నార్సింగ్ లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు మురికి నీరు ప్రవాహం.

పలుమార్లు చెప్పినా పట్టించుకోని సర్పంచ్, ఈ ఓ.

 

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

 

మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం లోకి వెళ్లకుండా మురికి నీళ్లు ప్రవహిస్తుండడంతో ప్రజలు ఎంతో భక్తితో శుభ్రంగా గుడికి వెళ్తుంటే ఆ యొక్క మురికి నీ రు ని తగులుతూ గుడి లోపలికి వెళ్లాల్సి వస్తుందని ఇలాంటి దుస్థితి ఏ గ్రామంలో ఉండదని ప్రజలు అంటున్నారు. 

ఈ యొక్క మురికి నీరు పదో వార్డులోని ఎరుకల బస్తి వాసుల డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక దేవాలయం ముందు మురికివాడ లాగా తయారయింద నీ ఈ విషయమై ఆ బస్తీ వారిని అడగగా వారు పలుమార్లు గ్రామ సభలో సర్పంచ్ కి ,ఈవో గారికి వార్డు మెంబర్ కి మరియు జడ్పిటిసి బాణాపురం కృష్ణారెడ్డికి ,ఎంపీపీ చిందం సబితాకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని చివరకి విసుగు చెంది కలెక్టర్ కు సర్పంచ్ పైన ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. 

దాని విషయమై అతనిని పిలిచి సర్పంచ్ నా పైన కంప్లైంట్ ఇస్తావ అని అతనిని బెదిరించడం జరిగింది.

దయచేసి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి పలు అంటు వ్యాధులు వ్యాపిస్తాయి కాబట్టి మా యొక్క వార్డులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని వెంటనే డ్రైనేజీ వ్యవస్థను సమకూర్చాలని మా యొక్క మనవి అని తెలిపారు.

పెన్షన్ ఇప్పించండి సార్.ఏళ్లు గడిచినా పింఛన్ రావడం లేదు.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

 

నా భర్త చనిపోయి సంవత్సరం గడుస్తున్నా నాకు గర్జన పింఛన్ రావడం లేదని రామాయంపేట మండలం దామరచేర్వు గ్రామానికి చెందిన సౌడ శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. 

దామరచెరువు గ్రామానికి చెందిన సౌడ శ్యామల భర్త గత సంవత్సరం మృతి చెందాడు. ఈ విషయాన్ని గ్రామపంచాయతీ సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శికి వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంతవరకు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఒక కుమారుడు.కూతురు ఇద్దరు పిల్లల ను కూలిపని చేసుకుంటూ ఇద్దరు పిల్లలలను పోషించుకుంటు కాలం వెళ్లదీస్తూ ఉంది.

తనకు ఇతర ఆదాయ మార్గాలు లేవని పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు చేయలేకపోవడం చాలా బాధాకరమన్నారు. పైసా ఆదయాం కూడా లేదు అధికారులైన ఇప్పటికి స్పందించి పెన్షన్ మంజూరు చేయాలని బాధితురాలు శ్యామల కోరుతున్నారు.

ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు పట్టించుకోని విద్యుత్ అధికారులు.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

 

రామాయంపేట పట్టణ బైపాస్ రోడ్డు గల విద్యుత్ స్తంభానికి వైర్లు ప్రమాదకరంగా మారాయి. పట్టణ శివారులోని మెదక్ రోడ్డు బైపాస్ రోడ్డుపై విద్యుత్ వైర్లు చత్తీస్గఢ్ నుండి వచ్చే రోడ్డు విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా విడదీసి ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్తంభంపై న కాస్రాలు ఊడిపోయి మూడు సంవత్సరాలు అవుతున్న పట్టించుకోని అధికారులు ప్రజలు ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుండి ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాగే పలు సందర్భాల్లో ఈ లైన్ విషయంగా వ్యవసాయ శాఖ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినప్పటికీ వారు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కుందనపల్లి పార్క్ కు అభివృద్ధి పర్చండీ

 

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు

రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండల పరిధిలోని కుందనపల్లి పార్కు అభివృద్ధి పర్చాలనీ రాష్ట్ర అటవి శాఖ సంరక్షణ ముఖ్య అధికారి రాకెష్ మెాహన్ దొబ్రియాల్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు గురువారం హైదరాబాద్ లో కలసి కోరారు. కుందనపల్లి సమీపంలోని పార్కు నిరుపయెాగం మారిందని పార్కును అభివృద్ధి చేయాలన్నారు.

తెలంగాణ రాష్ర్ట విద్యాభివృద్ధి సిఎం కెసిఆర్ గారి ప్రధాన లక్ష్యం  

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహ విద్య బోధన 

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు

తెలంగాణ రాష్ర్ట విద్యాభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు అన్నారు. గురువారం పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపిపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో 14 లక్షల 26 వేల నిధులతో మౌళిక వసతుల కల్పన, అదనపు నిర్మాణానికి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…రాష్ట్రం లో పేద విద్యార్ధులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో పని చేస్తున్నరని అన్నారు.

మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు వెచ్చించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలు పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు విద్య అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అహర్నిషలు పాటుపడుతున్నరని అన్నారు. ఈ

కార్యక్రమంలో మండల ఎంపీపీ వాల్వ అనసూర్య రాంరెడ్డి వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి తహశీల్దార్ వరదన్ కుమార్ ఎంపిడిఓ పాషా ఎంపీటీసీ దుర్గం కుమార్ మార్కెట్ కమిటి చైర్మెన్ అల్లం రాజన్న బయ్యపు మనోహర్ రెడ్డి తంగెడ అనిల్ రావు కిరణ్ మాదాసు అరవింద్ విసారపు రమేష్ మదన్ మెహన్ రావు ముత్యం సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

దేశానికి ఆదర్శం కెసిఆర్ గారి పాలనా  

 గ్రామాల సమగ్రాభివృద్దికే పల్లె ప్రగతి 

 రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు 

 రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఎనిమిది ఏళ్ల పాలన యావత్ దేశానికే ఆదర్శమని… గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సిఎం కెసిఆర్ గారి చేపట్టారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు అన్నారు. గురువారం పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామపంచాయతి కార్యాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే గారు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి సత్పలితాలిస్తుందని పల్లెలన్నీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అద్భుతాలు జరిగాయన్నారు. గత ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధి పట్ల ఆలోచన చేయలేదన్నారు. ఎనిమిదేళ్ల సిఎం కెసిఆర్ గారి పాలనలో ఎన్నో అద్భుత విజయాలు సాధించామని చెప్పారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే సిఎం కేసీఆర్‌ లక్ష్యం అన్నారు. దేశవ్యాప్తంగా 20 ఆదర్శ గ్రామాలుగా గుర్తిస్తే వాటిలో 19 తెలంగాణకు చెందిన గ్రామాలే ఉండడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనా విధానం, పాలనా దక్షతకు నిదర్శనమన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దడంలో కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని తమ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ వాల్వ అనసూర్య రాంరెడ్డి వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి తహశీల్దార్ వరదన్ కుమార్ ఎంపిడిఓ పాషా ఎంపీటీసీ దుర్గం కుమార్ మార్కెట్ కమిటి చైర్మెన్ అల్లం రాజన్న బయ్యపు మనోహర్ రెడ్డి తంగెడ అనిల్ రావు కిరణ్ మాదాసు అరవింద్ విసారపు రమేష్ మదన్ మెహన్ రావు ముత్యం సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ముగ్గురు అన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళ అరెస్ట్ పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ మరియు కేయూసి పోలీసులు సంయుక్తంగా కల్సి మంగళవారం అరెస్టు చేసారు.

వీరిలో ఇద్దరు ప్రధాన బుకీలతో పాటు బెట్టింగ్ పాల్పడుతున్న ఒక నిందితుడు వున్నాడు. వీరి నుండి పోలీసులు 20 లక్షల 80వేల ఏడు వందల రూపాయల నగదుతో పాటు ఒక కారు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.*

పోలీసులు అరెస్టు చేసిన వారిలో *1. మాడిశెట్టి ప్రసాద్, తండ్రి పేరు వెంకటేశ్, వయస్సు 40, గోపాల్‌పూర్, హన్మకొండ జిల్లా 2. కోత్తురు రాజు, తండ్రి పేరు రామదాసు, మల్లంపల్లి, ములుగుజిల్లా, 3.బుర్ర నాగరాజు, తండ్రి పేరు స్వామి, పర్కాల, హన్మకొండ జిల్లాకు చెందిన వారు వున్నారు.*

 

ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ బోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన బుకీ మాడి శెట్టి ప్రసాద్ కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలపూర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలోని తన ఇంటిని అడ్డా మార్చుకోని మరో ప్రధాన బుకీ అయిన కొత్తూరు రాజు తో కల్సి గూగల్ ప్లే స్టోర్ లో అందుబాటులో వున్న క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా వచుట్టుప్రక్కల

ప్రాంతాల్లోని యువతను క్రికెట్ బెట్టింగ్ తో పాటు మూడు ముక్కల ఆటలో పాల్గొనే విధంగా ప్రోత్సహించేవాడు. నిందితులు రోజు వారి జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి వివరాలను బెట్టింగ్ రాయుళ్ళ సమాచారం అందిస్తారు. క్రికెట్ బుకీ బెట్టింగ్ రాయుళ్ళుకు అనుకూలంగా మ్యాచ్ ఫలితాలు వస్తే వారు పందెం పెట్టిన మొత్తానికి రెండింతలు డబ్బును బుకీ అందజేసేవాడు. ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించిన లావాదేవిలు మొత్తం నిందితుడు గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా నిర్వహించేవారు. ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని గత కొద్ది కాలంగా రహస్యంగా నిర్వహిస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని మొత్తాన్ని నిర్వహిస్తునందుగాను ప్రధాన బుకీలకు ఐదు నుండి ఇరువై శాతం వరకు బెట్టింగ్ యాప్ సంస్థ కమీషను అందజేసేవారు. పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన బుకీపై గతంలో కేయూసి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు, హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది.

ఈ క్రికెట్ బెట్టింగ్ పై పోలీసులకు సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు బెట్టింగ్ నిర్వహిస్తున్న మామూనూర్ ప్రాంతంలో ఆకస్మిక దాడులు నిర్వహించి నిందితులు అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులు కేయూసి పోలీస్ స్టేషన్‌కు అప్పగించి కేసులను నమోదుచేయించారు. ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు,శ్రీనివాస్ జీ సంతోష్.ఎస్.వి లవణ్ కుమార్, కెయూసి ఎస్.ఐ సంపత్, ఏఏఓ సల్మాన్‌షా, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుళ్ళు సోమలింగం, మాధవరెడ్డి, స్వర్ణలత, కానిస్టేబుళ్ళు రాజేష్, ఆలీ, బిక్షపతి, శ్రీను, రాజు, శ్రవణ్ కుమార్, హోంగార్డ్ విజయ్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము

పెద్దదన్వాడలో గర్భిణీ స్త్రీలకు అవగాహన

జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాలకొండయ్య

జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజక వర్గం రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని పెద్ద దన్ వాడ గ్రామం రైతు వేదిక దగ్గర గ్రామము ఉన్న గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రి లో కాన్పు గురించి వారికీ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాలకొండయ్య అవగాహన కల్పించారు. ప్రతీ గర్భిణీ స్త్రీలు కాన్పుకు ముందు టీకా మందు సూది, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు తప్పకుండా వాడాలని ఆయన అన్నారు. కాన్పు ఇంటి దగ్గర కాకుండా రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పు కావాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి లో కాన్పు అయితే తల్లీ బిడ్డా క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారని ఆయన మాట్లాడుతూ తెలిపారు. కాన్పు తర్వాత కే సి ఆర్ కిట్ తో పాటు, ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇస్తుందని ఆయన అన్నారు. గర్భిణీ మహిళలు పురిటి నొప్పుల వచ్చిన వెంటనే 108 వాహనం నకు ఫోన్ చేస్తే, అంబులెన్స్ మీ ఇంటికి వచ్చి మిమ్ములను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నకు తీసుకొని వస్తారని, కాన్పు తర్వాత అదే వాహనం లో మిమ్ములను మీ ఇంటికి క్షేమంగా చేరుస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా పారా మెడికల్ ఆఫీసర్ మల్లికార్జున, రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్, హెల్త్ సూపర్ వైజర్ హెలెన్, నవనీతం, హెల్త్ అసిస్టెంట్ రంజిత్ కుమార్, ఏ ఎన్ ఎమ్ లు సుభాషిణి, నిర్మల, ఆశా వర్కర్లు సారమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం…. ఎమ్మెల్యే అరూరి….  

ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు.

 

వర్దన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన గొర్రె కుమారస్వామి గారికి 2లక్షల 50వేల రూపాయలు, దమ్మన్నపేట గ్రామానికి చెందిన కొండబోయిన సాయిలు గారికి 2లక్షల 50వేల రూపాయలు అలాగే మరో ముగ్గురు లబ్ధిదారులకు లక్షా 54వేల రూపాయలు మొత్తం 6లక్షల 54వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన చెక్కులను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చెన్నారం గ్రామంలోని నర్సరీ ని సందర్శించారు.

 

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా క‌ల్గిస్తుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భగవాన్ దాస్ స్పూర్తితోనే కార్మిక హక్కులకై పోరాటం

 

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

ఘనంగా భగవాన్ దాస్ 92వ జయంతి

కార్మిక నాయకులు, కమ్యూనిస్టు యోధుడు బిఆర్ భగవాన్ దాస్ స్పూర్తితోనే కార్మికుల హక్కుల రక్షణకై పోరాడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.బిఆర్ భగవాన్ దాస్ 92వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం హన్మకొండ అశోక జంక్షన్ లోని బిఆర్ భగవాన్ దాస్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ దాస్ విగ్రహానికి చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి కె. బిక్షపతి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల హక్కులను కేంద్రం హరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నామని అన్నారు.

పార్టీలు వేరైనా అందరికీ ఆదర్శంగా నిలిచిన ఉక్కు మనిషి బిఆర్ భగవాన్ దాస్ అని, ఆయన స్పూర్తితోనే తాము నిరంతరం కార్మిక, ప్రజాసమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుతున్నామని చెప్పారు. నగరంలో భగవాన్ దాస్, కాళీదాస్ పేదలకు ఇండ్ల స్థలాల కోసం పోరాడారని, ఇప్పటికే నిరుపేదలైన గుడిసె వాసులకు ఇండ్ల స్థలాలు ఇచ్చామని, ఇంకా చెరువు శిఖం భూముల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఉన్నందున ఇప్పించ లేక పోయామని, నగరంలో జీవో 58,59 ప్రకారం అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. వారు కన్న కలలు సాగించేందుకు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం అందరినీ కలుపుకొని ఐక్యంగా పోరాడుతామని చెప్పారు. 

బిఆర్ నగర్ లో భగవాన్ దాస్ విగ్రహం పెడతాం

ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

వరంగల్ నగరంలోని బిఆర్ నగర్ లో భగవాన్ దాస్ విగ్రహం ఏర్పాటు చేయాలని, అందుకు తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు.వరంగల్ నగర ప్రజలకు మంచినీటి సమస్య, పేదల ఇండ్ల స్థలాల కోసం భగవాన్ దాస్ అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె. బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి,భగవాన్ దాస్ కుమారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బిఆర్ లెనిన్, కార్పొరేటర్ లు పోతుల శ్రీమాన్, వేముల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ లు తాడిశెట్టి విద్యాసాగర్, మాడిశెట్టి శివశంకర్, వీరగంటి రవీందర్, చీకటి ఆనంద్, నాయకులు పులి రజనీకాంత్, నయీం, సిపిఐ జిల్లా నాయకులు మద్దెల ఎల్లేష్, కొట్టెపాక రవి, కండె నర్సయ్య, మాలోతు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాం బాలయ్య కుటుంబానికి సిద్ధార్థ సోషల్ సర్వీస్ సొసైటీ ఆర్థికసహాయం*

నేటిధాత్రి చేర్యాల..

చేర్యాల పట్టణానికి చెందిన శ్రీరా0 బాలయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించినందున సిద్ధార్థ సోషల్ సర్వీస్ సొసైటీ తరపున బాలయ్య కుటుంబానికి 15000 రూపాయలు మరియు 50 కిలోల బియ్యం బాలయ్య కుటుంబానికి అందజేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో సిద్ధార్థ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు గుస్క వెంకటేశం, కోశాధికారి శ్రీరాం వెంకటేశం, కార్యదర్శి కాటం విష్ణు, బుట్టి సత్యనారాయణ, బుట్టి యాదగిరి, గుస్క శశిధర్,గుస్క గోవర్ధన్,కాటం రవి, కాలాటి పృథ్వీరాజు,కాలాటి కేశవులు, తదితరులు పాల్గొన్నారు*

సిఎం చెప్పిందే నిజమైంది!

 

బిజెపి నేతల వ్యాఖ్యల దుమారం చేటు తెచ్చిందా?

గల్ఫ్ దేశాల అగ్రహాం మొదలైందా?

ఇది బుద్ది జీవుల దేశం….

మతపిచ్చి, మతోన్మాదం మంచిది కాదు…

చిన్న పొరపాటు జరిగినా వందేళ్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది?

గత కొంత కాలంగా కేసిఆర్ ఇదే చెబుతున్నారు?

అందుకే దేశంలో అధికార మార్పు జరగాలంటున్నారు?

ప్రజల్లో వస్తున్న మార్పు కేసిఆర్ వేస్తున్న అడుగుల వైపు…

సామ్యవాద, లౌకిక లక్ష్యాలే మనల్ని కాపాడేది

అందుకే కేసిఆర్ మేధావి లోకం మాట్లాడాలన్నారు…

మంచి ఎంత మంచిగా చెప్పినా కొన్ని ఎవరూ వినరు. వినదనెవ్వరు చెప్పినా, విననంతనే వేగిరపడ, వివరింపంగన్…అని పెద్దలు ఊరికే చెప్పలేదు. మంచి విషయాలు ఎవరు చెప్పినా వినాలి. అందులోనూ తెలంగాణ కార్యశీలి, కర్మశీలి, ఆచరణవాది, ప్రగతి దారి, బంగారు తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి కేసిఆర్ లాంటి వారు చెప్పినప్పుడైనా ఆలోచించాలి. కనీసం ఎందుకు చెబుతున్నాడా! అన్నదైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. బిజెపి వ్యవహారం మూలంగా భవిష్యత్తు కుదేలయ్యా అవకాశం వుందని ఊహించారు. ఎంతో రాజనీతిజ్ఞుతతో , ముందు చూపుతో, దేశంలో గుణాత్మక మైన మార్పు కావాలని సూచించారు. అదే జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ సూచనలను బిజెపి పెడచెవిన పెట్టింది. కర్ణాటక లాంటి సిలికాన్ వ్యాలీ గా పేరుగాంచిన ప్రాంతాలలో మతపరమైన అలజడులు వద్దని భుజ్జగించింత సుతిమెత్తగా కూడా కేసిఆర్ హితవు పలికారు. అయినా వినలేదు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు మతపరమైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం అలవాటు చేసుకున్నారు. అవే ఓటు బ్యాంకుగా మారుతున్నాయన్న భ్రమలు పెట్టుకున్నారు. ఇప్పడవి ఆశనిపాతమైనట్లు తెలుసుకుంటున్నారు. 

 తెలంగాణ రాష్ట్ర సాధన తన జీవిత లక్యంగా సాగిన నేత.‌ తెలంగాణ కోసం ఓ వైపు నిర్విరామ పోరాటం చేస్తూనే, మరో వైపు తెలంగాణ ప్రగతి దారుల గురించి కలలున్నారు. ఇప్పుడు ఆచరించి చూపిస్తున్నారు. అసలు ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత త్వరితగతిన వేగవంతమైన అభివృద్ధి కనబర్చిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదు. అంతర్జాతీయ నగరంగా, విశ్వ నగరంగా హైదరాబాదు తీర్చిదిద్దబడుతోంది. అయితే దేశ కాలమాన పరిస్థితులలో రాజకీయాల పాత్ర, కేంద్ర పాలక పక్షం ఏక పక్ష ప్రవర్తన గురించి ముఖ్యమంత్రి కేసిఆర్ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

 

కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చాక బిజెపి పార్టీ చేస్తున్న శృతిమించిన చేష్టలు దేశానికి ఇబ్బంది కరమంటూ చెబుతూనే వున్నారు. పెరుగుతున్న ధరలు, దెబ్బ తింటున్న అంతర్జాతీయ సంబంధాలపై కేంద్రం తీరును తప్పుపడుతూనే వున్నారు. నిత్యం బిజెపి మత సంబంధమైన వాదనలపై కేసిఆర్ అగ్రహాం కూడా వ్యక్తం చేశారు. మానిన గాయాలను రేపి రాజకీయం చేయడం, కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రచారం వంటి వాటిపై నిప్పులు చెరిగారు. చైనా మనదేశంలోకి చొచ్చుకొని వస్తున్న విషయం, అరుణాచల్ ప్రదేశ్ వద్ద చైనా గ్రామాల నిర్మాణం వంటి విషయాలపై బిజెపిని నిలదీశారు. దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ను కూడా బిజెపి నేతలు నిందించే దాకా వచ్చారు.‌ ముఖ్యమంత్రి కేసిఆర్ క్షమాపణ చెప్పాలని నానా యాగీ చేశారు. అయినా ముఖ్యమంత్రి బాధ్యత కలిగిన నాయకుడిగా ప్రజలను చైతన్యం చేయడం తన బాధ్యతగా కేంద్రం తప్పులను ఎత్తిచూపుతూనే వచ్చారు…కేంద్రాన్ని తూర్పారపడుతూనే వచ్చారు…

 

ఇప్పుడు అదే నిజమైంది. బిజెపి నేతలు నోటికి అడ్డూ అదుపు లేకుండా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో చర్చకు దారి తీశాయి. బిజెపి అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలు రేపిన దుమారం వల్ల అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చకు ఎవరు బాధ్యత వహిస్తారు. గతంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ విస్పష్టమైన భవిష్యత్తు ఉత్పాతం వివరించారు. ప్రపంచంలో 59 ఇస్లామిక్ దేశాలున్నాయి. మన దేశమంటే ఆయా దేశాలు ఎంతో ప్రాధాన్యతనిస్తాయి. అంతే కాకుండా ప్రపంచ దేశాలలో మన దేశ ప్రజలు సుమారు 13 కోట్ల మంది ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లారు. అక్కడ మంచి జీవితాలు అనుభవిస్తున్నారు.

ఒకానొక దశలో మన దేశ ఆర్థిక ప్రగతి మందగమనంలో వున్నప్పుడు, విదేశాలలో వున్న మన వారి మారకంతో బైట పడిన సందర్భాన్ని ఆర్థిక వేత్తలు ప్రస్తావిస్తుంటారు. అంతే కాదు 1980వ దశకం వరకు మన దేశ వృద్ధి రేటు జిడిపి కన్నా ఎంతో తక్కువ వున్న చైనా ప్రపంచంలో దూసుకుపోతోంది. అలా ప్రగతి లో పోటీ పడాల్సిన సమయంలో, ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా, అభివృద్ధి చెందిన దేశం కావాలంటే అందరికీ పని దొరకాలి. అన్ని రంగాలలో విసృతమైన పురోగతి కావాలి. పెట్టుబడులు రావాలి. మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశాలు క్యూ కట్టాలి. మన యువతకు పని కల్పించాలి. నూతన ఆవిష్కరణలు జరగాలి. టెక్నాలజీ రంగంలో మరింత పురోగతి సాధించాలి. పెట్టుబడులు వెల్లువలా రావాలి.

 

 1956 లో ఎల్ఐసి ప్రైవేటు రంగంలో వుంటే, దానిని నాటి ప్రధాని నెహ్రూ జాతీయం చేశారు. దానిని దేశ సంపదగా మార్చారు. మరి బిజెపి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసింది. విదేశీ పెట్టుబడులు లేకుండా, మన సంస్థలు ప్రైవేటు పరం చేస్తూ, మతపరమైన వివాదాలు రేపుతున్నారు. ప్రపంచ దేశాలలో వున్న మనవారి పట్ల అలాంటి ద్వేషభావాన్ని వ్యక్తం చేస్తే, వాళ్లంతా తిరిగి వస్తే వారికి ఉపాధి కల్పించగలమా? గత కొంత కాలం గా ముఖ్యమంత్రి కేసిఆర్ సూటిగా, స్పష్టంగా చెబుతూనే వస్తున్నారు. భవిష్యత్తులో ఇది జరిగే ప్రమాదముంది అంటూ హెచ్చరిస్తూనే వున్నారు. విదేశీ దౌత్యపరమైన సంబంధాలకు ఇబ్బంది కరమైన పరిస్థితులు తీసుకురావొద్దన్నారు. కానీ బిజెపి నేతలు అన్నంత పని చేశారు. కేసిఆర్ లాంటి వారి మాటలు పెడచెవిన పెడుతూనే వస్తున్నారు…

 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అల్లర్లు చలరేగినా, కనీసం ఆహారం అందని కాలమది…అయినా నాడు అభివృద్ధి మీదే దృష్టి పెట్టారే తప్ప, ఈ వివాదాలకు చోటివ్వలేదు. గత ఎన్నికల ముందు నుంచి ముఖ్యమంత్రి కేసిఆర్ చెబుతున్నది ఒకటే మాట. అభివృద్ధి వృద్ధి అంటే మతం కాదు…మనం మనం మనుషులమన్న భావన పెంపొందించుకోవడం…ఒకరినొకరు గౌరవించుకోవడం…ఒకరి మేలు మరొకరు కోరుకోవడం, ఒకరికొకరయ తోడుగా వుండడం. వీటికి మతం అడ్డు రావొద్దు. కులం గోడ కట్టొద్దు. కొన్ని వందల సంవత్సరాలు పరాయి పాలనలో మన దేశం వుంది. రెండు వందల ఏళ్లపాటు ఆంగ్లేయులు ‌పాలనలో వుంది. అయినా హిందూ అన్నది ఒక ప్రవాహం… అది మతమా? అభిమతమో గాని కొనసాగుతూనే వుంటుంది. సనాతన ధర్మం ఈ ప్రపంచం వున్నంత కాలం వుంటుంది.

 

 హిందూ అనే పదానికి సృష్టి తప్ప నాశనం లేదు. అది అంతమయ్యేది కాదు…ఒకదగ్గర ఆగిపోయేది కాదు…ఎవరో పెంచిపోషిస్తేనే పెరిగేది కాదు..దాని విసృతిని ఎవరూ అడ్డుకోలేరు…ఇది చరిత్ర చెప్పిన నిజం. మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజలే ఏలుతున్న ప్రభుత్వం. ఇంకా ఎందుకు అభద్రతా భావం. 

 

 

 మనదేశంలో, ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే 1323 లో పిచ్చి తుక్లక్ మూలంగా డిల్లీ సుల్తానుల చేతిలోకి వెళ్లి పోయింది. ఆ తర్వాత బహమనీ సుల్తానులు పాలించారు. ఆ తర్వాత కుతుబ్ షాహీ లు, వారి తర్వాత మొగలుల ప్రత్యక్ష పాలన, ఆపై అసఫ్ జాహీలు…పాలించారు. కానీ తెలంగాణ లో ఎనభై శాతం అప్పటికీ, ఇప్పటికీ హిందువులే వున్నారు. నిజాం కాలంలో రజాకార్ల నాయకుడు కాశిం రజ్వి తబ్లిక్ పేరుతో మత మార్పిడులకు పాల్పడ్డాడు. ఒత్తిడి తెచ్చాడు. హింసించాడు. అల్లకల్లోలం చేశాడు. కానీ వారి కోరిక నెరవేరిందా? అంజుమన్ లాంటి సంస్థ మత పరమైన సభలు నిర్వహించింది. కానీ ఏం జరిగింది. హిందూ సమాజంలో మార్పు రాలేదు. పైగా తెలంగాణ లో కలరా వ్యాప్తి చెందిన సమయంలో ఓ సైనికుడు నిర్మాణం చేయించిన మహాకాళి గుడి నిర్మాణానికి నిజాం సహకరించాడు. 

 

మూడో నిజామైన సికిందర్ జా కాలం నుంచి ఇప్పటికీ నగరంలో బోనాల పండుగ అన్ని వర్గాల సహకారం అంగరంగ వైభవంగా జరుగుతోంది. పీరిల పండుగ హిందూ ముస్లిం సఖ్యతను చూపిస్తోంది. ఆఖరు కుతుబ్‌షాహీ అయిన తానీషా కాలంలో భద్రాద్రి నిర్మాణం జరిగింది. అలాంటి వాతావరణం చెడగొట్టొద్దనేదే ముఖ్యమంత్రి కేసిఆర్ పదే, పదే చెబుతూవస్తున్నారు. అంతే కాదు ఆర్ ఎస్ ఎస్ ఛీఫ్ కూడా మసీదుల వివాదం వద్దన్నారు. అయినా గతంలో జరిగిన వాటికి ఇప్పటి సమాజానికి సంబంధం లేదు…నాటి తప్పులకు నేడు బాధ్యులెవరూ కాదు…రాజ్యాంగ స్పూర్తితో ముందుకు సాగాలే గాని, పార్టీల రాజ్యాంగాలు కాదు.

డబ్బు, బంగారంతో ఉడాయించిన కిలాడీ దంపతుల అరెస్ట్

అవసరాల కోసమని కాలనీవాసులను మోసం చేసి వారి నుండి డబ్బులు, బంగారాన్ని తీసుకోని వాటితో ఉడాయించిన కిలాడీ దంపతులను టాస్క్ ఫోర్స్ మరియు కేయూసి పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్ట్ చేసారు.*

*వీరినుండి పోలీసులు సుమారు 11లక్షల80 వేల రూపాయలతో పాటు 125 గ్రాముల బంగారు అభరణాలు, ఒక ఖరీదైన కారు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.*

ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన దంపతులు కొమళ్ళ కిషోర్, కొమళ్ళ దివ్య హన్మకొండ లోని పరిమళకాలనీలో నివాసం వుంటూ చిరు వ్యాపారం నిర్వహిస్తుండేవారు. ఈ వ్యాపారంలో వారికి లాభాలు రాకపోవడంతో సులభంగా పెద్ద

మొత్తం డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం ఈ కిలాడీ దంపతులు తాము నివాసం వుంటున్న కాలనీవాసులతో స్నేహపూర్వకంగా వుండేవారు. ఈ దంపతలు తమ ప్రణాళికలో భాగంగా ముందుగా కాలనీవాసుల వద్ద తమ వ్యక్తిగత అవసరాల నిమిత్తం ముందుగా చిన్న మొత్తాల్లో అప్పుగా డబ్బు లేదా బంగారాన్ని తీసుకోని ప్రతి ఫలంగా వారికి తీసుకున్న డబ్బుకు పెద్దమొత్తంలో వడ్డీ చెల్లించేవారు. దీనితో దంవతలు తాము తీసుకున్న డబ్బుకు రెండింతలు డబ్బు తిరిగి అందజేసి కాలనీవాసులను నమ్మించడం ప్రారంభించారు. కాలనీవాసులకు వీరిపై నమ్మకాన్ని కలిగించేవిధంగా ఈ దంపతలు వ్యవహరించారు. తాము అనుకున్న ప్రకారం తమ ప్రణాళిక చివరి అంకాన్ని రావడంతో కిలాడీ దంపతులు కాలనీ వాసుల నుండి పెద్ద మొత్తంలో డబ్బు, బంగారాన్ని తీసుకోనేందుకుగా ప్రణాళికను రచన చేసారు. ఇందులో భాగంగా నిందితురాలు కొమళ్ళ దివ్యా తనకు అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయుంచుకోవాలని లేదంటే తన ప్రాణానికే ప్రమాదమని కాలనీలోని మహిళలను నమ్మించడంతో పాటు తన చికిత్స కోసం డబ్బు లేదా బంగారాన్ని రుణం ఇచ్చేవారికి అధిక వడ్డీని అందజేస్తాని తెలియజేసి కాలనీలోని ఆరుగురు మహిళలను నుండి సుమారు 43 లక్షల 40వేల రూపాయలతో పాటు 430 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకోని కిలాడీ దంపతులిద్దారు ఒకాను శుభ ముహుర్తంలో కాలనీ నుండి ఉడాయించారు. దీనితో డబ్బు, బంగారు రుణంగా ఇచ్చిన బాధితులు ఈ దంపతులిద్దరు కాలనీకి రాకపోవడంతో పాటు వారి ఫోన్ కుడా స్వీస్ఆఫ్ కావడంతో తాము మోసపోయామని గుర్తించారు.

కమిషనర్ ఆదేశాల మేరకు నిందితులపై కేయూసి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడంతో పాటు పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ఫ ర్స్ ఇంచార్జ్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ అధ్వర్యంలో టాస్క్ఫ ర్స్ మరియు కేయూసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వద్దవున్న టెక్నాలజీని వినియోగించుకోని కిలాడీ దంపతలను గుర్తించడంతో పాటు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దంపతలిద్దరు కాలనీవాసులను

మోసం చేసినట్లుగా అంగీకరించారు. అదే విధంగా ఈ దంపతలకు సహకరించిన మరో ఇద్దరు మహిళలైన అరుణ,మంజుల ఇరువురు ప్రస్తుతం పరారీలో వున్నారని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

ప్రజల సొమ్ముతో ఉదయించిన దంపతులిద్దరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరచడం ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు సంతోష్, శ్రీనివాస్, కెయూసి ఇన్స్ స్పెక్టర్ దయాకర్, టాస్క్ ఫోర్స్, కేయూసి ఎస్. ఐలు లవణ కుమార్, సంపత్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్లు సోమలింగం,మాధవరెడ్డి, స్వర్ణలత,

కానిస్టేబుళ్ళు రాజేష్, ఆలీ, బిక్షపతి, శ్రీను, రాజు, శ్రవణ్ కుమార్ మరియు హోంగార్డ్ విజయ్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.

12వ తేదీన గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్

 

ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్య శ్యామలం*

 

 

*జూన్ 12వ తేదీన గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని ముద్దాడనున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు వెల్లడించారు.*

*గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్య శ్యామలం అవుతుందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.*

 

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పందిళ్ళ గ్రామంలో మంగళవారం శ్రీ స్వయం భూరాజేశ్వర ట్రస్టు వాసవి నిత్యాన్నదాన సత్రంను హుస్నాబాద్ ఎమ్మెల్యే ఓడితెల సతీశ్ తో కలసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు.

 

– రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ కామెంట్స్ :

 

– *జూన్ 12వ తేదీన గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని ముద్దాడనున్నాయని వెల్లడి.*

 

– *గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్య శ్యామలం అవుతుంది.*

 

– *పొట్లపల్లి శ్రీ స్వయం భూరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికై ముర్రంశెట్టి రాములు తండ్రి పరితపించే వారని, ఆకలి అయిన వారికి అన్నం పెట్టి మంచిపేరు గడించారు.*

 

– *పది మందికి ఉపయోగకరమైన సేవ చేస్తున్న స్వయం భూరాజేశ్వర ట్రస్టు వాసవి నిత్యాన్నదాన సత్రంకు శాశ్వత నిధిలో భాగస్వామిగా తన నెల వేతనాన్ని ట్రస్టుకు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడి.*

 

– *హుస్నాబాద్ లో 10 కోట్లతో 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తాం. ప్రతీ ఏఎన్ఏం సబ్ సెంటరుకు 20 లక్షలు నిధులు కేటాయింపు*

 

– *హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్నీ తండాలకు త్వరలోనే రోడ్లు మంజూరు చేయిస్తా.*

 

– *బీజేపీ కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకుండా మిల్లర్లపై రైడింగ్ పేరిట వేధింపులకు గురి చేస్తే., తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఇబ్బందులు కలగకుండా వడ్లు కొనుగోళ్లు పూర్తి చేస్తున్నది*

 

– *పక్క రాష్ట్రాలైన కర్ణాటక, ఛత్తీస్ ఘర్ లలో బీజేపీ, కాంగ్రెస్ పాలన ఉన్నా కానీ కనీసం వడ్లు కొనే పరిస్థితి లేదు.*

 

– *పక్క రాష్ట్రాల నుంచి వడ్లు తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో అమ్ముకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కంటే మనd తెలంగాణ రాష్ట్రంలో 500 ఎక్కువ వస్తున్నాయని వడ్లు విక్రయాలు చేసుకునేందుకు తెలంగాణకు వస్తున్నారు.*

 

– *మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బండి సంజయ్ ఒకవైపు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మరోవైపు పాదయాత్రలు చేయడం విడ్డూరం*

 

– *హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏఎన్ఎం సబ్ సెంటర్లను పల్లె ఆసుపత్రులుగా త్వరలో అప్ గ్రేడ్ చేస్తాం.*

అన్నకు నోటి దూల` తమ్ముడిది నెరవేరని కల!?

చిరు చేరడం కల్ల…మెగా రాజకీయం డొల్ల?

అభిమానులు నిప్పుల్లో దూకాలా?

నాగబాబు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు?

అభిమానులంటే అంత అలుసైపోయారా?

ఆ కుటుంబాలకు గర్భశోకాలు మిగుల్చుతారా?

ఎవరైనా అభిమాని పవన్‌ కోసమంటూ అఘాయిత్యం చేస్తే? ఎవరు భాధ్యులు?

నాగబాబు బుసలు` పవన్‌ రుసరుసలు..

పుస్తకాలు చేతిలో పట్టుకుంటే చరిత్ర తెలియదు!

జగన్‌ పాలన ఎమర్జెన్సీనీ తలపిస్తే పవన్‌ పోరాటమేది?

అయితే ముగ్గురం, లేకుంటే ఇద్దరం…ఒంటరి పోరు చూద్దాం!?

లెక్కలేని, లెక్కకందని పవన్‌ రాజకీయ లెక్కలు!

సినిమా ప్రమోషన్‌ కు తప్ప, బైటకు రారు…?

రాజకీయాలు చేసి, జనాన్ని ఉద్దరిస్తారా?

ఇప్పటికైనా జనం ఓట్లేందుకు వేయడం లేదో అర్ధం కాకపోతే కష్టం?

తెర మీద రంగుల కల, రాజకీయాల్లో నెరవేతుందా?

ఆంధ్రదేశాన్ని ఏలే కలుందని మీకు మీరనుకుంటే కాదు… జనమనుకోవాలి?

ఇంకా నయ్యం…ఒంటికి మంటెట్టుకోవాలనలేదు…అభిమానులంటే అంత అలుసైపోయారా? మీకోసం నిప్పుల్లో దూకాలా? మీరు రాజకీయాలు చేసి, గెలిచి పదవులు పొంది, పాలన సాగిస్తారా? ఆ కుటుంబాలకు గర్భశోకాలు మిగిల్చుతారా? సిగ్గుండాలి…మాట్లాడడానికి…అందుకే జనం జనసేనకు ఓట్లు వేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించినట్లున్నారు. ఏదైనా మాట్లాడే మందు ముందూ, వెనక ఆలోచించుకొని మాట్లాడాలి. జనంలో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అంతే కాదు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి. నోరుంది కదా…అని, ఎది చెప్పినా వింటారు కదా? అని నోటి నుంచి రాకూడని మాటలు మాట్లాడితే ఈ మాత్రం కూడా రాజకీయాలకు పనికిరాకుండా పోతారు. ఇది ముందు తెలుసుకోవాలి. అసలే రాజకీయాల మీద నాగబాబుకు అవగాహన శూన్యమన్నది వింటున్నదే…? అన్న అలా…తమ్ముడు ఇలా…నాగబాబు బుసలు కొట్టినట్లు మాట్లాడుతున్నాడు. తమ్ముడు తనేదో చరిత్రకు సాక్ష్యమన్నట్లు మాట్లాడుతున్నాడు. దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది 1975లో …ఎత్తేసింది 77లో…ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా, జనం ఏది చెబితే అది నమ్ముతారా? అసలు ఆనాడు అన్ని వర్గాల ప్రజలు ఏకమయ్యారా? అన్ని పార్టీలు కలిశాయా? ఇప్పుడు అలాంటి తరుణం ఎదురైందా? అదే నిజమైతే ఆనాడు ఎంతోమంది ఎమర్జెన్సీ నిరసిస్తూ పోరాటాలు చేశారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగావున్న వెంకయ్యనాయుడు కూడా ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు…మరి 2008 లో రాజకీయం మొదలు పెట్టిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటి వరకు ఎన్ని సార్లు జనం కోసం పోరాటాలు చేశారు. ఎన్ని సార్లు జైలుకు వెళ్లారో ఒక్కసారి చెప్పగలరా? మాటలు కాదు చెప్పాల్సింది…చేయాల్సింది ఉద్యమాలు…ప్రసంగాలు కాదు…ప్రజలంటే ప్రాణాలకు తెగించి పోరాడాలి. చంద్రబాబు పాలనలోనైనా ఓసారి పవన్‌ రోడ్డెక్కినట్లు జనానికి గుర్తుంది…మరి ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డిది అరాచకపాలనే అయితే,ఒక్కనాడు పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు రోడ్డెక్కలేదు? ఎందుకు పోరాటం చేయలేదు? భయమా? ఇది జనం అడుగుతున్న మాటే…? ఎన్నికల సమయం అనగానే ఎగరేసుకొని రావడం, నాలుగు రోజులు కనిపించడం మాయమైపోవడం ఇది పవన్‌ కళ్యాణ్‌ కు అలవాటైన నాటకమే…. తెలుగు ప్రజలకు పవన్‌ కళ్యాణ్‌ రాజకీయం ఏమిటో ఇప్పటికే ఎంతో అర్ధమైపోయింది. పవన్‌ కళ్యాణ్‌ ప్రజల్లోకి వస్తున్నారంటే సినిమా పూర్తయినట్లు…దాని ప్రమోషన్‌లో భాగంగా రాజకీయాలు చేస్తున్నట్లు అన్నది ఎప్పుడో తెలిసిపోయింది. అంతకనాన్నా ఏమీ వుండదని ఎప్పుడో స్పష్టమైంది. ఇప్పుడుకొత్తగా పవన్‌ కళ్యాణ్‌ చెప్పాల్సింది లేదు…జనం వినాల్సిందేమీ లేదు… ఆణిముత్యాలు చెప్పడానికి ఏమీ లేదు…నమ్మడానికి అసలైన రాజకీయం పవన్‌ దగ్గర లేనే లేదు…? ఇది జనం అనుకుంటున్న మాట. 

           అయితే ముగ్గురం, లేకుంటే ఇద్దరం…తప్పదనుకుంటే తప్ప… ఒక్కరమా? ఇదేం దిక్కు మాలిన ఫార్ములానో పవన్‌ కళ్యాణ్‌ కు తప్ప మరెవరికీ అర్ధంకానిది. 2008 నుంచి రాజకీయాలు చేస్తూ, 2022 వచ్చినా ఒంటరి పోటీకి భయపడే పార్టీ జనం కోసమేమి నిలబడుతుంది? జనానికి ఏం న్యాయం చేస్తుంది? 2014 ఎన్నికల్లోనూ జగన్‌కు అధికారం రావొద్దని కలిశారు. ఏం జరిగింది. ముగ్గురం కలిస్తే వెంకన్న స్వామి నామాలు అని భహిరంగంగానే ప్రకటించారు. కాని గెలిచి ఏం చేశారు. పంగనామాలు పెట్టారనే కదా! ప్రజలు 2019లో జగన్‌కు తిరుగులేని మెజార్టీనీ కట్టబెట్టారు. ప్రతిపక్షం వాసన లేకుండాచేశారు. పవన్‌ కళ్యాణ్‌ రెండు చోట్ల నిలబడ్డా ఓడిరచారు. ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా చేశారు. అయినా నిలబడ్డారు ఫరవాలేదని అందరూ అనుకున్నారు. కాని పవన్‌ది అదే మాట..మళ్లీ అదే బాట….మేం ముగ్గురం వస్తాం…సింగిల్‌ సింగిల్‌గా రాం…ఇదే కదా! నినాదం…ఈ మాత్రం దానికి రాజకీయాలు ఎందుకు? ఎన్నికల నాడు కలిస్తే చాలదా? బిజేపి, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేసి, 2014లో గెలిచారు. అమరావతి రాజధాని అన్నారు. కేంద్రం నుంచి ప్రధాని వచ్చారు. ఏం తెచ్చారు…? తెచ్చిందేమిటో…పవన్‌కు తెలుసు…అదే మహాభాగ్యమనుకున్నారు. సరే…ఆవేశమో! కోపమో! కాని జనం మేలు కోరే నాయకుడిగా గుర్తింపు కోసమో! పాపం పవన్‌ పాచిపోయిన లడ్డూలన్నారు. జనంతో కలిసి పోరాటం చేస్తారని అందరూ అనుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా అవే మాటలు చెప్పారు. చెగువేరా? అన్నారు…మహాత్మాబాపూలే …మార్గ నిర్ధేనం అన్నారు…ఆఖరకు ఉత్తర ప్రదేశ్‌ వెళ్లి…మాయావతీ ఆశీస్సులు తీసుకున్నారు..! ఏమైంది!! మళ్లీ బీజేపికి సై అన్నారు…మోడీకి జై కొట్టారు…ప్రత్యేక హోదా అన్న పదం ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా నోటి నుంచి రాకుండా చూసుకున్నారు. ప్రత్యేక హోదా ఇస్తే నాకేంటి? ఇవ్వకపోతే నాకేంటి? అనుకున్నారు…నేనొక్కడినే ఎందుకు బద్‌నాం కావాలని ఆ ముక్కే మర్చిపోయారు…? ఇప్పుడు మళ్లీ ఒక్కటౌతామంటున్నారు..ఏకమై ఎన్నికలకు వెళ్తామంటున్నారు..! ఈసారి ప్రత్యేక హోదా అన్న ఆ ఒక్క ముక్క తప్ప అన్నీ మాట్లాడుతున్నారు… జనానికి నామాలు పెట్టడం ఒక్క జనసేన వల్ల అయ్యేలా కనిపించడం లేదు…అందుకే మళ్లీ పొత్తుతోపోతే తప్ప, తలెత్తుకోలేమన్నది పవన్‌కు తేలిపోయింది. 

                 సింహం సింగిల్‌గా వస్తుందని గతంలోనే చెప్పి గెలిచింది వైసిసి. అదే డైలాగ్‌ సినిమాలో చెప్పి, రాజకీయాల్లో పాయిపోయిది జనసేన. ఒక్కసారి ఒంటరిగా పోవడంతో ఏం జరిగిందో కళ్ల ముందు పెట్టుకొని, మళ్లీ ఒంటరి పోరు అన్నది కలలో కూడా పవన్‌ ఊహించలేకపోతున్నాడు. పంతానికి పోతే, వైసిసి సవాలకు రెచ్చిపోతే గత ఫలితాలే పునరావృతం అన్నది పవన్‌కు తెలుసు. అందుకే వైసిపి వాళ్లు రెచ్చగొట్టినా మేం రెచ్చిపోం…ఒంటరిగా కలలో కూడా ఎన్నికల బరిలో దిగమంటున్నారు. ఇదిలా వుంటే ఇన్నేళ్లైనా నాగబాబుకు రాజకీయం అంతుపట్టడమే కాదు, ఒంటపట్టడం లేదన్నది మరోసారి రుజువైంది. మొన్న జరిగిన మా ఎన్నినకల్లోనే మాట నెగ్గించుకోలేకపోయారు….కనీసం పంతం నెగ్గించుకోలేకపోయారు…తన ప్యానల్‌లను గెలిపించుకోలేకపోయారు….కాని అభిమానులు పవన్‌ చెబితే నిప్పుల్లో దూకాలట…! 

                   నాగబాబు మాట వింటే చిన్నప్పటినుంచి చూస్తున్న చింతకాయను కొత్తగా ఇదేం కాయ వంకటింకరగా వుందన్నట్లుంది. నాలుగు పైసలు చేతిలో లేని నాడు నాగబాబు ఏం మాట్లాడాడో జనానికి తెలుసు? తన కుమారుడు సినిమా ఆడియో రిలీజ్‌కు పవన్‌ రాకపోతే అభిమానులు గగ్గోలు పెడుతుంటే, వారేదో బానిసలైనట్లు వారిని తిట్టారు..అభిమానులను చీదరించుకున్నారు…ఇప్పుడేమో! అన్న అభిమానులు, తమ్ముని అభిమానులు ఒక్కటి కావాలంటున్నాడు? అప్పుడు పవన్‌ రాలేదన్నందుకు తిట్టిన మీరే, ఇప్పుడు పవన్‌ కోసం అభిమానులు ఏదైనా చేయాలా? ప్రజలకు సేవ చేయడానికి మీరు రాజకీయాల్లోకి వచ్చారా? లేక జనాన్ని వాడుకొని, వారిని నిప్పుల్లో తేసేయడానికి వచ్చారా? వారి ప్రాణాలతో చెలగాటమాడాలనుకుంటున్నారా? కొంత మంది అమాయకులు మీ మాట విని, ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఎవరు భాధ్యులు…అన్న చేసేవి తప్పులు…తమ్ముడు వేసుకునేవి లెక్కలు…ఇవేనా మీ రాజకీయాలు…అందుకే మిమ్మల్ని జనం నమ్మడంలేదు… పెద్దన్న చిరంజీవిని నమ్మలేదు…తమ్ముడు పవన్‌కు ఓట్లే వేయలేదు…చిన్నన్న నాగబాబు రాజకీయాలకే అసలు పనికి రాడు…అన్నది తన నోటితో తానే చెప్పుకున్నంత పనిచేశాడు…అభిమానుల క్షేమం కోరువాల్సిన నోటితో,నిప్పుల్లో దూకాలన్నప్పుడే రాజకీయాలు చేసే అర్హత ఆ కుటుంబం కోల్పోయింది…సినిమా లోకంలో…రంగుల ప్రపంచంలో…తెర మీద దేవతలం అన్నంతగా మైకంలో వుండేవారికి ఇంతకన్న విలువలేముంటాయి? పుస్తకాలు చదవగానే కాదు…వాటిలోని డైలాగులు చెప్పడం కాదు…నిజాన్ని చూడాలి…సమాజంలో బతకాలి…సినిమా వేరు..రాజకీయం వేరు…మనుషులుగా అందరం సమానంగా, సంతోషంగా, అరమరికలు లేకుండా, సమసమాజ స్ధాపన కావాలని కోరుకోవాలి. ఆచరించి చూపాలి. ఇప్పటికైనా నటన నేర్చుకున్నట్లే , రాజకీయం కూడా నేర్చుకొని చేయండి…విలువలు ఎలా వుండాలో తెలుసుకొని రండి…జనం వస్తున్నారు కదా? అదే రాజకీయం అనుకోకండి…దాన్ని రాజకీయం చేయకండి!! అని అభిమానులు కూడా అంటున్నారు…!

పెద్దల సభకు పంపి ఏం ప్రయోజనం!?

ఎవరూ ఊహించకుండా పదవి ఇస్తే ఏం లాభం?

పార్టీకి పనికొస్తాడని అనుకున్నా పనికిరాని వైనం?

నాయకులను కలుపుకుపోతున్నట్లు కనిపించదాయే?

డాబు దర్పం తప్ప జనంలో కనిపిస్తున్నది లేదాయే?

 ప్రతిష్టకు పోయి పదవిస్తే ఫలితం లేకపాయే?

 పార్టీ కోసం పనిచేస్తున్నట్లైనా కనిపించదాయే?

అసలు పనిచేసే తీరికే నాయకునికి లేకపాయే?

పదవి అలంకారమాయే? 

పుట్టిన పార్టీ కాకపాయే, పెంచిన పార్టీ మీద ప్రేమ కనపడదాయే?

పట్టిపట్టి పదవిస్తే పంగనామాలే కావట్టే?                                 

ఆ ఎమ్మెల్సీ పాడి కౌషిక్‌ రెడ్డి. రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ నాయకుడికి దక్కని అరుదైన అవకాశం ఆయనకు దక్కింది. మొత్తం ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి అరుదైన అవకాశం ఎవరికీ రాలేదు. అంతటి గౌరవం కూడా ఎవరికీ దక్కినట్టు లేదు. కాని ఒక్క పాడి కౌషిక్‌రెడ్డికే దక్కింది. పాడి కౌషిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ రావడం అన్నది చిన్న విషయంగా కాదు. కాని దాని వెనక ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిదందన్నది అందరకీ తెలిసిందే. ఆయనకు ఇది అర్ధమైనట్లు లేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎవరికోసం దిగనన్ని మెట్లు దిగి మరీ కౌషిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేశారు. దాంతో ఆయన తన ప్రతిష్టను కూడా ఫణంగా పెట్టారు. ఒక దశలో టిఆర్‌ఎస్‌ పార్టీ వివాదం మూటగట్టుకున్నది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్ణయం ఎంతో విస్మయం కలిగించింది. ఆఖరుకు పాడి కౌషిక్‌ రెడ్డి మూలంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌కు, బిజేపికి మధ్య చెడిరది. ముఖ్యమంత్రి కార్యాలయానికి, రాజ్‌భవన్‌కు చెడిరది. దూరం పెరిగింది. అప్పటిదాకా వున్న సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ విషయాన్ని కడుపులోనే దాచుకున్నారు. ఇదంతా ఎవరి కోసం జరిగింది. ఒక్క పాడి కౌషిక్‌రెడ్డి మూలంగానే జరిగింది. ముందు భావించినట్లు హుజూరాబాద్‌ టిక్కెట్టు కౌషిక్‌రెడ్డికే దక్కెది. కాని ఆయన చేసిన హంగామా మూలంగా టిఆర్‌ఎస్‌ విమర్శలపాలైంది. టిక్కెట్టు నాదే..నాకే అంటూ కౌషిక్‌రెడ్డి ఇతర నాయకులతో మాట్లాడిన మాటలు బైటకు రావడం పెద్ద దుమారమే జరిగింది. ఇద ఇదిలా వుంటే అప్పటికే మంత్రి కేటిఆర్‌ కౌషిక్‌కు ఎనలేని ఫ్రాధాన్యతను కూడా ఇస్తూ వచ్చారు. ఏ ఫంక్షన్‌లోనైనా కనిపించినా ఎంతో ఆప్యాయతను చూపించారు. ఒక దశలో కౌషిక్‌రెడ్డి ఎమ్మెల్సీ ఫైల్‌పై గవర్నర్‌ సంతకం చేయకపోవడం కూడా టిఆర్‌ఎస్‌ రాజకీయమే అన్నంత దూరం కూడా వెళ్లింది. అలాంటి వివాదాలు కూడా టిఆర్‌ఎస్‌ ఎదుర్కొన్నది. పరోక్షంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా విమర్శలను ఎదుర్కొవాల్సివచ్చింది. విషయం చిన్నదైనా అగాధం పెద్దదైంది. అయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సిఎం చేసిన త్యాగం ఎవరూ చేయలేనిది. కౌషిక్‌రెడ్డి వివాదం పలు పలు విధాల చర్చలోకి రాకుండా చూసుకోవడానికి, ముఖ్యమంత్రి కేసిఆర్‌ నడిపిన మంత్రాంగం, చాణక్యం కూడా వృధా అవుతోందా? అన్నంత దాకా వస్తోంది. 

నమ్మకమన్న పదానికి పర్యాయ పదం ముఖ్యమంత్రి కేసిఆర్‌ అన్నది ఈ ఒక్క సంఘటన ద్వారా చెప్పొచ్చు. పార్టీకి ఏమీ కాని ఒక వ్యక్తి కోసం కూడా ఎంత దూరమైనా వెళ్లగలిగే వ్యక్తిత్వం కేసిఆర్‌ది అని కౌషిక్‌రెడ్డి విషయంలో రుజువైంది. ఎన్ని వివాదాలు ఎదురైనా భరించారు. ఎంత మంది వ్యతిరేకించినా పట్టించుకోలేదు. కాకపోతే ఎక్కడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందరి అంచనాలు పటాంపచలు చేశారు. ఆయన ఆలోచనల్లో వెనుకడుగు వేయలేదు. ముందడుగే వేశారు. కౌషిక్‌రెడ్డి మీద అత్యంత నమ్మకం, విశ్వాసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ పెట్టుకున్నారు. మరి అలాంటప్పుడు కౌషిక్‌రెడ్డి పని తనం ఎలా వుండాలి. రుణం తీర్చుకునే విధానం ఎలా వుండాలి? కాని అలా వుందా? ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. పార్టీకోసం ఏమైనా పనిచేస్తున్నాడా? అన్న చర్చే సర్వత్రా జరుగుతోంది. ఆఖరుకు హుజూరాబాద్‌ ఎన్నికల్లో అంత అంకితభావంతో కౌషిక్‌రెడ్డి పనిచేశాడా? అన్నదానిపై ఇప్పటికీ ఎక్కడో అక్కడ గుసగుసలు వినిపిస్తూనే వున్నాయి. కనీసం ఇప్పటికైనా పార్టీకోసం పనిచేస్తున్నాడా? కార్యకర్తలకు అండగా వుంటున్నాడా? నియోజకవర్గాన్ని కంచుకోటగా మళ్లీ మార్చే ప్రయత్నం చేస్తున్నాడా? అంటే పార్టీ శ్రేణులు చెప్పే మాటలు వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే…? రాజకీయాల్లో నమ్మకాలు ఎప్పుడూ పనిచేయవని తెలుసుకోవాల్సిందే? అన్నదే వినిపిస్తోంది. 

                           నేను ఎమ్మెల్యే కావాలి. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి నేనే పోటీ చేయాలి. పార్టీ టిక్కెట్టు ఇచ్చేనా…సరే సరి…లేకుంటే ఏ పార్టీ అయినా సరి….నేను బరిలో వుండడం తప్పనిసరి…ఎవరు అడ్డుకున్నా ఆగేది లేదు మరి…ఎవరి కోసమే ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు మరి…ఇది ఆయన ఆంతరంగికులతో అనే మాటలు అంటూ టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళనల సారాంశం. ఇంతకీ హుజూరాబాద్‌ టిఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుంది. హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ ఇన్‌ఛార్జి ఎవరు? గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్‌ను కాదని కౌషిక్‌ రెడ్డి చేస్తున్న హంగామా? ఏమిటి? అన్న విషయాల్లోకి వెళ్తే…అసలైన టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఎన్ని సార్లు ఫోన్‌లు చేసినా, స్పందించరు? అన్నది వినిపిస్తున్న మాట. తన ఇష్టాను సారం కమిటిలు వేసుకోవడం. ఆయన అనుచర గణానికి ప్రాధాన్యతనివ్వడం. నియోజకవర్గ ఇన్‌చార్చి గెల్లు శ్రీనుతో చర్చలన్నవి లేవన్నది జగమెరిగిన సత్యమే. మిగతా నాయకులతో పొసిగిందిలేదు. వారితో సఖ్యత కనబర్చింది లేదు. ఇప్పటికీ గోడమీద పిల్లి వాటమే కనిపిస్తోంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇస్తే తప్ప ఆలోచించేది లేదన్నట్టుగానే ఆయన వ్యవహారం వుందంటున్నారు. 

                          కౌషిక్‌రెడ్డి నియోజకవర్గానికి రాడు….ఎవ్వరు ఫోన్లు చేసినా ఎత్తడు? ఇక్కడో ఇంకో ట్విస్టు. 2001 నుంచి టిఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు ఎవరు ఫోన్‌ చేసినా అసలే ఎత్తడు? ఆయనతోపాటు కాంగ్రెస్‌నుంచి టిఆర్‌ఎస్‌లోకి వచ్చిన నాయకులు, కొత్తగా ఇతర పార్టీలనుంచి ఆయన ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి తప్ప ఇతరులకు స్పందించడు? పైగా ఇటీవల ఇల్లంత కుంట సీతారామ స్వామి ఆలయ కమిటిలో మొత్తం ఆయన అనుచరగణమైన కాంగ్రెస్‌ నుంచి వచ్చి చేరిన వారికే పదవులు అందించాడు? కనీసం ఒక్కరికి కూడా అసలైన కార్యకర్తలకు ఒక్క నాయకుడికి కూడా పదవి ఇవ్వలేదు. ఇప్పటికీ ఆయన జిల్లాపరిషత్‌ చైర్మన్‌ కనుమల్ల విజయ గణపతితోగాని, ఎస్సీ కార్పోరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌తోగాని, మరే నాయకుడితో గాని ఒక్క సమావేశం కూడా జరిగింది లేదు? వారితో కలిసి పార్టీ బలోపేతం కోసం ఇంత వరకు కార్యాచరణ చేపట్టింది లేదు? గెల్లిశ్రీనుతో కలిసి, పార్టీ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఏనాడూ చర్చ చేసింది లేదు… ఇక ఆయనతో పార్టీలోకి వచ్చిన వారితోనే ఇల్లంతకుంట కమిటి ప్రకటన జరగడంతో పార్టీలో వివాదం ముసురుకున్నది. దాంతో కౌషిక్‌రెడ్డి వెనక్కి తగ్గాల్సివచ్చింది. కౌషిక్‌రెడ్డి పూర్తిగా టిఆర్‌ఎస్‌ అసలైన నాయకులను పార్టీకి దూరం చేసే పనిలో వున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల హుజూరాబాద్‌కు చెందిన మున్సిపల్‌ నాయకుడి కుమారుడి వివాహం విషయంలో రాజకీయం వెగులోకి వచ్చింది. ఇటు కౌషిక్‌రెడ్డి ఓ దారిలో నడుస్తుంటే, మరో వైపు కొందరు టిఆర్‌ఎస్‌ కోవర్టులు మరో దారిలో నడుస్తూ, మొత్తానికి పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కోవర్టులు పదవులు పొందుతూ, ఇతర పార్టీలకు చెందిన వారితో అంటకాగుతూ పార్టీకి తీరని అన్యాయం చేస్తున్నారని అంటున్నారు. 

                       ఇటీవల నాలుగు మండలాల టిఆర్‌ఎస్‌ నాయకులు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని, ఆ వివరాలును పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక సమ్మక్క`సారలమ్మ జాతర కమిటిలు కూడా కౌషిక్‌ రెడ్డి తనకు ఇష్టం వచ్చిన వారితో వేయడం కూడా పెద్ద వివాదమైంది. అది పార్టీ అధిష్టానం దాకా కూడా వెళ్లింది. కోర్టును కూడా ఆశ్రయించేదాకా తీసుకెళ్లడం జరిగింది. ఒక్క కమలాపూర్‌ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో సమ్మక్క జాతర జరుగుతుంది. ఆ కమిటిలలో అసలైన తెలంగాణ వాది, టిఆర్‌ఎస్‌ నాయకులు లేరన్నది కొందరి వాదన. మొత్తంగా కౌషిక్‌రెడ్డితో వచ్చిన వారు మాత్రమే అన్నది టిఆర్‌ఎస్‌ ఓ వర్గం ప్రధాన వాదన. వీణవంక మండలంలో మరో వివాదం రేపారు. పాడి సుధాకర్‌రెడ్డి కుటుంబంతో కొత్త వివాదం తెచ్చిపెట్టారన్నది పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు రావడం ఇలాంటి వివిదాలను రేపడం తప్ప చేస్తున్నదేమీ లేదంటున్నారు. ఇక పార్టీపై దృష్టిపెట్టకపోతే ఎలా? అని కొంత మంది ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇప్పుడే నియోజకవర్గంలో పూర్తిస్ధాయి రాజకీయాలు వద్దు. క్యాబినేట్‌ ర్యాంక్‌ పదవి ఇచ్చిన తర్వాత నియోజక వర్గంలో పర్యటనలు చేయాలని సూచించారని అంటున్నారట. అసలు ఎమ్మెల్సీ పదవి అన్నదానికన్నా పెద్ద పదవి ఏముంటుందో? మరొకటి ఎలా ముఖ్యమంత్రి ఎలా ఇస్తానన్నారన్నదానిపై సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఓ వైపు ఇప్పటికే ప్రతిపక్షాలు తమదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తుంటే, ఇప్పటికీ గ్రామ, మండల, జిల్లా కమిటిలు లేక సమాధానాలు చెప్పేవారు లేక, ప్రతిపక్షాలు చెప్పినవే జనం నిజమనుకునేదాకా తెస్తున్నారు. ఇప్పటికైనా ఎంతో నమ్మకంతో కట్టబెట్టిన ఎమ్మెల్సీ పదవికి న్యాయం చేస్తూ, మిగతా నాయకులను కలుపుకుపోతూ, పార్టీ యంత్రాంగానికి నమ్మకం కల్గిస్తూ, వారికి భరోసా కల్పిస్తూ, పార్టీ కమిటీలను అందరూ కలిసి, వివాదాలు లేని నాయకులను ఎంపిక చేసి, పార్టీకి పూర్వవైభం తేవాల్సిన అవసరం వుంది.

సమస్యలు అడిగి తెలుసుకున్న నన్నపు నేని

 

4 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా 20 వ డివిజన్ లో కాలనీలలో

కలియదిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి అదికారులకు ఆదేశాలు జారి చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.

.డివిజన్ లోని సమస్యలు,ప్రజా వినతులు స్వీకరించి వీలైనంత వేగంగా సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే నరేందర్ హామీ ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్,కార్పోరేటర్ గుండేటి నరేంద్రకుమార్,ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

జిల్లా వైద్యాధికారులు దవాఖానల్లో నిద్ర

డీఎంహెచ్వో, డిప్యూటీ డిఎంహెచ్వోలు నెలలో ప్రతి పి హెచ్ సీ సందర్శించాలి.

• నెలలో ఒక రోజు పి హెచ్ సీల్లో నిద్ర చేయాలి.

• నేను కూడా నిద్ర చేస్తాను

 

• ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి

• హెచ్ వో డీ లు నెలవారీ సమీక్షలు చేసుకోవాలి

• సిజెరియన్ల రేటు గణనీయంగా తగ్గించాలి

• తీరు మారని ప్రైవేటు ఆసుపత్రులపై మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయాలి

• వచ్చే నెల నాటికి పనితీరు మరింత మెరుగు పడాలి. లేకుంటే చర్యలు తప్పవు

• పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా ఇంటింటా కరోనా వాక్సిన్ ఇవ్వాలి

• సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.

• పి హెచ్ సీ ల పై నెలవారీ సమీక్షలో ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

 

 

నెల వారీ (హెల్త్ క్యాలెండర్) సమీక్షలో భాగంగా పీహెచ్‌సీల ప‌నితీరు, పురోగతి పై వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు ఆదివారం అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం ఆఫీస‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, సూప‌ర్‌వైజ‌రీ సిబ్బందితో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఎన్సిడి స్క్రీనింగ్, ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో సి- సెక్షన్ల రేటు, ఏ ఎన్ సి రిజిస్ట్రేషన్, గర్భిణులకు అందుతున్న ఇతర సేవలు, ఓపీ, టీబీ, టి- డయాగ్నొస్టిక్, ఐహెచ్ఐపి, తదితర వైద్య సేవలపై జిల్లాలు, పీహెచ్సిల వారీగా సమీక్ష నిర్వహిచారు.

 

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..

 

ప్రాథమిక దశలో రోగాలు గుర్తించి, సరైన చికిత్స అందించడం ద్వారా దీర్ఘకాలిక రోగంగా మారకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుంది. తద్వారా ప్రజల ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుంది. ఇందులో పి హెచ్ సిలది కీలక పాత్ర. 

 

క్షేత్ర స్థాయిలో ఉండే సమస్యలు తెల్సుకునేందుకు, తక్షణం పరిష్కరించి ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్యాధికారులు ప్రతి నెల అన్ని పి హెచ్ సీ లు తప్పని సరిగా సందర్శించాలి. నెలలో ఒక రోజు రాత్రి 24×7 పి హెచ్ సీలో నిద్ర చేయాలి. ఒక రోజు నేను నిద్ర చేస్తాను. అక్కడి పరిస్థితులు తెల్సుకుంటాను.

 

ముఖ్యమంత్రి కే సి ఆర్ గారి సహకారంతో మనందరం చేస్తున్న కృషి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. అయితే ఇంకా చాలా మార్పు రావాలి.

 

తాజాగా విడుదలైన కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ప్రకారం, IMR – శిశు మరణాల రేటు 23 నుండి 21 కి తగ్గింది. 2014 లో ఇది 39 ఉండేది. దేశంలో ప్రస్తుతం 28 గా ఉంది.

 

దవాఖానల్లో ప్రసవాలు పెరగటం, కేసీఆర్ కిట్లు, అరోగ్య లక్ష్మీ, 102 వాహన సేవలు, మారుమూల ప్రాంతాలకు సైతం మెటర్నిటీ సేవలు విస్తరించడం, ప్రత్యేకంగా చిన్న పిల్లలకు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు వంటివి తగ్గుదలకు దోహదం చేశాయి. 

 

జాతీయ అరోగ్య సూచిల్లో పురోగతి (2014-2021)

MMR 92 – 56% ( IND 103)

NMR 25-16% (IND 22)

Under 5MR – 41-30% (IND 36)

Insti. Deliveries – 91-98 (IND 79)

Deliveries in Govt – 30 – 56

 

ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలందరికీ చేరువ చేస్తున్న మీ అందరి భాగస్వామ్యం ఇందులో ఉంది. 

 

దేశంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్న విషయంలో మనం దేశంలో మూడో స్థానంలో ఉన్నాం. మొదటి స్థానానికి చేరువ చేరుకోవాల్సిన అవసరం ఉంది. 

 

ముఖ్యంగా సిజేరియన్లు తగ్గించే విషయంలో మనం లక్ష్యం ఏర్పాటు చేసుకొని పని చేస్తున్నం. రాష్ట్రంలో 60 శాతం సిజెరియన్లు జరుగుతున్నాయి. ఇది చాలా వరకు తగ్గాలి. 

 

రాష్ట్రంలో 210 సబ్ సెంటర్ల పరిధిలో 70 శాతం కంటే ఎక్కువ ప్రసవాలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరుగు తున్నట్టు గుర్తించాము. దీంతో సిజెరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నము. గత మూడు నెలలుగా వారిపై ప్రత్యేక దృష్టి సారించాము.

 

ఇందులో కొన్ని పీహెచ్ సీ ల పరిధిలోని సబ్ సెంటర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వచ్చే నెల నాటికి తీరు మారాలి.

 

ప్రైవేటు ఆసుపత్రుల్లో అనవసర సిజెరియన్లు జరగకుండా చూడాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయాలి.

 

పీహెచ్‌సీ స్థాయికి ఆరోగ్య శ్రీ సేవ‌ల‌ను విస్త‌రించడం జరిగింది. వచ్చే మూడు నెలల్లో అన్ని కేంద్రాల్లో అందేలా చర్యలు తీసుకుంటున్నము. పీ హెచ్ సీ లలో ప్రసవాలు పెరగాలి. సాధార‌ణ ప్ర‌స‌వాలు పెంచాల‌నే ల‌క్ష్యంలో భాగంగా ప్రభుత్వ వైద్యుల‌కు, నర్సులకు ఇన్సెంటివ్ ఇవ్వ‌బోతున్నాము.

 

 

పీహెచ్‌సీల్లో అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.మందులు లేవు అనే ప‌రిస్థితి ఎట్టిపరిస్థితుల్లో ఉందొద్దు. మందుల పంపిణీ ఈ ఔషధీ పోర్టల్ ద్వారా జరగాలి.

 

ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు విధుల్లో ఉంటూ వైద్యులు, సిబ్బంది ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాలి.

 

24 గంట‌లు న‌డిచే పీహెచ్‌సీలు అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను అన్ని వేళ‌ల్లో అందించాలి.

 

అన్ని వివరాలను ఎప్పటి కప్పుడు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాంలో (IHIP) అప్‌లోడ్ చేయాలి.

 

ఎన్సీడీ స్క్రీనింగ్ మీ పరిధిలో ఈ నెల చివరి నాటికి వంద శాతం పూర్తి అయ్యేలా చూడాలి, అవసరమైన వారికి మందులు అందే విధంగా చూడాలి. టి- డ‌యాగ్నోస్టిక్ సేవలు వినియోగించుకోవాలి. 

 

కరోనా కేసులు దేశం లో కొన్ని చోట్ల పెరుగుతున్నాయి. మనం అప్రమత్తంగా ఉందాం. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలి. అన్ని కేటగిరీల్లో వంద శాతం పూర్తి చేయాలి. పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా..స్థానిక ప్రజా ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని, ఇంటింటా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాలి.

 

 

వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. సీఎం గారి ఆలోచన మేరకు పని చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.

 

కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్ శ్వేతా మహంతి, డీ హెచ్ శ్రీనివాస్ రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, Tsmsidc ఎండి చంద్ర శేఖర్ రెడ్డి, పలు విభాగాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

నవీన్ రావు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,

 

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో జరిగిన ఎమ్మెల్సీ నవీన్ రావు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు..

కొత్త దనం, తెలంగాణ యాస కమ్మదనంతో త్వరలో ప్రొడక్షన్స్ నెం.1 ప్రారంభం.

అమ్ము ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లొ ప్రొడక్షన్ న 1 గా శ్రీ సత్య జగదీష్ కోసురు గారి నిర్మాణం లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం పూర్తి స్థాయి వరంగల్

మాండలికంలో కధ రాయడం చేత ఆ మాండలికం లో ఆనుభవం కలిగిన వరంగల్ రంగస్థల నటుల్ని ముఖ్య పాత్రధారులుగా ఎంపిక చెయ్యడం కోసమే హన్మకొండలోని సుప్రభాహొటెల్ లో ఆడిషన్స్ జరిపినట్టుగా దర్శకుడు శశి వర్మ తెలిపారు 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరైన గుండు ప్రభాకర్ గారు మాట్లాడుతూ అందరు కొత్తవాళ్లతో నిర్మితమవుతున్న ఈ సినిమాకి ఎంతో ప్రజాదరణ పొందిన పాటల్ని రాసిన మన వరంగల్ కవి గాయకుడు మిట్టపల్లి

సురేందర్ మొదటి సారి కధ మాటలు పాటలు అందించడం నన్ను ఎంతో ఆకట్టుకుంది మన ఉమ్మడి జిల్లాకి సంబందించిన మానుకోట సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి విరాట పర్వం లాంటి విప్లవాత్మక సినిమాతో కొత్త ట్రెండ్ సృష్టించి ఈ సినిమా కోసం కొత్త గాయని గాయకులతో అన్ని పాటల్ని పాడిస్తూ నేపధ్య సంగీతాన్ని సమకూర్చడం చెప్పుకోదగ్గ విషయం హీరో డాక్టర్ విశ్వాస్ రేగొండకి సంబంధించి గుంటుకు పవన్ కెమెరామెన్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారని తెలిసి మన జిల్లా యువ కళాకారుల్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో నా వంతు ప్రోత్సాహాన్ని అందించడానికి ముందుకు వచ్చానని చెప్తూ ఈ టీం స్పిరిట్ చుసిన తర్వాత ఇదే టీం తో ఒక సినిమా చెయ్యాలని నిర్నయిన్చుకున్నామని వివరాలన్నీ ఆగస్టు నెలలో వెల్లడిస్తామని గుండు ప్రభాకర్ గారు తెలియజేశారు 

 

నిర్మాత జగదీష్ కోసూరు గారు మాట్లాడుతూ హైదరాబాద్ రవీంద్రభారాతి మరియు ఈ రోజు హన్మకొండ సుప్రభా హోటల్ లో జరిగిన ఆడిషన్స్ లో ఎంపికైన నటి నటులతో జూన్ ,జులై లో వర్కుషాప్ నిర్వహించి ఆగస్ట్ నెలలో చిత్ర యూనిట్ వరంగల్ పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరుపనున్నట్లు వరంగల్ మేయర్ గారు గుండు సుధారాణి ప్రభాకర్ గార్లు అందించిన సహకారానికి ఆ ప్రాంతం పట్ల మరింత మమకారం పెరిగిందని నిర్మాత జగదీష్ కోసురు కృతజ్ఞతలు తెలియజేసారు 

 

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ ఈ సినిమా మొదటి పాట గా మిట్టపల్లి సురేందర్ రాసిన సాహిత్యానికి మన నేపథ్యం ఉట్టిపడే బాణీ తో మొదటి పాట ట్రాక్ వర్క్ పూర్తిచేసినట్టుగా చెప్పారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version