుల మీదుగా సర్టిఫికేట్ ప్రధానోత్సవం

 జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా 9వ డివిజన్ కార్పోరేటర్ చీకటి శారద. ఆనంద్ గారు,

4వ డివిజన్ కార్పోరేటర్ బి. ఆశోక్ గారు, హనుమకొండ కిక్ బాక్సింగ్ చైర్మన్ పులి రజినికాంత్ గారు,

ఇన్స్పైర్ ఇంటర్నేషనల్ ప్లే వే స్కూల్ డైరెక్టర్ మజిద్ ఆలి గారు, కిక్ బాక్సింగ్ ఆకాడమి కొచ్ లు

సి.హెచ్. సుప్రియ, పి.దినేష్ తేజ, జి. నవనీత్, శేశి, మనికుమార్, హరిమతన్, గణేష్ లు హజరు

అయినారు.

అప్పగించిన పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయండి

అప్పగించిన పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయండి

వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

విధి నిర్వహణలో భాగంగా అధికారులకు చేయాల్సిన విధుల పట్ల నిర్ణీత గడువులో పూర్తి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.

 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం పెండింగ్ లో వున్న దర్యాప్తు కేసులు, వివిధ కేసుల్లో మెడికల్, రిపోర్ట్స్, పోస్తుమార్టం , ఏఫ్.ఎస్.ఎల్, డయల్ 100, సన్నిహిత పిటిషన్లుతో పాటు ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్దు ప్రమాదాల నివారణ, బ్లాక్ స్పాట్స్ పై విశ్లేషణ , దోంగతనాల నియంత్రణ మరియు సైబర్ నేరాలపై అవగాహన, కేసుల నమోదు తీరుతెన్నులపై వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించడంతో పెండింగ్ లోని నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకుగాను అవలంబించాల్సిన తీరు పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. 

డిసిపిలు, అదనపు డిసిపిలు, ఏసిపిలు, ఇన్స్ స్పెక్టర్లు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అధికారులు పోలీస్ స్టేషన్ లొ నమోదయ్యే కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనసరించి దర్యాప్తు చేయాల్సి అవసరం వుండని. ముఖ్యంగా నేరస్తుడి నేరాలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించడం కోసం అధికారులు వ్యక్తిగత శ్రధ్దతో విధులుబనిర్వహించాల్సి వుంటుంది.కేసు సంబంధించి పోలీస్ అనుబంధ విభాగాల నుండి అందాల్సిన పత్రాలు రావడంలో ఆలస్యం జరిగితే నా దృష్టికి తీసుకరావాలని. ముఖ్యంగా ప్రజావాణి సందర్బంగా ప్రజలు చేసే ఫిర్యాదులపై అధికారులు త్వరితగతిన పూర్తిచేసి సమగ్రమైన నివేదిక అందజేయాలని. రోడ్డుప్రమాదాల నివారణకై అధికారులు ప్రత్యేక శ్రద్ద కనబర్చడంతో పాటు రోడ్దు ప్రమాదాలకు గల కారణలపై పోలీస్ అధికారులు సంబంధిత అధికారులతొ విశ్లేషణ చేసి తగుచర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో డిసిపిలు అశోక్ కుమార్, వెంకటలక్ష్మి , సీతారాం, అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ పాల్గోన్నారు.

పాస్పో బ్యాక్టీరియా వాడకం పై అవగాహన.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

                                             రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు ముఖ్యంగా దుక్కిలో వేసే టువంటి 20-20- 0 -13 డి ఏ పి వంటి ఎరువులు మోతాదుకు మించి వేయడం వల్ల నేల నీరు గాలి కాలుష్యం తో పాటుగా రైతుకు ఖర్చులు పెరగడం తో పాటుగా నేల యొక్క సారం తగ్గడంతోపాటు రసాయన ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల సేంద్రియ కర్బన పదార్థం తగ్గిపోయి పంటకు మేలు చేసే టువంటి సూక్ష్మ జీవులు, వానపాముల సంఖ్య తగ్గిపోతుంది తద్వారా భూమి యొక్క సారం తగ్గడం వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు ఎరువుల పైననే సబ్సిడీ రూపేణా 65 వేల కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది, రైతు వేసిన టువంటి తో ఎరువుల లో కేవలం 30-40 శాతం మాత్రమే మొక్క తీసుకోవడం జరుగుతుంది మిగతా ఎరువు మొక్క అందుకోలేని రూపంలోకి మారుతుంది, యొక్క రసాయన స్వభావం మారిపోయి దీర్ఘకాలంలో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతు యొక్క పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో భాస్వరం నిల్వల్ని కరిగించే విధంగా పాస్పో బ్యాక్టీరియా వినియోగంపై విస్తృత స్థాయిలో రైతులకు అవగాహన కల్పించే దిశలో ఈరోజు వ్యవసాయ సహాయ సంచాలకుల ఆవరణలో ఇంఛార్జి ఏడీఏ రాజ్ నారాయణ అధ్వర్యంలో డివిజన్లో పరిధిలోగల మండల వ్యవసాయ అధికారులకు వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు ప్రాథమిక సహకార సంఘం సభ్యులకు డీలర్లకు రైతులకు పాస్పో బ్యాక్టీరియా వాడకం మరియు వినియోగంపై క్షేత్ర ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ శ్రీ బాదే చంద్రం మరియు రామాయంపేట నిజాంపేట నార్సింగి చేగుంట వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు లు పాల్గొన్నారు

ఎమ్మెల్యే చందరన్న గారి నాయకత్వంలోనే కొనసాగుతా

టి.ఆర్.ఎస్ నాయకురాలు అనుముల కళవతి

రామగుండం శాసనసభ్యులు

 

 కోరుకంటి చందరన్న గారి నాయకత్వంలో టి.ఆర్.ఎస్ పార్టీ లో కొనసాగుతానని మహిళా నాయకురాలు అనుముల కళావతి తెలిపారు. ఇటివల కళవతి టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేయాగా శుక్రవారం కళావతి నివాసంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారి నేతృత్వంలో తిరిగి టి.ఆర్.ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా అనుముల కళావతి మాట్లాడుతూ…కొన్ని తమ స్వంత కారణాల వల్ల ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగిందన్నారు. రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ గారితో ఉద్యమంలో పని చేయడం జరిగిందని ఎమ్మెల్యే గారికి చెదోడు వాదోడుగా ఉంటామని చెప్పారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచెస్తనని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడ్దు రవీందర్ మెతుకు దేవరాజ్ ఉన్నారు.

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి

జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు

నేటిధాత్రి చేర్యాల…

చేర్యాల :గత కొన్ని రోజుల క్రింద హైదరాబాద్ లో మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పుల్లని వేణు మాట్లాడుతూ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని ఒక పబ్బు నుండి తీసుకెళ్లి మైనర్ బాలిక పైన ఐదుగురు నిందితులు అత్యాచారానికి పాలుపడడం జరిగిందని వాళ్లని కఠినంగా శిక్షించాలని అత్యాచారం పాల్పడినటువంటి వ్యక్తులు ఎంత పెద్ద రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తులైనా అందరిలాగానే శిక్షించాల్సిందే అని అదేవిధంగా నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఉన్నా ఇంకా అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఏవిధంగా ఉందనేది మనకు అర్థం చేసుకోవచ్చు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు లేని యెడల ఏఐఎస్ఎఫ్ గా అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

 రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి 

సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. వైద్యుల నిర్లక్ష్యంతో మరో పసికందు మృతి.

వీర్నపల్లి మండలం అడవి పదిరకు చెందిన ప్రియాంక అనే గర్భిణీ కి డెలీవరి ఆలస్యం చేయడంతోనే పాప మృతి చెందినట్లు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యుల నిర్లక్ష్యం వలన రోజుకు ఒకటి ఇలాంటి సంఘటన జరుగుతూనే ఉంటున్నాయి దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తున్న బంధువులు..

దివ్యాంగులకు దళిత బంధు ఇవ్వాలి

నేటిధాత్రి చేర్యాల…

సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షుడు సుతారి రమేష్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో ఉన్న గ్రామాలలో దివ్యాంగ సోదరులకు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు మా దివ్యాంగులకు కు ఇవ్వాలి 5% శాతం రిజర్వేషన్ కలిగిన మా దివ్యాంగులకు ఇవ్వాలి గ్రామాల్లో గాని పట్టణంలో గాని ఇద్దరికీ లేక ఐదుగురికి కేటాయించాలి కానీ మా వికలాంగులకు ఒక్కరికి కూడా దళిత బందులో మా పెరు లేకపోవడం చాలా బాధాకరం అని ఆయన అన్నారు ఈ సందర్భంగా వికలాంగుల సంఘాలన్నీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టరేట్ ముట్టడి చేస్తామని ఎమ్మార్వో ఆఫీస్ మరియు ప్రజా ప్రతినిధులను నిలదీస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు..

వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి (మోతిబిందు)శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశాం

వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి (మోతిబిందు)శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశాం. జిల్లాలో మొట్టమొదటి సారిగా పూర్తిస్థాయి ఉచిత కంటి శస్త్ర చికిత్స చేయడం జరిగింది.

 

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి బోయినపల్లి మండలం కోరేం గ్రామానికి చెందిన లింగవ్వ వయసు (45)కంటి సమస్య తో ఏరియా ఆస్పత్రికి రావడం జరిగింది. సదరు రోగిని పరీక్షించి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించాము.దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా వేములవాడ ఆస్పత్రిలో పూర్తిస్థాయి ఉచితంగా కంటి శస్త్ర చికిత్స చెయ్యడం జరిగింది. ఈ శస్త్రచికిత్సలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్. మహేష్ రావు ఆధ్వర్యంలో వైద్య బృందం డాక్టర్ మురళి కృష్ణ, డాక్టర్ రత్నమాలమరియు థియేటర్ అసిస్టెంట్ నరసింగం, రాజేందర్ పాల్గొని విజయవంతం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ బి వినోద్ ను కల్సిన టీఎన్జీఓ నాయకులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి 

 

కరీంనగర్ ఉమ్మడి జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ వినోద్ మరియు ఎమ్మెల్యే రమేష్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసి రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరగా సత్వరం పరిష్కరించబదుతుంది అని హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్ ,రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఎల్సాని ప్రవీణ్ ,కరీంనగర్ ఎల్ ఎం డి యూనిట్ అధ్యక్షులు గంగారపు రమేష్ టీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపాధ్యాయుల చంద్రశేఖర్ ఉన్నారు.

ఘనంగా కవ్వంపల్లి సత్యనారయణ జన్మదిన వేడుకలు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి ఇల్లంతకుంట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మానకోండూర్ నియోజవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటతో కలిసి కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచుతూ కవ్వంప్లలి చిత్రపటానికి పాలభిషేకం చేసారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి ఆధ్వర్యంలో కేక్ చేశారు. అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ డా కవ్వంపల్లి సత్యనారయణ జిల్ల కాంగ్రెస్ అధ్యక్షులు నియోజకవర్గ ఇంచార్జ్ మానకొండూర్ నియోజకవర్గంలో ఎంతో మంది నిరుపేదలకు వైద్యపరంగా ఆదుకోని వేలమందిని కాపాడుతున్నరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కవ్వంపల్లి సత్యనారయణ గారిని శాసనసభ్యులుగా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చిట్టి ఆనంద రెడ్డి యసి సి సేల్ ఆధ్యక్షుడు బడుగు లింగం, జిల్ల యసి సి సేల్ కన్వీనర్ జుట్టు నగేష్,మండల బిసి సేల్ అధ్యక్షుడు వీరేశం, పట్టణ అధ్యక్షుడు మామిడి నరేష్ , మైనర్టీ అధ్యక్షుడు జమాల్, సురేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, విజయ్, అనిల్‌,తిరుపతి, రాజు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి కుంటల శేఖర్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏర్రోజు సంతోష్, మండల కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి రజనీకాంత్, అనంతగిరి, యాదిరెడ్డి, బాబు,తదితరులు పాల్గొన్నారు.

బిజెపి తోనే అభివృద్ధి సాధ్యం

బిజెపి మంగపేట మండల అధ్యక్షులు యరంగారి కుమార్

మంగపేట నేటి ధాత్రి,

ములుగు జిల్లా అసెంబ్లీలోని బిజెపి మంగపేట మండల అధ్యక్షులు యరంగారి కుమార్ ఆధ్వర్యంలో మొట్ల గూడెం, శనిగాకుంట, గాంధీనగర్, నరసింహ సాగర్, పూరేడిపల్లి మొదలగు గ్రామాలలో బిజెపీ గరీబ్ కళ్యాణ యోజన కార్యక్రమంలో మన ప్రియతమ భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి గడిచిన ఎనిమిది సంవత్సరాల అద్భుత పరిపాలన లో భాగంగా సంక్షేమ పథకాల గురించి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ పాలన పథకాల వైఫల్యాల గురించి గడపగడపకు తెలియజేయడం జరిగినది. మరియు సంబంధిత కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చెందుతుందని మంగపేట మండల ప్రజల ఆకాంక్ష… ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, జిల్లా పదాధికారులు, మండల పదాధికారులు, ఓబీసీ మోర్చా జిల్లా, మండల నాయకులు,గిరిజన మోర్చా జిల్లా, మండల నాయకులు, దళిత మోర్చా జిల్లా మరియు మండల నాయకులు, మండల మోర్చా నాయకురాలు, బూత్ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు కార్యదర్శులు, సభ్యులు, గ్రామస్తులు మొదలగు వారు పాల్గొన్నారు.

తలరాత మార్చే చేతిరాత

 రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి

సిరిసిల్ల పట్టణం భావన ఋషి నగర్ లోని తక్షశిల ఇంగ్లీష్ మీడియం హైస్కూలు లో గత వారం రోజులుగా చేతిరాత తరగతులను నిర్వహించారు. ఈ సందర్భం గా చేతిరాత నిపుణులు కాంభోజ శ్రీనివాస్ మాట్లాడుతూ చేతిరాతలో మెలకువలు నేర్చుకున్న ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మంచి చేతిరాత తో తలరాత మార్చుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ మడుపు శ్రీకాంత్ రెడ్డి చేతిరాత లో అందమైన చేతిరాత రాసిన ఉపాధ్యాయులకు ప్రశంశ పత్రాలను అంద జేశారు

ఆకట్టుకుంటున్న ప్రజాప్రతినిధుల ‘బడిబాట’

ఆలోచింపజేసేలా ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం

 

కేసముద్రం(మహబూబాబాద్), నేటిధాత్రి:

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరికకు చేపట్టిన బడిబాట కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ కోమటిపల్లి ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల వినూత్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటుంది. ఉదయంపూట యధావిదిగా బడిబాట కొనసాగిస్తూ గుర్తించిన విద్యార్థుల ఇంటికి,తండాలకు వారి తల్లిదండ్రులు అందుబాటులో ఉండే సాయంకాల వేళల్లో వెళ్ళి *’మీ పిల్లలను మన ఊరి ప్రభుత్వ బడిలో చేర్పించండి…వారి చదువుకు పూర్తి బాధ్యత మాది’* అంటూ భరోసా కల్పిస్తున్నారు. వారితో పాటు సర్పంచులు,ప్రజాప్రతినిధులు కోమటిపల్లి సర్పంచ్ నీలం యాకయ్య,తారాసింగ్ తండా సర్పంచ్ యస్.శంకర్ ఇతర ప్రజాప్రతినిధులు బడిబాట కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.శుక్రవారం సాయంకాలం మొదలుకుని సాయంత్రం రాత్రి 9గంటలవరకు కోమటిపల్లి గ్రామ చుట్టుపక్కల ఉండే వివిధ తండాలను సందర్శించారు.కాలినడకన పిల్లలు బడికి రావడం ఇబ్బందనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుచేయగా ఒక వాహనాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇవ్వగా,తనవంతుగా వాహనానికి అయ్యే రెండు నెలల ఖర్చు భరిస్తానని ధాత జల్లె శ్రీనువాస్ ముందుకు వచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం రుక్ముద్ధీన్, ఉపాధ్యాయులు నరేందర్ ఇల్లెందుల,మధుకర్,కో ఆప్షన్ మెంబర్ కొమురయ్య, వార్డుమెంబర్స్,యూత్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 12న నిర్వహించనున్న టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి*

జిల్లా కలెక్టర్ కె.శశాంక

మహబూబాబాద్,నేటిధాత్రి:

ఈ నెల 12న ఆదివారం రోజున నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక ప్రకటనలో తెలిపారు.జిల్లా కేంద్రంలో మొదటి పేపర్ -1 కు పరీక్షా కేంద్రాలు 26 ఏర్పాటు చేసి ఉదయం 9-30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షకు 6159 మంది అభ్యర్థులు, పేపర్-2 కు పరీక్షా కేంద్రాలు 23 ఏర్పాటు చేసి మధ్యాహ్నం 2-30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పరీక్షకు 5270 మంది అభ్యర్థులు, రెండు పేపర్ లకు కలిపి 11 వేల 429 మంది హాజరుకానున్నారు. మహబూబాబాద్ లో 12, తొర్రూర్ లో 10, మరిపెడ లో 4 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. హాల్టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని,హాల్ టికెట్లో ఏమైనా తప్పులు ఉంటే గెజిటెడ్ అధికారితో,డి. ఈ. ఓ. తో అటెస్టేషన్ చేయించుకుని పరీక్ష సెంటర్లో ఇవ్వాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే డీఈఓ కార్యాలయము చరవాణి నెంబరు 91827 22510 లో సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు బ్లాక్ బాల్పాయింట్ పెన్ ను ఉపయోగించాలని, పరీక్ష కేంద్రానికి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్ అనుమతి లేదని తెలిపారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు,26 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 26 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 283 మంది ఇన్విజిలేటర్ లు,రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు.

టెట్ పరీక్ష నిర్వహణకు కేటాయించబడిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు, రూట్ ఆఫీసర్స్,హాల్ సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్ లకు ఈనెల 11న ఫాతిమా హై స్కూల్ దగ్గర గల తొర్రూరు రోడ్డులోని బాలాజీ గార్డెన్స్ లో ఉదయం 8 గంటల నుండి నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని ఆదేశించారు.

ప్రజారోగ్యానికి ప్రాధాన్యత

నిరుపేదల నీడలో.. మెరుగైన సర్కారు వైద్యం

 

సిద్దిపేట డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో 18 లక్షలతో బస్తి దవాఖాన శాశ్వత భవనం

సిద్దిపేట కేసీఆర్ నగర్ లో బస్తి దవాఖానను ప్రారంభించిన మంత్రి హరిశ్ రావు

సిద్దిపేట నేటి ధాత్రి

ప్రజా ఆరోగ్యం పై తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అనటానికి నిదర్శనం బస్తి దవాఖానాలని మంత్రి హరీష్ రావు అన్నారు

సిద్దిపేట లో డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో బస్తి దవాఖాన నూతన భవనాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ లో భాగంగా పట్టణాల్లో బస్తి దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో గతంలో తాత్కాలిక భవనంలో బస్తి దవాఖాన సేవలు అందుబాటులో కి ఉండే. 18 లక్ష లతో ఇటీవలే పక్కా భవనం నిర్మాణం చేసుకున్నాం.. దీనితో కేసీఆర్ నగర్ లో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని నిరుపేద నీడలో మెరుగైన వైద్య సౌకర్యం ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు..బస్తీ దవాఖానాల్లో అవుట్​ పేషెంట్​ సేవలు అందించడం సహా బీపీ, షుగర్​తో పాటు 57 రకాల వైద్య పరీక్షలను చేస్తారని ఇక్కడ సేకరించిన న‌మూనాలను సిద్దిపేట వైద్య కళాశాల ఆసుపత్రిలో ని తెలంగాణ స్టేట్ డ‌యాగ్నస్టిక్​ సెంటర్​కు పంపిస్తారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా అందిస్తామని ,స్వల్పకాల అనారోగ్యానికి తక్షణ వైద్య చికిత్సలు అందించడం సహా టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తారు.ఇక పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లో బస్తి దవాఖాన ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు..

 

*ప్రభుత్వ వైద్య సేవల పై ప్రజల్లో అవగాహన కలిపించాలి*

ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవల పై ప్రజల్లో అవగాహన కలిపించాలని, నార్మల్ డెలివరీలు జరిగేల చూడాలని ఆశ , ఏ ఎన్ ఎం లను మంత్రి హరీష్ రావు సూచించారు.. బస్తి దవాఖాన వద్ద ఆశ ఏ ఎన్ ఎం లతో ముచ్చటించారు.. ప్రజలు ప్రయివేటు ఆసుపత్రి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు సద్వినియోగం చేసుకొనెల చూడాలన్నారు.. పేద ప్రజలకు ప్రయివేటు ఆసుపత్రి కి వెళ్లి ఆర్థిక భారం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు తెలియ పరచాలని,నార్మల్ డెలివరీ ల సంఖ్య పెంచాలని సూచించారు . మీకు నెలకు 3వేల పారితోషకం కూడా ఇస్తున్నాం అని చెప్పారు.. పి హెచ్ ల వారిగా గత నెలలో డెలివరీ ల పై ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మంచి విత్తనాలతోనే మిర్చిలో అధిక దిగుబడి అదనపు రాబడి.

నూతన ఫెర్టిలైజర్ షాప్ ప్రారంభించిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి…

 

మంగపేట నేటి ధాత్రి

 

మిర్చి సాగులో మంచి నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి అదనపు రాబడి సాధ్యపడుతుందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు గురువారం మండలంలోని రాజుపేటలో శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ ఎరువులు మరియు విత్తనాల షాప్ ని షాపు ప్రొప్రైటర్ బత్తుల అశ్విని నందకుమార్ తో కలిసి సాంబశివ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు విత్తనాలు మరియు పురుగుమందులను అందించాలని నిర్వాహకులకు సూచించారు అంతేకాకుండా వరి మిర్చి పంటల లో బైబ్యాక్ వాణిజ్య పద్ధతిలో నిర్వహిస్తున్న సంస్థలతో భాగస్వామ్య ఒప్పందంతో రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర వచ్చేలా కృషి చేయాలని కోరారు ప్రస్తుత వ్యవసాయ సంవత్సరంలో ఎరువుల కొరతని గుర్తించి డీలర్లు ఎరువుల స్టాక్ లను పంట ప్రారంభానికి ముందే అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బత్తుల ప్రణీత్ కుమార్ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ యజమాని అశ్విని నందకుమార్ కత్తి గూడెం సహకార సంఘం డైరెక్టర్ గంట సునీత రామారావు కిసాన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు వల్లిపెళ్లి శివప్రసాద్ రైతులు పూజారీ రామయ్య పూజారి ఆదినారాయణ ఎగమాటి వెంకట్ రెడ్డి చెట్టుపల్లి తిరుపతి రావు వలీ హైదర్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి పనుల్లో పర్యవేక్షణ.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

 

రామాయంపేట మున్సిపాలిటీ పట్టణ ప్రగతి ఈరోజు రామాయంపేట మున్సిపల్

పట్టణంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జి శ్రీనివాస్ మున్సిపల్ పట్టణంలోని ఎస్సీ కాలనీలో జెసిబి ద్వారా పూడికతీత పనులను పర్యవేక్షించారు. మిషన్ భగీరథ పైపు లైన్

లీకేజీ పనులు మరమ్మతులకు ఆదేశించారు. మెదక్ రోడ్ లోని పట్టణ ప్రగతి వనంలో హరితహారం కింద మొక్కలు నాటడానికి ట్రాక్టర్ ద్వారా గుంతలను తీయడం మొదలు పెట్టారు అక్కడ కూడా పనులను పర్యవేక్షించారు. ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను సమస్యలను సేకరించి వీటిని దశలవారీగా పనులు చేపడతామని తెలిపినారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొర్రా అనిల్ ఇతరులు చింతల యాదగిరి మలయాళ కిషన్ మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్.AE యుగంధర్ . మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లు రమేష్ గౌడ్ బాబు వార్డు అధికారి ఆగ మయ్య మహిళా రిసోర్స్ పర్సన్ రజిత మున్సిపల్ పర్యవేక్షణ అధికారులు కాలేరు ప్రసాదరావు శ్రీధర్ రెడ్డి వెలుగుల శ్రీనివాస్ చింతల కృష్ణ ప్రజలు పాల్గొన్నారు.

ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కెసిఆర్ గారి లక్ష్యం

పట్టణ ప్రగతి ద్వారా సుందరంగా నగరాలు 

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి లక్ష్యమని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ గారు అన్నారు. 4 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 46 వ డివిజన్లో 4 కోట్ల 50 లక్షల నిధులతో

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… దేశంలోని ప్రధాన పట్టణాలకు ధీటుగా తెలంగాణ రాస్ట్రం లోని పట్టణాలను తీర్చి దిద్దాలనే సంకల్పంతో ముఖ్య మంత్రి కె సి ఆర్ ఈ కార్యక్రమానికి రూపకల్పన అన్నారు. అభివృద్ది కార్యక్రమాలలో ప్రజలను భాగస్వాములను చేయడమే కార్యక్రమ ముఖ్యోద్దేశ్యమని

అన్నారు. అభివృద్ది , పరిశుభ్రత , పచ్చదనం ధ్యేయంగా అధికారులు , ప్రజాప్రతినిధులకు విస్తృత అధికారాలిస్తూ కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. చెత్త ఎక్కడికక్కడే పడేయడం వలన వ్యాదుల బారిన పడే అవకాశం వున్నందున తడి చెత్త , పొడి చెత్త గా వేరు చేసి ఇవ్వాలని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి డివిజన్లోని ప్రజలకు మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్ నగర కమీషనర్ సుమన్ రావు డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పోరేటర్ పాతపెల్లి లక్ష్మీ ఎల్లయ్య బాల రాజ్ కుమార్ నాయకులు తానిపర్తి గోపాలరావు జే.వి.రాజు నారాయణదాసు మారుతి , మెహిద్ సన్నీ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

 

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలను రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతల యాదగిరి మాట్లాడుతూ తిరుపతి రెడ్డి పార్టీలో ఎనలేని సేవలు చేశారని ఆయన గుర్తు చేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. 

తిరుపతి రెడ్డి మరిన్ని ఉన్నత పదవులను చర్చించి మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్యామ్ రెడ్డి. రమేష్ రెడ్డి. బొర్ర అనిల్ కుమార్.బొట్ల బాబు. తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం 

 

-టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ

 

మంగపేట-నేటి ధాత్రి

 

ములుగు జిల్లామంగపేట మండలంకొత్తపేట(చేరుపల్లి) గ్రామంలో

 

 ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ అన్నారు.

 

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పాలన అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుంది అని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ అన్నారు.

ములుగు జిల్లా అధ్యక్షులు ,నియోజకవర్గ ఇంచార్జ్ మరియు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ చొరవతో మంగపేట మండలంలో కొత్తపేట (చేరుపల్లి) గ్రామానికి చెందిన 60 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయింది.

 

 కొత్తపేట గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు.

 

 ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ప్రవేట్ హాస్పిటల్ లో వైద్యం పొంది ఆర్ధికంగా అప్పుల పాలైన వారిని ఆదుకునే లక్ష్యం తో సీఎం కేసీఆర్ ఆలోచనతో వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ పేదల అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు.

 

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు.

 

సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 

 ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణసోసైటీ చైర్మన్ తోట రమేష్,సొసైటీ డైరెక్టర్లు అచ్చ సత్యనారాయణ, నర్రా శ్రీధర్,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, కొత్తపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్టిమల్ల బాలకృష్ణ,పార్టీ శ్రేణులు, రంగాని నరేంధర్,యంపెళ్లి చంద్రరావు,దేవేందర్,కుకట్ల చంటి,రాచకొండ గణేష్,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version