దుగ్గొండి,నేటిధాత్రి :
దుగ్గొండి మండల కేంద్రంలో మున్నారుకాపు భవన నిర్మాణానికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి 20 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు మున్నూరుకాపు మండల కన్వీనర్ శెంకేసి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ నిధులను మంజూరు చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి, మంజూరు కావడానికి కృషి చేసిన కాపు సంఘం భాద్యులు జడ్పీ వైస్ ఛైర్మెన్ ఆకుల శ్రీనివాస్, డివిజన్ నాయకులు శెంకేసి కమలాకర్, మండలాధ్యక్షుడు నీలం పైడయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దుగ్గొండి గ్రామ సంఘ అధ్యక్షుడు తొగరు వెంకటేశ్వర్లు, శెంకేసి రాజ్ కుమార్, కూస రాజు, సాంబరాజు బిక్షపతి, బండారి రాజు, దేవేందర్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.