– బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సీఎం రేవంత్ రెడ్డి కి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కి ప్రత్యేకమైన శుభాకాంక్షలు
గురువారం రోజున వేములవాడ విలేకరుల సమావేశం నిర్వహించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ 20 కోట్లు నిధులు వేములవాడకు కేటాయించడం అభినందనీయమని ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గం ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుందని వారన్నారు. గత ప్రభుత్వము చేయని విధంగా వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వేములవాడ నియోజకవర్గ అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో వీటీడీఏ సమావేశం ఒక్కసారైనా పెట్టలేరని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీటీడీఏ మీటింగ్ పెట్టడం అందులో టెంపుల్ డెవలప్మెంట్ సమావేశం నిర్వహించడం చాలా అభినందనీయమని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం కి దక్కిందని గత ప్రభుత్వంలో ఎలాంటి ఉద్యోగాలు కల్పించని దుర్మార్గమైన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది టిఆర్ఎస్ పార్టీ ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ కి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని ఉండాలని హితవు పలికాడు.వేములవాడ రోడ్ల విస్తరణ మరియు బ్రిడ్జి నిర్మాణానికి మరో 35 కోట్ల నిధులు విడుదల చేస్తానని చెప్పడం అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కూరగాయల కొమురయ్య, బీసీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రాము గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీధర్ గౌడ్ ,నాయకులు కూర దేవయ్య,దాడి మల్లేశం, గంటల ప్రకాష్, షేక్ ఫిరోజ్,సిరిగిరి శ్రీకాంత్,గుర్రం తిరుపతి, సారం పెళ్లి భాను, తూటు సాయి, గీగురు సాయి, తదితరులు ఉన్నారు.