రైతులకు 2లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలి.

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్

చిట్యాల, నేటిధాత్రి :

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు చిట్యాల మండలం కేంద్రంలో
ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులకు కూలికి వచ్చిన వారికి కూడా కూలి డబ్బులు ఇవ్వలేక అల్లాడిపోతున్నారు, రైతులకు ఇచ్చిన హామీలు చేయడంలో మాత్రం ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తుందని తక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు క్రాప్ లోను ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *